దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సత్వర స్పందన…

దివ్యాంగుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సత్వర స్పందన

ఇద్దరికి తక్షణమే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేత

కృతజ్ఞతలు తెలియజేసిన దివ్యాంగులు

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఇద్దరు దివ్యాంగుల ఇబ్బందులను చూసి చలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సత్వరం స్పందించారు. వారి సమస్యకు పరిష్కారం చూపారు.

కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఉప్పుల శ్రీనివాస్, ముస్తాబాద్ మండలం
గూడెం కొమిరే పరశురాములు అనే దివ్యాంగులు సోమవారం ఐడీఓసీకి పని నిమిత్తం వచ్చారు. వారిని చూసిన జిల్లా కలెక్టర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్యపై వచ్చారో అడిగి తెలుసుకున్నారు.

తాము పనులపై బయటికి వెళ్లేందుకు, పనులు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వారికి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. వారి ఇద్దరికి వెంటనే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, హెల్మెట్ జిల్లా కలెక్టర్ అందజేశారు.

తమ సమస్య, ఇబ్బందులను అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు అందజేసిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version