‘‘బిఆర్‌ఎస్‌’’ రజతోత్సవాలు.. తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు.’’బి.వినోద్‌ కుమార్‌

‘‘బీఆర్‌ఎస్‌’’ రజతోత్సవాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు… ప్రజల పండుగ…అంటున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘బి. వినోద్‌ కుమార్‌’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో పంచుకున్న ఉద్యమ స్మృతులు, పార్టీ ప్రస్థానంపై పంచుకున్న విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..

https://youtu.be/cwZB9cR80Oo

`మరో వందేళ్ల బీఆర్‌ఎస్‌ కు పడనున్న అడుగులు

`తెలంగాణ వున్నంత వరుకు బిఆర్‌ఎస్‌ వుంటుంది

`బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ వుంటుంది

`తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది

`తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా మనుగడలోనే వుంటుంది

`బీఆర్‌ఎస్‌ రాజకీయ ఉద్యమ పోరాటం నిండిన పార్టీ

`వ్యక్తిగత రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు

`సిద్ధాంతాలు లేని పార్టీలు బీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ పోటీ కాదు

`ప్రపంచ చరిత్రలోనే ఈతరం ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ సంకెళ్లు తెగించి కొట్లాడి తెంపిన పార్టీ

`తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పార్టీ

`తెలంగాణ ఆత్మ గౌరవం నింపిన పార్టీ

`తెలంగాణ చైతన్య రథాలు కదిలించిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణలో చైతన్య కిరణాలు నింపిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ నే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ పోరులావా పొంగించిన పార్టీ బీఆర్‌ఎస్‌

`బీఆర్‌ఎస్‌ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు

`కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

`కేసీఆర్‌ అనే పదమే విశ్వజనీనం

`బీఆర్‌ఎస్‌ అనే పార్టీయే ఉద్యమ సోపానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలంటే ఒక్క పార్టీ పండుగనే కాదు. అది తెలంగాణ ప్రజల పండుగ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పండుగ. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బిఆర్‌ఎస్‌. కేసిఆర్‌ మది నుంచి జాలు వారిన ఆశయాలు, ఆలోచనలు నుంచి పురుడు పోసుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తవుతున్న శుభవేళ జరుపుకుంటున్న ప్రజా సంబురాలు. పార్టీ వేడుకనే కాదు, ప్రేజా వేడుకలు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పార్టీ. ప్రజా ప్రవాహాన్ని పోరుబాటగా మలిచిన పార్టీ. ప్రజా సేవలో, ఉద్యమ స్వరూపాన్ని నింపిన పార్టీ. తెలంగాణ అభివృద్ది ప్రాంత హక్కు..తెలంగాణ రాష్ట్ర జన్మ హక్కు అని నినాదం నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నింపుకొని, తెలంగాణ ఆత్మాభిమానం చాటి చెప్పిన పార్టీ. ఒక వ్యక్తి రాజకీయం కోసం పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టినపార్టీ. తెలంగాణకోసం కేసిఆర్‌ చేసిన త్యాగం నుంచి ఉద్భవించినపార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ గోసను నుంచి విముక్తికోసం పుట్టిన పార్టీ. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణ సాదించిన పార్టీ. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ చేతుల మీదుగా బంగారు తెలంగాణ ఆవిష్కారం చేసిన పార్టీ. మోడువారిని పల్లెను చిగురించిన పార్టీ. చుక్క నీటి కోసం తల్లడిల్లిన పల్లెలో గోదారి పరవళ్లు తొక్కించిన పార్టీ. ఇంటింటికీ గోదారి నీళ్లందించిన పార్టీ. సాగు లేక, సాగు చేయలేక రైతు కన్నీటి వ్యవసాయం నుంచి, గోదారి గలగలలు వింటూ రైతు కన్నీళ్లు తుడిచిన పార్టీ. ఒకప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ వెటకారం చేసిన వాళ్లు కోట్ల రూపాయల ధరలు పలికేలా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ. అందుకే బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణ కుటుంబ పార్టీ. తెలంగాణ గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయే పార్టీ. మరో వెయ్యేల్లయినా చెరిగిపోని, తరిగిపోని చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీది. తెలంగాణ ఉనికి వున్నంత వరకు నిలిచిపోయే పార్టీ. తెలంగాణ అస్ధిత్వాన్ని తన భుజాల మీద మోసే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ. ఎన్ని తరాలు మారినా తరగని చిరునామా లాగా శాశ్వతంగా తెలంగాణ గుండెల్లో నిండిన పార్టీ అంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బోయిన పల్లి వినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఉద్యమ కాలం నాటి అనుభవాలు, బిఆర్‌ఎస్‌ పుట్టు పూర్వత్తరాలపై పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు…ఆయన మాటల్లోనే..

బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్స సంబురాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు…అవి ప్రజల జరుపుకునే పండుగ. తెలంగాణ కోసమే పుట్టి, అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఈ సంబురాల వేళ మరో వెయ్యేళ్ల ప్రయాణం సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది తెలంగాణ ప్రజల పార్టీ. మా పార్టీ బిఆర్‌ఎస్‌ అని ప్రజలు గర్వంగా చెప్పుకునేపార్టీ. త్యాగాల నుంచి పుట్టి, తెలంగాణ పొలికేకలు పెట్టి, గులాబీ జెండాను పట్టి, పిడికిలెత్తి జై తెలంగాణ అని నినదించిన ఏకైక పార్టీ. అసలు తెలంగాణ అనడానికి తెలంగాణ నాయకులకే నోరు రాని రోజులవి. తెలంగాణ అంటే ఎక్కడ తమ పదవులు పోతాయో అని భయపడిపోయిన రోజులు. వెనుకబడిన ప్రాంతం అని తెలంగాణ నాయకుల చేత సమైక్య పాలకులు చెప్పించిన కాలం. కష్టమొచ్చిన చెప్పొదు. కాలం కాకపోయినా ఏడువొద్దు. తెలంగాణ కోసం ఏది అడిగినా గొంతెమ్మ కోరికలంటూ సమ్యై వాదులు హేళన చేసిన రోజుల నుంచి జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన కేసిఆర్‌ ఉక్కు సంకల్పం నుంచి ఉద్భవించిన గులాబి సింహస్వప్నం బిఆర్‌ఎస్‌ పార్టీ. ఆ మాటలు చెబుతుంటేనే రక్తం మరుగుతుంది. బిఆర్‌ఎస్‌ అని పలుకుతుంటేనే రక్తం ఉప్పెనై పొంగుతుంది. అంతటి శక్తి వంతమైన పదం బిఆర్‌ఎస్‌. గులాబీ జెండను చూస్తేనే ఉద్యమం ఉరకలెత్తేది. ప్రజలు జెండా పట్టుకొని ఉద్యమ రంగంలోకి దింకేలా చేసింది. అంత గొప్పది. అందుకే టిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వున్నంత వరకు వుంటుంది. తెలంగాణ గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగా చిరస్ధాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ గుండెలో గులాబీ రెపరెపలాడుతూ వుంటుంది. తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా రాజకీయ మనుగడలో ముందు వరుసలోనే వుంటుంది. బిఆర్‌ఎస్‌ అని పలుకుతున్న ప్రతి సందర్భంలోనూ కేసిర్‌, కేసిఆర్‌ అని ప్రకృతి నుంచిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ మూల సిద్దాంతంగా, తెలంగాణ వాదమే సూత్రంగా పుట్టిన పార్టీ. సిద్దాంతాలు లేని ఏ రాజకీయ పార్టీ బిఆర్‌ఎస్‌కు పోటీ కాదు. రాలేదు. తెలంగాణ సంకెళ్లను తెంచడానికి తెగించి కొట్లాడిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణలో అణువణువూ నిండిన పార్టీ. తెలంగాణ వాదానికే కాదు, తెలంగాణకే స్వేచ్చా వాయువులు ప్రసరింపజేసి పార్టీ. ఉద్యమానికి ఊపిరి పోసి, తెలంగాణ చైతన్య రథ చక్రాలు కదిలించిన పార్టీ. తెలంగాణలో చైతన్య కిరణాలు పంచిన పార్టీ. తెలంగాణనే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ. తెలంగాణ పోరు లావా పొంగించిన పార్టీ. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అందుకే కేసిఆర్‌ అనే మూడక్షరాల పదం విశ్వజననీం…సర్వాంతర్యామి స్వరూపం. బిఆర్‌ఎస్‌ పార్టీయే ఉద్యమ సోపానం. తెలంగాణ కోసం కేసిఆర్‌ తొలి అడుగు వేసిన నాడు ఎటు చూసినా ఎడారి పరిస్ధితులు. ఒక్కడుగా అడుగులు మొదలు పెట్టాడు. ఒక్కడే సింహమై గర్జించాడు. ఒక్కడే జై తెలంగాణ అని పిడికిలెత్తి నినదించాడు. ఒక్కడే అసెంబ్లీలో తన గళం వినిపించాడు. ఒక్కడే అసెంబ్లీలో తెలంగాణ సమస్యలపై ఏకరువు పెట్టారు. కేసిఆర్‌ నోరు నొక్కేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసినప్పుడు, తెలంగాణ వాదాన్ని సమూలంగా అణచివేయాలని చూశారు. ఎక్కడికక్కడ అప్పటి ఉమ్మడి పాలకపక్షంతో పాటు, అప్పటి ప్రతిపక్షం కూడా చేతులు కలిపి, కేసిఆర్‌ను ఓడిరచాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసిఆర్‌ నాయకత్వం ఎలాంటిదో అప్పటికే ఉమ్మడి పాలకులకు తెలుసు. కేసిఆర్‌ ఎంతటి పట్టుదల వున్న నాయకుడో తెలుసు. కేసిఆర్‌ ఎంతటి విజ్ఞానవంతుడో తెలుసు. ఎంతటి వాగ్ధాటి కల్గిన నాయకుడో తెలుసు. తెలంగాణపై కేసిఆర్‌కు వున్నంత అవగాహన మరే నాయకుడికి లేదని తెలుసు. అందుకే అడుగడుగునా కేసిఆర్‌ను అవమానపర్చాలని చూశారు. కేసిఆర్‌ అదే తీరులో స్పందించి సింహస్పప్నమైన వారి విమర్శలకు తెలంగాణ నిజాలు చెప్పి నోరు మూపించేవారు. అలా ప్రజలందరికీ తెలంగాణ కావాలని వున్నా,కేవలం పదవుల కోసం ఉమ్మడి పాలకులకు మోచేతి నీళ్లు తాగే నాయకులు కేసిఆర్‌ను పలుచన చేయాలని అనేక మార్లు ప్రయత్నం చేశారు. కాని ధర్మం, న్యాయం కేసిఆర్‌ వైపు నిలించింది. కేసిఆర్‌ మీద నమ్మకంతో తెలంగాణ అంతా కదిలింది. తొలి గులాబీ జెండా ఎగిరింది. అది తెలంగాణ అంతటా రెపరెపలాడిరది. దేశ దిగంతాలు దాటి ప్రపంచంలో తెలంగాణ వాదులున్న అన్ని దేశాలలో గులాబీ జెండా ఎగిరింది. నిజానికి రాజకీయ పార్టీ నపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఉద్యమ పార్టీ నిర్వహణ అనేది మరింత అసాద్యం. అటు ఉద్యమాన్ని రంగరించి, ఇటు రాజకీయానికి చాణక్యాన్ని జోడిరచి కేసిఆర్‌ సాగించిన ప్రయాణం ప్రపంచంలోనే ఎక్కడా, ఎవ్వరూ నిర్వహించి వుండరు. తెలంగాణ కోసం కేసిఆర్‌ చేసిన సాహసం అంతా ఇంతా కాదు. కేవలం ఆమరణ దీక్ష సమయంలోనే ,కాదు అడుగుడుగునా ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. పార్టీని నడిపించారు. ప్రజలను చైతన్యం నింపారు. పసిపాప నుంచి మొదలు పండు ముసలివరకు జై తెలంగాణ అని నినదించేలా కోట్లాది మంది తెలంగాణ వాదులను తయారు చేశారు. ఒక్క కేసిఆర్‌ గొంతు కోట్ల గొంతుకలై జై తెలంగాణ అని గర్జిస్తుంటే దిక్కులు మారుమ్రోగిపోయాయి. అదీ కేసిఆర్‌ అంటే..అలాంటి కేసిఆర్‌ పెట్టిన బిఆర్‌ఎస్‌ పార్టీ ఆచంద్ర తారార్కం వెలుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ వున్నంత వరకు, తెలంగాణ ఉనికి వున్నంత వరకే కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన నడిచిన అడుగులు చరిత్ర పుటల్లో సజీవంగా వుంటాయి. అందుకే బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను ప్రజలే జరుపుకునేందుకు వరంగల్‌ వస్తారు. ప్రజలే ఆ పండుగను ఆశీర్వదిస్తారు. మహా సింహగర్జనను మించిన సభను నిర్వహించి, తెలంగాణ వాదం ఎంత బలమైందో, కేసిఆర్‌ నాయకత్వం ఎంత గొప్పదో చూస్తారు. కేసిఆర్‌ పిలుపు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వరంగల్‌ రజతోత్సవ సభతో మరోసారి తెలుసుకుంటారు. కేసిఆర్‌తోపాటు తొలి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ కోసం పునరంకితమైనందుకు నా జన్మ కూడా ధన్యమైందనే అనుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో నేను కీలకమైన పాత్ర పోషించాను. కరుడుగట్టిన బిఆర్‌ఎస్‌ సైనికుడిగా పార్టీకోసం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను.

తెలంగాణ ఆత్మకే జీవం బిఆర్‌ఎస్‌:పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ‘‘కేసిఆర్‌’’

వరంగల్‌ రజతోత్సవ సభ ఎలా వుంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ కు వివరించిన ఎమ్మెల్సీ ‘‘పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి’’ వివరాలు…ఆయన మాటల్లోనే..

