మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/

`ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది.

`నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది.

` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది.

` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది.

`మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది.

`మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌.

`అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌.

`దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా?

`తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా?

` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు.

`బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ మూడు గంటలు.

`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.

`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.

`తెలంగాణ ను గోస పెడతరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్‌లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్‌ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కాని బండి సంజయ్‌ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్‌ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపి. అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు.
కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు.
అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ కధ మరోలా వుంది.
ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్‌ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్‌ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్‌, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్‌ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది.
దేశమంతా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్‌ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తేడా…కేసిఆర్‌ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.

రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/

ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ. Continue reading అభివృద్ధి అంటే హైదరాబద్‌

కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.

`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.

`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.

`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌.

`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌.

`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే

`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.

`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమకారులను గన్‌ తో బెదిరించిందే రేవంత్‌.

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్‌.

`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్‌.

`రేవంత్‌ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ కు చోటు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్‌ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్‌న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్‌ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్‌ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్‌ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్‌ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అంటే హైదరాబాద్‌లో కర్ఫ్యూ. హైదరాబాద్‌లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్‌ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్‌ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్‌సాగర్‌లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. కాంగ్రెస్‌ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ తరానికి కాంగ్రెస్‌ అంటే ఏమిటి?
ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్‌పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్‌ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్‌పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్‌ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్‌పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్‌ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్‌. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్‌పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్‌రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్‌పార్టీ.
కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్‌ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్‌ లో ప్రచారం చేసిన షబ్బీర్‌ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్‌, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్‌ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

`సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు.

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కష్టాల కర్నాటక… కరంటు కటకట!

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బ్కె ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

కాంగ్రెస్‌ ను నమ్మితే సంక్షేమం సమాదే!

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’ ఆయన మాటల్లోనే..

` వ్యవసాయం ఆగమే!

`మళ్ళీ కరంటు కోతలే!

`కరువు కాలం కోరి తెచ్చుకునుడే?

`నిత్యం అధికారం కోసం కొట్లాటే!

`పాలన గాలికే!

`పథకాలన్నీ పక్కకు పెట్టుడే!

`మూడు గంటల కరంటే!

`బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడే!

`తెలంగాణ అల్లకల్లోలమే!

`అంతా కలహాల కుమ్ములాటలే!

`సఖ్యతలేని రాజకీయ కాపురమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ ఆగమే..బతుకులు ఆగమాగమే! తెలంగాణ జీవనం తలకిందులే!! తెలంగాణను ఆదరిస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కె..ఎందుకంటే పదేళ్లలో మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో తెలంగాణ వుందో? కాంగ్రెస్‌, బిజేపి పాలిత రాష్ట్రాలలో పరిస్ధితులు ఎలా వున్నాయో? తెలుసుకోవాలి. కొట్లాడి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పదేళ్లలో జరిగిన అభివృద్ది అంతా ఇంతా కాదు. అసలు మనం తెలంగాణలోనే వున్నామా? అన్నంత ఆశ్చర్యం అప్పుడప్పుడూ వేస్తుంది. హైదరాబాద్‌లో తిరుగుతుంటే ఎక్కడున్నామన్న అనుమానం కలుగుతుంది. అంతలా తెలంగాణను, హైదరాబాద్‌ను మార్చివేశారు. ప్రగతిని పరుగులుపెట్టించారు. పదేళ్లలో అద్భుతమైన ప్రణాళికా బద్దమైన సమ్మిళితమైన, సుసంపన్నమైన అభివృద్దిని మన కళ్ల ముందు నిలిపారు. అదీ కేసిఆర్‌ పాలన. కాంగ్రెస్‌ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. ఎందుకంటే వాళ్లు మాటలే చెబుతారు. మాటలు కోటలు దాటించి, కాళ్లు తంగెళ్లు కూడా దాటించలేరు. అందుకే గడపలోనే వుంటూ గూడుఫుఠానీ చేస్తుంటారు. మాయామశ్చీంద్ర వేషాలు వేస్తుంటారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎంతకైనా దిగజారుతారు. ఒక్క విషయంలో కాంగ్రెస్‌ నాయకుల దుర్నీతి ఎలాంటిదో సూటిగా చెప్పొచ్చు. కాళేశ్వరం విషయంలో వాళ్లు చెప్పే మాటలు విని ప్రజలే చీ అంటున్నారు. తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేస్తే సక్కగ నీళ్లన్నీ తెలంగాణ పారేవిఅంటూ అతి తెలివి లెక్కలు చెబుతున్నారు. సరే పదేళ్లు అధికారంలో వుండి ఎందుకు పూర్తి చేయలేదు. కేవలం ఎన్నికల కోసం, జిమ్మిక్కుల కోసం, తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చుపెట్టడం కోసంకాంగ్రెస్‌ ఆడిన నాటకమని ఎంత మందికి తెలుసు. కాంగ్రెస్‌ దుష్టపన్నాగాలు,కటిల రాజకీయాలు ఇలా వుంటాయి. నిజంగా తెలంగాణకు నీళ్లివ్వాలనే చిత్త శుద్ది కాంగ్రెస్‌కు ఏనాడు లేదు. వుంటే ఏనాడో తెలంగాణ పచ్చబడేది. కాని కాంగ్రెస్‌ పాలనలో ఎండిపోయింది. ఎడారిగా మారింది. సాగులేని కరువుకు కారణమైంది. మంచినీళ్లు కూడా దొరకుండా చేశారు. ప్లోరైడ్‌తో తెలంగాణ ప్రాంతమంతా కాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు, నడుములు వంగిపోతుంటే చూశారే గాని మంచినీళ్లు కూడా ఇవ్వలేని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఊసరవెళ్లి వేశాలు వేస్తున్నారు. మళ్లీ తెలంగాణను ఎండబెట్టడానికి కొత్త మొసలికన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి స్వార్ధ నాయకులు నిండి వున్న కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ నట్టెట మునుడుగే అంటున్న ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతొ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
పగటి వేషగాళ్ల రూపంలో కాంగ్రెస్‌ నాయకులు రంగులు మార్చి మళ్లీ వస్తున్నారు.
ఎన్నికల సమయం తప్పితే ఎప్పుడూ కనిపించరు. ఎన్నికలనగానే కలుగులో దాని వున్న ఎలుకలు బైటకొచ్చినట్లు వస్తారు. వచ్చి అబద్దాలను రంగులు పులుముతారు. ఈసారి మరీ భరితెగిస్తున్నారు. అలవి కాని హామీలను ముందు పెట్టుకొని నమ్మించి ముంచేందుకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అసవరం వుంది. వ్యవసాయమే దండగ అన్నంతగా ఒక దశలో మాట్లాడిన వాళ్లు కూడా సాగు గురించి, వ్యవసాయం గురించి, నీళ్ల గురించి సిగ్గూ, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఏళ్లపాటు పాలించి తెలంగాణను అరిగోస పెట్టి, ఇప్పుడు తియ్యని మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా? ఆదరిస్తారా? మొన్ననే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎకరానికి మూడు గంటల కరంటు చాలు అంటూ వెకిలి మాటలు రైతుల చేత చీవాట్లు తిన్నాడు. అసలు తెలంగాణ వ్యవసాయం గురించి ఒక్కముక్క కూడా తెలియని వాళ్లు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మన దౌర్భాగ్యం. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయి. ఏఏ భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయి? ఎంత నీరు అవసరం. ఏ భూమి ఎంత నీటిని తీసుకుంటుంది. అన్నదానిపై కనీసం అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు మేం పాలిస్తాం. మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. నిండా ముంచేందుకు రెడీగా వుండండి అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఒక దశలో కరంటు కష్టాలు ఎలా ఎదుర్కొన్నదో ప్రజలందరికీ తెలుసు. పల్లెలనుంచి మొదలుపట్టణాల దాకా ఏ రోజు కూడా పట్టుమని గంట సేపు కరంటు వున్న దాఖలాలు లేవు. ఇక పల్లెల కష్టం చెప్పనలవి కాదు. పగలు పదినిమిషాలు, రాత్రి పదినిమిషాలు అన్నట్లు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదే తెలియనంత చీకటికాలం చూశాం. కాంగ్రెను నమ్మితే మళ్లీ ఆ రోజులు రావడం ఖాయం. యాభై ఏళ్లు పాలించినా కరంటు ఎంత కావాలి? ఎలా తేవాలి? ఎలా సరఫరా చేయాలి? అన్నదానిపై కనీస అవగాహన లేకుండానే పాలించారు. ఇంకా తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అంటూ లెక్కలు చెప్పారు. ఏమైంది? ఆంద్ర వెలుగులతో నిండిపోతుంది. తెలంగాణ చీకట్లలో మగ్గిపోతుందని కాంగ్రెస్‌నాయకులు చెప్పిన మాటలు తారుమారయ్యాయి. ఆంద్రలో కరంటు కష్టాలు. తెలంగాణలో కరంటు వెలుగులు చూస్తున్నాం. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ తెలంగాణలో కరంటు కష్టాలు కొనుక్కున్నట్లే. ఇక దశలో వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా పవర్‌ హాలిడే ప్రకటించిన రోజులున్నాయి. కాంగ్రెస్‌ను పాపం అంటే చాలు మళ్లీ ఆ రోజులు వస్తాయి. అందుకే తెలంగాణ ప్రజలు, యువత పాత రోజులు ఎలా వుండేవో కూడా తెలుసుకోవాలి.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ను నమ్మితే పాలన గాలికి వదిలేసి, నిత్యం కొట్టుకుంటూ, ప్రజా సమస్యలను వదిలేస్తారు.
వారి వారి రాజకీయ ఆధిపత్యాలను ప్రజల మీద రుద్దుతారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా అమలు కాని పధకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ సీమాంధ్ర నేతల పెత్తనం కిందనే సాగుతోంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి తన గురువు చెప్పినట్లు నడుకుంటాడే గాని, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయడు. తెలంగాణ ప్రజలు ఓ వైపు ఉద్యమం సాగిస్తుంటే గన్‌ పట్టుకొని తెలంగాణ వాదులను బెదిరించిన రేవంత్‌రెడ్డి లాంటి వారి నాయకత్వం తెలంగాణ ప్రజలకు శాపమౌతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి స్దానం లేదు. కాకపోతే అబద్దాలను పదే పదే చెప్పి నమ్మిస్తే అమాయక ప్రజలు కొన్ని సార్లు నమ్మి మోసపోయే అవకాశం వుంది. మంచి తొందరగా ఎవరికీ ఎక్కడు. చెడు తొందరగా చెవిని చేరుతుంది. అందుకే తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మొద్దు. మళ్లీ మోసపోవద్దు. ఎందుకంటే వ్యవసాయం మళ్లీ మొదటికి తెస్తారు. కరంటు కోతలు సృష్టిస్తారు. రైతులను ఆగం చేస్తారు. రైతు బంధులో కోత పెట్టకుండా వుండలేరు. ప్రతిపక్షంలోవున్నప్పుడే కరంటు అంత అవసరం లేదని చెప్పిన వాళ్లకు అధికారమిస్తే మోటర్లుకు మీటర్లు పెట్టకుండా వదలరు. అందుకే ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా వుండాలి. తెలంగాణ మళ్లీ చీకటి రోజులను చూడకుండా చూసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు గోసపడుతుంటే కన్నీరు పెట్టుకున్ననాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడూ కన్నీటిని జారవిడవకుండా బతకాలని తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా వుంది. సుసంపన్నంగా ముందుకు సాగుతోంది. స్వయం సమృద్దిని సాధించింది. దేశ జిడిపిని మంచి ముందుకు దూసుకెళ్తోంది. చెడగొట్టే కాంగ్రెస్‌, బిజేపిలు కాచుకొని కూర్చున్నాయి. వాటి ఉచ్చులో పడొద్దు. తెలంగాణను చేజేతులా ఆగం చేసుకోవద్దు. ఇదే ప్రజలకు మనవి.

గంగులకు తిరుగు లేదు…బండి గెలిచేది లేదు!?

https://epaper.netidhatri.com/

`కరీంనగర్‌ వెలుగులు గంగులతోనే…

`ప్రగతికి కరీంనగర్‌ చిరునామా చేసింది గంగులనే.

`కరీంనగర్‌ ను సుందరవనం చేసింది గంగులనే…

`ఐటి టవర్‌ తెచ్చింది గంగులే…

`వేలాడే వంతెనతో అందాలు అద్దింది గంగులే..

`రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది గంగులే..

`ఆపన్నులను ఆదుకున్నది గంగులే…

`కరోనా కాలంలో ప్రాణాలు పోసింది గంగులే…

`బండి కనీసం జనంలో తిరిగింది లేదు…

`సమాజాన్ని చీల్చడం తప్ప స్నేహం పంచింది లేదు.

`పార్లమెంటుకు పంపిస్తే బండి నిధులు తెచ్చింది లేదు.

`కరీంనగర్‌ కు మేలు చేసింది లేదు.

`రాజకీయాలు తప్ప, గెలిపించిన ప్రజలకు మేలు చేసింది లేదు.

`ప్రజలకు అందుబాటులో వుండి ఆదుకున్నది లేదు.

`పార్టీకి పనికిరాని బండి..ప్రజలకు పనికొస్తాడా!?

`పార్టీ పక్కన పెట్టిన బండి…ప్రజలకు సేవ చేస్తాడా?

`కరీంనగర్‌ కు చేసిన మేలు ఒక్కటీ లేదు!

`బండి చేసింది గుండుసున్నా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కరీంనగర్‌ నియోకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌కు తిరుగులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్‌ ముందు బిజేపి. అభ్యర్ధి బండి సంజయ్‌కు అంత బలం లేదు. ఎన్నికల్లో గెలిచేది లేదని అంటున్నారు. అయినా సరే కరీంనగర్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ముగ్గురు ఒకే సామాజిక వర్గ నేతలు కావడం మరో విశేషం. అయితే వరుసగా మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో ఇప్పటికే బండి సంజయ్‌ రెండు సార్లు వరసగా ఓడిపోయాడు. ఇప్పుడు మూడోసారి ఓడిపోవడానికి సిద్దంగా వున్నడని అంటున్నారు. మొత్తం మీద బండి సంజయ్‌ మీద బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గంగుల మూడోసారి కరీంనగర్‌ నుంచి పోటీ చేసి హాట్రిక్‌ సాధించనున్నాడని అంటున్నారు. అంతగా గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ ప్రజల జీవితాలలో ఆయన రాజకీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ముచ్చటగా మూడోసారి గంగుల మీద ఓడిపోవాలని సంజయ్‌కు రాసివుందంటున్నారు. నిజానికి బిజేపి అగ్రనేతలు తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ముందు బండి సంజయ్‌ కూడా పోటీ చేయకపోవచ్చన్న వార్తలు వినిపించాయి. అయితే బండి సంజయ్‌ భయపడుతున్నాడన్న చర్చ జోరుగా సాగింది. దాంతో పారిపోయిండు అన్న అపవాదు కన్నా, పోరాడి ఓడిపోయిండన్న పేరు వుంటుందని ఎన్నికల బరిలో నిల్చున్నాడు. ఓడిపోతానని ఆయనకు కూడా తెలుసు. అంతే కాదు గత ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్‌ అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాడు. ఇది ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పుతుందని అందరూ అనుకున్నారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతుందని ఊహించలేదు. పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే బండి సంజయ్‌ తెలంగాణ బిజేపి శాఖకు అద్యక్షుడయ్యాడు. కరీంనగర్‌కు దూరమయ్యాడు. పాదయాత్రలు చేశాడు. కాని కరీంనగర్‌ ప్రజలను కలుసుకోలేకపోయాడు. తెలంగాణ అంతటా తిరిగాడు. కాని కరీంనగర్‌ గల్లీలు తిరిగి ప్రజలకు తోడుగా నిలవలేదు. తెలంగాణ రాజకీయాలలో కీలకమనుకున్నాడు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్కన పెట్టేలా చేసుకున్నాడు. ఇదంతా ఆయన చేసుకున్న స్వయం కృతాపరధామే అని చెప్పాలి. ఇక పార్లమెంటు సభ్యుడినైనా బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏమైనా చేశాడా? అంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. చూపించుకుందామనుకున్నా ఒక్కటీ లేదు. రైల్లే ఫ్లైఓవర్‌ నేనే తెచ్చాను అంటూ ఇప్పుడు కొత్త కథలు చెబుతున్నాడు. కాని ఆ ప్రతిపాదన యూపిఏ హయాంలో జరిగింది. పొన్నం ప్రభాకర్‌ ఎంపిగా వున్న సమంయలో ప్రతిపాదన వుంది. తర్వాత వినోద్‌కుమార్‌ ఎంపిగా వున్నప్పుడు దానికి అడుగులుపడ్డాయి. అంతే గాని రైల్వే బ్రిడ్జ్‌ సాదనలో బండి సంజయ్‌ పాత్రలేదు. కాకపోతే ఆయన ఎంపిగా వున్న సమయంలో పరిపాలన అనుమతులు రావడం బండి సంజయ్‌ గొప్పదనం కాదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పినట్లు పరాయి వాళ్ల పిల్లలను తమ పిల్లలు అని చెప్పుకుంటారు. ఇక బండి సంజయ్‌ కోతలకు అంతూపొంతు వుండడం లేదు. అబద్దాలకు హద్దూ బద్దూ వుండడం లేదు. కరీంనగర్‌ ప్రజలు బండి సంజయ్‌ పార్లమెంటు సభ్యుడిగా ఒక్క రూపాయి తేలేదని ఆరోపిస్తుంటే, నేను రూ.8వేల కోట్ల రూపాయలు తెచ్చానని పచ్చి అబద్దాలు చెబితే ప్రజలు నమ్ముతారా? బండి సంజయ్‌ పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే కరోనా విపత్తుతో దేశమంతా అల్లకల్లోలమైంది. ప్రపంచమే తలకిందులైంది. ఇప్పటికీ ప్రపంచమేకోలుకోలేకపోతోంది. మరి బండి సంజయ్‌ రూ.8వేల కోట్లు తెచ్చి ఏం పనులు చేశాడా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నాడు. నిజాలు చెప్పినా ప్రజలు వింటారు. గాని లేని పోని అబద్దాలు చెబితే ప్రజలు ఇక ఎప్పుడూ నమ్మరు. పార్లమెంటు సభ్యుడైన తర్వాత అన్ని నిధులు తెస్తే ఏనాడైనా మీడియా ముఖంగా వెల్లడిరచిన దాఖలాలున్నాయా? ఇలా ఎన్నికల వేళ బండి సంజయ్‌ అబద్దాల మీద అబద్దాలు చెబుతుంటే ప్రజలు ఎక్కడిక్కడ నిలదీశారు. దాంతో తెలంగాణలో జరిగిన అభివృద్ది అంతా కేంద్రమే ఇస్తుందని మాట మార్చారు. లింకు రోడ్లంటాడు. రేషన్‌ బియ్యం కేంద్రానివే అంటాడు. తెలంగాణలో రేషన్‌కార్డులు కొత్తవి ఇవ్వడం లేదంటాడు. రేషన్‌కార్డుల జారీ అనేది కేంద్రం పరిధిలో వుండేదన్న సోయి కూడా లేకుండా మాట్లాడుతుంటాడు. వైకుంఠ దామాల నిర్మాణం కేంద్రం సొమ్మే అంటాడు. రైతు వేధికలు కేంద్రం డబ్బులే అంటాడు. మరి కరీంనగర్‌కు ఏం తెచ్చావంటే అందులో నుంచే కరీంనగర్‌కు పైకమొచ్చిందని చెబుతున్నాడు. దాంతో బండి సంజయ్‌ మాటలను విని ప్రజలు నవ్వుకుంటున్నారు.
పార్టీకే బండి సంజయ్‌ పనితీరు నచ్చలేదు.
ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వంలో గిచ్చి కయ్యం పెట్టుకోవడంతోపాటు, సమాజంలో చిచ్చు పెట్టే ప్రకటనలు చేయడాన్ని కేంద్రం సహించలేదు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇలా మాట్లాడే పార్టీ నుంచి సాగనంపేలా చేసుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ హిందూ ముస్లింల ప్రస్తావన, శవం, శివం అంటూ చెప్పిన లెక్కలు తెలంగాణ సమాజానికి నచ్చలేదు. బిజేపి నాయకులకే బండి సంజయ్‌ మాటలు ఒప్పుకోలేదు. బండి సంజయ్‌ వల్లపార్టీకి ఈమాత్రం వున్న ఇమేజ్‌ కూడా తెలంగాణలో పోయే ప్రమదముందని తేల్చి చెప్పారు. బండిని దించేశారు. నిజానికి ఏపార్టీ అయినా ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చే ప్రయత్నం చేయదు. కాని బండి సంజయ్‌ వల్ల రాష్ట్రం రాజకీయాలు కలుషితమౌతాయని ఆ పార్టీ గ్రహించింది. ఆయనను పక్కనపెట్టింది. అయినా ఆయనలో మార్పు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్న విపరీత వ్యాఖ్యలు జనానికి నచ్చడం లేదు. కరీంనగర్‌ యువత గంజాయి మత్తులో తూగుతున్నారంటూ బండి చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా వున్నాయి. ఓ వైపు ఆయనపైనే తంబాకు అన్న అపవాదు వుంది. అలాంటి బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. అంతే కాకుండా బాధ్యత కల్గిన ఎంపి తన ఇలాఖాలో గంజాయి అమ్మకాలు సాగుతుంటే ఇంత కాలం ఏం చేసినట్లు? స్వయంగా ఆయన కూడా పట్టింపజేయొచ్చు. పోలీసులకు సమచారమందించి వారిని పట్టుకునేలా చేయొచ్చు. కాని ఇప్పటి వరకు ఏనాడు అలాంటి విషయాలు చెప్పకుండా, కరీంనగర్‌ యువతను మత్తుకు బానిసలు అని అనడం వారి మనోభావాలను దెబ్బతీయడం కాదా? వారి ఆత్మగౌరవానికి చేటు కాదా? ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడడం బండికి అలావాటు. అబాసుపాలు కావడం బండికికొత్త కాదు.
కరీంనగర్‌ అభివృద్ది విషయంలో గంగుల కమలాకర్‌ చూపిన చొరవ అంతా అంతా ఇంతా కాదు.
వరసుగా 2009, 2014,2018 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. హాట్రిక్‌విజయాన్ని అందుకున్నారు. బండి సంజయ్‌ను ఇప్పటికే రెండు సార్లు ఓడిరచాడు. మూడోసారి కూడా బండి మీద గెలిచి అలా కూడా హాట్రిక్‌ కొట్టాలని గంగుల కమలాకర్‌ చూస్తున్నాడు. మంత్రిగా కరీంనగర్‌ అభివృద్దికి గంగుల ఎంతో కృషి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా కరీంనగర్‌ అభివృద్దిలో తనదైన ముద్ర వేస్తూనే వస్తున్నారు. మంత్రిగా అంతకు రెట్టింపు ప్రగతిని కరీంనగర్‌లో చూపించారు. కరీంనగర్‌ను అందమైన నరగరంగా తీర్చిదిద్దారు. మానేరు డ్యాం ముందు నగరంలోనే సుందరమైన వనం ఏర్పాటు చేశాడు. కరీంనగర్‌కు కొత్త అందాలను తెచ్చాడు. ప్రకృతి రమణీయతను పెంచాడు. పచ్చదనం వెల్లివిరిసేలా చేశాడు. కరీంనగర్‌కు వేలాడే వంతెన తెచ్చి, కరీంనగర్‌కే కొత్త అందాలు అద్దిన ఘణన సాధించాడు. ఐటి టవర్‌ తెచ్చి, కరీంనగర్‌ యువతకు స్దానికంగానే ఉద్యోగ, ఉపాధి కల్పనతో వారి జీవితాలలో వెలుగులు నింపాడు. ఆపన్నులను ఆదుకోవడంలో గంగుల ముందుంటారు. కరోనా కాలంలో కరీంనగర్‌ ప్రజలకు ఎనలేని సేవ చేశాడు. కరోనా బారిన పడిన ప్రజలకు ఇతోదిక సాయం చేశాడు. వారికి వైద్యం అందించాడు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. అలా కరీంనగర్‌ ప్రజలకు సేవలందించిన గంగులను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెబుతున్నారు.

