వినాయక మండపాలకు పర్మిషన్ తప్పనిసరి
దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా దుగ్గొండి మండలంలో మండపాల పట్ల అన్ లైన్ ద్వారా పర్మిషన్ తప్పనిసరి అని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.అందుకు తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తల పట్ల వివరిస్తూ వినాయక నవరాత్రుల పట్ల పర్మిషన్ తీసుకున్న వారు ప్రతి విగ్రహానికి ఒక ఆర్గనైజర్ 24/7 ప్రత్యేకంగా ఉండాలని తెలిపారు.అలాగే విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఆ శాఖతో అనుమతి పొందాలన్నారు. డి.జేలు ఉపయోగించకుండా స్కూల్స్, హాస్పిటల్స్ ప్రదేశాల్లో 50 డెసిమల్ సౌండ్ ఉపయోగిస్తూ సాధారణ ప్రదేశంలో 55 డెసిమల్ సౌండ్ వాడాలని చెప్పారు.విగ్రహ ప్రదేశాలలో మద్యం సేవించి,అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకూడదని అలాగే కమ్యూనిటీ,పార్టీలకు విరుద్ధంగా పాటలు పెట్టకూడదని ఎస్సై హెచ్చరించారు.అగ్నిప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించకుండా నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్సై రణధీర్ రెడ్డి మండల ప్రజలకు సూచించారు.