 

`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్‌ గుండెలు అదిరిపోవాలే..

`రజతోత్సవ సభ తరతరాల తెలంగాణ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది

`తెలంగాణ నలు మూలల నుంచి దండు కదిలితే ఎలా వుంటుందో అలా వుంటుంది

`పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు ప్రజలు వరంగల్‌ సభకు వస్తారు

`వరంగల్‌ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్‌ పార్టీ అతలాకుతలం అవుతుంది

`సభలంటే బిఆర్‌ఎస్‌ సభలే అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా వుంటుంది

`చరిత్రలో రజతోత్సవ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా జరుగుతుంది

`బిఆర్‌ఎస్‌ అంటే నాయకులే కాదు యోధులు

`త్యాగాల వీరులు..తెలంగాణ తెచ్చిన ధీరులు

`తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికులు

`తెలంగాణ అంటేనే పడని వాళ్లు పాలకులైతే ఇలాగే వుంటుంది

`తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ల చేతిలో పెడితే విధ్వంసమౌతుంది

`60 ఏళ్ల కలను నిజం చేసింది కేసిఆర్‌

`14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసిఆర్‌

`పదేళ్లలో తెలంగాణను వందేళ్లు ముందుకు తీసుకెళ్లింది కేసిఆర్‌

`ఒక్క ఏడాదిలోనే మళ్ళీ వందేళ్లు వెనక్కి నెట్టింది కాంగ్రెస్‌

`కాంగ్రెస్‌ అంటేనే కరువు…తెలంగాణకు బరువు

`కాంగ్రెస్‌ అంటేనే కష్టం.. నష్టం

`యాభై ఏళ్లు పాలించి 50 వేల ఎకరాలు పారించలేదు

`పదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చింది కేసిఆర్‌

`మాయ మాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది

`అలవికాని హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది

`పాలించడమంటే నోటి కొచ్చింది చెప్పడం కాదు

`ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం

`అవి రెండూ కాంగ్రెస్‌ కు చేతకాదు

`భవిష్యత్తులో మరో పాతికేళ్లు ప్రజలు ఇక కాంగ్రెస్‌ ను జనం నమ్మరు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏనుగు వెళ్తుంటే మొరిగే శనకాలు వుంటాయి. అవి శునకానందం పొందుతుంటాయి. అల్పులు, అజ్ఞానులు అంతటా వుంటారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారు. కాని తెలంగాణ ఆత్మతో పెనవేసుకున్న బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తేనే రాజకీయ మనుగడ అనుకునే వారు కూడా చాల మంది వుంటారు. అలాంటి వారికి బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ మరోసారి పాఠమే కాదు, గుణపాఠం కూడా నేర్పుతుంది. సభలంటే అవి తెలంగాణకే పరిమితం. తెలంగాణ ఉద్యమానికే తలనమానికం. బిఆర్‌ఎస్‌ పార్టీకే సొంతం. ఆ చరిత్రను తిరగరాసే శక్తులు లేవు. రావు. మళ్లీ మళ్లీ సింహగర్జన లాంటి సభలు నిర్వహించాలన్నా, ఆ చరిత్రను తిరగరాయాలన్నా అది బిఆర్‌ఎస్‌కే సాధ్యం. కేసిఆర్‌ పేరు చెబితే తప్ప అంత గొప్పసభలు జరగవు. అందుకే ఈసారి బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నభూతో నభిష్యతి అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా జరుగుతుందని ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాసభలకు కూడా అనుమతులు ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌ది. కాంగ్రెస్‌కు ఈ నికృష్ట సంప్రదాయంకొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే సభ నిర్వహణకు ప్రతిసారి కోర్టును ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వ్యతిరేకులు పాలిస్తున్న ఈ సమయంలో కూడా బిఆర్‌ఎస్‌ సభకు మళ్లీ అనుమతి కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్‌ నైజం. ఆ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులులేరు. తెలంగాణ కోసం గొంతిత్తిన వాళ్లు లేరు. వున్న వారు పదవుల కోసం ఆరాటం తప్ప, తెలంగాణ కోసం నొరెత్తే శక్తి లేని వాళ్లు వున్నారు. అందుకే కాంగ్రెస్‌ను నమ్మి, తెలంగాణ మళ్లీ ఒకసారి ఆగమైంది. ఒక్క అవకాశమంటూ ప్రజలను వేడుకొని, అడుగడుగునా ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటి అమలు చేయలేక, కనీసం కేసిఆర్‌ వేసిన బాటలో నడవలేక తెలంగాణను తెర్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణను ఆగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నునంచే ప్రజలకు ఆ ప్రభుత్వం ఏమిటో తెలిసిపోయింది. వారి పాలన చేతగాదని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు కాంగ్రెస్‌ పాలనలో అమలు కావని అర్ధమైపోయింది. అందుకే ఇంత తొందరగా ప్రజా వ్యతిరేక మూటగట్టుకున్న ప్రభుత్వం ప్రపంచంలోనే కూడా ఎక్కడా వుండదు. అందుకే ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్లీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమొస్తుందా? కేసిఆర్‌ మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? పచ్చని తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్‌ దరిద్రం పోతుందా? అని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభతో ప్రజలకు భరోసా కల్పించడానికి, భవిష్యత్తు బంగారంగా వుంటుందని చెప్పడానికి వరంగల్‌ సభ గొప్పగా జరగనుంది. తెలంగాణ నలు మూలల నుంచి పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల హజరయ్యే అవకాశం వుంది. అందుకే 1200 ఎకరాలలో చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సభకు శ్రీకారం చుడుతున్నాం..ఈ రజతోత్సవేడుక సాక్షిగా మరో వందేళ్ల చరిత్రకు, ప్రయాణానికి పునరంకితం కావాలనుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌ రెడ్డి తన అభిప్రాయాలను నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

