ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

పార్టీలకు అతీతంగా చెక్కులను అందిస్తున్నాం

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

 

 

 

శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల పట్టణ,పరకాల,నడికూడా, ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 58 మంది లబ్ధిదారులకు 24,27,750 రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు.పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని అన్నారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version