బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్., తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఇన్చార్జీలతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కొలికపోగు వెంకటేశ్వరావు మాదిగ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో ఇన్చార్జీలు కో ఇన్చార్జిలు గ్రామ కమిటీల నిర్మాణం గద్దెలు త్వరితగతిన పూర్తి చేసి జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ అవిద్భవ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ అంతడుపు ల సారయ్య మాదిగ పల్లి శ్రీను మాదిగ బండారు రాజ్ కుమార్ మాదిగ నేర్పటి శ్రీను క్రాంతి బండారు బాబు జీ సమ్మయ్య సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
చిట్యాల, నేటిధాత్రి :
సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు నియోజకవర్గంలోని చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలల్లో పర్యటించారు. ఆయా గ్రామాలల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, మండలంలో. తిరుమలాపూర్ గ్రామంలో కంచర్ల పోషాలు, చిట్యాల మండల కేంద్రంలో చింతకింది రాజమణి, నవాబుపేట గ్రామంలో మహమ్మద్ హకీమ్, కైలాపూర్ గ్రామంలో సకినాల కుమారస్వామి ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మధు వంశీకృష్ణ మాజీ ఎంపీటీసీ దబ్బటఆనిలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…
నేటి ధాత్రి- మహబూబాబాద్-గార్ల:-
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని,రైతాంగాన్ని,కూలీలను ఆదుకోవడంలో పూర్తి వైఫల్యం చెందాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ అన్నారు.సోమవారం అఖిలభారత రైతుకూలీ సంఘం గార్ల మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు సూత్రపు మనోహర్ అధ్యక్షతన మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్బంగా జడ సత్యనారాయణ,గుజ్జు దేవేందర్ లు ప్రసంగిస్తూ,ఆదివాసీలను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రం బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్,ములుగు,భద్రాది కొత్తగూడెం జిల్లా లో ఉన్న 339 ఆదివాసి గ్రామాలను 49వ జీవో ప్రకారం ఖాళీ చేయటం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలను చట్టాల ద్వారా బయటికి పంపడానికి పూనుకోవడం దారుణమని అన్నారు.ఈ మూడు జిల్లాల్లో ఉన్న గ్రామాలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కోరుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోకుంటే ప్రతిఘటన ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు.రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజాన్ని,సమానత్వాన్ని రద్దు పరచాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పరివార్ ప్రయత్నిస్తుందని రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకురావడం కోసం బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని అన్నారు.ఆదివాసీల నివసించే అడవులను అదానీ, అంబానీలకు వేదాంత కంపెనీలకు దారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకోవడం శోచనియమని అన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని,ఎరువులు,పురుగు మందులు కల్తీ లేకుండా నాణ్యమైనవి ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జి. సకృ,మండల నాయకులు గౌనీ మల్లేష్,పాక వెంకన్న, మాలోతు మాన్య,శ్రీరాములు, నందగిరి శ్రీను, వి. సక్రు, జయరాం,చింతల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు, ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు. ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పాకాల మహిళా బ్యాంక్ 25 లక్షల 50వేల లాభం అర్జించిందని పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండం రాజేశ్వరి తెలిపారు.శాంతినగర్ లోని మహిళా బ్యాంక్ కార్యాలయంలో 24 వార్షిక మహాసభ ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాక్స్ సొసైటీ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ2024-25 సంవత్సరానికి గాను డిపాజిట్లు రెండు కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మహిళ బ్యాంక్ 236 సంఘాలు మరియు బృందాలతో ఆర్థిక అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతున్నట్లు తెలిపారు. 3000 పైచిలుకుల సభ్యులు గల సంఘంలో పాడి గేదె రుణాలు, వ్యాపార రుణాలతో పాటు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ కోశాధికారి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధ, గండు శ్రీదేవి,గాధగోని నిర్మల, రాపాక మాణిక్యం, మండల పద్మ, దేవులపల్లి వాణి,గుడిశాల వనజ, బొమ్మగాని మంజుల, గొడిశాల రజిత ,లీగల్ అడ్వైజర్ పెండెం శివానంద్ సిబ్బంది కీసరి విజయ, పాకాల రంజిత్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి
ఐనవోలు నేటిధాత్రి:
ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి
ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి:
వీపనగండ్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల నుండి డిప్యూటే షన్ ద్వారా వనపర్తి ప్రభుత్వ బాలుర పాఠశాల కు బదిలీ చేయించుకొని వచ్చారని వనపర్తి లో రాజకీయ పార్టీ ల సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఫిర్యాదు చేశామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు వనపర్తికి ఆ ఉపాధ్యాయుని వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డి స్పందించి ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వీపనగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్న సిపిఎం ఖండిస్తున్నామని వీపనగండ్లలో బాలికల బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని , అతన్ని 5 మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయకుంటే వనపర్తి లోని ప్రజా సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఎం నాయకులు బాల్ రెడ్డి, దేవేందర్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి, రవి, ఇటుకూరి రంజిత్, కొండ వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు
నాగర్కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాలలో కుంటల ఆక్రమణలు,చెరువు శికం భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానిక సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.