కేసిఆర్‌ అంటేనే ఒక చరిత్ర. కేసిఆర్‌ అంటేనే యుగకర్త. కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవనాడి. తెలంగాణ ఉద్యమ వేడి. తెలంగాణ కారణజన్ముడు. తెలంగాణ ప్రజల గోస తీర్చేందుకు కదం తొక్కిన వీరుడు. అందుకే తెలంగాణ తెలంగాణ వచ్చింది. అందుకే తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ అని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి 25 వసంతాల ప్రయాణం సామాన్యమైనవిషయం కాదు. తెలంగాణ పేరు మీద అనేక పార్టీలు ఏర్పాటయ్యాయి. అవకాశ వాద రాజకీయాలు చేయాలనుకున్న వారు మధ్యలోనే తెలంగాణ మంత్రం మర్చిపోయారు. తెలంగాణ కోసం జై తెలంగాణ అనడమే మానేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా కొనసాగించి, కడదాకా కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్‌. దేశంలో ఉద్యమ పార్టీలు చాలా తక్కువ. అందులోనూ బిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ మరొకొటి లేదు. రాదు! ఇంకా వందేళ్లయినా చెక్కు చెదరని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇంకా వెయ్యేళ్లైనా తెలంగాణ సమాజం మర్చిపోని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకులు లేరు. భవిష్యత్తు చూడదు. తెలంగాణ తేవడమే కాదు..తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్‌. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి, రైతులుకు నీటి కష్టాలు తీర్చిన భగీరధుడు. కాంగ్రెస్‌ పార్టీ యాభై ఏళ్లుగా పునాది రాయితప్ప, తట్టెడు మట్టి తీయని ప్రాజెక్టులు అనేకం వున్నాయి. దశాబ్దాలుగా వాటి పేరు చెప్పి కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికిప్పుడు పబ్బం గడుకున్నదే తప్ప చుక్క నీరివ్వలేదు. ఎకరం పొలం పారించలేదు. తెలంగాణ ఎడారిగా మారుతున్నా గుడ్లప్పంచి చూశారు. తెలంగాణ ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కాంగ్రెస్‌ నాయకులు చూసి నవ్వుకున్నారు. ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చారు. ఉమ్మడి పాలకులను ఎదిరించే ధైర్యం లేక చేష్టలుడిగి చూశారు. ఉమ్మడి పాలకుల మోచేతినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అందుకే తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకోలేదు. కేసిఆర్‌ పేరు తెలంగాణలో నిత్య స్మరణ కావడానికి, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ నిలిచిపోవడానికి, తెలంగాణ సాధనతోపాటు, కాళేశ్వరం, యాదాద్రి దేవాలయాలు చాలు. ఇప్పటి కాలంలో ఎవరికీ సాద్యం కాని యాదాద్రి గుడి నిర్మాణం జరిగింది. అలాంటి గుడి నిర్మాణం జరగాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. కాని ఏడేళ్ల కాలంలో యాదాద్రి గుడి నిర్మాణం జరగడంత ప్రపంచమంతా విస్తుపోయింది. కాళేశ్వరంతో మొదలైన పోలవరం ఎక్కడున్నదో..కాళేశ్వరం పూర్తయి నీళ్లు ఎలా ఇస్తున్నదో ప్రజలు చూస్తూనే వున్నారు. కేసిఆర్‌ నాయకత్వ పటిమను కొనియాడుతూనేవున్నారు. ఇరవైదేళ్ల పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా తలా తోకలేని కొంత మంది నాయకులు వేస్తున్న ప్రశ్నలు విచిత్రంగా వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకుల పసలేని వాదన అద్వాహ్నంగావుంది. మాటకు ముందు కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర గురించి మాట్లాడే నాయకులు ఆ పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని బారతీయుడు పెట్టింది కాదు. ఏవో హ్యూమ్‌అనే ఆంగ్లేయుడు పెట్టిన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు చీలికలు, పీలికలైన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. పార్టీ చీలిన ప్రతీసారి కొత్త గుర్తుతో ప్రజల ముందుకొచ్చిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అలా పలుసార్లు అంతరించి, మిగుతూవచ్చిన పార్టీ కాంగ్రెస్‌. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్‌ కాదు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇప్పుడున్న కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాని టిఆర్‌ఎస్‌ నుంచి బిఆర్‌ఎస్‌ పేరు పార్టీయే పేరు మార్చుకున్నది. టిఆర్‌ఎస్‌ నాయకుడైనా, బిఆర్‌ఎస్‌ నాయకుడైనా ఒక్కరే..ఆ ఒక్కరు కేసిఆరే…పార్టీ పేరు మాకు మేముగా మార్చుకున్నాం..పార్టీ జెండా మారలేదు. గుర్తు మారలేదు. ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. ఎన్నికల సంఘం నియమాళికి లోబడి పేరు మార్పు జరిగింంది. పార్టీ పేరు మార్పును అంగీకరించింది. ఈ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వారి మాటలు అసలే నమ్మరు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్‌ పార్టీ గుండెలు అదిరిపోతుంది. ఆ పార్టీ అతలా కుతలమౌతుంది. రాజకీయసభలంటే బిఆర్‌ఎస్‌ సభల్లా వుండాలని ప్రపంచమంతా 27 తర్వాత మాట్లాడుకంఉటుంది. చరిత్రలో వరంగల్‌ సభ మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే కేవలం రాజకీయ సభ కాదు. అది ప్రజల సభ. తెలంగాణ వాదుల సభ. తెలంగాణ ఉద్యమకారుల సభ. త్యాగాల వీరులైన బిఆర్‌ఎస్‌ అభిమానులసభ. తెలంగాణ తెచ్చిన ధీరుల సభ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికుల సభ. తెలంగాణ తలరాత మార్చిన బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ. తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేసిన పోరాట యోధుడు కేసిఆర్‌ సభ.

బెంగాల్‌లో హిందువులకు రక్షణ కరవు

అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయిన హిందువులు

మైనారిటీలకు రక్షణగా వుంటానన్న మమతా బెనర్జీ

అధికారం తప్ప బాధితుల గోడుపట్టని ప్రభుత్వం

హింసకు కారణమైనవారికి అండగా వుండటం ఎంతవరకు న్యాయం?

కేంద్ర బలగాలు వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు

బెంగాల్‌లో సమన్యాయం ఎక్కడ? కేవలం మైనారిటీ న్యాయం తప్ప!!

డెస్క్‌,నేటిధాత్రి: 

హింసాత్మక రాజకీయాలకు, అరాచకానికి మారుపేరుగా పశ్చిమబెంగాల్‌ తయారైంది. వక్ఫ్‌బిల్లును పార్లమెంట్‌ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఏప్రిల్‌ 8నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ముర్షిరాబాద్‌ జిల్లాలో ముస్లిం మెజారిటీలుగా వున్న షం షేర్‌గంజ్‌, సుతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. వాహనాలు, దుకాణాలు, ఇళ్లను యదేచ్ఛగా తగులబెట్టారు. రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. హిందువుల ఇళ్లపై యదేచ్ఛగా దాడులు జరగడంతో సుమారు 300 కుటుంబాలు పొరుగునే వున్న మాల్డా ప్రాంతానికి పారిపోయాయి. వీరంతా బైష్ణవ్‌నగర్‌లోని పర్లాల్‌పూర్‌ హైస్కూల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ధూలియాన్‌ ప్రాంతానికి చెందిన చాలామంది భాగీరథి నదిలో పడవల ద్వారా బైష్ణవ్‌నగర్‌కుపారిపోయారు. అల్లరిమూకలు తాగునీటి ట్యాంకుల్లో విషం కలపడమే కాకుండా, పురుషులను చితకబాది, మహిళలను వేధింపులకు గురిచేయడమే కాదు తక్షణమే ఈ ప్రాంతం నుంచి వెళ్లి పోవాలని డిమాండ్‌ చేయడంతో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోవాల్సి వచ్చిందని ధూలియాన్‌ ప్రాంత వాసులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరికొందరు పక్క రాష్ట్రమైన రaార్ఖండ్‌కు పారిపోయారు. షంషేర్‌గంజ్‌లో ఒక కుటుంబానికి చెందిన హరగోవింద్‌ దాస్‌ అనే 72ఏళ్ల వృద్ధుడు, ఆయన కుమారుడు చరణ్‌దాస్‌ (40)లను బయటకు ఈడ్చుకువచ్చి హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. వీరి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ దారుణంపై పోలీసులు ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడంగమనార్హం. అల్లర్లకు పాల్పడుతున్న మూకలపై పోలీసులు కాల్పులు జరిపిన ప్పుడు ఇజాజ్‌ అహ్మద్‌ (25) అనే యువకుడు గాయపడ్డట్టు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ (శాంతిభద్రతలు) జావెత్‌ షమీమ్‌ తెలిపారు. ఇతడిని ఆసుపత్రి లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

