మృతిని కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సహాయం
కుటుంబానికి మనోధైర్యం కల్పించిన గ్రామస్తులు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన కుక్కముడి తిరుపతి అనే యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు.భార్య ఇద్దరు అనూష ఇద్దరు కూతుళ్ళు,ఒక కుమారుడు ఉన్నాడు.నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు అండగా నిలిచారు.వారి కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సహాయం,50 కిలోల బియ్యాన్ని అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు.రూ.35 వేలు చిన్నారుల పేర్లపై ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తున్నట్లు వారు తెలిపారు.మున్ముందు చిన్నారులు అండగా ఉంటామని గ్రామస్తులు హామీ ఇచ్చారు.