నాగర్కర్నూల్ పట్టణం కొత్త జిల్లా గా ఏర్పడిన నాటి నుండి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా వరకు కుంటలు,చెరువు శిఖం భూములు ఆక్రమణలు జరిగినట్లు వివిధ పత్రికలలో వార్తలు వినపిస్తున్నాయని ఇట్టి భూఆక్రమణల పై గతంలో కలెక్టర్ కూడ నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులను ఆదేశించినా చర్యల విషయంలో అధికారాలు,ఆధారాలు ఉన్నా ఆలస్యం చేస్తూ నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,పట్టణ ప్రజలకు,రైతులకు మేలు చేసే చెరువులను, కుంటలను కాపాడవలిసిన తక్షణ కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందని ప్రకృతి వనరులను రాజకీయ అండదండలతో చెరబట్టి ధ్వంసం” చేసి కాంక్రీట్ జంగిల్ గా కందనూలు చెరువు”లను మారుస్తున్నా.జిల్లా ఉన్నతాధికారుల లో ఏమాత్రం చలనం కలగడం లేదని వాపోయారు.
జల వనరులను ఎవరు ఆక్రమించుకున్నా విచక్షణాధికారం ఉపయోగించి ప్రభుత్వ ఆధీనం లోకి తెచ్చుకునే అవకాశం ఉన్నా,ఆ దిశగ ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఆక్రమణలపై కోర్టుకేసులు ఉన్నా కబ్జాదారుల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేసే అధికారం జిల్లా ఉన్నతాధికారులకు ఉందని,ప్రజల ఆస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లినా,తమ అధికార దండాన్ని ఉపయోగించే అవకాశం ఉన్నతాధికారులకు ఉన్నా చర్యలు తీసుకోకుండా..
Government lands
ప్రేక్షక పాత్ర వహిస్తే,మిగిలిన ప్రభుత్వ భూమి కూడ కబ్జా ల పాలుకావడంతో పాటు భవిష్యత్తు తరాలకు తీరని నష్టం”చేసిన వారు అవుతారాని సూచించారు.చెరువు బఫర్ జోన్, శిఖం పరిధి లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చట్టంలో ఉన్నా భూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కుంటలను ధ్వంసం చేస్తూ,చెరువు శిఖం భూములలో నిర్మాణాలు చేసిన వారిపై పీ.డి యాక్ట్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టాల్సిందిగా పిర్యాదు లో విజ్ఞప్తి చేసారు.