పార్లమెంట్‌ ఆమోదం పొందిన వక్ఫ్‌బిల్లుపై రాష్ట్రపతి ఏప్రిల్‌ 5న సంతకం చేసిన తర్వాత, నాలుగు రోజులకు అంటే 8వ తేదీన ముర్షిరాబాద్‌లో అల్లర్లు జరిగినా పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు. తర్వాత ఏప్రిల్‌ 11న ఒక ప్రదర్శన సందర్భంగా అల్లర్లు ప్రారంభమై విధ్వంసకాండ చెలరేగింది. హిందువుల ఆస్తులు యదేచ్ఛగా లూటీలు చేయడమే కాకుండా వారి దుకాణాలను, వాహనాలను అల్లరిమూకలు తగులబెట్టాయి. గత శనివారం కలకత్తా హైకోర్టు కేంద్రబలగాలనురంగంలోకి దించాలని ఆదేశించడంతో, వాటి ప్రవేశం తర్వాత అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ విధ్వంసకాండ నేపథ్యంలో కోల్‌కతాలో బీజేపీ నేతృత్వంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. మమతా బెనర్జీ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. హిందువులపై దాడులు, వారి ఆస్తుల లూటీలు జరిగాయని ఈ విధ్వంసకాండపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీతో విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుసుకాంత ముజందార్‌ డిమాండ్‌ చేశారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘‘బంగ్లాదేశ్‌ నుంచి అల్లరి మూకలను కావాలనే ఇక్కడికి రప్పించి బీజేపీ ఈ విధ్వంసరచన చేసిందని, ఈ అల్లరి మూకలు తిరిగి బంగ్లాదేశ్‌కు పారిపోయాయంటూ’’ ఆరోపించింది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైంది కాకుండా, ఈవిధంగా ఆరోపించడం తృణమూల్‌ కాంగ్రెస్‌కే చెల్లింది. ఇదిలావుండగా పరూలియా బీజేపీ ఎం.పి. జ్యోతిర్మయి సింగ్‌ మహతో కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. ఇందులో ఆమె పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని అమల్లోకి తేవాలని కోరారు. సీనియర్‌ బీజేపీ నేత సుబేందు అధికారి మాట్లాడుతూ తృణ మూల్‌ కాంగ్రెస్‌ పాలనలో రాడికల్‌ మూకలు రెచ్చిపోతున్నాయని, ముర్షిరాబాద్‌ జిల్లా ఇప్పుడు వీరి హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అనుసరిస్తున్న మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు హిందువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముర్షిదాబాద్‌ జిల్లాలో ప్రాణా లు అరచేత పట్టుకొని పారిపోతున్న ప్రజల ఫోటోలను ఆయన ప్రదర్శించారు. అయితే బీజేపీ చూపిస్తున్నవన్నీ ఫేక్‌ ఫోటోలంటూ తృణమూల్‌ రాజ్యసభ ఎం.పి. సాగర్‌ ఘోష్‌ ఆరోపించారు.

అరాచకానికి కూడా ఒక హద్దుంటుంది. మమతా బెనర్జీ పాలనలో ఆ హద్దులు కూడా చెరిపేసినట్టు వర్తమాన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్‌ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత నాలుగు రోజులకు అల్లర్లు చెలరేగాయంటే దీని అర్థం ఏమిటి? ఇప్పటికే సర్వభ్రష్ఠ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన మమతాబెనర్జీ ఇంకా తన పదవీకాంక్షకోసం మరెంతమంది హిందువుల ఉసుర్లు తీసుకుంటారనేది ప్రశ్న. హింసకు పాల్పడిన మూకలను అదుపులోకి తీసుకురాక పోగా, వక్ఫ్‌బిల్లును రాష్ట్రంలో అమలు చేయనని, మైనారిటీలకు రక్షణగా వుంటానని ప్రకటించా రంటే మమతా బెనర్జీని ఏమనుకోవాలి? ఒకపక్క వందలాది హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతపట్టుకొని స్వస్థలాలను వదిలేసి పారిపోతే, బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ఏకంగా అల్లర్లకు కారకులైనవారికి అండగా నిలవడమేంటి? రాజకీయంగా అభిప్రాయ భేదాలుం టే రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప, హిందువులు బలిపశువులవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ వైఖరి ఖండనార్హం. కేంద్ర బలగాలు వస్తే తప్ప అల్లర్లు సర్దుమణగలేదంటే, అల్లరి మూకలకు ప్రభుత్వం అండగా వున్నట్టేగా అర్థం? ఓట్లకోసం, అధికారం కోసం అమాయక హిందువులను బలి తీసుకోవడమేంటి? ఇంత జరిగినా బాధితులకు అండగా వుంటామన్న ఒక్క ప్రకటన కూడా మమతా బెనర్జీ నోటివెంట రాకపోవడం ఎంత విచిత్రం? పశ్చిమ బెంగాల్‌లో అసలు ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నది? ఇటీవల యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘వందమంది ముస్లింల మధ్య 50మంది హిందువులు బతకగలరా?’’ అని ప్రశ్నించారు. కుహనా సెక్యులర్‌ వాదులు దీనిపై నానా రాద్ధాంతం చేశారు. మరిప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నదేంటి? దీనిపై ఒక్కరూ నోరు మెదపరు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఎందుకంటే బాధితులు హిందువులు కదా! అదే ఏ ఒక్క ముస్లిం బాధపడి నా ప్రపంచమంతా కొట్టుకుపోయినంత రాద్ధాంతం చేస్తారు! అందరూ మనుషులే! అందరి ప్రా ణాలు సమానమే. దేశంలో ఎక్కడాలేని గొడవలు కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే…అది కూడా బంగ్లాదేశ్‌ సరిహద్దులో వున్న ముర్షిరాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వ్యవసాయ బిల్లుల విషయంలో కేవలం పంజాబ్‌, హర్యానాలకు చెందిన ‘రైతులమని చెప్పుకుంటున్నవారు’ ఆందోళనకు దిగారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా వీటిపై గొడవ జరగలేదు. ఎందుకంటే రైతులకు ఈ చట్టాలవల్ల కలిగే ప్రయోజనం తెలుసు. కానీ పంజాబ్‌, హర్యానాల్లోని దళారీలు ఇంతటి అల్లర్లకు బాధ్యులు. చివరకు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంది. కానీ నష్టపోయింది రైతులు, ప్రయోజనం పొందింది దళారీలు. ఇప్పుడు పశ్చి మ బెంగాల్‌లో అల్లర్లు, విధ్వంసకాండకు పాల్పడినవారికి పూర్తి రక్షణ, బుజ్జగింపులు కాగా హిందువులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు! ఈ ప్రాంతాల్లో స్వస్థలాల్లోనే హిందువులు బతకలేని పరిస్థితినెలకొంటే, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఇటీవల బయల్పడిన విభేదాల నేపథ్యంలో, పార్టీపై మమతా బెనర్జీ క్ర మంగా పట్టు కోల్పోతున్నారన్న అనుమానాలు పొడచూపాయి. బీజేపీ క్రమంగా బలపడుతూ, తృణమూల్‌పై ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తున్న తరుణంలో, ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అ లర్లను సృష్టించారా? అన్నది తేలాలి. మెజారిటీ ప్రజల మనోవేదన, ఆక్రందనల నేపథ్యంలో వ చ్చే అధికారం ఆనందాన్నిస్తుందా? ప్రస్తుతం బెంగాల్‌ వాతావరణం చూస్తుంటే, ఒకప్పుడు కశ్మీర్‌ లో హిందువులు అనుభవించిన దుర్భర పరిస్థితులు గుర్తొస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు పరాకాష్టకు చేరి, దాల్చిన వికృతరూపానికి బెంగాల్‌ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

