అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.
కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.
కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.