కాంగ్రెస్‌కు మూడోసారి భంగపాటు తప్పదు

`కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

`కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!!

`రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే…

`కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!

`బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ!

`నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు.

`ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

`ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు.

`గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు.

`టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు.

`బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

`తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.

`ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.

`జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు.

`ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు.

` కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. రేవంత్‌ ను నమ్ముకున్న కాంగ్రెస్‌ కు దక్కేది రెవడే..మిగిలేవి పగటి కలలే. తెలంగాణ ఆత్మాభిమానంపై కాంగ్రెస్‌ ఏనాడో దెబ్బ కొట్టింది. ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్సే తెలంగాణ ను ముంచింది. తెలంగాణ ఉద్యమానికి కనీసం సంబంధం లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తామనుకోవడం అంటేనే ఆ పార్టీ నిజ స్వరూపం అర్థమౌతోంది. అంతే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కొన్ని సత్యాలు తెలియాల్సి వుంది. 2014 ఎన్నికలలో ఆంద్రప్రదేశ్‌ లో ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. తెలంగాణకొచ్చి రాష్ట్రం ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత తీర్చుకోండి అన్నట్లు మాట్లాడాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే మా పని అయిపొయింది. తెలంగాణ కు ఏమీ ఇవ్వాల్సిన పని లేదని తేల్చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం అన్నది ఇక ఎప్పుడూ జరగదు. ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరు క్షణం ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్‌ చెబుతోంది. అసలు అరవై ఏళ్లపాటు గోస పడిరదే తెలంగాణ. బాగుపడిరదే ఆంద్రప్రదేశ్‌. తెలంగాణ వస్తే అంధకారమౌతుంది. అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. మేం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అసలు తెలంగాణ నాయకులకు పాలన చేయడం కూడా రాదు. తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రాని తెలంగాణ భూములని ఎగతాళి చేశారు. తెలంగాణ కు అన్నం పెడుతున్నదే మేమన్నారు. విడిపోయి తెలంగాణ నష్టపోకూడదనే చెబుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో విడిపోయి నష్టపోయామంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేని కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మతారని ఎలా అనుకుంటున్నారు. పగటి కలలు ఎందుకు కంటున్నారు. ముందు తెలంగాణ ను ప్రేమించడం కాంగ్రెస్‌ నేతలు నేర్చుకోవాలొలి. కేవలం అదికార యావ తప్ప తెలంగాణ మీద కాంగ్రెస్‌ కు ఎలాంటి మమకారం లేదు. తెలంగాణ ఇచ్చామన్న కృతజ్ఞత తీర్చుకోవాలన్న అహంకారంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం రెండు రాష్ట్రాలు కలుపుతామని కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే నిండా మునిగినట్లే అన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పదేళ్లయినా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మేందుకు సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ పథకాల ప్రచారం అంతా పెద్ద డ్రామా… అంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ మోసాలు ఎలా వుంటాయో వివరించారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారంలోకి రావడం కోసం 2014 లో చంద్రబాబు చెప్పివన్నీ అబద్దాలే అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అబద్దాలు చెప్పి నమ్మించడం తప్ప ప్రజలను నిజాలతో నమ్మించలేమని స్వయంగా రేవంత్‌ రెడ్డే అన్నారు. కావాలంటే ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డి చెప్పిన వీడియో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ కన్నా రేవంత్‌ కు ఎక్కువ ఆశగా వుంది. అసలు తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్‌ నే నమ్మడం లేదు. అలాంటిది రేవంత్‌ ను నమ్మి ఓట్లు వేయడం అన్నది కల. కలగంటే కూడా తీరని కోరిక. గత ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ లో వున్న వాళ్లే కాంగ్రెస్‌ పని అయిపోయింది అని చెప్పిన సందర్భం వుంది. కేవలం కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ ఊపుకొచ్చిందన్న ఊహల్లో విహరిస్తున్నారు. అసలు విషయం దాచి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి పదిహేను సంవత్సరాలౌతుంది. రెండు సార్లు బిజేపి స్వంత మెజారిటీతో కర్నాటక లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూడమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ బిజేపి కాంగ్రెస్‌ ను చీల్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. పైగా బిజేపి పార్టీ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటి అని ప్రజలకు తెలిసిపోయింది. దాంతో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ ను మోసం చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు బాగా ప్రభావం చూపాయి. బిజేపి కర్నాటక ఆత్మ గౌరవంతో ఆడుకున్నది. ఎలాగైనా గుజరాత్‌ కు అమూల్‌ పెరుగును కర్నాటక ప్రజల మీద రుద్దాలనుకున్నారు. కర్నాటక లో పేరు మోసిన పెరుగు కంపనీని అమూల్‌ లో విలీనం చేయాలనుకున్నారు. దానికి తోడు పెరుగు పేర కన్నడం లో కాకుండా కేవలం హిందీలో రాయాలని కేంద్రం నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పెరుగు ప్యాకెట్ల మీద హిందీ బాషను మాత్రమే ప్రింట్‌ చేయాలని ఒత్తిడి ని దేశ ప్రజలతో పాటు కర్నాటక ప్రజలు కూడా తిరస్కరించారు. బలవంతంగా హిందిని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడమే అవుతుందని కర్నాటక బిజేపి మీద కన్నెర్ర చేసింది. బిజేపిని కాదని, కాంగ్రెస్‌ కు కర్నాటక ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్‌ కొన్ని అలవికానీ హామీలను గుప్పించడం కూడా సీట్లు పెరగడానికి కారణమైంది. అంతే తప్ప కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కర్నాటక లో అధికారం సిద్దించలేదు. కర్నాటక లో బిజేపి ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. పైగా బిజేపి మళ్ళీ అధికారంలోకి తెచ్చినా తనకు పెద్ద ప్రాధాన్యత లభించకపోవచ్చని యడ్యూరప్ప సైలెంట్‌ గా వుండడం కూడా బిజేపి కి మైనస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ కు అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇదీ అసలు ముచ్చట.
కాంగ్రెస్‌ వన్నీ కోతలే! కాంగ్రెస్‌ చెప్పే విషయాలు నమ్మశక్యమైనవి కాదు.
గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఏదైనా ఒక విధానం తీసుకుంటే అది అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. తెలంగాణ తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అన్నది చెప్పాలి. ఇప్పటికే అధికారంలో వున్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. అధికారంలో వున్న రాష్ట్రాలలో అమలు చేయకుండా ఎందుకున్నారు.
హస్తమంతా రిక్తమే!! అంతే అంతా ఉత్తదే. కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!
కర్నాటక లో ప్రకటించిన ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదు. కర్నాటక లో అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా అక్కడ సిలిండర్‌ రూ. 500కు సిలిండర్‌ ఇచ్చింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హెల్త్‌ స్కీమ్‌ లేదు. ఇందిరమ్మ ఇండ్లు కర్నాటక లో లేదు. జాగాలున్న వారికి రూ. 5 లక్షల పథకం లేనే లేదు. రైతులకు రైతుబందు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కానీ తెలంగాణ లో మాత్రమే ఇస్తారట. నిన్నటి దాకా తెలంగాణ అప్పుల రాష్ట్రం అన్నారు. జీతాలకే పైసలు లేవన్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నిజాయితీ వుండాలి. ఇంత కాలం తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక్కసారైనా అని వుంటే బాగుండేది. పూరి గుడిసెలో ఏసి ఫిట్‌ చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ చెప్పింది అలాగే వుంది. తెలంగాణ లో ఆదాయం అప్పలకే సరిపోతుందన్న వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే జనం నమ్ముతారా?
బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు నిశితంగా పరిశీలిస్తే కొత్తగా వాళ్లు చెబుతున్నది ఏమీ లేదు?
ఎందుకంటే వాళ్లు వచ్చేది లేదు. ఇచ్చేది లేదు. అందుకే నోటికొచ్చిన హామీలిస్తున్నారు.ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాగా తెలుసు. గెలిచేది లేదన్నది సీనియర్‌ నేతలందరికీ నాయకులకు తెలుసు. ఓ వైపు టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తున్నవే. కేవలం డబ్బులు వున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్న మాటలే. టిక్కెట్ల పేరుతో రేవంత్‌ రెడ్డి సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఇది తెలిసే సీనియర్లు గుర్రుగా వున్నారు. పైగా బైట నుంచి ఎవరొస్తారా? టిక్కెట్లు అమ్ముకుందామా? దుకాణం నడుస్తోంది. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. ముచ్చట మూడో సారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం. తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు. ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. మూడోసారి భంగపాటు తప్పదు. కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు. కేవలం తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నమ్మడం లేదు. తెలంగాణ కోసం ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో కలిసి పద్నాలుగేళ్లు కొట్లాడి సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన రేవంత్‌ ను కాంగ్రెస్‌ నేతలు నమ్మినా ప్రజలు జీవితంలో నమ్మరు. రేవంత్‌ రెడ్డి వున్న కాంగ్రెస్‌ కు ఓటు కూడా వేయరు. రేవంత్‌ సృష్టిస్తున్న అబద్దాల మాయా మశ్చీంద్రను జనం అసలే నమ్మరు. తన సొంత నియోజకవర్గ ప్రజలే తెలంగాణ విషయంలో రేవంత్‌ చేసిన పాడు పనికి చీ కొట్టి ఓడిరచారు. ఇక తెలంగాణ ప్రజలు నమ్మడం అనే కల్ల. కాంగ్రెస్‌ పథకాలన్నీ డొల్ల.

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/

` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు.

` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.

 

`సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు.

`పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు.

` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు.

`తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు.

`తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు.

`నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు కరంటు జిలుగులు తెచ్చాడు.

`పగలంతా, రేయంతా వెలుగులు నింపాడు.

`రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇస్తున్నాడు.

`ఆసరా ఫెన్షన్లతో పెద్దకొడుకయ్యాడు.

`కళ్యాణ లక్ష్మి తో మామయ్యగా మారాడు.

`తెలంగాణ తెచ్చి తెలంగాణ పితగా కీర్తి నందుకున్నారు.

`మా సారు అని వేనోళ్ల కొనియాడబడుతున్నాడు.

` కేసిఆర్‌ చేతిలోనే తెలంగాణ పదిలమని ప్రజలు నమ్ముతున్నారు.

`మరో సారి కూడా మన సారునే గెలిపించుకుంటామంటున్నారు.

`సారు సర్కారే కావాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా! అమావాస్య చీకటిలో దీపావళి జాతరా!! అంటూ ఓ కవి రాసిన జీవనచిత్రం సరిగ్గా తెలంగాణ పడిన గోసను తెలియజేస్తుంది. అయితే తెలంగాణకు చీకట్లు సహజంగా రాలేదు. తెలంగాణ చీకటోళ్ల లోకం ఒట్టిగనే కాలేదు. పరాయి పాలకులు పగబట్టి చేశారు. తెలంగాణ జీవితాలను చీకటి చేశారు. బతుకులు ఆగంచేశారు. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ. ఊర్లన్నీ వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతివృత్తులు మాయమైపోయి, దిక్కులేని బతుకుల కాలం చూసి గొడగొడ ఏడ్చిన తెలంగాణ. ఎటు చూసినా బీడువారి నోర్లు తెరిచి నీటి చుక్క కోసం ఎదురుచూసిన తెలంగాణ. దుబ్బలుగా మారి, పంటలకు పనికి రాకుండాపోయిన తెలంగాణ. ఏ చెలక చూసినా ఎడారే…ఏ చెరువు చూసినా మొలిచిన తుమ్మలే…పల్లెల్లో నీటి కటకటలే… సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపం దిగమింగుకొని బతికిన రోజులవి. నేడు నీటి జాడలకు కొత్త నడకలు నేర్పిన తెలంగాణ. నీటి పరవళ్ల తెలంగాణ. పంటల పరవశంలో తెలంగాణ. కరువు పారిపోయిన తెలంగాణ. బీడుకానరాని తెలంగాణ. చెరువులు బాగు పడ్డ తెలంగాణ. చెరువులు గంగాళాలైన తెలంగాణ. కాళేశ్వరం నీరు కాలువల్లో పరుగులు పెడుతున్న తెలంగాణ. సాగు సస్యశ్యామల తెలంగాణ. పడావు బడ్డ భూముల్లో పుష్కలమైన పంటల తెలంగాణ. పల్లె మురుస్తున్న తెలంగాణ. పచ్చదనం వెల్లివిరిసిన తెలంగాణ. అరవైఏళ్ల గోసను తెలంగాణ పొలిమేరలకు తరిమిన తెలంగాణ. సంక్షేమ తెలంగాణ. సాధికారిత సాధించిన తెలంగాణ. చేతి వృత్తులకు మళ్లీ జీవమైన తెలంగాణ. పల్లెబతుకుల్లో వెలుగులు నిండిన తెలంగాణ. పల్లె మరుస్తున్న తెలంగాణ. పట్నం ప్రగతి తెలంగాణ. పల్లెల్లో వెలుగుల తెలంగాణ. వేకువలో వెండి వెన్నెల తెలంగాణ. ప్రగతి తెలంగాణ. బంగారు తెలంగాణ. పదేళ్లలో దార్శనికుడు కేసిఆర్‌ ఆవిష్కరించిన బంగారు తెలంగాణ. బాగు పడిన తెలంగాణ. బంగారు మాగాణం నా తెలంగాణ. పాడ పంటల తెలంగాణ. పచ్చదనంతో మురుస్తున్న తెలంగాణ.

సమైక్య పాలకుల దాష్టికానికి కకావికలమైన తెలంగాణ కేసిఆర్‌ రూపంలో తిరిగి వెలుగులు నింపుకున్నది.

ఆగమైన చెరువులు నీళ్లునింపుకున్నవి. . ఆనవాలు లేకుండాపోయిన చెరువులు గంగాళాలైనవి. రూపు చెదిరిపోయిన పల్లెలు పండగ చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బతుకులైన తెలంగాణ జీవితాలు ఆత్మ గౌరవాన్ని నిలుపుకున్నాయి. పరాయి పాలనలో బిక్కుబిక్కు జీవితాలు వెలుగులు నింపుకున్నాయి. మన రాష్ట్ర్రం మన తెలంగాణ అని తలెత్తుకున్నాయి. నాడు విద్య లేదు.విలువ లేదు. నేడు తెలంగాణ వ్యాప్తంగా 1000 గురుకులాలు. నాడు ఉపాధి లేదు. నేడు తెలంగాణ యువతుక ఐటి కొలువులు. నాడు పంటలకు దిక్కులేదు. నేడు కరువుకు తెలంగాణలో చోటు లేదు. నాడు ఆకలి తీరింది లేదు. నేడు దేశానికి అన్నం పెడుతున్నాం. నాడు కరువు కాటుకు బతికింది లేదు. నేడు కరువునే కాటేసేంత అన్నపూర్ణ అయ్యింది. నాడు కొట్లాడినా లాభం లేదు. పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాల్లో కానరాని ప్రగతి. ఇదీ నాటి తెలంగాణ దుస్దితి. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెల్లో కరంటు లేక, రాక, సాగుకు ఎప్పుడొస్తుందో తెలియక, ఎండుతున్న పంటలను చూసిన విలవిలలాడిన తెలంగాణ.
ఉమ్మడి పాలకుల చీకటి నుంచి తెలంగాణ విముక్తి చెందింది.
కేసిఆర్‌ పట్టుదల ముందు, పంతం ముందు, ఆత్మగౌరవ నినాదం ముందు ముందు, ఉద్యమం ముందు, పోరాటం తట్టుకోలేక సమైక్య పాలన విరగడైంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. పారే ఏరు ఎండిపోయి వెక్కిరిస్తుంటే తెలంగాణ గుండె పగిలిపోయింది. ఒట్టిపోయి వాగు చుక్క నీరు మోసుకుపోలేక పోతే కేసిఆర్‌ కంట తడినుంచి కన్నీరొలికింది. ఆ క్షణం జై తెలంగాణ అని ఆ కన్నీరు నినదించింది. కేసిఆర్‌ గొంతులో నుంచి ప్రపంచానికి వినిపించింది. కేసిఆర్‌ కంటి నుంచి జారి పడిన కన్నీటి చుక్క పోరాటం మొదలు పెట్టింది.