సంకేపల్లి గ్రామంలో 55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన *శంకర్ పల్లి, నేటి ధాత్రి :-
శంకర్ పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామస్థులతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమస్యలని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పనులలో జాప్యం జరగకుండా పనులను త్వరితగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, ఫిల్డ్ అసిస్టెంట్ ఉబాగుంట రాజు, మాజీ సర్పంచ్ భద్రయ్య, వార్డు మెంబర్లు, కావాలి గోపాల్, సురేష్, మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డియార్వో విజయలక్ష్మి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి,నర్సంపేట ఉమారాణి గార్లు పాల్గొని ప్రజలనుండి స్వీకరించారు.స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 130 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ 54, హౌసింగ్ 20 దరఖాస్తులు వచ్చాయని మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 56 వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ప్రజావాణికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని,మీ పరిధిలో పరీక్షించవలసిన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు.ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ఆదేశించారు.ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నంచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టిఐ ,గ్రీవెన్స్ పెండేల్సి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,e ఫైలింగ్ లో ఫైల్స్ సర్క్యులేట్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు.వ్యవసాయ,ఆరోగ్య, విద్యాశాఖ తదితర శాఖలు శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలని పనులపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణచేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ అధికారి అనసూయ, డిబిసిడివో పుష్పలత,జిల్లా విధ్యా శాఖ అధికారి జ్ఞానేశ్వర్,నర్సంపేట ఆర్డీఓ ఇమారాణి,సంబంధిత అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమిద్దాం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి – ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్
కరీంనగర్, నేటిధాత్రి:
భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జూలై 2న ఛలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి పిలుపుని స్తున్నట్లు యుగంధర్ తెలిపారు.
ఈముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కరీంనగర్ బస్టాండ్ వద్ద విడుదల చేశారు.
ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను నష్టపరిచే చర్యలను దేశ పౌరులు తిప్పికొట్టాలని వారు అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోడీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
మోడీ ట్రంప్ మాటలను సైతం ఖండించలేదని వారు అన్నారు.
భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం ద్వారా మరోసారి తన క్రూరమైన వైఖరిని బహిర్గతం చేసిన మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని మండిపడ్డారు.
మోదీ అమెరికా సందర్శించినప్పుడల్లా కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తారు.
‘హౌడీ మోడీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ధ్వజమెత్తారు.
ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
మోడీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదని వారు ఉద్ఘటించారు.
అందుకే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
ఈపోస్టర్ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కనకం ప్రవీణ్, వినయ్, చరణ్, మధు, రాజేష్, కిరణ్ రాఘవేంద్ర,కుమార్, వినయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ వీలయినంత త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనీ లబ్దిదారులకు సూచించారు.నిర్మాణం స్టేజిల వారిగా ఫోటో కాప్చర్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కాంక్షని,పంచాయతీ కార్యదర్శి అరెల్లి సత్యనారాయణని ఆదేశించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది.అవి తరచుగా ఇళ్లలోకి ప్రవేశించి ఆస్తి నష్టం కలిగిస్తున్నాయనీ,ఇళ్ళముందు బాల్కనీ రక్షణ గోడలపై కూర్చుంటూ,విద్యుత్ తీగలపై తిరుగుతూ ప్రజలను,ముఖ్యంగా పిల్లలను,మరియు వృద్ధులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయనీ స్థానికులు వాపోతున్నారు.ఈ కోతులను సురక్షితంగా నియంత్రించి,నిర్బంధించి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాత మంచిర్యాల ప్రాంతవాసులు కోరుతున్నారు.ఈ ప్రాంత ప్రజల భద్రత మరియు శ్రేయస్సు కోసం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.
ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు. ఈ యొక్క సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు సురేష్ బుద్ధిష్ట్ర సొసైటీ నాయకులు సుభాష్, నర్సింలు, అశోక్, రాజు, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి టి. హరిశ్ రావు ని సోమవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, యం. జైపాల్, మల్లేశం, లు ఉన్నారు.
పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కనీసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యేలు మాణిక్ రావు,చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఘటన జరిగి ఐదు గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు అందించడంలో, కుటుంబ సభ్యులకు వివరాలు తెలపడంలో వైఫల్యం అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం ఇంత పెద్ద పేలుడు జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగే సమయంలో కంపెనీలో మొత్తం 140 మంది పని చేస్తున్నట్లు తెలుస్తున్నది.
మొత్తం నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
8 మంది మృతి చెందగా, దాదాపు 26 మందిని పలు ఆసుపత్రులకు తరలించారు.మిగతా వారి పరిస్థితి తెలియరావడం లేదు.
