చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ (2) నూతన కమిటీ నాయకులు సోమవారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును భూపాలపల్లి క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు, అనంతరం ఎమ్మెల్యే నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ (2) అధ్యక్ష కార్యదర్శు లైన బుర్ర రమేష్ కట్కూరి శ్రీనివాస్ లను శాలువాతో సన్మానించి వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని,అలాగే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని , అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం, మరియు వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ని కలిసిన ప్రెస్ క్లబ్ కమిటీ ఉపాధ్యక్షులు సరిగోమ్ముల రాజేందర్, సంపత్, సహాయ కార్యదర్శి కోశాధికారి గుర్రపు రాజమౌళి, నేరెళ్ల ఓదెలు, కార్యవర్గ సభ్యులు కట్కూరిమొగిలి , గుర్రపు తిరుపతి, కట్కూరి రాజు, మైదం మహేష్, పాముకుంట్ల చందర్, ఉన్నారు.