CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం, ఏప్రిల్, 24:

తన‌ సిఫార్సు మేరకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మేరకు ఖమ్మం బుర్హాన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 8.50 లక్షల విలువైన చెక్కులను 19 మంది బాధితులకు అందజేశారు. మరో ఇద్దరికి ముందస్తు ఆపరేషన్ నిమిత్తం మంజూరైన రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న బాదితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మధిర మున్సిపల్ కౌన్సిలర్ వెన్నంశెట్టి అప్పారావు, మధిర పట్టణ బీఆర్ఎస్ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాసా రామారావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లేడిపోయిన గోపాలరావు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లా ఐదు మండలాలకు సంబంధించినcmrf చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

నేటిదాత్రి ,నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ పట్టణ ,మరియు బిజినపల్లి ,తాడూరు, తిమ్మాజీపేట తెలకపల్లి, మండలాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 2 29 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులదే ఎవరైనా పథకానికి దూరంగా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎలాంటి సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కరాజు మున్సిపల్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version