ఎంత మంది బయటికి రాగలిగారు అనేది అర్థం కాని పరిస్థితి కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చెందుతున్నారు.
తమవారి జాడ చెప్పాలని అధికారులను వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులకు వివరాలు తెలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్, ఎస్పీ లను కలిసి చెప్పాను.
ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పని చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ప్రమాదం జరిగి 5 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.కంట్రోల్ రూం పెట్టండి, కామన్ ఫోన్ నెంబర్ పెట్టండి అని అధికారులకు సూచించారు.ప్రమాదం జరిగి 5 గంటలు అవుతున్నది ఏం చేస్తున్నారు?
వివరాలు తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నరు?
ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్ అద్బుతంగా పని చేస్తున్నది.
కానీ, ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పని చేస్తున్నది అని ప్రశ్నించారు.
ప్రత్యేక అధికారులను పెట్టుకోండి, అటెండెన్స్ లిష్ట్ పెట్టుకోండి.డ్యూటీలో ఎంత మంది ఉన్నరు అంటే కలెక్టర్ ఒక లెక్క, ఎస్పీ ఒక లెక్క చెబుతున్నారని ఆరోపించారు.
5 గంటల నుంచి ఏ వివరాలు లేవు, బాధ్యత రాహిత్యంగ పని చేస్తున్నది ప్రభుత్వం అసలు కార్మిక శాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఇక్కడకు వచ్చే కుటుంబ సభ్యులు ఎవరిని కలవాలో చెప్పండి.
హ్యాండ్ మైక్ పెటుకొని గైడ్ చేసే బాధ్యత లేదా?
గాయపడ్డ వారిని ప్రైమేరీ కేర్ ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తున్నారు.
30శాతం కాలితే డేంజర్, కార్పొరేట్ ఆసుపత్రులకు వారిని ఎందుకు పంపడం లేదు ఏఐజీ, కేర్, అపోలో ఆసుపత్రులకు పంపండి.
మొదటి గంటలో ట్రీట్మెంట్ అందితే ప్రాణాలు కాపాడవచ్చు.
నిర్లక్ష్యంతో గోల్డెన్ అవర్ మిస్ చేస్తున్నారు.
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని పేర్కొన్నారు.
కుటుంబాలకు సమాచారం అందించడంలోనూ ఫెయిల్ ఎంత మంది డ్యూటీలో ఉన్నారో గుర్తించడంలో ఫెయిల్ పారిశ్రామిక వాడలో వరుసగా ఇది మూడో సంఘటన.
గతంలో జరిగిన సంఘటనలో 5గురు చనిపోయారు.
వరుస అగ్రి ప్రమాదాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
ఏడాదిలో మూడో సంఘటన జరగటం దురదృష్టకరం.
ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది.
సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఫెయిల్ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే కాపాడే విధంగా చర్యలు రూపొందించాలి.
చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించి 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.
నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్-2025 పోస్టర్ ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించబడుతున్న నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (NSPC)-2025 పోస్టర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా lAS సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకుపర్యావరణ పరిరక్షణ లో భాగంగా నీటి సంరక్షణ, చెట్లు నాటడం, మరియు తడి పొడిచెత్త వేరుచేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలని మరియు క్విజ్ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య DYSO రాందాస్ పాల్గొన్నారు. “HARIT – The Way of Life” అనే నినాదంతో ఈ పోటీ July 1 నుంచి August 21, 2025 వరకు దేశవ్యాప్తంగా జరుగనుంది. August 30న ఫలితాలు ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనవచ్చని వారు సూచించారు. ఈ పోటీని తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు. పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పోటీకి సంబంధించిన నమోదుకు, క్విజ్ పోటీకి సంబంధిత లింకులు కూడా విడుదల చేశారు.పోటీ గమ్యం: విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన లింక్ పోటీ https://ecomitram.app/nspc/ వెబ్సైట్లో విద్యార్థులు చూడవలసిందిగా కోరారు.
వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం డిప్యూటీ తహశీల్దార్ రాజేష్ ఖన్నా అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్య శారదదేవి సోమవారం ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్ తో పాటు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్, నల్లబెల్లి తహశీల్దార్ కృష్ణ ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.