ఆ చుక్కే తెలంగాణ భూమిని తడిపేందుకు మొదటి చినుకైంది.

ఆ నాడు ఎత్తిన పిడికిలి కేసిఆర్‌ తెలంగాణ తెచ్చేదాకా విప్పలేదు. ఎత్తిన జెండా దించలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చలించలేదు. బెదిరింపులకు అదరలేదు. కేసులకు బెదరలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తెలంగాణ సాదనే జీవిత పరమావధి చేసుకున్నాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చి వీరుడయ్యాడు. తెలంగాణ తల రాత మార్చిన విధాతయ్యాడు. పట్టిన పట్టు విడవకుండా, ఒక్కడుగా మొదలై, ఒక్కటే అడుగై, ఒకరినొకరు ఆయనలో అడుగులో అడుగై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేసిండు. పద్నాలుగేళ్ల నిరంతర పోటారం చేశాడు. రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించాడు. అరవై ఏళ్ల తెలంగాణ కల నెరవేర్చాడు. తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేశాడు. సాగుకు ఇరవైనాలుగు గంటల కరంటు ఇచ్చి రైతన్నను రాజునే చేశాడు. నా తెలంగాణ కోటిన్నర సాగు మాగాణ చేశాడు. మిషన్‌ కాకతీయతో 46వేల చెరువులకు మళ్లీ జీవం పోశాడు. కాకతీయుల కాలం కళ్ల ముందుకు తెచ్చాడు. చెరువులన్నీ నిండగ, ఎండాకాలంలో మత్తళ్లు దుంకంగ, వాగులు ఒర్రెలు గోదారి జలాలు పారంగ, జలజలగలగలలు కళ్ల ముందు కదలాడంగా తెలంగాణ నిజప్రపంచమైంది. సంక్షేమంలో మేటిగా అడుగులేస్తోంది. ప్రగతిలో పరుగులు పెడుతోంది.

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కారమైంది.

మిషన్‌ భగీరధతో తెలంగాణ పల్లెల్లోకి గోదారి పరవళ్లు పరుగులు తీసి, ఆడ పడుచుల కాళ్లు కడుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ చరిత్రను పదిలం చేసి, పది కాలాలపాటు తెలంగాణకు నీటి గోస తీరింది. సస్యశ్యామల తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. స్వపరిపాలనతో ఆత్మ గౌరవం వెల్లివిరిస్తోంది. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వారు కూడా అబ్బుర పడేలా తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె వికాసమే దేశ వికామని నాయకులు నమ్మితే చాలు…పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువ లేకుండాపోతుంది. దేశానికి అన్నం పెట్టే ధైర్యం రైతన్నలో కనిపిస్తుంది. వారి మోములో ఎప్పుడూ చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనగానే పులకించేంది…తరించేది రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి.
పల్లె కష్టం, పాడి కష్టం, ఆకలి వేధనలు, ఆక్రందనలు తెలిసిన నాయకుడు పాలకుడైతే కరువు పారిపోతుంది.
కష్టం పొలిమేర దాటి రావాలంటే భయపడుతుంది. సంతోషం ఇంటింటా వెల్లివిరిస్తుంది. అది మన తెలంగాణలా వుంటుంది. పల్లె శోభితమై మురుస్తోంది. పంటల రాశులు చూసి పరవశిస్తుంది. పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, సంబురపడుతుంది. పాడి పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది. తన కన్నీటి పొరల్లో నాలుగు దశాబ్దాల పాటు దాచుకున్న తెలంగాణ స్వప్నం నిజంచేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌, సువర్ణ పాలనతో స్వర్ణయుగం తెచ్చాడు. బీడు వారిన భూములను సస్యశ్యామం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధరలు పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, కరంటు, ఉపాధి, సంక్షేమ, ప్రగతి రంగాలన్నీ ఏకకాలంలోనే సాక్ష్యాత్కరించాడు. ఒక్క తెలంగాణలోనే…పచ్చని ప్రకృతిలో తెలంగాణ పుడమి పులకించుతోందిజ తెలంగాణ జాతి సగర్వంగా బతుకుతన్నది. కేసిఆర్‌ చేతుల్లోనే తెలంగాణ పదిలంగా వుంటానని పాఠం నేర్పిస్తోంది.

ఎదురులేని నాయకత్వం. తిరుగులేని ప్రభంజనం.

https://epaper.netidhatri.com/

`లక్షన్నర మెజారిటీ దిశగా…

`పేదల గుండెలకు దగ్గరగా…

`ప్రతి కుటుంబానికి తోడుగా…

`ఆపదలో వున్న వారికి అండగా…

`ప్రతి వ్యక్తికి తోడుగా…

`తానే పెద్ద దిక్కుగా…

`అందరికీ భరోసాగా…

`ఆపన్నులకు చేయూతగా…

`రైతన్న మోములో చిరునవ్వుగా…

`పచ్చని పొలాలో సిరి వెలుగులా…

`పల్లెల్లో వెండి వెలుగులా…

`ప్రతి గుండెలో ఆరని తడిగా…

` ‘‘హరీష్‌ అన్న’’..పదమే ఒక ధైర్యం గా…

హైదరాబాద్‌,నేటిధాత్రి:
నాయకుడికి ప్రజలంటే ప్రేమ కావాలి. ప్రజల మీద మమకారం వుండాలి. అవి రెండు నిండుగా వున్న మనసున్న నాయకుడు మంత్రి హరీష్‌రావు. ఎదురులేని రాజకీయం. బెదురులేని ఉద్యమ ప్రాస్దనం…తెగించి పోరాడే తత్వం…నిరంతరం అభివృద్ది మంత్రం…సిద్దిపేటలను తీర్చిదిద్దిన వైనం…హరీష్‌రావు మార్క్‌ ప్రగతి ప్రయాణం..తెలంగాణకే తలమానికం…నాయకులకు ఆదర్శం…ప్రజలకు ఎంతో సంతోషం. ఈ రోజ సిద్దిపేట ఇంత అందంగా ముస్తాబైందంటే కారణం మంత్రి హరీష్‌రావు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆరే సిద్దిపేటను నేను కూడా ఇంత అభివృద్ది చేయకయపోదునేమో! అన్నారంటే హరీష్‌రావు చిత్తశుద్ది ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. తన ప్రాంతం మీద ఆయనకు వున్న ఇష్టం, అభిమానం సిద్దిపేటను సుందరవనంగా తీర్చిదిద్దేలా చేసింది. సిద్దిపేటలో అడుగడుగునా హరీష్‌రావు మార్కు అభివృద్ది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో మెజార్టీ ఎంత అన్నదానిపై ప్రజల్లో రకరకాల చర్చలున్నాయి. ఎన్ని వున్నా అందరూ మాట్లాడుకునే మాట మాత్రం లక్షన్నర…మెజార్టీ అన్నదే ఎక్కువగా ఫోకస్‌ అవుతోంది. అలా సిద్దిపేటన తీర్చిదిద్దడం వల్లనే ఇలాంటి చర్చ జరుగుతోంది.

ALSO WATCH:

https://youtube.com/shorts/4GqrRz04x3w?si=Wk-1OCwOo7JedICf

ప్రజల గుండెలకు దగ్గరైన నాయకుల్లో హరీష్‌రావు ఒకరు.
దేశంలో ఇలాంటి నేతలు చాలా అరుదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా ఇలాంటి నాయకుడు మరొకరు లేరు. ఎన్నికల సమయం వచ్చిందంటే ఆయనపై పోటీకి నిలిచే నాయకుడికి గురించి ప్రజలు ఎవరూ ఆలోచించరు. అలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొన్న నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఏదో ఒక ప్రభుత్వ సాయం అందించిన నాయకుడు హరీష్‌రావు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు, సింఎం. రిలీఫ్‌ ఫండ్లు, ఎల్‌వోసిలు, ఆసుపత్రుల్లో వైద్యాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు కంపనీలలో కూడా ఉద్యోగాలు. ఏదో ఒక మేలు ప్రతి కుటుంబానికి జరిగింది. లబ్ధిదారుల ఓట్లే ఆయన మెజార్టీని పెంచుతూ పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆపదలో వున్న వారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ రోజుకు కనీసం పది మందికైనా ఏదో రకమైన సేవ అందించాలన్న ఆలోచనతోనే దినచర్య ప్రారంభించే నేత బహషా ఒక్క హరీష్‌రావే కావొచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులంటే ఎలా వుంటున్నారో..ఇటీవల కాలంలో చూస్తూనే వున్నాం. కాని వాళ్లందరికీ భిన్నమైన నాయకుడు హరీష్‌రావు. తాను ఉద్యమ నేపధ్యం నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. అందకు ప్రజలకు దగ్గరగా వుండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. ప్రజలను మేలు చేసే పనులు మాత్రమే చేపడుతుంటాడు. తన నియోకజవర్గంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటాడు. ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోయాడు. నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ముందు తలుపు తట్టేది హరీష్‌రావు ఇంటినే…ఆయన ఇల్లు నిత్యం ఉదయమే జన సందోహంతో నిండిపోతుంది. ఎంత మంది వచ్చినా ఎంతోఓపికతో వారి సమస్యలు వింటారు. వారి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరిస్తారు. వారికి మేలు చేస్తుంటారు. తన వద్దకు వచ్చినవారందరిలో భరోసా నింపి పంపిస్తుంటారు. మళ్లీ,, మళ్లీ తిరగాల్సిన పరిస్ధితి రానివ్వరు. ఆపన్నులకు చేయూతనిందిస్తారు.

హరీష్‌రావు మంత్రి అయ్యాకే ప్రజలకు సేవ చేయడం లేదు.

ఆయన ఉద్యమ నాయకుడిగా, ఎమ్మెల్యేగా వున్న సమయం నుంచే విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో ఓ వైపు రాష్ట్రమంతా తిరుగుతూనే, నియోజకవర్గ బాగోగులు చూసుకుంటుంటేవారు. నిత్యం తన ప్రజలకు అందుబాటులో వుంటుండేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి కూడా అనేక నిధులు తెచ్చి, సిద్దిపేటను తీర్చిదిద్దారు.ఇదీ ఆయన అంకితభావానికి నిదర్శనమని చెప్పాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతపరిస్దితి ఎలా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఎటు చూసినా ఏడారిని తలపించేది. ఎక్కడా నీటి చుక్క జాడ వుండేది కాదు. నీడ కూడా కానరాని పరిస్ధితి. బాట సారులే కాదు, కనీసం పశువులకు కూడా నీడ లేకుండాపోయిన రోజులను తెలంగాణ చూసింది. సాగు లేక, పాడి లేక తెలంగాణ పల్లెలు చిద్రమైన కాలంలో సిద్దిపేట నియోజకవర్గ రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. అప్పటి ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేసినా, ఎమ్మెల్యేగా హరీష్‌రావు దగ్గరుండి ఎన్నో చెరువులను ప్రజల బాగస్వామ్యంతో శ్రమదానం చేసి బాగు చేయించాడు. తాను పలుగు పట్టి తవ్వి,పార పట్టి మట్టిని తట్టలో వేసి, ఆ తట్ట మట్టిని ట్రాక్టర్లో పోసి శ్రమ విలువ తెలిసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఫోటోలకు ఫోజులిచ్చే నాయకులను చూస్తుంటాం. కాని రోజంతా చెరువు పనులు చేసిన నాయకుడు ఒక్క హరీష్‌రావు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమ కాలంలో కూడ ఆయన ప్రజలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక దశలో కరవు విలయతాండవం చేసి, కనీసం పశువులకు గడ్డి కూడా లేని కాలం చూసింది తెలంగాణ. ఆ సమయంలో కోన సీమ పచ్చగా, ఆంద్ర అంత నిండుగా వుంది. అక్కడి నుంచి తన సొంత ఖర్చులతో పశుగ్రాసం తెప్పించి, తన నియోకజవర్గ రైతులకు అందించిన నాయకుడు హరీష్‌రావు.

ఎడారిలా ఒకనాడు జీవం కోల్పోయిన తెలంగాణ నేల ఇప్పుడు సస్యశ్యామలమైంది.

కాలువల నిండా నీళ్లు. మిషన్‌ కాకతీయతో చేసిన చెరువుల అభివృ ద్దితో ప్రతిపల్లె ఒక గంగాళం. ప్రతి బావి నిండుగా, ప్రతి బోరు ఎల్లబోసేంత నీటితో తెలంగాణ జలకళ సంతరించుకున్నది. సిద్దిపేట కూడా సాగు, తాగు నీటిని నింపుకొని, రైతుకు మేలు చేస్తోంది. ఆడబిడ్డలకు మంచినీళ్లందిస్తోంది. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి కూడా ఎంతో కటకట. ఎన్ని గజాల చేదబావులైనా నీళ్లు వుండేవి కాదు. ఎన్ని వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరొచ్చేది కాదు. కాని సిద్దిపేట ప్రాంతలో భూ గర్భ జాలలు విపరీతంగా పెరిగాయి. ఫ్లోరైడ్‌ సమస్య పూర్తిగా పోయింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో సమృద్దిగా నీటి సంపదను పెంచుకున్నట్లైంది. ఇదంతా హరీష్‌రావు వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన కృషి అమోఘం. అందుకే ఆయనను మాజీ గవర్నర్‌ నర్సింహన్‌ మంత్రి హరీష్‌రావును కాళేశ్వరరావు అంటూ కీర్తించారు. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి నిర్మాణం చేయించాడు. రాత్రి పగలు అక్కడే నిద్ర చేసి, ప్రాజెక్టు పూర్తి చేయించారు. అంతలా తెలంగాణ మీద మమకారం ఆయనకు వుంది. అందుకే ఆయన భారీ నీటిపారుదల మంత్రిగా కాళేశ్వరమేకాదు, మల్లన్న సాగర్‌తోపాటు అనేక రిజర్వాయర్ల నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించి తెలంగాణనే నీటి గంగాళం చేసిన నాయకుడు హరీష్‌రావు. అటు రాష్ట్ర సమస్యలు,ఇటు తన నియోకవర్గ వర్గ సమస్యలు తీర్చుకుంటూ, నాయకుడిగా అందిరికీ ఆదర్శమయ్యాడు. జాతీయస్దాయిలో ఏ అవార్డు వచ్చినా అందులో సిద్దిపేట వుంటుంది. తన నియోజకవర్గాన్నే ప్రగతి నమూనాగా తీర్చిదిద్డారు. మోడల్‌ అభివృద్ది అంటే ఏమిటో చూపించారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాదికారులు, సిద్దిపేటను సందర్శిస్తునే వుంటారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలు తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తూ వుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్దిపేట అభివృద్దికి ఒక ప్రయోగశాలగా మార్చి, ప్రగతికి చిరునామా చేసిన నాయకుడు హరీష్‌రావు.

ఛీ..ఛీ…రేవంత్‌ అని ఛీ..కొడుతున్న జనం?

https://epaper.netidhatri.com/

` రేవంత్‌ రెడ్డి మతి లేని మాటలు.

`కరంటు మీద అవగాహన లేని లెక్కలు.

`సాగు మీద సంబంధం లేని సాకులు.

`ఆలయాల భూములమ్మి మైనారిటీలకు సాయపడతాడట.

`సమైక్య పాలనే బాగుందన్న రేవంత్‌.

`నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్‌ లైన్‌ కాదట.

`సమైక్య పాలనలో నీళ్లిచ్చారట.

`అప్పుడే ఉద్యోగాలు బాగా ఇచ్చారట!

` తెలంగాణ నిధులతో హైదరాబాదు అభివృద్ధి చేశారట.

`ఉద్యమ ద్రోహి రేవంత్‌ నోట పచ్చి అబద్దాలు.

` అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమాన్నే తప్పు పడుతున్న రేవంత్‌.

`సమైక్య పాలకులు నీళ్లిస్తే పాలమూరు ఎందుకు ఎడారైంది?

`వలసల జిల్లాగా పాలమూరు ఎందుకు మిగిలింది.

`నమ్మితే తెలంగాణను ఆగం చేస్తాడు.

`చంద్రబాబు చేతిలో తెలంగాణ పెట్టి సమైక్య నినాదం వినిపిస్తాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 రాష్ట్ర రాజకీయాలను రేవంత్‌రెడ్డి పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌ వ్యవహారాన్ని అటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇటు ప్రజలు చీ..అంటున్నారు. ఛీ..ఛీ..అంటున్నారు. అయినా రేవంత్‌కు అర్ధం కావడం లేదు. ఎంత గుడ్డెద్దు చేలోపడినట్లు వుంది ఆయన వ్యహారం. ఈ మధ్య నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. లాజిక్‌ లేని లెక్కలు చెబుతున్నాడు. అసలు లెక్కలు తప్పుతున్నాడు. జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీని వీదినపడేస్తున్నాడు. తాను మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత గొప్పనాయకుడిని అన్న అపోహకు వచ్చేశాడు. అందుకే సీనియర్లను పక్కన పెట్టేశాడు. కాంగ్రెస్‌నిండా తెలుగుదేశం నింపేశాడు. ఇక ఆడిరది ఆట, పాడిరది పాట అనుకుంటున్నాడు. అన్నీ తప్పులే చేస్తున్నాడు. స్దాయికి మించి మాట్లాడుతున్నాడు. తాను పిసిసి అద్యక్షుడిని అన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. తన మాటల వల్ల పార్టీకి ఎంత నష్టం వస్తుందన్నది ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ పెరుగుతుందన్న భ్రమలో వుంటున్నాడు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద ఎలా పడితే అలా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నాడు. విరుచుకుపడుతున్నాన్న భ్రమ పడుతున్నాడు. మంత్రి కేటిఆర్‌ మీద ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. పైగా తనకు ఆ మాటలు కేసిఆరే నేర్పారంటూ పిచ్చి సూక్తులు చెబుతున్నాడు. సరే రాజకీయంగా ప్రత్యర్ధుల మీద మాటలు రాజకీయాలే అనుకుందాం..కాని ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామన్న సోయి కూడా లేకుండా రేవంత్‌ మాట్లాడుతున్నాడు. 

 అమెరికాలో ఎకరాకు మూడు గంటల కరంటు చాలంటూ సోది చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు దానికి బాష్యం చెబుతున్నాడు. 

ప్రతి రైతు 10హెచ్‌పి మోటార్‌ వాడితే ఎకరం పొలం మూడు గంటల్లో పారకమైపోతందంటున్నాడు. మెడ మీద తలకాయ వున్నవారెవరూ ఇలాంటి విధంగా ఆలోచన చేయరు. ఎందుకంటే తెలంగాణ కమతాలన్నీ చిన్న కమతాలు. ఆ కమతాలలో బావులకు సగం భూమి పోవడాన్ని ఎవరూ కోరుకోరు. గుంట స్ధలం కూడా వృధా పోకూడదని ఏ రైతైనా కోరుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు నిర్లక్ష్యం, కరువు పరిస్దితులు ఏర్పడడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో బావులు ఎప్పుడో ఎండిపోయాయి. దాంతో చాల మంది రైతులు బావులను ఎంత పూడిక తీసుకున్నా నీటి జాడలు కనిపించలేదు. దాంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయి, అప్పులపాలై వలసలు పోయిన సందర్బాలున్నాయి. ఆ అప్పులు తీర్చుకొని, మళ్లీ అప్పులు చేసి బోర్లు వేయించుకున్నారు. గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో బోర్లమీదే వ్యవసాయం ఎక్కువ శాతం సాగుతోంది. బావులు ఎప్పుడో పూడుకుపోయాయి. చాల బావులు రైతులే పూడ్చేశారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 26లక్షల బోర్ల కింద వ్యవసాయం సాగుతోంది. ఈ విషయం రేవంత్‌కు తెలిసినట్లు లేదు. 10 హెచ్‌పి మోటార్లు దేనికి అనుసందానం చేయాలో రేవంతే చెప్పాలి. అంతే కాదు బోర్లలో ఇంకా అంతటి సబ్‌ మెర్సిబుల్‌ మోటార్లు రాలేదు. వచ్చినా బోర్లు అందుకు సహకరించవు. ఈ మాత్రం పరిజ్ఞానం రేవంత్‌కు లేకపోవడం విడ్డూరం. కాదు దౌర్భాగ్యం. రేవంత్‌కు సాగు మీద కనీస అవగాహన లేదని తేలిపోయింది. తన అజ్ఞానం ఎంత గొప్పగా వుందో ఆయనే తెలియజేశాడు. 

ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే పాలన బాగుందని రేవంత్‌రెడ్డి కితాబిస్తున్నాడు.  

నిజంగా రేవంత్‌రెడ్డికి ధైర్యం వుంటే తాను సమైక్యవాదిని అని ప్రకటించాలి. అవకాశవాదిగా ఎందుకున్నట్లు? ఇప్పటికీ తాను సమైక వాదానికి కట్టుబడి వున్నానని చెప్పదల్చుకున్నావా? అదైనా సూటిగా చెప్పు? ప్రజలే తేల్చుకుంటారు? తెలంగాణలో ఉమ్మడి పాలకుల పాలనే బాగుంటే పాలమూరు ఎందుకు ఎండిపోయింది? పాలమూరు ఇప్పుడు పచ్చబడిరదో కళ్లుండే చూస్తున్నావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వలస జిల్లా అంటే ఉమ్మడి పాలమూరే అన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? రేవంత్‌ది అదే జిల్లానా? పాలమూరు మీద కవులు కొన్నివేల పాటలు రాశారు. కొన్ని వందల మంది గాయకులు పాలమూరు గాయాలు పాడి వినిపించారు. కొన్ని వందల మంది రచయితలు పాలమూరు కరువు మీద పుస్తకాలే రాశారు. ఇక జర్నలిస్టులు కొన్ని వేల వార్తలు రాశారు. పాలమూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే బస్సులు ప్రచురించేవారు. అంతేందుకు పాలమూరు కరువు పారద్రోలుతానని చెప్పి,చంద్రబాబు దత్తతు తీసుకున్నాడు. కనీసం రేవంత్‌కు ఆ సందర్భమైనా గుర్తుందా? చంద్రబాబు దత్తత తీసుకొని ఏం బాగు చేశాడో రేవంత్‌ రెడ్డి చెప్పగలరా? తెలంగాణ గురించి మాట్లాడే ముందు రేవంత్‌ ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. నిజంగానే ఉమ్మడి పాలకుల పాలన బాగుంటే తెలంగాణలో ఆది నుంచి ఎందుకు ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం ఎందుకు జరిగింది. తెలంగాన ప్రజలు తిన్నది అరక్క ఉద్యమం చేశారని రేవంత్‌ చెప్పదల్చుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మందికి తెలంగాణ నాయకులకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం వచ్చింది? వచ్చినా వాళ్లు ఎందుకు పదవులు పోగొట్టుకోవాల్సివచ్చిందన్నది? రేవంత్‌కు తెలిసే మాట్లాడుతున్నాడా? దేశంలోనే గొప్ప పార్లమెంటేరియన్‌గా పేరు గాంచిన రేవంత్‌కు బంధువైనా జయపాల్‌రెడ్డి లాంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? సమాధానం రేవంత్‌ చెప్పాల్సిన అవసరం వుంది. 

ఉమ్మడి పాలకులు నీళ్లిచ్చారా?

 అదే నిజమైతే కోనసీమ ఎందుకు పచ్చగా వుండేది. తెలంగాణ ఎందుకు ఎండిపోయేది? ఇప్పుడు కోససీమ కన్నా, తెలంగానలో ఎందుకు బంగారు పంటలు పండుతున్నాయి? ఉమ్యడి రాష్ట్రంలో తెలంగాణకు మంచినీళ్లు ఇవ్వని ఉమ్మడి పాలకులు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మించి, కాలువ ద్వారా మద్రాసుకు మంచినీళ్లు తీసుకెళ్లారన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఎంత? ఆంద్రకు వాటా ఎంత? అన్నది రేవంత్‌ తెలుసుకున్నాడా? శ్రీశైలం కేవలం విద్యుత్‌ ఉత్పాదన కోసం కట్టిన ప్రాజెక్టే అన్నది తెలుసా? తెలంగాణకు శ్రీశైలం నుంచి వరద జలాలు మాత్రమే వినియోగం అన్న లెక్కలు చెప్పిన పాలకుల లెక్కలు రేవంత్‌ విన్నాడా? నాగార్జున సాగర్‌ ఎక్కడ నిర్మాణం చేయలి? ఎక్కుడ చేశారు? అన్నది రేవంత్‌కు తెలుసా? నాగార్జున సాగర్‌ నిర్మాణం చేసి, తెలంగాణకు ఖనిజ సంపద కూడా ఉపయోగపడకుండా కుట్ర చేసిన సందర్భం తెలుసా? కేవలం తెలంగాణను ముంచి, నీళ్లను తరలించుకుపోయేందుకు నాగార్జునసాగర్‌లో ఉమ్మడి పాలకులు చేసిన కుట్ర తెలుసా? ముందు ప్రకటించిన ప్రాంతం నుంచి తరలించి, వేరే ప్రాంతంలో నిర్మాణం చేశారని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ వాదికి తెలుసు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ విషయం తెలిసేది. 

మైనార్టీ డిక్లరేషన్‌ కోసం ఆలయభూములు అమ్మకానికి పెడతావా?

తెలంగాణలో కొన్ని శతాబ్దాల నుంచి ముస్లింలు, హిందువులు బాయి, బాయి అనుకుంటూ జీవిస్తున్నారు. రెండు మతాల సంస్కృతిలో మిలితమై బతుకుతున్నారు. ఒకరి పండుగలకు ఒకరు గౌరవించుకుంటూ సాగుతున్నారు. భాద్రాద్రి రామయ్యకు ముత్యాల వహరాలు నిజాం రాజు పంపించాడు. గంగాజమున తహజీవ్‌ కొనసాగుతోంది. పాతబస్తీలో బోనాల జాతర ఎంతో ఆనందోత్సహాలతో జరుగుతుంది. రంజాన్‌ నాడు హిందువులు, ముస్లింలు ఎంతో కలిసి వేడుక చేసుకుంటారు. అలాంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకేనా సున్నితమైన విషయాలను రేవంత్‌ లేవనెత్తుతున్నాడా? ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసి, ఓట్లు చీల్చి ముస్లింఓట్లతో గద్దెనెక్కాలన్న రేవంత్‌ ఆలోచనను ఎవరూ సమర్థించరు. మైనార్టీలు కూడా ఇలాంటి రాజకీయాన్ని అసలే స్వాగతించరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనంతా కూర్యూలే! ఏ ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా వున్నదిలేదు. కాని ఈ తొమ్మిదేళ్లు ఎంతో ప్రశాంతంగా వుంది. కర్ఫ్యూ అన్న పదమే తెలంగాణ మర్చిపోయింది. ఆ ప్రశాంతతన చెడగొట్టేందుకు రేవంత్‌ కుట్ర పన్నుతున్నాడా? గతంలో కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో కరువు, నగరంలో కర్ఫ్యూ ఇవే కదా? నిత్యం విన్నవి. చూసినవి. రేవంత్‌ను నమ్మితే భవిష్యత్తులో కూడా మళ్లీ ఇవే చూడాల్సివస్తుందేమో! ప్రజలు బాగా ఆలోచించుకోవాల్సిన అసవరం వుంది.

మూడోసారి కూడా సారు, కారు సర్కారే?

https://epaper.netidhatri.com/

`హాట్రిక్‌ విజయం తధ్యమే!

`మెజారిటీ సీట్లు ఖాయమే

`తెలంగాణ అంతటా మళ్ళీ గులాబీ పరిమళమే.

`ప్రజల మద్దతంతా కారు పార్టీకే.

`ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ మరో సారి ప్రభంజనమే.

`పల్లెలు, పాడి పంటలు పరవశమే…

`పట్నంలో ప్రగతి పరుగులే.

`తెలంగాణ అన్ని వర్గాల అభ్యున్నతే…

`కాంగ్రెస్‌ పాపపుకాలం పాయే…

`బీఆర్‌ఎస్‌ తో పుణ్య కాలమొచ్చె.

`పదేళ్లలో తెలంగాణ మెరిసే…`ప్రజలంతా మురిసే.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా కారు, సారు,సర్కారు అనే నిదాదమే వినిపిస్తోంది. ప్రచారంలో కారు దూసుకుపోతోంది. ఎక్కడ విన్నా సారు పేరే వినిపిస్తోంది. తెలంగాణ సర్కారుకు ఎదరులేదని తెలుస్తోంది. కంగ్రెస్‌ ఎంత దుష్ట్రప్రచారం చేయాలని చూసినా,ప్రజలు నమ్మడం లేదు. రేవంత్‌ను అసలే నమ్మే పరిస్ధితి లేదు. ఎందుకంటే పూటకో మాట మాట్లాడడంతో రేవంత్‌ ఆరి తేరిపోయాడు. ఓవైపు సీనియర్లను సాగనంపి, దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వస్తున్న వారిని తరిమేసి కాంగ్రెస్‌ నిండా తన అనుచర వర్గాన్ని నింపుకున్న రేవంత్‌ ఎన్నటికైనా కాంగ్రెస్‌ ముంచేస్తాడని భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి నిత్యం జపం చేసేది ఆంధ్రాబాబు చంద్రబాబు పేరే. అందుకే రేవంత్‌ను నమ్మడం అంటే ప్రశాంతంగా వున్న తెలంగాణలో ప్రజలే అల్లకల్లోలం రేపుకోవడం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ అంటేనే కరువు. కాంగ్రెస్‌ అంటేనే జనాలకు బరువు. ఆది నుంచి ఓసారి చూస్తే దేశం మొత్తం కాంగ్రెస్‌ పాలించిన డెబ్బైవ దశకం దాకా దేశం మంతా కరువే. ఆనాడు కరువులో దేశంలో కొన్ని వేల మంది మరణించినట్లు కూడ లెక్కలున్నాయి. కరువు పరిస్ధితుల దృష్ట్యా నాలుగో పంచ వర్ష ప్రణాళికలను కూడా నిలిపిసేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. దేశమంతా కరువు నెలకొని వున్నా ఎలాంటి కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోపాటు, రాజకీయ అస్ధిరత దేశంలో ఎమర్జెన్సీలను పెట్టి, వేధించడంతోనే ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. ఇదీ కాంగ్రెస్‌ చరిత్ర. అంత దాకా ఎందుకు కర్నాకటలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అక్కడ కరువు మొదలైంది. ఆ ప్రభావం తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పడిరది. చలికాలంలో కూడా రాజమండ్రి లాంటి ప్రాంతాలలో చినుకు లేక ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నారని సమాచారం. అలాగే తెలంగాణలో కూడా ఈ మధ్య వాన చినుకు కరవైంది.

గడచిన తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో కరువు ఛాయలు లేవు. 

ఇలాంటి పరిస్ధితుల్లో కర్నాటక రైతులకు కరంటు ఇవ్వలేకపోతోంది. కాని మన తెలంగాణలో వర్షాలు లేకపోయినా తెలంగాన పల్లెలో సమృద్ధిగా నీరుంది. చెరువులు నిండుగా వున్నాయి. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణలో మూడేళ్లపాటు వాన చినుకు లేకుండా కరువు రాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో చినుకును ఒడిసిపట్టి, రిజర్వాయర్లు నింపేశాడు. ఇదీ విజన్‌ ఉన్న నాయకుడి పాలనకు నిదర్శనం. ఒకప్పుడు తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలలాడిరది. కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు మళ్లీ నేనున్నా, తెలంగాణ ప్రజలను పీక్కు తింటాను..కరువును తెస్తాను… జనాన్ని విలవిలాడిస్తాను అన్నట్లు కాంగ్రెస్‌ నేతల ప్రచారం వుంది. ఎందుకంటే పది హెచ్‌పిల మోటార్‌తో ఎకరం మడి మూడు గంటల్లో పారుతుందని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. అసలు బోర్లలో 10 హెచ్‌ పి మోటర్‌ వేసే అవకాశం వుంటుందా? అసలు తెలంగాణలో ఎన్ని బోర్లు వున్నాయో లెక్కలు కూడ తెలియని రేవంత్‌రెడ్డి మోటర్ల గురించి మాట్లాడితే రైతులు నవ్వుకుంటున్నారు. తెలంగాన రాకముందు 17 లక్షల బోర్లు వుండగా, ఇప్పుడు 26లక్షల బోర్లు సాగుకు నీరందిస్తున్నాయి. తెలంగాణలో భూగ్భజలాలు విపరీంతా పెరిగాయి. 10హెచ్‌ పి మోటార్లు కేవలం బావులకే పరిమితం. కాంగ్రెస్‌ పాలకుల పుణ్యమా అని తెలంగాణలో చాలా బావులు ఎప్పుడో కనుమరుగయ్యాయి. పూడికలు నిండిపోయాయి. వాటిని తీయడానికి రైతుకు లక్షల్లో ఖర్చవుతుంది. అందుకు అంత ఖర్చు చేయలేక, బోర్లను నమ్ముకొని తెలంగాణ రైతు వ్యవసాయం సాగిస్తున్నారు. అందుకే 24 గంటల కరంటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. సాగు మీద కనీస అవగాహన లేని రేవంత్‌ మాటలు నమ్ముకొని రైతు నిండా మునిగేందుకు సిద్దంగా లేడు. కాంగ్రెస్‌ ఓటేస్తానని రైతు ఎక్కడా చెప్పడంలేదు. కాని కాంగ్రెస్‌ అసత్య ప్రచారం మొదలుపెట్టి, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని పగటి కలలు కంటున్నారు. యాభై ఏళ్లు కష్టాలు, నస్టాలు, గోసలు చూసిన పల్లె జనం ఇంకా కాంగ్రెస్‌ నమ్ముతారని అనుకోవడం భ్రమ. అందులోనూ రేవంత్‌ నాయత్వం అంటే అది కాంగ్రెస్‌ కాదు. తెలుగుదేశం. తెలంగాణను మరింత గోస పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, పాలమూరును దత్తత తీసుకుంటున్నానని నమ్మించి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్క చెరువులో పూడిక తీయలేదు. ఒక్క పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అలాంటి దుర్మార్గపు పాలన తెలంగాణకు రుచిచూపించిన నాయకుడిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం ఆలోచిస్తాడని అనుకుంటే పొరపాటు. తెలంగాణ ఉద్యమకారులను తుపాకితో బెదిరించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాడా? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేసిన రేవంత్‌ తెలంగాణ ప్రయోజనాలు చూస్తాడా? యాభై లక్షలతో అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి. అలాంటి రేవంత్‌రెడ్డిని నమ్మితే నిండా ముంచకుండా వుంటాడా? ఇరవై నాలుగు గంటల కరంటును మూడు గంటలు చేసి రైతులను గోస పెట్టకుండా ఊరుకుంటాడా?

ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.

 తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రానున్నది. వెల్లివిరిసిన చైతన్యంతో తెలంగాన సాధించుకున్న ప్రజలకు ఏ పార్టీని గెలిపించుకోవాలన్న దానిపై ఎవరి ప్రభావం వుండదు. మూడోసారే కాదు, ఎన్ని సార్లైనా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌నే ఆదరిస్తారు. కేసిఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారు. హాట్రిక్‌ విజయం ఖాయమన్నది జనం చెబుతున్న మాట. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పనిచేసినా, తర్వాత ఆయనకు దూరమైన ఉద్యమకారులంతా కాంగ్రెస్‌, బిజేపిల కోసం పనిచేశారు. అయినా ఆ పార్టీల అసలు స్వరూపం తెలిసి, మళ్లీ ఉద్యమకారులంతా బిఆర్‌ఎస్‌వైపు వస్తున్నారంటే ఉద్యమ పార్టీకి వున్న ప్రాదాన్యత, ముఖ్యమర్రతి కేసిఆర్‌మీద వున్న నమ్మకం ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నాగం జనార్ధన్‌ రెడ్డి ఆనాడే బిఆర్‌ఎస్‌లోకి వస్తే ఎంతో గొప్పగా వుండేది. ఆలస్యమైనా ఏ చెట్టు పక్షులు ఆ గూటికే చేరుతాయన్నట్లు ఉద్యమ కారులంతా మళ్లీ బిఆర్‌ఎస్‌కు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అంటున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఇప్పుడు ఆయన కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చెరుకు సుధాకర్‌ గౌడ్‌, గాయకుడు ఏపూరి సోమన్న దాకా ఉద్యమ కారులంతా బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు తుల ఉమ కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ఉద్యమ కారులంతా కేసిఆర్‌ వైపు వచ్చారంటేనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిబద్దత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తారని అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ సమాజం ఎటు వైపు వుంటుందో బిఆర్‌ఎస్‌ అక్కడ వుంటుంది. బిఆర్‌ఎస్‌ ఎక్కడ వుంటుందో అక్కడ ఇతర పార్టీలకు చోటు వుండదు. ఇది ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌కు, తెలంగాణ సమాజానికి వున్న అవినాభావ సంబంధం. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ జనం గుండెల్లోనుంచి బిఆర్‌ఎస్‌ను తప్పించలేరు. తెలంగాణ సాదన, సంక్షేమపాలన చూపిన ఏకైక నాయకుడు కేసిఆర్‌.

ప్రజా దీవెన పల్లాకే!

https://epaper.netidhatri.com/

జనగామ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు…ఆయన మాటల్లోనే.

`జనగామలో వార్‌ వన్‌ సైడే.

`పల్లాకు పెరుగుతున్న మద్దతు.

` కుల సంఘాల తీర్మానాలు

` అడుగడుగునా పల్లా కు ఆదరణ.

` పెద్ద ఎత్తున పల్లా కు అనుకూలంగా తీర్మానాలు.

`గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం.

`నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం.

`ప్రచారంలో కనిపించని కొమ్మూరి.

`కాంగ్రెస్‌ ప్రభావం అంతంత మాత్రం.

`బిఆర్‌ఎస్‌ శ్రేణుల విసృత ప్రచారం.

