రామాలయ నిర్మాణం గొప్ప విజయం

శతాబ్దాల సమస్యను పరిష్కరించి రామాలయ నిర్మాణం

భాజపా మూలాలు జనసంఫ్‌ులో

1951లో శ్యామాప్రసాద్‌ ముఖర్జీ స్థాపించిన జనసంఫ్‌ు

1977లో మూడు పార్టీలు కలయికతో జనతాపార్టీ ఆవిర్భావం

1979లో కుప్పకూలిన జనతా ప్రభుత్వం

1984 నుంచి క్రమంగా పార్టీ బలోపేతం

1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ సాధన

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్యలో రామమందిర నిర్మాణ వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావడమే కాకుండా, అక్కడ నూతన రామాలయ నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టి, భారతీయ జనతాపార్టీ హిందువులకు ఇచ్చిన అతిముఖ్యమైన హామీని నెరవేర్చింది. నిజానికి ఇక్కడ రామమందిర నిర్మాణం జరుగుతుందా? అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న. అటువంటి దాన్ని ఎటువంటి శషభిషలకు తావులేకుండా సాధించి చూపారు నరేంద్ర మోదీ. కొన్ని సంవత్స రాల క్రితం ఆయన, రామమందిర నిర్మాణం జరిగిన తర్వాతనే అయోధ్యలో అడుగుపెడతానన్న శపథాన్ని నెరవేర్చారు. 2023 అక్టోబర్‌ నెలలో రామమందిర నిర్మాణం విషయం ప్రకటించి, 2024 జనవరినెలలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. 2024 పార్లమెంట్‌ ఎన్నిక ల్లో ఆయన రామమందిర నిర్మాణాన్నే ప్రధాన సమస్యగా ముందుకు తెచ్చి, ఈసారి 400 సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉధృతంగా ప్రచారం సాగించారు. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి, 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తే, రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ దుష్ప్రచారం చేయడం తో ప్రజల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఓటర్లలో అనుమానాలు బలంగా నాటుకొని, బీజేపీకి వ్యతిరే కంగా ఓట్లు వేయడంతో, ఎన్డీఏ కూటమి సీట్లు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గి 293కు మాత్రమే పరిమితమయ్యాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, నితిష్‌కుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీల దన్నుతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పాలన సు స్థిరంగా కొనసాగుతోంది. 

భారతీయ జనతాపార్టీ

స్వాతంత్రానంతరం ఏర్పడిన భారతీయ జనతాపార్టీ హిందూ జాతీయవాద పార్టీ. ప్రధానంగా ఉత్తర భారతదేశానికి చెందిన అగ్రకులాలవారు ఈ పార్టీకి అనుకూలం. ఈ అపప్రథనుంచి బయటపడి ఇతర వర్గాల్లో కూడా తన బలాన్ని పెంచుకోవడానికి, వెనుకబడిన వర్గాల వారికి పార్టీ కీలకస్థానాల్లో అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఈవిధంగా తాను కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే పార్టీగా ప్రజల్లో క్రమంగా పేరు సంపాదించుకుంది. ఆవిధంగా క్రమంగా ఎదుగుతూ వచ్చిన పార్టీ 2014, 2019 మరియు 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించి దేశ పాలనను కొనసాగిస్తోంది. బీజేపీ మూలాలు