సదస్సుల ఆర్భాటం కాంగ్రెస్‌ను గట్టెక్కించదు

గుజరాత్‌ నమూనాకు దీటైన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అందిస్తుందా?

బలమైన నాయకులను పార్టీలో వుండనివ్వరు

బలంలేని అనామక నాయకులతో ప్రయోజనం శూన్యం

యువతరం రావాలంటే వృద్ధ నాయకుల సంతానమే దిక్కు

ఓటమి శిథిలాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌

ప్రాంతీయ పార్టీలకు తోకగా మారిన దైన్యం

అంపశయ్య నుంచి అధికారం పీఠానికి ఎదగడమంటే భగీరథ యత్నమే

నిజమైన సెక్యులర్‌గా మారకపోతే పార్టీ మనుగడ కష్టం

కేవలం ఒక్క వర్గం ఓట్లు అధికారాన్ని కట్టబెట్టవు

మైనారిటీ భజన మారకపోతే పార్టీ పతనం తప్ప ఉత్థానం వుండదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

1961లో గుజరాత్‌లో భావ్‌నగర్‌లో కాంగ్రెస్‌ జాతీయ సదస్సు జరిగింది. మళ్లీ 64 సంవత్సరాల తర్వాత రెండోసారి అహమ్మదాబాద్‌లో ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహిం చింది. 1961 సదస్సు తర్వాత గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో అధికారంలో చాలా సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగింది. ఇన్నేళ్ల తర్వాత నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన గుజరాత్‌ మోడల్‌ను సవాలు చేయడమే ఇప్పుడు అహ్మదాబాద్‌లో జాతీయ సదస్సు నినిర్వహణ ప్రధాన లక్ష్యం. మరిప్పుడు జాతీయ సదస్సును నిర్వహించేందుకు గుజరాత్‌నే ఎందు కు ఎంచుకుంది? ఇది పార్టీకి ఏమేరకు ప్రయోజనం? అనేవి ప్రధానంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. తొలిరోజు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మెమోరియల్‌ హాలులో, పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగింది. రెండోరోజు మాత్రం సబర్మతి ఆశ్రమం వద్ద జరిగిన సదస్సుకు ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గన్నారు.

గుజరాత్‌ను ఎంచుకోవడానికి కారణాలు

మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించి వందో ఏడు కావడం ఒక కారణం కాగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి రెండో కారణం. ముఖ్యంగా ఈ రెండూ గుజరాత్‌కు సంబంధించినవి. ఇప్పటివరకు బీజేపీ సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌కే తన విధానాల్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడైన పటేల్‌ వారసత్వాన్ని తాము అనుసరిస్తున్నామని తెలియజెప్పడమే సబర్మతి ఆశ్రమం, సర్దార్‌ పటేల్‌ మెమోరియల్‌ను ఎంచుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సు ద్వారా 2027 నాటికి గుజరాత్‌లో అనుసరించబోతున్న వ్యూహాన్నికాంగ్రెస్‌ స్పష్టం చేసింది. గుజరాత్‌నుంచి ఒక కొత్త రాజకీయ సంస్కృతి ప్రారంభమైతే దాని ప్రభావం దేశవ్యాప్తంగా తప్పనిసరిగా వుండితీరుతుందనేనది కాంగ్రెస్‌ నిశ్చితాభిప్రాయం. ఇప్పటివరకు రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన బీజేపీ నమూనాను పెకలించి వేయగలిగితే అప్పుడు గుజరాత్‌ పై కాంగ్రెస్‌ అధిష్టానం ఆసక్తితో వున్నదని, ఇక్కడ పార్టీ ఎంతో చురుగ్గా పనిచేస్తున్నదన్న సందేశం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులకు వెళుతుందని పార్టీ అధినాయత్వం భావిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా గుజరాత్‌ను భాజపా ఏలుతున్న నేపథ్యంలో, ఇక్కడ కాంగ్రెస్‌ ఉనికిని ఒక ‘జోక్‌’గా తీసుకునేవారి మైడ్‌సెట్‌ను మార్చాలన్నది కూడా కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశం. ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాలి. సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన 2002 సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ సదస్సులు ఢల్లీికే పరిమితమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏటావివిధ రాష్ట్రాల్లో పార్టీ సదస్సులు జరిగేవి. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అత్యంత బలంగా వున్న గుజరాత్‌ రాష్ట్రం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 

గుజరాత్‌ మోడల్‌ ప్రాధాన్యత ఏమిటి?