బిఆర్‌ఎస్‌ పటిష్టంగా వున్న నియోజకవర్గాలలో జనగామ ఒకటి. ఇక్కడ ఉద్యమ నేపధ్యం వున్న పార్టీలకు కొంత ఆదరణ ఎక్కువ. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి జనగామలో బిఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్ధాయిలో మద్దతు తెలిపిన ప్రాంతాలలో జనగామ ముందు వరుసలోవుంటుంది. ఇప్పుడే కాదు జనగామ అంటేనే పోరాటాల ఖిల్లా. అందుకు ఇక్కడ పోరాట వీరులకు ఆదరణ ఎక్కువ. తెలంగాణ కోసం పోరాటం చేసిన బిఆర్‌ఎస్‌కు జనగామలో మరింత ఆదరణ. అలాగే ఆసారి ఎన్నికల్లో కూడా అదే పరంపర కొనసాగనున్నది. గత కొంత కాలంగా జనగామాలో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలున్నాయంటూ కొన్ని పార్టీలు, సంస్ధలు పనిగట్టుకొని ప్రచారం సాగించాయి. కాని బిఆర్‌ఎస్‌కు తప్ప, జనగామలో మరోపార్టీకి బలం లేదు. పట్టులేదు. ప్రజల ఆదరణ లేదని తేలిపోతోంది. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. ఇది కూడా ప్రజల్లో కాంగ్రెస్‌ అంటే చులకన భావమేకాదు, హేహ్య భావం కూడా కలిగేలా చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి అసలు రాజకీయం తెలసిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకుంటే ప్రతాప్‌ రెడ్డి రాజకీయాల్లో వుండాలనుకుంటాడు. కాని ప్రజలకు దూరంగా వుంటుంటాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రోత్సాహంతో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యాడు. కాని ఆయన ఏనాడు ప్రజల్లో లేరు. జనంతో కలిసిపోలేదు. ఉద్యమంలో కూడా ఆయన కనిపించడం అంటే వేదికల మీద తప్ప రోడ్ల మీద కొట్లాడిరది లేదు. పైగా ఆయన చేర్యాల పట్టణంలో కూడా కారు అద్దాలు ( అప్పుడు కార్లకు నల్లటి ఫిల్ములు వుండేవి) పైకెక్చించుకొనే వుండేవారు. ప్రజలకు అభివాదం చేయడం ఆయనకు ఇష్టం వుండదు. కనీసం పట్టణంలో తిరుగుతున్నప్పుడైనా ప్రజలతో కలివిడిగా వుండేవారు కాదు అన్న ఆరోపణలున్నాయి. ప్రజలు నమస్కారం అంటే కూడా కనీసం ప్రతిగా మర్యాదను కూడా చూపించేవారు కాదని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి దళితులంటే చిన్న చూపు అని గతం నుంచి చెప్పుకుంటారు. ఆయన గతంలో ప్రచారానికి వెళ్లినా, ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల మీద గ్రామలకు వెళ్లినా ఉన్నత వర్గాల కుటుంబాలలోనే మంచి నీరు తాగేవారు. వాళ్ల ఇళ్లలోనే కాసేపు సేద తీరేవారు. ఏనాడు ఆయన కనీసం బిసి నాయకులు ఇండ్లలో మంచినీళ్లు తాగ లేదని అంటుంటారు. అంతే కాదు ప్రచారం సమయాల్లో కూడా ఏనాడు ఆయన దళిత నాయకులను వెంట తీసుకెళ్లలేదని అంటుంటారు. దళిత వాడల్లో ప్రచారాలు కూడా చేయలేదని చేర్యాల మండలంలో చెబుతుంటారు. అదే ఇప్పుడు ఆయన కుమారుడు కూడ అనుసరిస్తున్నాడని అంటున్నారు. తాజాగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు చేర్యాల మండలంపరిధిలోని ఓ గ్రామ మాజీ దళిత సర్పంచ్‌ను బూతులు తిట్టడమే కాకుండా చేయి, చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ సర్పంచ్‌కు మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని దళితులంతా కొమ్మూరికి వ్యతిరేకంగా మారారని, గ్రామాలలో తీర్మాణాలు చేసినట్లు కూడా సమాచారం. దాంతో కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో మిగిలిన కొద్దిపాటి ఆదరణ కూడా లేకుండాపోయిందని కాంగ్రెస్‌ శ్రేణులో మధపడుతున్నాయి. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజల్లో కలుస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తీరికలేకుండా ఆయన గ్రామాలను చుట్టేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా విసృతంగా ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుపై పూర్తి ధీమాతో వున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు తనదే అంటున్నారు. ప్రజాశీర్వాదం తనకే అంటున్నారు. ప్రచారంలో ప్రజలు ఇస్తున్న ధైర్యం చూస్తుంటే మంచి మెజార్టీ తో గెలుస్తానన్న ధీమా మరింత బలపడుతోందంటున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…
జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంతో విజ్ఞులు.
ఎంతో చైతన్య వంతులు. ఎవరు ఎలాంటి వారు అన్నదానిపై పూర్తి అవగాహన, స్పష్టత వున్న వాళ్లు. ముఖ్యమంత్రి కేసిర్‌ అంటే ఎనలేని అభిమానం వుంది. ఏ ఊరికి వెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా కేసిఆర్‌ నాయకత్వమే కావాలని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రజల అభిమానం , ఆదరణ ప్రత్యక్షంగా చూస్తున్నాను. గతంలో పట్టభద్రుల ఎన్నికలు చూశాను. అప్పుడు గెలిపించారు..అయితే ఆ ఎన్నికలు వేరు… అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఎమ్మెల్యే ఎన్నికలు అంటేనే ఓ అద్భుతమైన భావన నాకు కలిగింది. ప్రజలకు దగ్గరగా వుండే జీవితం అంటే ఎంత గొప్పగా వుంటుందో, ప్రజల మధ్య జీవితం ఎంత గౌరవంగా వుంటుందో తెలిసింది. ప్రజలకు సేవ చేయడం అన్నది పూర్వ జన్మ సుకృతం. ప్రజలతో కలిసి సాగడం అన్నది గొప్ప అనుభవం. ప్రజల ఆదరణ చూస్తే ఒక్కొసారి తెలియకుండానే నా కళ్లలో ఆనందబాష్పాలు సడులు తిరుగుతున్నాయి. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను. వారి ఆదరణ చూస్తుంటే జీవితాంతం వారికి ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తోంది. నా జీవితాంతం జనగామ ప్రజలకు సేవ చేస్తాను. వారి సేవలోనే తరిస్తాను. జనగామను అన్ని రంగాలలో అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను. గ్రామాలను మరింత తీర్చిదిద్దుతాను. జనగామ నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇప్పటీకీ వేలాది మంది హైదరాబాద్‌ కు ఉపాది అవకాశాల కోసం వెళ్తుంటారు. వారికి జనగామలోనే ఉపాది అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను. జనగామకు కూడా ఐటిని తీసుకొస్తాను. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో వున్న జనగామ గొప్ప విద్యాకేంద్రం. ప్రభుత్వం ఎలాగూ ఉద్యోగ కల్పన చేపడుతూనే వుంటుంది. దానికి తోడు నిరుద్యోగ యువతలో వారి వారి స్కిల్‌ ను బట్టి కూడా ఉపాది కల్పన జరగాల్సిన అవసరం వుంది. అందుకోసం ఐటి కంపనీలు, ఫార్మా కంపనీలు, ఇతర ఇండస్ట్రీలు కూడా తెచ్చి, జనగామను ఉపాధికి కేంద్రంగా చేస్తాను. స్ధానిక యువత జీవితాల్లో వెలుగులు నింపుతాను. ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందించే వారధిగా వుంటాను.
ప్రతిపక్షాలకు జనగాంలో చేటు లేదు.
ఎందుకంటే జనగామ చాల వరకు ఎంతో ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జనగామకు అ వసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. జనగామ జిల్లాకోసం జరిగిన ఉద్యమాన్ని గౌరవించి జిల్లా ఏర్పాటు చేశారు. జనగామ చెరువులను మొదటి దఫాలోనే పునరుద్దరణ చేసి, ఒకనాడు చుక్క నీటికి కటకటలాడిన జనగామను సస్యశ్యామలం చేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జనగామ ప్రాంతం మీద ఆధారపడి చుట్టూ కొన్ని వందల గ్రామాలు అధారపడి వుంటాయి. నిత్యం ఏ చిన్న అవసరం వున్నా, ప్రజలు జనగామకు వస్తుంటారు. అలాంటి జనగామను మరింత అభివృద్దిచేయాల్సిన అవసరం వుంది. నేను గెలిచిన మరుక్షణం నుంచి జనగామ అభివృద్దికోసం నిరంతర శ్రమిస్తాను. ఈనెల 18న చేర్యాలలో కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజాశీర్వాద సభ వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు చేర్యాల ప్రాంతంతో ఎంతో అనుబంధం వుంది. చేర్యాల సిద్దిపేట జిల్లాలో బాగంగా వుంది. అక్కడి ప్రజలు చేర్యాల రెవిన్యూ డివిజన్‌ కావాలని కోరుతున్నారు. చేర్యాల ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ప్రతి దానిని నెరవేరుస్తాను. వారి కళ్లలో ఆనందం నింపుతాను. చేర్యాలలో ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. నా జీవితాంతం వారికి సేవ చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తాను.

కారే రావాలి. సారే కావాలి!

https://epaper.netidhatri.com/

`సామాన్యల మదిలో ఇదే మాట.

`ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా జనం చెబుతున్నది అదే మాట.

`పల్లె, పట్నం ఒకటే మాట.

`కేసిఆర్‌ తో తెలంగాణ అంతా..

` కేసిఆర్‌ వెంటే జనమంట.

`అభివృద్ధి ప్రధాతతోనే ప్రయాణమంట.

`గోస పెట్డిన కాంగ్రెస్‌ మాకొద్దంట.

`మాట తప్పడం కాంగ్రెస్‌ కు అలవాటేనంట.

`అరవై ఏండ్ల గోస పోగొట్డిన కేసిఆరే మాకు అండ.

`తెలంగాణ మరిన్ని వెలుగులు చూడాలంటే కేసిఆరే రావాలంట.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక మాట. తెలంగాణలోని ఏ ప్రాంత ప్రజలను కదిలించినా చెబుతున్న మాట ఇదే. ఎందుకంటే పదేళ్ల క్రితం తెలంగాణ. ఇప్పుడున్న తెలంగాణను ప్రజలు చూస్తున్నారు. నాటి గోసలు గుర్తు చేసుకుంటున్నారు. అరవై ఏళ్లు తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే అయ్యో..అని బాధ పడిన నాయకుడు ఒక్కరైనా ఆనాడు కాంగ్రెస్‌లో వున్నాడా? ఆ సమయంలో ఒక వేళ ఎవరైనా జై తెలంగాణ అన్నా అది వారి రాజకీయ స్వార్ధం కోసమే అని అనేక సందర్భాలలో తేలిపోయింది. 1669లో విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమం చేస్తే అందులో దూరిన కాంగ్రెస్‌ రాజకీయ నాయకులు ఏం చేశారు. విద్యార్ధి ఉద్యమాలను హైజాక్‌ చేసి, చెన్నారెడ్డి లాంటి వారు ఉద్యమాన్ని వారి గుప్పిట్లోకి తీసుకొని, తెలంగాణ ప్రజా సమితి పేరు మీద గెలిచి, కాంగ్రెస్‌లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమాన్ని చిదిమేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టారు. కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని పదవులు పొందారు. నాయకులుగా చెలామణి అయ్యారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ అయ్యాడు. కేంద్ర మంత్రి పదవులు వెలగబెట్టారు. ఆయన బాటలోనే చాలా మంది నడిచారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలను వంచించారు. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఉపయోగపడ్డారు… రాజశేఖరరెడ్డి రాజకీయ అవకాశాలకు నిచ్చెనలేశారు. అడుగడుగునా తెలంగాణను అవమానాలకు గురి చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర నేతలు దెబ్బతీస్తుంటే గుడ్లప్పగించి చూశారు. ఇది మన కళ్లముందు వున్న జరిగిన చరిత్ర.
1994లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పదేళ్లు ప్రతిపక్షంలో వుంది.
2004లో కూడా అధికారంలోకి రాకపోతే ఇక కాంగ్రెస్‌ ఖతమే అన్నంతదాకా వెళ్లింది. దాంతో అధికార దాహంతో వున్న సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకుల చేత కృత్రిమంగా జై తెలంగాణ నినాదాలు వినిపించారు. నిజంగా కాంగ్రెస్‌ నాయకులకు చిత్త శుద్ది వుంటే… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని వాడేందుకు ఊడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వణికిపోయారు. కాని కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ శంఖాన్ని పూరించాడు.. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం వినిపించకుండా చేసిన కట్టడిని కేసిఆర్‌ ఎదిరించాడు… ఎవరూ తెలంగాణ అన్న పదం వాడొద్దని చంద్రబాబు ఆనాడు సభలో తీర్మాణం చేయించాడు. కేసిఆర్‌ తిరగబడ్డాడు. నిలదీశాడు. తెలంగాణ ప్రజలు అంగీకరించని ప్రపంచానికి వినిపించాడు. నా ప్రాంతం అరి గోస పడుతుంటే, నా ప్రాంతాన్ని పేరు పెట్టి పిలవకుండా కట్టడి చేస్తానంటే నేను ఊరుకునే ప్రసక్తి లేదని దిక్కరించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆనాడు చంద్రబాబుకు భయపడి సభ సంప్రదాయాలకు కట్టుబడి వుండాలన్న సాకుకు చెప్పి, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా తెలంగాణ అన్న పదం వాడడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుడు కూడా ఇదేం పద్దతి తెలంగాణకు అనూకూలంగా మట్లాడిరదిలేదు. ఆనాటి ప్రభుత్వాన్ని ఏ కాంగ్రెస్‌ నాయకుడు ప్రశ్నించలేదు. ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు సభలో నిరసన తెలుపలేదు. కాని 2004 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్దితి కనిపించడం లేదని తెలిసి జై తెలంగాణ అనండని రాజశేఖరెడ్డి చెబితే గాని గొంతు పెగలలేదు. కనీసం అప్పుడైనా అసెంబ్లీలో జై తెలంగాణ అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారా? అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న రాజశేఖరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అండగా వుండడం కోసం బైట అన్నారే గాని, సభలో అనలేదు. తన రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ నాయకులను ఉసిగొల్పిన రాజశేఖరెడ్డి ఒక్కనాడైనా మా పార్టీ తెలంగాణకు అనుకూలం అని చెప్పాడా? అంటే అదీ లేదు. ప్రతిపక్ష నేతగా 1999 నుంచి 2004 దాకా వున్న వైఎస్‌. రాజశేఖరెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడైనా ప్రశ్నించాడా? అంటే లేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే…అంటూ అవేవో వేదాలు వల్లించినట్లు చెబుతున్నారు.
నిజాం రాజ్యంతో కొన్ని దశాబ్ధాల పాటు పోరాటం చేసి, విముక్తి చెందిన తెలంగాణ ఊపిరి తీసుకోకముందే, బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రతో కలిపేశారు.
రెండు ప్రాంతాల నాయకులతో పెద్ద మనుషులు ఒప్పందం చేయించినట్లే చెయించి, డిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చేలోపే రాష్ట్రం పేరు మార్చిన ఘనత కాంగ్రెస్‌ నాయకులది. డిల్లీ పెద్దల దగ్గర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ అన్న పేరును ప్రతిపాదించి, హైదరాబాద్‌లో దిగగానే ఆంధ్రప్రదేశ్‌ అని నామకరణం చేస్తే చేష్టలుడిగి, పదవుల కోసం ఆశపడిరది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. ఆనాటి నుంచి తెలంగాణను పీక్కు తినడానికి తప్ప తెలంగాణకు మేలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు లేడు. తెలంగాణను ఆంధ్రలో కలిపి కుంపటి పెట్టిందే కాంగ్రెస్‌ నాయకులు. ఆనాడు ఆంధ్రలో కలిపేయకపోతే తెలంగాణ ఆనాడు బాగుపడేది. ఆత్మగౌరవంతో అస్ధిత్వంతో బాగుపడేది. అరవై ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చేదా? తెలంగాణ మిగులు మూడు కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే, మా ఇంట్ల మాసిపోయి గోడకేసి వున్నాయి..తెచ్చియ్యమంటే తెచ్చిస్తాను అని తెలంగాణను అవమానించిన నాయకులు కాంగ్రెస్‌ నాయకులు కాదా? ఇప్పుడు తెలంగాణ మేమిచ్చామంటూ చిలకపలుకులు పలుకుతున్నారు. తెలంగాణలో 1969లో సమారు 375 మంది, తర్వాత 2004నుంచి 2014 దాకా 1200 మందికి పైగా యువత ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌ నాయకులు కారణం కాదా? వీటికి కాంగ్రెస్‌ నాయకుల దగ్గర సమాధానం లేదు. సీమాంధ్ర నాయకుల ముందు మాట్లాడడానికి ఇప్పటికీ నోట్ల నాలుక లేని, వారి ముందు కూర్చునేందుకు వెన్నెముక లేని నాయకులు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల ఆత్మగౌరవం నిలుపుతారా? హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం ఆశపడుతూ, వారి ఆశీస్సులతో అధకారం కోరుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలే కోరుకుంటున్నారు. కాని తెలంగాణ కోసం కాదన్నది ఇక్కడే స్పష్టమౌతోంది. అందుకే ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కావాలో స్పష్టంగానే చెబుతున్నారు.
కారే రావాలి…మళ్లీ కేసిఆరే ముఖ్యమంత్రి కావాలి.
బిఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి రావాలి. అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎంత మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు. పల్లెనుంచి పట్నందాక ఒకటే మాట. ముఖ్యమంత్రి కేసిఆర్‌నే తమ ప్రయాణం అని ప్రజలే స్పష్టం చేస్తున్నారు. రెండు వేలు పించన్‌ ఇచ్చి మమ్మల్ని సాదుతున్న పెద్ద కొడుకు కేసిఆర్‌ అని తెలంగాణ సమాజం అంటోంది. కేసిఆర్‌తోనే తెలంగాణ వచ్చింది. అభివృద్ధి జరిగింది అన్నది జనం మదిలో గూడుకుట్టుకున్న మాట. అది నిజం కూడా…తెలంగాణలో నిత్య నరకం అనుభవిస్తున్న రైతును చూసి చలించి, సామాన్యుల వెతలు చూసి కన్నీళ్లు పెట్టుకొని, పిడికిలెత్త జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది ఒక్క కేసిఆరే… అందుకే ఆయనతోనే మేము..మా కోసమే కేసిఆర్‌ అని ప్రజలు బలంగా నమ్ముతున్నాడు. మూడోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెబుతున్నారు.

పేదలపాలిట పెన్నిది పెద్ది.

https://epaper.netidhatri.com/

తెలంగాణ ఉద్యమం ఎంత అంకిత భావంతో చేశామో, ఆకలి దప్పులు వదులుకొని, నిరంతరం రాష్ట్రం సిద్దించేదాకా ఎలా కొట్లాడానో, ఎమ్మెల్యేగా ప్రజలకు అంతే త్రికరణ శుద్దిగా సేవలందిస్తున్నాను. అంటున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎన్నికల ప్రచార సరళిపై ప్రజల స్పందన, చేసిన అభివృద్ధి ఆయన మాటల్లోనే..

`నర్సంపేట ను తీర్చిదిద్దిన నాయకుడు.

`తెలంగాణ ఉద్యమం కీలక పాత్రదారుడు.

`వరంగల్‌ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా వున్నాడు.

`మహా గర్జన వంటి సభ నిర్వహణతో పెద్ది పేరు మారు మ్రోగిపోయింది.

`ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్యమ సభలన్నీ పెద్ది రూపకల్పనలో జరిగినవే.

`బీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టతకు పెద్ది నాయకత్వం నిదర్శనం.

`కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచాడు.

`ఐసోలేషన్‌ సెంటర్‌ తన ఇంటి ముందే ఏర్పాటు చేసి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

`నర్సంపేట ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ బెడ్లు, వార్డులు ఎర్పాటు చేయించాడు.

`ప్రజలకు ఆ సమయంలో పెద్దన్నగా తోడున్నాడు.

`పేదలకు కరోనా కాలంలో ఆకలి బాధలు లేకుండా చూసుకున్నాడు.

`నర్సంపేటను అభివృద్ధికి చిరునామా చేశాడు.

`నియోజకవర్గం సస్యశ్యామలం చేశాడు.

`అన్ని రంగాలలో నర్సంపేటను తీర్చిదిద్దాడు.

`పార్టీలకతీతంగా సేవలందించాడు.

`సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చేశాడు.

`ఆపదలో వున్న వాళ్ల వైద్యానికి ఎల్‌ ఓసిలు తెలంగాణ లో అందరికన్నా ఎక్కువ ఇచ్చాడు.

`ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

`గ్రామాలకు గ్రామాలే పెద్దికి మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారు.

`నర్సంపేట లో పెద్దికి ఎదురులేదు.