ప్రస్తుత భారతీయ జనతాపార్టీ మూలాలు 1951 నాటి జనసంఫ్‌ులో వున్నాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ విభాగంగా 1951లో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జనసంఫ్‌ును స్థాపించారు. 1967 ఎ న్నికల్లో ఉత్తరభారతదేశంలో జనసంఫ్‌ు గుర్తించదగిన స్థానాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. తర్వాత అటల్‌బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో మరో మూడు పార్టీలతో కలిసి ‘జనతాపార్టీ’ ఏర్పా టైంది. ఇందిరాగాంధీ నేతృత్వంలోని ఇందిరా కాంగ్రెస్‌ను ఓడిరచి 1977లో అధికారంలోకి వ చ్చిన జనతాపార్టీ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటల కారణంగా 1979లో కుప్పకూలిపోయింది. తర్వాత జనతాపార్టీలో భాగంగా వున్న భారతీయ జనసంఫ్‌ు ఎంపీలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గనకూడదంటూ మిగిలిన పార్టీల నాయకులు పట్టుపట్టడంతో, జనతాపార్టీ ముక్కలుగా చీలిపోయింది. ఆవిధంగా 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ కొత్త పార్టీ కి అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలు నేతృత్వం వహించారు. వీరు క్రమంగా సెక్యులర్‌ ముసుగులో కాంగ్రెస్‌ పార్టీ సాగిస్తున్న మైనారిటీ బుజ్జగింపు రాజకీ యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతేకాదు అయోధ్యలోని రామ జన్మభూమి ప్రదేశంలో మొఘల్‌ రాజు బాబర్‌ నిర్మించిన కట్టడం స్థానంలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న ప్రధానలక్ష్యంతో రాజకీయాలు నడిపారు. అంతేకాదు ముక్కలు చెక్కలుగా వున్న హిందూ ఓటర్లను సంఘటితం చేసి ఒకేతాటిపైకి తీసుకొని రావడానికి ఈ ముగ్గురు నేతలు ఎంతో కృషిచేశారు. అ యోధ్య రామమందిరం సమస్య దేశంలోని హిందువులను సుసంఘటితం చేసేందుకు ఎంతగా నో దోహదం చేసింది. ఫలితంగా అప్పటివరకు లోక్‌సభలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన పార్టీ 1991 ఎన్నికల నాటికి పార్లమెంట్‌లో 117 స్థానాలకు ఎదిగింది. అదే ఏడాది ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

నిజానికి 1992, డిసెంబర్‌ 6వ తేదీన అయోధ్యలో అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి పరి ష్కారంలో మరో అడుగు ముందుకు పడిరది. అంతకు ముందు భాజపా సీనియర్‌ నేత అయిన లాల్‌కృష్ణ అద్వానీ నేతృత్వంలో జరిపిన రథయాత్రకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం లభించడమే కాదు, బీజేపీ బలీయమైన పార్టీగా ఎదగడానికి దోహదం చేసింది. అంతేకాదు రథయాత్ర పుణ్యమాని కుహనా సెక్యులర్‌ పార్టీల దాగుడుమూతల రాజకీయాలు, హిందువులను ఓట్లకోసం చీల్చి తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న విధం ప్రజలకు బాగా అవగాహనకు వచ్చింది. అ యితే ఇది పూర్తిస్థాయిలో రానప్పటికీ, చాలావరకు చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు తరతరాలుగా హిందువులు తమ ఆరాథ్య దైవంగా పూజించే రాముడికి అయోధ్యలో మందిరం నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించిన హిందువులు జాగృతమయ్యారు. 

1996లో అతిపెద్ద పార్టీగా అవతరణ

1996 ఏప్రిల్‌ 27, మే 2, 7 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ లోక్‌సభలో 161 సాధించి పెద్దపార్టీగా అవతరించింది. కానీ అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మెజారిటీ లేదు. అయితే అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ, అతిపెద్ద పార్టీగా అవత రించి బీజేపీ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. మే 15న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా పదవీ స్వీకారం చేశారు. సభలో మెజారిటీ నిరూపిం చుకునేందుకు రాష్ట్రపతి 15 రోజుల అవకాశాన్నిచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం లోక్‌సభలో ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నించింది కానీ సఫలీకృతం కాలేదు. దీంతో అవి శ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేకంటే, రాజీనామా చేయడమే ఉత్తమమని భావించిన వాజ్‌పేయి 13వ రోజున తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత హెచ్‌.డి. దేవెగౌడ నేతృత్వంలో ఏడాదికా లం, 1997లో ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌ నేతృత్వంలో మరో ఏడాది పాటు యునైటెడ్‌ ఫ్రంట్‌ పాలన సాగించినా ఆయా ప్రభుత్వాలు పడిపోవడంతో 1998లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. అయితే 1996లో 11వ లోక్‌సభ ఎన్నికల్లో 471 స్థానాలకు పోటీచేసిన భారతీయ జనతాపార్టీ, 1998లో 12వ లోక్‌సభ ఎన్నికల్లో 388 సీట్లకు పోటీచేసింది. ఈసారి పార్టీ182 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఏడాదిలోనే కుప్పకూలింది. ఫలితంగా 1999లో మళ్లీ 13వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ సారి కూడా బీజేపీ 182 సీట్లనే సాధించినప్పటికీ, వివిధ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయ డం ద్వారా అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో నేషనల్‌ డెమోక్రటిక్‌ ఆలయన్స్‌ ప్రభుత్వం 2004 వరకు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. ఈ ఏడాది 14వ లోక్‌సభకు జరిగిన ఎ న్నికల్లో బీజేపీ బలం గణనీయంగా తగ్గిపోయింది. అప్పటివరకు 182 సీట్లున్న పార్టీ, కేవలం 138 స్థానాల్లోనే గెలుపు సాధించింది. ఫలింగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చింది. ఆవిధంగా మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా యుపీఏ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలో కొనసాగింది. అంటే పదేళ్లపాటు 2014 వరకు యూపీఏ అధికారంలో వుంది. 

