నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఏ వన్, ఏ టూ గా కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడిన పిరికిపంద చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం, టీపీసీసీ పిలుపు మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం చరిష్మా ను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే కేసు విచారణలో ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమంగా సంపాదించిన సంపత్తి ఉందన్న నిబంధనలపై నిర్థారణ లేదని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకువస్తామనీ చట్టపరంగా, రాజకీయంగా దీనికి గట్టి ఎదురుదెబ్బ ఇస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, మాజీ వార్డు సభ్యులు ఉప్పులపు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ , గాండ్ల సమ్మయ్య, బుడిగె శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, బంగారు ప్రసాద్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, రాజేశం, గండి కుమార్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.