హైదరాబద్‌,నేటిధాత్రి:

పేదల పాలిట పెన్నిది పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పడిన వేదనలు చూశాడు. వాటి నుంచి విముక్తి కోసమే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలిసి నడిచాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. ఏనాడు పదవుల కోసం ఆరాటపడలేదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ విముక్తికోసమే ఆలోచించాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తన నియోజకవర్గ ప్రజల అభివృద్ది కోసం, సంక్షేమంకోసం పాటుపడుతున్నాడు. పదేళ్లలో తెలంగాణను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలా అన్ని రంగాల్లో పురోగతిని చూపించారో, నర్సంపేటలో పెద్ది కూడా అంతటి ప్రగతిని చేసి చూపించారు.ఐదేళ్ల తన ఎమ్మెల్యే పదవీ కాలంలో దాదాపు సగం కాలం కరోనాతో పోయినా, ఆ సమయంలో ప్రజలే ప్రాణంగా చూసుకున్న నాయకుడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి. కరోనా సమయంలో ఆ మాట వింటేనే ఎంతో మంది గజగజ వణికిపోయారు. ప్రజలను నేరుగా కలిసేందుకు ఎంతో భయపడ్డారు. కాని సుదర్శన్‌రెడ్డి మాత్రం తన ఇంటి ముందే ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, నియోజకవర్గంలో కరోనా బారిన పడిన వారికి దగ్గరుండి వైద్య సేవలందించారు. ఐసోలేషన్‌ సెంటర్‌లో వారిని నిత్యం కలిసి, వారికి మనో ధైర్యాన్ని నింపాడు. తిరిగి వారిని ఆరోగ్యవంతులుగా తయారుచేశారు. అందుకోసం ఆయన తీసుకున్న శ్రద్ద ఇప్పటికీ నియోజవర్గ ప్రజలు మర్చిపోవడం లేదు. తమ ప్రాణాలను కాపాడిన దేవుడు పెద్ది అంటూ కొలుస్తున్నారు. అంతే కాకుండా అత్యవసర వైద్య సేవలు అందాల్సిన వారికి నర్సంపేట ఆసుపత్రిలోనే సౌకర్యాలు కల్పించి, వారికి చికిత్సందించారు. అలా కూడా కరోనా బారిన పడిన వారికి ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందించి వారి ఆరోగ్యాలు కాపాడారు. వారి కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇక ఈ ఐదేళ్ల కాలంలో తెలంగాణలో వున్న అందరు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వైద్య సేవల కోసం ఎల్‌ఓసిలు ఇప్పించిన ఎమ్మెల్యేగా పెద్ది అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా కాలంలో తన నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా ఆయనను పండ్లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, డ్రై ప్రూట్స్‌, సి విటమిన్‌ అందించే పండ్లు పంపిణీ చేసి ప్రజలకు ఆదుకున్న నాయకుడు పెద్ది. అలా ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన నాయకుడు ఆయన. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తన నియోజక వర్గంలోనే ప్రజలందరికీ సమానంగా సంక్షేమపథకాలు అందించిన నాయకుడు పెద్ది. అందుకే ఆయనను అన్ని రాజకీయ పార్టీల నాయకులు అభిమానిస్తున్నారు. ఈసారి పార్టీలకు అతీతంగా పెద్దిని గెలిపించుకుంటామంటూ నర్సంపేట ప్రజలు చెబుతున్నారు. నర్సంపేటలోని అనేక గ్రామాలు పెద్దికే తమ ఓటు అంటూ తీర్మాణాలు కూడా చేస్తున్నాయి. దీనంతటికీ పెద్ది చేసిన సేవలే నిదర్శనం. తన నియోజకవర్గంలో అత్యధికంగా సిఎం. రిలీఫ్‌ఫండ్స్‌ కూడా ఇప్పించిన నాయకుడిగా పేరు పొందారు. ఇలా అన్ని వర్గాల ప్రజల గుండెల్లో పెద్ది గూడు కట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో గొప్పగా వుంది. ప్రచారం కోసం ప్రజలే స్వచ్ఛందంగా పెద్దికి వారి కష్టం చేతిలోపెడుతున్నారంటే పెద్ది మీద వారికి వున్న అభిమానం ఎంతటిదో అర్దం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పెద్ది సుదర్శన్‌రెడ్డి. వరంగల్‌ లో జరిగిన మహా గర్జన అంటే చరిత్రలో నిలిచిపోయిన సభ. అలాంటి సభలో ప్రపంచంలోనే గతంలో లేవు. ఆ తర్వాత కూడా రాలేదు. అంతగొప్పగా తెలంగాణ ఉద్యమ సమయంలో సభ నిర్వహించి శభాష్‌ అనిపించున్న నాయుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఎమ్మెల్యేగా ఐదేళ్లే అయినా ఆయన చేసిన అభివృద్ది అంతా ఇంతా కాదు. కరోనా సమయంలో ఆయన చూపిన మానవత్వం మాటల్లో చెప్పలేనిది. అలాంటి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీ వున్నారు. ఆ సందర్భంగా నర్సంపేటలో జరిగిన అభివృద్దిపై పెద్ది సుదర్శన్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న అభివృద్ధిపనులు ఆయన మాటల్లోనే…
నర్సంపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాడు.
నియోజకవర్గం సస్యశ్యామలం చేయడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్దిలో నెంబర్‌ వన్‌చేశాను. వరంగల్‌ జిల్లాలో చరిత్రలోనే హర్టీకల్చర్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను నల్లబెల్లి మండలం కన్నారావు పేటలో ఏర్పాటు చేయించడం జరిగింది. గత ఏడాది కురిసిన అకాల వర్షాలకు నష్టపోయి రైతులకు రూ.52 కోట్లు నష్టపరిహారం అందించడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలో వున్న 68,391 మంది రైతులకు రైతు బంధు అందుతోంది. రైతు భీమా కింద 389 మంది రైతు కుటుంబాలకు భీమా సొమ్మును అందజేయం జరిగింది. నియోజవర్గంలో 29 రైతు వేదికలు పూర్తి . రూ.11 కోట్లతో సుమారు 7500 మంది రైతులకు సబ్సిడీతో విద్యుత్‌ మోటార్లు అందజేత. రూ.80 కోట్లతో లక్ష మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణం. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో రైతు ఆహార ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పిఓ) ఏర్పాటు. వాటి ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేత. మిర్చీ పరిశోధన కేంద్రానికి అసవరమైన స్ధల సేకరణ పూర్తి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఒక్క నర్సంపేట నియోజవర్గంలోనే దాదాపు 1000 ట్రాక్టర్లు అందించాం. 60 మంది ఎస్సీ ఎస్టీ రైతులకు 90శాతం సబ్సిడీతో ట్రాకర్లు అందజేత. 1990 మంది పాల రైతులు, కార్మికులు, మత్స కారులకు, గొర్రెల కాపరులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. ఇక నీటి పారుదలపై అత్యంత శ్రద్ద పెట్టడం జరగింది. జివో.నెంబర్‌. 20 ద్వారా వట్టివాగుపై చెక్‌ డ్యామ్‌ కం రోడ్‌ బ్రిడ్జి నిర్మాణం. చెన్నారావు పేట వాగుపై చెక్‌ డ్యాం. 336 కోట్లతో రామప్ప`పాకాల ప్రాజెక్టు పూర్తి. రెండు పంటలకు పూర్తి స్ధాయిలో సాగుకు నీరందుతోంది. రూ.225 కోట్లతో రామప్ప` రంగరాయ చెరువు పనులు పూర్తి. రెండేళ్లుగా గోదావరి జలాలతో ఆ ప్రాంతం సస్యశ్యామలం. నర్సంపేటకు ఇరిగేషన్‌ కార్యాలయం మంజూరు. ఎస్సారెస్సీ..డిబిఎం ద్వారా సుమారు 65 వేల ఎకరాలకు సాగు నీరు. నియోజకవర్గం మొత్తం చెరువులు , చెక్‌ డ్యామ్‌లు, ఎస్సారెస్సీ , ఇతర ప్రాజెక్టులన్నీ కలుపుకొని 1,26,099 ఎకరాలకు నీరందించాం. నిండు కుండలా మాదన్నపేట చెరువు గోదావరి జలాలతో గత రెండేళ్లగా కళకళలాడుతోంది.
సంక్షేమంలో నర్సంపేట నెంబర్‌ వన్‌గా నిలిచింది.
నియోజకవర్గంలో 48,581 మందికి ఆసరా ఫెన్షన్లు అందుతున్నాయి. ఇప్పటి వరకు 11,300 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందజేయడం జరిగింది. 1630 మంది దళిత రైతులకు ఎస్సీ, కార్పోరేషన్‌ ద్వారా 70 శాతం సబ్సిడీతో 4520 పాడి గేదెలు అందజేయడం జరిగింది. అంతే కాకుండా 145 మంది దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ పధకం కింద 435 ఎకరాలు అందించడం జరిగింది. నియోజకవర్గం లో 1150 మందికి దళిత బంధు యూనిట్లు అందించాం. 1200 బిసి యూనిట్లు, 3500 గృహలక్ష్మి యూనిట్లు, 120 మైనార్టీ యూనిట్లు అందజేత. వంద మందికి దళిత బంధు యూనిట్లు అందించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పోరేషన్ల ద్వారా రుణాలు. దాదాపు 10వేల మంది నిరుపేదలకు ఎల్‌ఓసి, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందిచడం జరిగింది. ఇది తెలంగాణలోనే ఒక రికార్డు. నియోజకవర్గంలో వున్న 338 చెరువులలో చేప పిల్లల పెంపకం. ముదిరాజ్‌ సోదరులకు ట్రాలీలు, మోపెడ్లు అందజేత. గొల్ల కురుమలకు 11,781 గొర్రెల యూనిట్లు అందజేత. గిరిజన సంక్షేమంలో కూడా నర్సంపేట ముందజ. పోడు సాగు చేసుకుంటున్న 3271 మంది గిరిజనులకు 7337 ఎకరాల భూమి పట్టాలు అందించడం జరిగింది. 3271 మంది గిరిజనులకు రైతు బంధు సాయం అందజేత. తాజాగా పోడు పట్టాలు అందుకున్న 1805 మంది రైతులు రైతు బంధు. నియోజకవర్గంలో వున్న 5074 మంది గిరిజనుల 11606 ఎకరాలకు రైతు బంధు అందించడం జరుగుతోంది. గిరిజనుల కోసం నర్సంపేట లో ఏసి తో కూడిన బంజారా భవన్‌ నిర్మాణం జరుగుతోంది. అన్ని తండాలకు రూ.100 కోట్లతో కొత్త రోడ్లు నిర్మాణం. కొత్తగా ఏర్పాటు చేసిన 40 గ్రామ పంచాయితీలకు అంతర్గత రోడ్లు. 40 పంచాయితీ భవనాలు. గిరిజన తండాలలో పల్లె దవఖానాలు. నర్సంపేట నియోజకవర్గంలో 1100 మంది గిరిజన రైతులకు సబ్సిడీతో విద్యుత్‌ మోటార్లు అందజేత. గిరి వికాస్‌ పేరుతో బోర్‌ వెల్‌ సాగు ఏర్పాటు.
వైద్య ఆరోగ్య శాఖలో కూడా నర్సంపేటకు కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ తేవడం జరిగింది.
సమారు 450 పడకల ఆసుపత్రి, నిర్మానం తుది దశలో వుంది. మరో మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఆ మెడికల్‌ కాలేజీకి 1650 పోస్టులు మంజూరు చేయించడం జరిగింది. రూ. 30 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు. కిడ్నీ డయాలసిస్‌ సెంటర్‌తో సేవలు. నర్సంపేట నియోజకవర్గంలో 49 ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఉచితంగా అందించే 57 రకాల వైద్య పరీక్షల కోసం భవన నిర్మాణం పూర్తి. త్వరలో సేవలు అందుబాటులోకి…కరోనా సమయంలోనే ఆర్‌టిపిసిఆర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటిలో బస్తీ దవఖాన ఏర్పాటు. 2020లో కరోనా బాధితులు, తలసేమియా వ్యాధి గ్రస్తులకోసం నియోకజవర్గంలోనే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 8350 యూనిట్ల రక్తాన్ని దాతలు అందించారు. వాటిని ప్రభుత్వానికి అందించడం జరిగింది. దాంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో 76500 కుటుంబాలకు సి.విటమిన్‌ లభించే పండ్లు ప్రజలు అందించడం జరిగింది. దేశంలోనే మొదటిసారి ఒక ఎమ్మెల్యే ఫ్రీ ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, 1179 మందిని కాపాడడం జరిగింది.
విద్య విషయంలో నర్సంపేటను ముందుంచడం జరిగింది.
గిరిజన సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయించాం. ఇది తెలంగాణలోనే మొదటిది కావడం విశేషం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఇది పెద్ద విద్యా సంస్ధ. దుగ్గొండిలో ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు. నర్సంపేటలో ఎస్సీ బాలుర గురుకులం ఏర్పాటు. గిర్నిబావి దగ్గర బిసి గురుకులం పాఠశాల ఏర్పాటు. విజినే పల్లి ఖానాపూర్‌లో బిసి బాలికల పాఠశాల ఏర్పాటు. సర్వాపురంలో బిసి బాలికల గురుకులం ఏర్పాటు. ఎస్టీ బాలురల కోసం నర్సంపేటలో పాఠశాల. మైనార్టీ బాలికల గురుకులం ఏర్పాటు. అర్భన్‌ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల మహేశ్వరంలో ఏర్పాటు. ఎన్‌ఏసి ద్వారా మహిళ ఉపాదికోసం కుట్టుమిషన్‌ శిక్షణాకేంద్రం. ఉచితంగా కుట్టు మిషన్లపంపిణీ. ఎస్సీ యువత కోసం స్కిల్‌ డెవలప్‌ మెంటు సెంటర్‌ త్వరలో ప్రారంభం కానున్నది.
నర్సంపేట మోడల్‌ అభివృద్ది అందరికీ ఆదర్శం.
రాష్ట్రంలోనే పైపుడ్‌ నేచురల్‌ గ్యాస్‌ మొదట అవకాశం నర్సంపేటకు తేవడం జరిగింది. నాచురల్‌ గ్యాస్‌ ద్వారాఇంటింటికీ గ్యాస్‌ సప్లై జరగుతోంది. మార్కెట్‌లో సిలిండర్‌ ధర 1250 రూపాయలు వుంది. అదే గ్యాస్‌ను పైప్‌ ద్వారా ప్రజలకు రూ.730కే అందించడం జరుగుతోంది. మున్సిపాలిటీలో 12 కిలోమీటర్ల పరిదిలో సెంట్రల్‌ లైటింగ్‌పూర్తి. మున్సిపాలిటీలో 9 కిలోమీటర్ల పరిధిలో బిటీ రోడ్ల నిర్మాణం, సైడ్‌కాల్వల నిర్మాణ జరుగుతోంది. ఆర్‌ అండ్‌ బి ద్వారా 30 కిలోమీటర్ల రోడ్డును రూ.45 కోట్లతో నిర్మాణం. పిఎంజిఎస్‌వై ద్వారా 25 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణం. నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో 200 కిలోమీటర్ల మేర అంతర్గత సిసి రోడ్లు. రూ.60 కోట్లతో మండలాల్లో బిటి రోడ్ల మరమ్మత్తులు. నర్సంపేట`నెక్కొండ ప్రదాన రహదారిపై శిధిలావస్ధలో వున్న ముగ్ధుంపూర్‌ బ్రిడ్జి నిర్మాణం. గిరిజన గ్రామాలలో ఎస్టీసబ్‌ ప్లాన్‌ ద్వారా 54 కిలోమీటర్ల రోడ్డు నిర్మానం. 22 కోట్లతో నూతన బిటి రోడ్లు నిర్మాణం. నెక్కొండ, నల్లబెల్లి మండల కేంద్రాలలో కొత్త డబుల్‌ రోడ్ల నిర్మాణం. 2022లో కురిసిన వడగండ్ల వానకు ద్వంసమైన రోడ్ల మరమ్మత్తులు. పంచాయితీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి ద్వారా రోడ్ల నిర్మాణం. నియోజకవర్గంలో 133 కేవి 14 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పనులు పూర్తి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వైకుంఠదామాలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి. నూత గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు. 69 నూతన జిపిల భవనాలు. ప్రతి గ్రామానికి వివో. మహిళా భవన నిర్మాణం. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 2023`24లో 8500 మంది మహిళలతో క్రీడోత్సవాలు నిర్వహించడం అన్నది గొప్ప సందర్భం.

రెడ్డిలతో నింపి…బడుగులను సాగనంపి

https://epaper.netidhatri.com/

`సీనియర్లను తరిమి…బడుగులను వంచించి.

`గెలవక ముందే ఎండబెట్టి తొక్కుతా అంటున్న రేవంత్‌!

`నిలకడలేని తనం.. రేవంత్‌ రాజకీయం!

`అభివృద్ధి మీద అవగాహన లేదు.

`నాయకులు, రేవంత్‌ కు మధ్య సమన్వయం లేదు.

`పార్టీకి పని చేసిన వారికి గుర్తింపు లేదు.

`ఇన్నేళ్లు సేవ చేసిన వారికి టిక్కెట్లు లేవు.

`కాపీ కొట్టిన పథకాలు.

`అమలు చేస్తారన్న నమ్మకం లేదు.

`గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు!!

`కనిపిస్తున్నది గాలి కాదు…కాంగ్రెస్‌ గెలిచేది లేదు.

కాంగ్రెస్‌ను చెల్లా చెదురు చేయడంలో పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సక్సెస్‌ అయ్యాడు. కాని తాన ఒక్కడినే అందరికన్నా మేధావిని అనుకునేంత స్ధాయికి చేరుకున్నాడు. ఇంత కాలం ఆయనను నమ్మకున్నవారికి కూడా ఆయన కొంత మందికి టిక్కెట్లు ఇవ్వలేదు. అలాంటి వారిలో అద్దంకి దయాకర్‌ ఒకరు. ఆయనను ఓ వైపు ఎదగోసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయించారు. తర్వాత అదే అద్దంకి దయాకర్‌ చేత క్షమాఫన చెప్పించాడు. ఆఖరుకు దయాకర్‌కు టిక్కెట్‌ ఇవ్వలేదు. కాని రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించాడు. రెడ్డి రెడ్డి ఒకటే నిరూపించాడు. కాంగ్రెస్‌పార్టీ కోసం ఇంత కాలం పనిచేసిన వారిని కాదని, అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం కండువా కప్పకముందే టిక్కెట్లు ప్రకటించారు. దాంతో నిన్నటిదాకా కాంగ్రెస్‌ అంటే గుర్తు పట్టిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్‌ అంటే రేవంత్‌రెడ్డి మాత్రమే అనే స్దితికి తెచ్చేశాడు. సరిగ్గా ఏడాడి క్రితం అమెరికాలో పర్యటనలో వున్న సమయంలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం చేస్తున్నాడు. ఆనాడు రేవంత్‌ అంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌అంటే రేవంత్‌ అని చెప్పాడు. ఆనాడు ఖండిరచిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నేడు నోరు మెదపలేకపోతున్నాడు. కారణం పార్టీ మారిన తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. దాంతో ఆయన కూడా మాట్లాడే పరిస్దితి లేకుండా చేసుకున్నాడు. కాని అసమ్మతి అనేది నివురుగప్పిన నిప్పులా మారింది. తెలంగాణలో రెడ్డి రాజ్యం తీసుకురావాలన్నది రేవంత్‌ లక్ష్యం. అందుకే ఆయన ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో రెడ్డిలందరికీ కనీసం ఐదు ఎకరాల పొలం వుండేలా వారిని ఉన్నత స్దితి తేవాలని చెప్పాడు. ఇప్పుడు దానిని అనుసరిస్తున్నాడు. తన వర్గాన్ని మొత్తం పార్టీలో నింపుకున్నాడు. ఆయనకు ఎప్పుడూ ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడకుండా వుండేందుకు బడుగులను తరిమేశారు. కొందరని పొమ్మనలేక పొగబెట్టాడు. కొందర్ని కావాలనే పక్కనపెట్టేశాడు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్‌ నాయకుడి మీద నోరు పారేసుకున్నాడు. 2014లో 50వేలు, 2018లో 70 వేట ఓట్ల తేడాతో ఓడిపోయిన పొన్నాలకు ఎలా టిక్కెట్లు ఇస్తామని కొత్త బాష్యం చెప్పారు. మరి కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిలో ఎలా టిక్కెట్‌ తెచ్చుకున్నాడు. పార్టీ ఎలా టికెట్‌ ఇచ్చింది. అసలు పిసిసి. పదవే రూ.50 కోట్లకు కొనుకున్నాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనాడో చెప్పాడు. రేవంత్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడుగా వున్నంత కాలం గాంధీభవన్‌లో అడుపెట్టనన్నాడు. కాని రెడ్డి రెడ్డి ఎంత కొట్లాడుకున్నా ఒకటే అని నిరూపించుకున్నారు.
తాజాగా రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి.