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తాను గుజరాత్‌ ముఖ్యమంత్రి వున్నప్పుడు అభివృద్ధి విషయంలో ‘గుజరాత్‌ నమూనా’ను ప్రవేశపెట్టారు. గుజరాత్‌ నమూనాను ఒక రాజకీయ అస్త్రంగా మలచుకొని 2014లో ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు ఆధారం గుజరాత్‌ నమూనా మాత్రమే! ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ రాజకీయాలు గుజరాత్‌ నమూనా చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి వున్నప్పుడు వై బ్రెంట్‌ గుజరాత్‌ పేరుతో, పెట్టుబడుల ఆకర్షణ, రవాణారంగ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. ‘అచ్ఛేదిన్‌ ఆనేవాలే హై’ అనే ని నాదంతో 2014లో బీజేపీ ఎన్నికల బరిలో దూసుకెళ్లడానికి ఈ వైబ్రెంట్‌ గుజరాత్‌ గొప్ప ఆధా రంగా నిలిచింది. ముఖ్యంగా నరేంద్రమోదీ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమన్న ఇమేజ్‌ను సృ ష్టించుకోవడంతోపాటు, చేపట్టిన అభివృద్ధి పనుల్లో విజయం సాధించడం 2014, 2019 మరి యు 2024 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా అధికారానికి రావడానికి గొప్ప నిచ్చెనగా ఉపయోగ పడిరది. గుజరాత్‌లో ‘సెజ్‌’లను ప్రోత్సహించడం, పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అందరికీ తెలిసేలా చేయడం మోదీ సాధించిన విజయాలు. ఇవే తర్వాతి కాలంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మరియు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ కార్యక్రమాల రూపంలో కేంద్ర స్థాయిలో అమలు చేయడానికి దోహదం చేశాయి. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను విజయవంతంగా అమలు చేయ డం ద్వారా, కాంగ్రెస్‌కు అభివృద్ధి విజన్‌ లేదంటూ బీజేపీ డిఫెన్స్‌లో పడేసింది. 2002 తర్వాత గుజరాత్‌లో ఇప్పటివరకు ఏవిధమైన అల్లర్లు జరగలేదు. ఇందుకోసం రాష్ట్రంలో అనుసరించిన పద్ధతినే జాతీయ స్థాయిలో కూడా అమలుచేస్తున్నారు. ఈవిధంగా గుజరాత్‌ నమూనా దేశ ప్రజలను సమ్మోహితులను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. మరి తానుకూడా అంతటి స్థాయి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేస్తానని దేశ ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడిరది. దీన్ని మరే ఇతర రాష్ట్రం నుంచైనా చేపట్టవచ్చు. కాకపోతే బీజేపీ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి కనుక వాటిని దెబ్బతీయాలంటే తన ప్రయత్నాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఇప్పుడు కాంగ్రెస్‌ సదస్సు రూపంలో చేసింది ఇదే.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పరిస్థితేంటి?

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. 1985లో కాంగ్రెస్‌ 149 సీట్లలో గెలిచి రాష్ట్రాన్ని పాలించింది. అదే 2022 నాటికి ఇక్కడ బీజేపీ ఏకంగా 156 సీట్లు గెలిస్తే, కాంగ్రెస్‌ కేవలం17 స్థానాలకే పరిమితమైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారి గుజరాత్‌లో పోటీచేసి 13% కాంగ్రెస్‌ ఓట్లకు గండికొట్టింది. ఇక 2022 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌నుంచి వలసలు మొదల య్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ బలం 12కు కుంచించుకుపోయింది. ఇదే స మయంలో బీజేపీ సీట్లు 161కి పెరిగాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే రా ష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ సీట్లలో బీజేపీ 25 గెలుచుకోగా, 61.86% ఓట్లు నమోదయ్యా యి. ఇక అసెంబ్లీ ఎన్నికల గుణపాఠం నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి పోటీచేసి నా ఈ రెండిరటికి కలిసి వచ్చిన ఓట్లశాతం 31.24%. గెలుచుకుంది కేవలం ఒక్క సీటు మాత్రమే. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక అనుకూలాంశాన్ని గుర్తించాలి. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, 2024లోక్‌సభ ఎన్నికల్లో 20 అసెంబ్లీ సెగ్మంట్లలో ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకోవడం విశేషం. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో తన ఆధీనంలో వున్న 13 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది. అదే బీజేపీ 68 మున్సిపాలిటీల్లో 60 గెలుచుకొని తన సత్తా చాటింది. 

బీజేపీ హవాను కాంగ్రెస్‌ అడ్డుకోగలదా?

మార్చి 7వ తేదీన పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘గుజరాత్‌లో రెండు రకాల నాయకులున్నారు. కాంగ్రెస్‌ను తమ హృదయాల్లో ఇప్పటికీ ప్రతిష్టించుకొన్న ప్రజలతో మమేకమయ్యే నాయకులు ఒకరకం కాగా, పార్టీలోనే వుంటూ, బీజేపీతో అంటకాగే రకం నాయకులు మరికొందరు. ఇటువంటివారిని తొలగించి మనం ఒక ఉదాహరణగా నిలవాలి’’. బాగానేవుంది కానీ ఈ ప్రక్షాళన సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి ఆక్సిజన్‌ మాదిరిగా వున్నది ముస్లింలు, గిరిజనులు. మిగిలిన గుజరాతీలను ఆకర్షించాలంటే అభివృద్ధి పేరుతో మాత్రమే సాధ్యం. ఇప్పటికే గుజరాత్‌ ఒక నమూనా రాష్ట్రంగా నిలిచింది కాబట్టి, చిన్న సమస్యలేమైనా వుంటే వాటిని పట్టుకొని ముందుకెళ్లాల్సి వుంటుంది. గత మూడు దశాబ్దాలుగా భాజపా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతోంది. అందువల్ల ప్రస్తుత తరానికి కాంగ్రెస్‌ గురించి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ కొత్తతరం యువతను, మహిళలను తనవైపు తిప్పుకుంటే తప్ప ఫలితం వుండదు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయినిస్తోంది కనుక, అంతకుమించిన అద్భుతం తాను సృష్టించగలనని కాంగ్రెస్‌ ప్రజల్లో నమ్మ కం కలిగించగలగాలి. గుజరాత్‌ అసెంబ్లీకి మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపల కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థాయిల్లోని నాయకత్వంలో ఉత్తేజం నింపి ఎంతో శ్రమిస్తే తప్ప ఫలితం వుండబోదు. మరి ఇది సాధ్యం కావాలంటే పార్టీకి సుశిక్షతమైన కార్యకర్తలతో కూడిన సైన్యం, మంచి కమాండర్‌ అవసరం. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరూ పార్టీకి లేరు. అన్నింటికీ మించి పార్టీకి ఆర్థిక వనరుల కొరత పెద్ద స మస్యగా మారింది.

కాంగ్రెస్‌కు తక్షణం కావలసినవి

బీజేపీ మాదిరిగా సంస్థాగతంగా బలోపేతం కావడం. ‘ఎన్నికల మిషన్‌’ మాదిరిగా పనిచేస్తున్న బీజేపీ స్థాయిలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలను ఏర్పరచుకొని, తన సిద్ధాంతా లను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలగాలి. ఇందుకోసం విశ్వసనీయమైన నాయకులు, కార్యకర్తలు అవసరం. ప్రస్తుతం పార్టీకి ఈ రెండిరటి కొరత తీవ్రంగా వుంది. బీజేపీతో యుద్ధా నికి ఇంతటి బలీయమైన ఆధారం కావాలి. ఈ హంగు లేదన్న సంగతి రాహుల్‌గాంధీకి తెలి యంది కాదు. అందువల్ల కేవలం సదస్సుల నిర్వహణ ద్వారా బలమైన మోదీని కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేదు. బీజేపీ తాను అనుకున్నవాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగలుగుతోంది. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇంతటి బలమైన క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. అయితే సదస్సువల్ల అస లు ప్రయోజనం వుండదా? అంటే ఎంతోకొంత వుండితీరుతుంది. కానీ అది ఎంతమాత్రం సరిపోదు. 