నరేంద్ర మోదీ నేతృత్వంలో తిరిగి అధికారంలోకి…

2014 నాటికి దేశంలో యుపీఏ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారు. అప్పటివరకు సుదీర్ఘ కాలంగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీని, బీజేపీ ఈసారి ఎన్నికల్లో ప్రధా ని అభ్యర్థిగా ప్రకటించింది. అదే ఏడాది ఏప్రిల్‌`మెనెలల్లో అనేక విడతలుగా జరిగిన ఎన్నికల్లో దేశంలో భారతీయ జనతపార్టీ అప్రతిహత విజయం నమోదు చేసి అధికారాన్ని చేపట్టింది. విశే షమేంటంటే ఈ ఎన్నికల్లో పార్టీ 282 స్థానాల్లో విజయం సాధించడం. అంటే పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పార్టీలు మరో 54 స్థానాల్లో విజయం సాధించడంతో చాలాకాలం తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైంది. 2014 మే 26న నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 

బీజేపీ అభివృద్ధి ప్రస్థానం

జనతాపార్టీనుంచి విడిపోయి భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే బీజేపీ క్రమానుగతంగా బలాన్ని పెంచుకుంటూ చివరకు మెజారిటీ స్థానాలను గెలుచుకునే దశ కు చేరుకోవడాన్ని గమనించవచ్చు. 1984లో (8వ లోక్‌సభ) బీజేపీకి లోక్‌సభలో కేవలం 2 సీట్లు మాత్రమే వుండేవి. 1989 (9వ లోక్‌సభ)లో పార్టీ ఏకంగా 89 సీట్లను గెలుచుకోగలిగింది.ఇందుకు ప్రధాన కారణం లాల్‌కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర మరియు ఆయన వ్యూహాత్మక నాయకత్వం. ఇక 1991లో 120, 1996లో 161, 1998లో 182, 1999లో 182,2004లో 138, 2009లో 116 సీట్లు (ఈ రెండు టర్మ్‌ల్లో పార్టీ సీట్లు క్రమంగా తగ్గిపోవడం గమనార్హం), 2014లో 282 (సొంతంగా మెజారిటీ సాధన), 2019లో 303, 2024లో 240 స్థానాల్లో గెలుపు సాధించింది. పార్టీ క్రమంగా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే, ఒక స్పష్టమైన వ్యూహాత్మక వైఖరితో నాయకత్వం పార్టీని ముందుకు నడిపిందని అర్థమవుతుంది. మిగిలిన పార్టీల్లో ఈవిధమైన క్రమానుగత వృద్ది కనిపించదు. వస్తే అధికారంలోకి రావడం లేదా కుప్పకూలిపోవడం. ఈ రెండిరటిలో ఏదో ఒకటి మాత్రమే జరిగేది. ఒకటి రెండుసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్నా విశ్లేషించుకొని మరింత బలంగా ముందుకు వెళ్లడం పార్టీ బలీయమైన సంస్థాగత నిర్మాణాన్ని వెల్లడి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!