గత టిక్కెట్లు అమ్ముకున్నాడంటూ వస్తున్న ఆరోపణల మీద మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ టికెట్‌ అడిగిన వారు లేరు. ఇప్పుడు కాంగ్రెస్‌ టికెట్‌కోసం పోటీ పడుతున్నారు. టిక్కెట్లకోసం ధరఖాస్తు చేసుకొమ్మంటే వెయ్యి మంది చేసుకున్నారు. అంటే నా వల్ల పార్టీకి ఎంత ఊపు వచ్చిందో గమనించాలని సూచిస్తున్నాడు. అంతే కాదు తాను కోవర్టులను ఏరి వేయాలని ఏనాడో చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతుందన్నాడు. కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించి దక్కని వాళ్లు బిఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, వాళ్లంతా కోవర్టులంటూ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు చంద్రబాబు కోవర్టే రేవంత్‌రెడ్డి. ఇటీవల జైలులో చంద్రబాబును కలిసిన కాసాని జ్ఞానేశ్వర్‌ తో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అన్నట్లే లెక్క అన్నాడని చెప్పారు. అంటే కాంగ్రెస్‌ను ఎంత దూరం రేవంత్‌రెడ్డి తీసుకెళ్తున్నాడో అర్దం చేసుకోవచ్చు. అలాంటి రేవంత్‌ కాంగ్రెస్‌లో కోవర్టుల గురించి మాట్లాడుతుండం హాస్యాస్పదంగా వుంది. రేవంత్‌ తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లే అని పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్‌లోనే కొందరు పెద్దలు అంటున్నారు. ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే అన్న రేవంత్‌రెడ్డి ఆశ కాంగ్రెస్‌ను ఖాళీ చేయించే స్దితికి తెచ్చాడు. ఈ మధ్య రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష కూడా వివాదస్పదమౌతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, కేటిఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలు కూడా ఆహ్వానించడం లేదు. నిజానికి రేవంత్‌రెడ్డి రాజకీయమే నిలకడలేని తనంతో కూడుకున్నది. రేవంత్‌రెడ్డికి రాజకీయాల మీద అవగాహన లేదు. తెలంగాణ సాగు మీద పట్టు లేదు. ప్రగతి మీద ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలాంటి అవగాహన లేదని, ఆయన గొప్ప పాలన అందించాడని గుర్తు చేస్తున్నాడు. అంటే తాను ప్రతిపక్షంలో వున్నా, అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అని చెప్పకనే చెబుతున్నాడు. ఉద్యమ కారులకు టిక్కెట్లు ఎందుకు ఇవ్వ లేదంటే రేవంత్‌ రెడ్డి చెబుతున్న భాష్యాలు ఎవరూ సమర్ధించరు. పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కి లాంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం జరిగిందని సమర్ధించుకోవడం వింతగా వుంది. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ వదిలి, ఆ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, రేవంత్‌ను తూర్పార పట్టి, బిజేపిలో చేరి, మళ్లీ యూటర్న్‌ తీసుకున్నా టికెట్‌ ఇచ్చారు. అంటే కేవలం అక్కడ ఆయన రెడ్డి అనే టాగ్‌లైన్‌ తప్ప మరొకటి లేదు. కాని రాజగోపాల్‌ రెడ్డికి ఉద్యమ కారుల లిస్టులో టికెట్‌ ఇచ్చినట్లు రేవంత్‌ చెప్పుకోవడం దుర్మార్గం. గత పదేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడిగా కాంగ్రెస్‌ మీద ఈగ వాలకుండా చూసుకున్న మానవతా రాయ్‌ లాంటి వారికి టికెట్‌ ఇవ్వలేదు. ఆయన బిఆర్‌ఎస్‌లో చేరితే కోవర్టు అని అనడం అంటేనే రేవంత్‌ అహాంకారం కనిపిస్తోంది. మానవతా రాయ్‌ అనేక కేసులు ఎదుర్కొన్నది కూడా కోవర్టుగానేనా అన్నది రేవంతే సమాధానం చెప్పాలి.
రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు లేరు.
ఓటుకు నోటు కేసు ఆయనకు మెడల్‌ లాంటిది అని చెప్పడం అంటేనే ఆయన రాజకీయ దివాలుకోరుతనానికి నిదర్శనం. తెలంగాణ కోసం ఏనాడు రేవంత్‌రెడ్డికొట్లాడిరది లేదు. ఒక ఆ సమయంలో తెలుగుదేశం పార్టీయే అదికారంలో వుంటే రేవంత్‌రెడ్డి సమైక్య వాదం వినిపించేవారు. కాకపోతే అప్పుడు ప్రతిపక్షంలో వుండడం, చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం చెప్పడం వల్ల రేవంత్‌ రెడ్డి జై సమైక్యాంద్ర అనలేదు. ఏనాడు ఆయన జై తెలంగాణ అనలేదు. కాని ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా టికెట్‌ ఇప్పించడంలో తాన పాత్ర వుందంటూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేయగానే చంద్రబాబు సీమాంద్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తుంటే రేవంత్‌ఆనాడు మాట్లాడిరది లేదు. పైగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని అస్దిరపర్చాలని చూసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాడంటే ఎవరూ నమ్మరు. రేవంత్‌రెడ్డి ఆలోచనలు ఉట్టికి ఎగరేలనమ్మ, ఆకాశానికి ఎగిరినట్లు వుంది. అసలు కాంగ్రెస్‌ వచ్చే అవకాశమే కనిపించడం లేదు. కాని ఆయన తెలంగాణలో మరో కొత్త నగరం నిర్మాణం చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడు. కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కాపీ. మొత్తం బిఆర్‌ఎస్‌ ఫధకాలనే ఆయన కాపీకొట్టారు. ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడు. కాంగ్రెస్‌ ప్రకటించిన పధకాలకు గ్యారెంటీ ఏమిటి? వాటికి వారెంటీ ఎవరిస్తారు? అన్నదానికి కాంగ్రెస్‌లో సమాదానం లేదు. అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు ఎంత వరకు నమ్ముతారన్నది కాలమే నిర్ణయించాలి.

గెలుపు నాదే..ప్రజల మద్దతు నాకే.

https://epaper.netidhatri.com/

ప్రజలకు నిత్యం అందుబాటులో వుండేది నేను. కష్ట సుఖాలలో పాలు పంచుకునేది నేను. ఆపదలో ఓదార్చేది నేను. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఎన్నికలు రాగానే నేనున్నానని వచ్చే వారిని ప్రజలు ఎప్పుడూ నమ్మరు. నా ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం వుంది. వారికి నేను సేవ చేస్తాననే విశ్వాసం వుంది. అందుకే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు తన ప్రచార వివరాలు వివరించారు. అవి వారి మాటల్లోనే…
`తెలంగాణ కోసం పోరాటం చేశాను.

`వర్ధన్నపేట అభివృద్ధికి బాటలు వేశాను.

`వర్ధన్నపేట ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాను.

`అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాను.

`నిన్న వర్ధన్నపేట, నేడు వర్ధన్నపేట.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశాను.

`కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో దగ్గరుండి సేవలందించాను.

`కాంగ్రెస్‌ ను నమ్మొద్దు…మోసపోవద్దు.

`కాంగ్రెస్‌ అభ్యర్థికి నియోజకవర్గం మీద ఇప్పుడు ప్రేమ పుట్డకొచ్చిందా?

`కరోనా లాంటి సమయంలో జనం కనిపించలేదా?

`ప్రభుత్వ అధికారిగా వున్నంత కాలం నియోజకవర్గం ముఖం చూడలేదు.
`సామాజిక సేవలు నిర్వర్తించింది లేదు.

`పదవి మీద యావ తప్ప ప్రజల మీద లేదు.

`ఓడితే కాంగ్రెస్‌ అభ్యర్థి మళ్లీ కనిపించడు.

` గెలిచినా ప్రజలకు అందుబాటులో వుండడు.

`నిత్యం ప్రజలతో వుంటేది నేనే…

`వారికి సేవ చేసేది నేనే..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గెలుపు నాదే..ప్రజల మద్దతు నాకే..ఇది ఎంత ఆత్మ విశ్వాసంతో, ప్రజల మీద నాకున్న నమ్మకంతో చెబుతున్న మాట. ఎందుకుంటే నా ప్రజలు నాకు దైవుళ్లతో సమానం. వారికి నేను చేసిన సేవ, వాళ్లంటే నాకున్న అభిమానం అందరికీ తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ఆశీర్వదించి పంపిస్తున్నారు. నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే నిత్యం ప్రజలు అందుబాటులో వుండేది నేను. గత రెండున్నర దశాబ్దాలుగా అటు ఉద్యమ కారుడిగా, ఇటు ప్రజా ప్రతినిధిగా వారి మధ్యలోనే నా జీవితం గడుస్తోంది. నా జీవితం వారి ముందు తెరిచిన పుస్తకం. ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నది నేను. వారి సంతోషాలను చూసేది నేను. వారి ఆపదలకు ఓదార్చేది నేను. నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. నా నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేందుకు ఎంతో కృషి చేస్తున్నాను. నేను ఎన్నికల రాగానే వచ్చ వ్యక్తిని కాదు. ఎప్పుడూ ప్రజలే.. నా జీవితంగా సేవ చేస్తున్న నాయకుడిని. అందువల్ల వర్ధన్న పేట నియోజక వర్గ ప్రజలు కేవలం రాజకీయ స్వార్ధం కోసం, అధికార యావ కోసం వచ్చిన వారిని నమ్మరు. నా ప్రజల మీద నాకు అచంచలమైన విశ్వాసం వుంది. వారికి నేనంటే కొండంత నమ్మకం వుంది. వారికి నేను మాత్రమే సేవ చేస్తానన్న భరోసా కల్పించడం జరగింది. మాటలు ఎవరైనా చెబుతారు. మాటలు చెప్పి మాయమౌతారు. కాని నా జీవితం వారి జీవితాలతో పెనవేసుకున్న పేగు బందంలాంటిది. అందుకే ప్రజలు మళ్లీ నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం వుంది అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ప్రచార వివరాలు వెల్లడిరచారు. అది వారి మాటల్లోనే పాఠకులకు…
నా జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పోరాటం చేశారు.
తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తన వంతు కర్తవ్యం నిర్వర్తించాను. ఆనాటి పరిస్ధితులు తెలంగాణ ప్రజలు తెలుసు. నిరంతరం ప్రజల్లో వున్న రోజులవి. నిరంతరం కొట్లాడిన రోజులవి. ఏదో ఒక రూపంలో ఉద్యమ స్వరూపాన్ని తెలంగాణ వాదాన్ని చూపించినకాలం. అలా నిత్యం ఉద్యమం, తెలంగాణ సమస్యలపై కూడా అలుపెరగకుండా రాజీ లేని పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ సాధన తర్వాత మన ప్రాంతాన్ని దేశ గర్వించేలా అభివృద్ది చేయడం జరిగింది. దేశంలోనే నేడు తెలంగాణ నెంబర్‌ వన్‌ స్ధాయిలో నిలబెట్టడం జరిగింది. అలాగే వర్ధన్నపేటను అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరిగింది. అయితే అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. దానికి ఆది అంతం వుండదు. నియోజకవర్గానికి ఎంతో చేశాం. ఇంకా చేయాల్సివుంది. చేస్తాను. వర్ధన్నపేటకు మరింత గుర్తింపు తెస్తాను. నిన్న వర్ధన్న పేట ఎలా వుంది..నేడు వర్ధన్న పేట ఎలా వుందంటే ప్రజలే సమాధానం చెబుతారు. ఒకప్పుడు మంచినీటికి కటకట లాడిన వర్ధన్న పేట ఇప్పుడు సస్యశ్యామలమైంది. పంటలు లేక ఎడారిని తలపించిన ప్రాంతంలో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయి. మోడువారిన జీవితాలలో వెలుగులు వచ్చాయి. ఒట్టిపోయిన చెరువులకు మళ్లీ పూర్వ కళ వచ్చింది. చెదిరిపోయిన చెరువులకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. చెరువు కూడా ఇప్పుడు ఊరుకు ఆదాయవనరుగా మారింది. కొన్ని కులాలకు ఆర్ధిక వనరులను సమకూర్చేకల్పతరువైంది. రైతుకు నీళ్లందిస్తోంది. పాడి పంటలను కాపాడుతోంది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తెలంగాణలోని మొత్తం 46వేల చెరువులు నిండు గంగాలాలైనవి. పల్లె సీమలకు ఆయువుపట్టుగా మారినవి.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో వర్ధన్నపేటను ఎంతో అభివృద్ధి చేశాను.
పదేళ్ల క్రితం వరకు దుఖం చూసిన తెలంగాణ సరిగ్గా కోలుకుంటున్న సమయంలో కరోనా కాటు కూడా పెద్ద ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. ప్రపంచాన్ని వణికించిన కరోనాతో ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సివచ్చింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రభుత్వం తరుపున చేయాల్సినంత సాయం అందించారు. ఎమ్మెల్యేగా నా ప్రజల కోసం ఎంతో చేయడం జరిగింది. రెండు సంవత్సరాల పాటు నిరంతరంగా నా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. వారికి అవసరమైన ఆరోగ్య సేవలు అందించాను. వారి జీవనం గడిచేందుకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించి వారి ఆకలి బాదలు తీర్చాను. అలా ప్రజలకు సేవచేసే బాగ్యం నాకు ఆ దేవుడు అందించాడు. వారి గుండెల్లో నా స్ధానం పదిలం చేశాడు. నా ప్రజలంటే నాకు ఎంతో ప్రాణమో ఆ సమయంలో ప్రజలు గుర్తించారు. నా నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కరోనా వైద్యం అందక ప్రాణాలు కోల్పోవద్దని వారికి మెరగైన వైద్య సేవలు అందించి ప్రాణాలు నిలిచేందుకు కృషి చేశారు. వారు ఇప్పుడు ఆరోగ్యంగా వున్నారు.
కరోనా లాంటి కష్ట కాలంలో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు.
ప్రజల దరి చేరేందుకు కూడా వారు ముందుకు రాలేదు. కరోనా కాలంలో కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎన్నికల రాగానే మాత్రం వచ్చి వాలుతున్నారు. వర్ధన్నపేటలో కూడా అలాంటి పరిస్థితే వుంది. వర్ధన్నపేటలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బరిలో వున్న వ్యక్తికి హటాత్తుగా ఎన్నికలనగానే నియోజకవర్గం గుర్తుకొచ్చింది. ఈ నియోజవర్గంలోనే తాను పుట్టిందన్నది తెలిసింది. ఇంత కాలం ఎందుకు గుర్తులేదు. ఇంత కాలం వర్ధన్న పేటు ఎందుకు గుర్తు రాలేదు. ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తి వర్ధన్న పేట గురించి ఎన్నడూ ఆలోచించింది లేదు. కరోనా కాలం ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆనాడు కనీసం అయ్యో నా నియోకవర్గం, నా ప్రజలు అని ఎందుకు రాలేదు. కనీసం నియోజకవర్గ ప్రజలను ఓదార్చే తీరిక కూడా లేని వ్యక్తి ఇప్పుడొచ్చి మాయ మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా?
కాంగ్రెస్‌లో టిక్కెట్లు వచ్చిన వాళ్లంతా వాటిని కొనుకున్న వ్యక్తులే అన్నది తేట తెల్లమైంది.
ఆ విషయంపైనే దేశమంతా చర్చ జరగుతోంది. ప్రజలకు ఏనాడు అందుబాటలో లేనివాళ్లంతా వచ్చి వాలుతున్నారు. ఏ ఒక్క సామాజక సేవా కార్యక్రమం కూడా చేపట్టని వ్యక్తి కాంగ్రెస్‌ పేరు చెప్పుకొని వచ్చి రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం , దుర్మార్గం. అలాంటి పార్టీతో రాజకీయం చేసేవాళ్లు కూడా ఆ కోవకే చెందుతారు. అలాంటి వ్యక్తి చటుక్కున ఎన్నికల ముందు దిగితే ప్రజలు ఆహ్వానించరు. పదవి మీద యావ తప్ప, ప్రజల మీద ప్రేమ లేని కాంగ్రెస్‌ అభ్యర్ధిని ప్రజలు ఎలాగూ ఆదరించరు. ఓటమి తప్పదు. ఆ తర్వాత ప్రజల్లో వుంటాడన్న నమ్మకం లేదు. నిత్యం ప్రజల్లో వుండేది నేను. వారికి సేవ చేసేది నేను. అందుకే వర్ధన్న పేట ప్రజల ఆశీర్వాదం నాకే వుంటుంది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్‌ పెట్టిన గోసలు ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోరు కూడా…అంతెందుకు కర్నాటక మోడల్‌ పేరుతో తెలంగాణ ఎన్నికల్లో లేని పోని గొప్పలకు పోయిన కాంగ్రెస్‌పార్టీ అక్కడ కరంటు కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదన్న సంగతి తేలిపోయింది. అంటే కాంగ్రెస్‌ మాటలే పచ్చి అబద్దాలని తేలిపోయింది…తమ పథకాలనే కాపీ కొట్టి గ్యారెంటీ పేరుతో ప్రజల ముందుకొచ్చి, తెలంగాణ భూములు అమ్ముతామని ఇప్పుడే చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీని అయ్యో అంటే తెలంగాణనే అమ్మేస్తుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ విషయంలో ఎంతో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది. మాయ మాటలు చెప్పేవారిని నమ్మి, మళ్లీ చీకటి రోజులు తెచ్చుకోవద్దు.

రేవూరి తెలంగాణ ద్రోహి! పచ్చి అవకాశవాది.

https://epaper.netidhatri.com/

 

ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిస్తుంటే, 610 జీవో అమలుకోసం ఒక్కనాడు పాటుపడని రేవూరిని ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. పార్టీ మారి, నియోజకవర్గం మార్చుకొని వచ్చినంత మాత్రాన మేకవన్నె పులిని ప్రజలు గుర్తించరా? తెలంగాణ లో అవకాశవాద రాజకీయాలకు చోటు లేదు. కాంగ్రెస్‌ కు ఓటు పడదు అంటున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో సాగుతున్న ప్రచార వివరాలు ఆయన మాటల్లోనే…

`610 జీవో చైర్మన్‌ గా తెలంగాణకు న్యాయం చేయలేదు.

`తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు.

`పదవుల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టుపెట్టావ్‌.

`జీవితాంతం కాంగ్రెస్‌ ను తిట్టి ఇప్పుడు కాంగ్రెస్‌ లో చేరావ్‌.

`జనం చీకొట్టినా మారలేదు.

`రేవూరికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల సంక్షేమం పట్టదు.

`పార్టీలు మారినట్లే, స్థానాలు కూడా మార్చే ఊసరవెళ్లి.

`రేవంత్‌ ను నమ్మి కొత్త ముసుగేసుకుంటే ప్రజలు నమ్మరు.

 

`దొంగలు, దొంగల సావాసం చేస్తారంటే ఇదే.

`రేవూరికి డిపాజిట్‌ కూడా దక్కదు.

`ప్రజలను ఓట్లడిగే నైతికత రేవూరికి లేదు.

ALSO READ : https://netidhatri.com/congress-is-bound-to-get-upset-for-the-third-time-says-nagar-kurnool-brs-mla-marri-janardhan-reddy/

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రేవూరి ప్రకాశ్‌రెడ్డి పచ్చి అవకాశవాది. తన రాజకీయం స్వార్ధం కోసం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పూటకో ముసుగేసుకొని, ప్రజలు చీ అన్నా, తిరస్కరించినా రాజకీయాల కోసం పాకులాడుతున్నాడు. జీవితాంతం తన రాజకీయ పబ్బం కోసం ఏ కాంగ్రెస్‌నైతే నిత్యం తూర్పారపట్టాడో ఆ పార్టీలో చేరి మళ్లీ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలని చూస్తున్న నాయకుడిని ప్రజలు ఎట్టిపరిస్ధితుల్లో నమ్మరు. తెలంగాణకు సేవ చేసే అవకాశం వచ్చినా, రేవూరి తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసి, తన పరపతికోసం పాకులాడిన నాయకుడు రేవూరి. తెలంగాణ యువత జీవితాలను చిదిమేసిన దుర్మార్గుడు రేవూరి. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని తెలంగాన సమాజమంతా గగ్గోలు పెడుతుంటే, అప్పటి పాలకులు వేసిన 610 జివో అధ్యయన కమిటికి చైర్మన్‌ చేస్తే రేవూరి ఏం చేశాడు. ఎలాంటి నివేదిక ఇచ్చాడు. కేవలం తూతూ మంత్రంగా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి, తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఏనాడు పరిగణలోకి తీసుకోలేని అసమర్ధుడు రేవూరి. కేవలం చాయ్‌ బిస్కట్ల కోసం కమిటీ సమావేశాలు ఏర్పాటు సీమాంద్ర పాలకులు అడుగులకు ముడుగులొత్తి, తెలంగాణ ప్రయోజనాలు కాలరాసిన నీతిలేని వ్యక్తి రేవూరి. తెలంగాణ ఆత్మ క్షోభించేలా చేసిన దుర్మార్గుడు. కమిటీ చైర్మన్‌గా వుండి అధికారులు సహకరించడం లేదని తన చేతగాని తనన్నా బైట పెట్టుకున్నాడే గాని, తెలంగాణ కోసం ఆయన బైటకు రాలేదు. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఆ పాలకులను నిందించలేదు. కనీసం సహకరించని అధికారుల మీద కూడా చర్యలకు ఉపక్రమించలేదు. అంటే ఆయన కావాలనే తెలంగాణకు అన్యాయం చేసేవారికి వత్తాసు పలికి, తెలంగాణ యువతకు తీరని అన్యాయం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో పదవులు ఆశలతో కాంగ్రెస్‌చేరాడు. తన రాజకీయ జీవితమంతా రాజకీయంగా కాంగ్రెస్‌తో పోరాటం చేసిన వ్యక్తి రేవూరి. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో చేరి తాను పచ్చి అవకాశవాదినని నిరూపించుకున్నాడు. ఇలాంటి నాయకులే వల్లే ఒకప్పుడు తెలంగాణ తీరని అన్యాయానికి గురైంది. నిరాధరణ గురైంది. నిర్లక్ష్యాన్ని చవిచూసింది. అభివృద్ధికి ఆమడ దూరం విసిరేయబడిరది. కేవలం ఉమ్మడి పాలకులు మోచేతి నీళ్లు తాగేందుకు తప్ప, తెలంగాణ ప్రయోజనాల కోసం కలలో కూడా పనిచేయని రేవూరి లాంటి వారిని ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. అయినా సిగ్గులేని తనంతో రాజకీయం కోసం ఆరాపడుతున్నాడు. అంటూ రేవూరి ప్రకాశ్‌రెడ్డిని తూర్పారపట్టిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ప్రచార వివరాలు, ప్రత్యర్ధలపై ఆయన విరుచుకుపడుతున్న తీరు ఆయన మాటల్లోనే…
రాజకీయాలు చేయాలంటే నిజాయితీ వుండాలి. ప్రజల కోసం త్యాగం చేసే గుణముండాలి. అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిత్వం వుండాలి.
తన ప్రజలను కాపాడుకునే ధైర్యం కావాలి. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి నర్సంపేట ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. కాని ఏం చేశాడు. తెలంగాణ వచ్చిన తర్వాతే నర్సంపేటకు కళ వచ్చింది. అభివృద్ది జరిగింది. అక్కడ రేవూరికి స్దానం లేదు. గత ఎన్నికల్లో నర్సంపేటలో ప్రజలతో మరోసారి చీ కొట్టించుకోవడం ఇష్టంలేక, వరంగల్‌ వెళ్లి అక్కడ ప్రజలను నమ్మించాలని చూశాడు. కాని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరంగల్‌ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. వారికి రేవూరి వ్యక్తిత్వం తెలుసు. ఆయన రాజకీయం తెలుసు. తెలంగాణకు ఆయన చేసిన ద్రోహం తెలుసు. అందుకే ఆయనను అక్కడ కూడా గెవలకుండా తీర్పిచ్చారు. తెలుగుదేశం నంంచి బిజేపికి వెళ్లాడు. అక్కడ ఆయన నాయకత్వ పటిమ ఎంటిదో తెలుసుకొని వాళ్లు పక్కన పెట్టేశారు. రేవంత్‌ నాయత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు వెళ్లి, రాజకీయం చేద్దామని, ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు పరకాలకు వచ్చాడు. రేవూరి ఎంతటి రాజకీయ స్వార్ధపరుడో పరకాల ప్రజలకు కూడా తెలుసు. దొంగలు,సావాసం చేస్తారంటే ఇదే…తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూసి, ఓటుకు నోటుకు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డితో కలిసి సాగుతున్న వాళ్లంతా అవకాశవాదులే. అందులోకైతే సులభంగా దూరిపోవచ్చని అటు బాట పట్టాడు. పరకాలలో పోటీకి వస్తున్నాడు. అసలు పరకాలలోనే కాదు, తెలంగాణలో ఎక్కడా ఓటు అడిగే నైతిక హక్కు లేని వ్యక్తి రేవూరి. పరకాల ప్రజలు ఎంతో చైతన్య వంతులు. పరకాలను అన్ని రకాలుగా అభివృద్ది చేశాను. పరకాల నా అడ్డా. అంత గర్వంగా చెప్పగలను. ఇది అభివృద్ది చేసిన నాయకులు మాత్రమే చెప్పుకోగలరు. ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నర్సంపేటను కన్నెత్తి చూడని రేవూరి పరకాల మొహం కూడా చూడడు. అనుకోని అవకాశం వచ్చిందని వస్తున్నాడు. పరకాల మీద ప్రేమతో కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పరకాల వచ్చాడు. అలాంటి వ్యక్తికి పరకాల ప్రజలు ఓటు కూడా వేయరు. డిపాజిట్‌ కూడా రాదు..
పరకాలలో నేను చేసిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తోంది.
పదేళ్ల క్రితం పరకాల ఎలా వుండేది. ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలకు తెలుసు. ఒకప్పుడు మంచినీటికి కూడా కటకటలాడిన పరకాల సాగులోనూ దూసుకుపోతోంది. నా ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకుల, కార్యకర్తల సహాకారంతో గ్రామ గ్రామాన ప్రచారం విసృతంగా సాగుతోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు అనుభవించని కష్టాలు తీరిపోయాయి. మారు మూల పల్లె అయినా, పట్నమైనా సరే కరంటు ఇరవై నాలుగు గంటలు వస్తుంది. దేశంలోనే ఎక్కడా ఇలా ఇరవై నాలుగు గంటల కరంటు వ్యవసాయానికి ఇస్తున్నది లేదు. కాంగ్రెస్‌ పార్టీ మేం గెలిచామని విర్రవీగుతున్న కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతును మోసం చేశారు. తెలంగాణలో ఎలాంటి హమీ లేకుండానే రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు గత తొమ్మిది సంవత్సరాలుగా ఇస్తున్నాం. కాని కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏడు గంటల కరంటు ఇస్తామని చెప్పి, కనీసం మూడు గంటలు కరంటు కూడా ఇవ్వలేక చేతులెత్తేశారు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ తెలంగాణ ప్రజలను నిండా ముంచేస్తారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరంటు సాధ్యమైనప్పుడు కర్నాకటకలో ఎందుకు ఇవ్వడం లేదు? అంటే వారికి పాలన కంటే కొట్లాటలు ముఖ్యం. ప్రజల ప్రయోజనాల కంటే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు స్వప్రయోజనాలు,రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వారికి కావాలి. అందుకే ప్రజలను వారి, సంక్షేమాన్ని గాలికి వదిలేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభూ ఏళ్లకుపైగా పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇరవైనాలుగు గంట కరంటు ఎనాడైనా ఇచ్చిన చరిత్ర వుందా? తెలంగాణ రైతులు సంక్షేమం పట్టిందా? రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రస్‌ వుందా? ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే తెలంగాణలోనే కాదు,దేశంలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు పక్కన పెట్టారు. తెలంగాణ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రంలో సంక్షేమ పాలకుడు కేసిఆర్‌ నాయకత్వంలో సుబిక్షమైన తెలంగాణను ఓర్చుకోలేక కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. కాని వారి ఆటలు చెల్లవు. వారి రాజకీయాలకు చోటు లేదు. పరకాలలో కాంగ్రెస్‌కు డిపాజిట్‌కూడా రాదు…గతం కన్నా మరింత మెజార్టీతో గెలుస్తా…తెలంగాణలో మా పార్టీ 90కి పైగా సీట్లు గెల్చుకొని మూడోసారి మళ్లీ ప్రభంజనం సృష్టిస్తాం…

కృత్రిమ మీడియాలో కాంగ్రెస్‌…ప్రజా క్షేత్రంలో బిఆర్‌ఎస్‌.

https://epaper.netidhatri.com/

` కాంగ్రెస్‌ లో కుంపట్లు…

`టిక్కెట్ల సిగపట్లు.

` సీనియర్లలో కొరవడిన ఐక్యత.

` ఎటూ తేల్చుకోలే గందరగోళాలాలు.

`నేనే సిఎం అంటూ సీనియర్ల ప్రకటనలు.

`నేనే నాయకుడిని.. కొండంగల్‌ లో రేవంత్‌ రెడ్డి..

`నేనే సిఎం…కోమటి రెడ్డి వెంకటరెడ్డి.

`ఆలూ లేదు..చూలు లేదు..ఆతృతకు అంతులేదు.

`అటు కొట్లాటలు…ఇటు పదవుల పంపకాలు.

`ఎన్నికలయ్యేదాకా ఇదే కొట్లాట..

`కాంగ్రెస్‌ అంటేనే గ్రూపుల గలాట.

`జనం సమస్యలు పట్టవు.

`ప్రజలకు చేరువ కాలేరు.

`జనం కాంగ్రెస్‌ ను రానివ్వరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా కాంగ్రెస్‌ అంటేనే కోపాలు, తాపాలు, కొట్లాటలు, కుంపట్లు,సిగపట్లు, గందరగోళాలు, ఇలా చెప్పుకుంటూపోతే సకల దరిద్రాలకు నిలయం. ఏ ఒక్కరి మాట మీద అందరూ వుండరు. ఎవరికి వారే..యమునా తీరే..అక్కడ ఎవరు పవర్‌ఫుల్లో, ఎవరి పవర్‌ లెస్సే ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు కీలకభూమికపోషిస్తారో ఎవరికీ అర్దం కాదు. అంతా గందరగోళం జగన్నాధం..ఎప్పుడు ఎవరు పెత్తనం చేస్తారో కూడా చెప్పడం కష్టం. ప్రతిసారి ఒకరి పెత్తనం సాగుతుంది. కాని ఈసారి జరుగుతున్నంత గందరగోళం ఎప్పుడూ లేదు. పైగా నేనే సిఎం…నేనేంటే నేనే అన్న వారు మళ్లీ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఆ మధ్య జానారెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నేనే సిఎం అన్నారు. నాకంటే సీనియర్‌ ఎవరూ లేరు. నాకంటే అర్హత కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు. పదవులు నాకు అలంకారం కాదు. నేనే పదువులకు అలంకారం అని కూడా చెప్పుకున్న ఏకైక నాయకుడు జానారెడ్డి. జానారెడ్డి నేనే సిఎం అంటు గత పన్నెండేళ్లుగా చెబుతున్నాడు. 2009 తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత ఆయనకు కూడా ఆశ కల్గింది. అప్పటి నుంచి నేనే సిఎం అంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో నేనే సిఎం అన్నాడు. 2018లో కూడా అదే చెప్పాడు. కాని ఓడిపోయాడు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. కాని నేనే సిఎం అంటున్నాడు. తాజాగా రేవంత్‌ రెడ్డి మీ కొడంగల్‌ బిడ్డనే రాష్ట్రానికి నాయకుడు అన్నాడు. అంతే షర్మిల మీడియా ముందుకు వచ్చి, తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లు కొట్టిచెప్పింది. ఇక నేను కూడా ఎక్కడ రేస్‌లో వెనుకబడి పోతానో అనుకున్నాడో ఏమో! కోమటి రెడ్డి వెంటకరెడ్డి కూడా నేను సిఎం అవుతానన్నాడు. అంతే నా కంటే మీరే నేను సిఎం కావాలని కోరుకుంటున్నారంటే ప్రజలనుద్దేశించి అన్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి కూడా నేనే సిఎం అన్న మాట చెప్పేశాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్ధితులను ఆసరా చేసుకొని, మొత్తానికి రేవంత్‌రెడ్డి చక్రం తిప్పుతున్నారు. కాని కావాలనే అసంతృప్తి జ్వాలలు రలిగిస్తున్నారు. అసలైన కాంగ్రెస్‌ నేతలు పక్కన పెట్టి, తన సొంత అనుచరగాణానికి ప్రాధాన్యత కల్పిస్తున్నాడు.
గతంలో ఎన్నడూ కాంగ్రెస్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారంటూ వార్తలు రాలేదు.
కాకపోతే తమకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే టిక్కెట్లు ఇప్పించున్నారన్న వార్తలు వుండేది. ఎవరి గ్రూపు వారు పదిలం చేసుకునే రాజకీయాలు వుండేవి. కాని రేవంత్‌ రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ రాజకీయాలే మారిపోయాయి. మొత్తంగా తెలుగుదేశం ఫ్రేమ్‌ మాత్రమే కనిపిస్తోంది. ఆ ఫేమ్‌ కోసమే రేవంత్‌ రాజకీయం చేస్తున్నట్లుంది. అందుకే కాంగ్రెస్‌ మొత్తం ఖాళీ చేసే ఎత్తుగడలు వేశాడు. పక్కాగా ప్రణాళికలు అమలు చేశాడు. మొత్తం సైకిల్‌ నేతలను నింపడంతోపాటు, రెడ్డి నేతలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇవి ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు. ఎవరికి నష్టమన్నది మాత్రం తేలిపోతోంది. ఎన్నటికైనా రేవంత్‌ రాజకీయం వల్ల సీనియర్లకు అవమానాలు తప్పవు. వారి ఆశలు అడియాసలు కావడం తప్పదు. ఈసారి ఎలాగూ కాంగ్రెస్‌ అదికారంలోకి రాదన్న సంగతి రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. పాతకుపోయిన సీనియర్లందరినీ పక్కన పెడితేగాని కాంగ్రెస్‌ మొత్తం తన చేతుల్లోకి రాదన్నది రేవంత్‌కు సష్టంగా అర్ధమైన విషయం. అందుకే ఓ దశలో కాంగ్రెస్‌ అంటేనే నేను..నేనంటేనే కాంగ్రెస్‌ అని అమెరికాలో అన్నారు. దాంతో కోమటి రెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఆయన ప్రకటనను తప్పుపట్టారు. అయితే అంతకు ముందే తాను ఐపిఎస్‌ ఆఫీసర్‌ లాంటి వాడిని అని అనడంతో సీనియర్లంతా భగ్గుమన్నారు. మేం హోంగార్డులమా? అంటూ ఫైర్‌ అయ్యారు. అయినా రేవంత్‌రెడ్డిని కదిలించలేకపోయారు. దాంతో ఆత్మాభిమానం వున్న నాయకులు కాంగ్రెస్‌ను వదిలి పెట్టి వెళ్లిపోయారు.
రాజకీయ అవకాశవాదంతో మళ్లీ వాళ్లే కాంగ్రెస్‌లోకి వస్తుండడంతో రేవంత్‌ తన రాజకీయానికి మరింత పదునుపెడుతున్నట్లు కనిపిస్తున్నా కాంగ్రెస్‌ను పూర్తిగా తెలుగుదేశంగా మార్చే ప్రయత్నంలో సక్సెస్‌ అవుతున్నారు.
కేవలం రెడ్డి వర్గమైతేనే తన చెప్పు చేతుల్లో వుంటుందని, తన రాజకీయాలు సాగుతాయని రేవంత్‌ అంచనా వేసుకుంటున్నారు. దాంతో ఇతర సామాజిక వర్గ నేతలను పక్కన పెడుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వారిని ఇప్పటికే సాగనంపేశారు. ఇప్పుడు మరో బలమైన నేత దామోదర రాజనర్సింహను కూడా సాగనంపేపనిలో వున్నారు. రేవంత్‌రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అసలు రేవంత్‌ను ఓ దశలో చెడుగుడు ఆడుకున్నారు. తానే పులిని అనుకున్నాడు. చివరికి రేవంత్‌కు సరెండరైపోయాడు. ఇదే ప్రజల్లో లేని కాంగ్రెస్‌ పార్టీని ఆంద్రా మీడియా, ఆ పార్టీ సృష్టించుకున్న సోషల్‌ మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కాంగ్రెస్‌ చేస్తున్న ఆ ప్రచారం ప్రజల్లోకి వెళ్తుందా అంటే వెళ్లదు. కేవలం యూత్‌కు ఎంటర్‌టైన్‌మెంటుగా మాత్రమే పనికొస్తుంది. ఇలా ఓవైపు కాంగ్రెస్‌లో ఓ వర్గం హడావుడి చేస్తుంటే సీనియర్లు తెలంగాణ మొత్తం కాంగ్రెస్‌లో ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ మొత్తం ఓ కొద్ది మంది చేతుల్లో మాత్రమే బందీ అయిపోయింది. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తోంది. ఈ విషయాన్ని గతంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుల సమీకరణాల సమావేశంలో వచ్చేది మన రాజ్యమే అంటూ వారికి లేని పోని ఆశలు కల్పించాడు. మొత్తానికి తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటున్నప్పటికీ సీనియర్లను పక్కనపెట్టి పెద్ద తప్పు చేస్తున్నాడు.
తెలంగాణ మొత్తం సీనియర్లంతా కాంగ్రెస్‌ను వీడిపోతున్నారు.
గడచిన ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తూ, ప్రచారాన్ని మాత్రం రేవంత్‌రెడ్డి ఉదృతం చేసుకుంటున్నాడు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం మూలంగా వాళ్లు కొంతదూకుడుగా ప్రచారం సాగిస్తారన్ననమ్మకంతో రేవంత్‌వేసిన స్కెచ్‌ సక్సెస్‌ అవుతుందన్న పగటి కలల్లో వున్నాడు. నిజానికి గ్రౌండ్‌లో పరిస్ధితి వేరు. కాంగ్రెస్‌ సృష్టించిన మీడియాలో పరిస్ధితి వేరు. తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకొని వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఈ విషయం తెలంగాణ ప్రజలే చెబుతున్నారు. అసలు దేశంలోనే అత్యంత వేగవంతమైన ప్రగతిని సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అసలు తెలంగాణలో ప్రజల్లో ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదని రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. అందుకే టిక్కెట్ల పంపకాలను, అమ్మకాలుగా మార్చుకున్నాడన్నది ఓ ఆరోపణ. కాంగ్రెస్‌ పార్టీ కోసం రేవంత్‌రెడ్డి గతంలో ఏ నాయకుడు పెట్టనంత ఖర్చు చేశాడు. కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ అధికారంలోకి రాదని ఆయనకు తెలుసు. అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి తిరిగి రాబడి కావాలంటే టిక్కెట్లు అమ్ముకోవడమే శరణ్యమనుకున్నాడు. టిక్కెట్ల బేరం పెట్టేశాడు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. వాళ్లు ముట్టజెప్పిందెంతో కూడా లెక్కలు చెబుతున్నారు. గత రెండు మూడేళ్లుగా రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మికోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ రేవంత్‌ మొండి చేయి చూపించాడు. వాళ్లకు టికెట్‌ ఇస్తాం..ఎంతిస్తావంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే వాళ్లను లూప్‌లైన్లో పెట్టి, కొత్తవారికి మూటలు అప్పగించిన వారికి టిక్కెట్లు ఇచ్చాడు. వారిని గెలిపించుకొచ్చే పూచీ నాదని అధిష్టానాన్ని నమ్మించి, సీనియర్లను పక్కన పెట్టి, అసలైన కాంగ్రెస్‌ నాయకులను వంచించి, తన లెక్కలు తాను రచించుకొని ఓడిపోయే పార్టీ నుంచి సొమ్మును కూడబెట్టుకునే ఎత్తుగడ వేశాడు. వచ్చే ఎన్నికల ఆశలను ఇప్పటినుంచే పదిలం చేసుకునే ఆలోచన చేస్తున్నాడు. అందుకే ప్రచారంలో కనిపిస్తే చాలు..అనుకుంటున్నారు.

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

https://epaper.netidhatri.com/

`పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు.

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కష్టాల కర్నాటక… కరంటు కటకట!

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బ్కె ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version