రాహుల్‌ శపథం

బీజేపీ అహంకారాన్ని తప్పకుండా దెబ్బకొడతామని రాహుల్‌ గాంధీ అన్నారు. కానీ ప్రస్తుతం వున్న కంగాళీ నాయకులతో ఇది సాధ్యమా? ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రాహుల అభిమతం. కాంగ్రెస్‌లో పాతుకుపోయిన వృద్ధ నాయకులు ఈ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డుకొట్టక మానరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్‌ సంస్కృతి కదా! ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వున్న మల్లికార్జున ఖర్గే 2022, అక్టోబర్‌ 26న పార్టీ అధ్యక్షుడయ్యారు. ఇప్పటికే ఆయన వృద్ధుడైపోయారు. అందరినీ ముందుకు పొమ్మనగలరు కానీ, తాను కదలలేరు. బీజేపీలో మాదిరిగా పార్టీ అధ్యక్షుడు ఇంత కాలం మాత్రమే పదవిలో కొనసాగాలన్న నియమం లేదు. నెహ్రూ కుటుంబం అభీష్టం మేరకే ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఈ వ్యవహారశైలి బాగా తెలిసినవాడు కనుకనే ఖర్గే, తన తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు రాహుల్‌ చేపట్టాలని కోరుతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన పేరుకే అధ్యక్షుడు. నెహ్రూ కుటుంబానిదే అంతా అధికారం! ఆయన నిర్ణయాలు తీసుకునేదేం లేదు! సోనియా చెప్పింది చేయాలంతే. రాహుల్‌ పేరు చెబితేనే పదవిలో ఉన్నంతకాలం కొంతమేర ప్రశాంతంగా వుండగలరు! ఇదిలావుండగా ప్రియాంకా వాద్రాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశం వుందంటున్నారు. కానీ ఈ సదస్సు సమయానికి ఆమె అమెరికా వెళ్లిపోయారు. ముఖ్య సమయాల్లో రాహుల్‌ లేదా ప్రి యాంక లేదా ఇద్దరూ వుండరు. కాంగ్రెస్‌ పార్టీ ‘మొదటి కుటుంబంలోనే’ మూడు గ్రూపులలున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఒకటి సోనియా, రెండు రాహుల్‌, మూడు ప్రియాంక. ఇ టువంటి అసంబద్ధ నాయకత్వాన్ని నమ్ముకొని విశ్వసనీయంగా కేడర్‌ పనిచేయడం కష్టమే. అయితే దేశవ్యాప్తంగా జిల్లా, బ్లాక్‌ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలన్నది అగ్ర నాయకత్వం ఉద్దే శంగా కనిపిస్తోంది. ఇది నిజం కావాలంటే ముందు అగ్రనాయత్వం వ్యవహారశైలిలో మార్పు రావాలి.

వరుస పరాజయాలు

ఇటీవలి సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ఏ ఎన్నికల్లో విజయం సాధించడంలేదు. వచ్చే బిహార్‌ ఎన్నికల్లోమహా ఘట్‌బంధన్‌పై కాంగ్రెస్‌ ఆశపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇందెంత నిప్పచ్చరంగా వుంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్‌ను దేశంలోని ఏ ప్రాంతీయపార్టీ లెక్కచేయడం లేదు. ఒకప్పుడు వీరిని శాసించిన కాంగ్రెస్‌ ఇప్పుడు వాటికి తోకమాదిరిగా వుండాల్సిన దుస్థితి! విరిగిన కత్తులు, సొట్టపోయిన డాళ్లు, చక్రాలు ఊడిన రధాలతో, అన్ని హంగులూ వున్న శత్రువుతో పోరాడాలి? ఇది సాధ్యమయ్యేదేనా? ‘కురువృద్ధులతో’ నిండిన కాంగ్రెస్‌ పార్టీని యువత ఎంతవర కు విశ్వసిస్తారనేది కూడా ప్రశ్నే! రాహుల్‌ను యువ నాయకుడిగా ముందుకు తెద్దామన్నా ఆయన ఎక్కడ కాలుపెట్టినా కలిసిరావడంలేదు! ఆయన ప్రచారానికి వస్తారంటే, పార్టీలో గెలిచే అవకాశాలున్న నాయకులకు గుండెదడ మొదలైనట్టే! 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ వ రుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న సత్యాన్ని గుర్తించాలి.

కొత్త ఇన్‌చార్జ్‌లు

 కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శులను మరో తొమ్మిది రాష్ట్రాల కు ఇన్‌చార్జ్‌లను నియమించింది. మరో ఆరుగురు నాయకులకు ఉద్వాసన పలికింది. ఛత్తీస్‌గఢ్‌మాజీ ముఖ్యమం త్రి భూపేష్‌ భాగల్‌కు ఏ.ఐ.సి.సి. సెక్రటేరియట్‌లో స్థానం కల్పించి, పంజాబ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు. రాజ్యసభ ఎం.పి. సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ను ప్రధానకార్యదర్శి గా చేసి, జమ్ము`కశ్మీర్‌, లద్దాఖ్‌లకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. 

రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా నియమితులైనవారిలో రాజ్యసభ ఎం.పి. రజనీపాటిల్‌ (హిమాచల్‌ ప్రదే శ్‌, చండీగఢ్‌), బి.కె. హరిప్రసాద్‌ (హర్యానా), హరీష్‌ చౌదరి (మధ్యప్రదేశ్‌), గిరీష్‌ చోడంక్‌ (తమిళనాడు, పుదుచ్చేరి), అజయ్‌కుమార్‌ లల్లూ (ఒడిషా), కె.రాజు (రaార్ఖండ్‌), మీనాక్షి నటరాజన్‌ (తెలంగాణ), లోక్‌సభ ఎం.పి. సప్తగిరి శంకర్‌ ఉలక (మణిపూర్‌, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌), కృష్ణ అల్లవారు (బిహార్‌) వున్నారు. కొత్తగా నియమితులైనవారు రాహుల్‌ గాంధీ, ప్రియాం కా వాద్రాలకు సన్నిహితులు కావడం గమనార్హం. 

ఎంతగా చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఇప్పుడు పార్టీకి చాలా అవసరం. కార్యకర్తల్లో విశ్వాసం పాదుగొల్పే నాయకులు కాంగ్రెస్‌లో కరవయ్యారు. కాస్త గట్టి నాయకుడని అనుకున్న వారిన పొగబెట్టి బైటికి పంపించే సంస్కృతి జీర్ణించుకున్న కాంగ్రెస్‌కు అనామక నాయకులే విశ్వాసంగా పడివుంటారు. బలమైన నాయకుడెవరూ కాంగ్రెస్‌లో ఇమడలేరు. ఇప్పుడు శశిధరూర్‌, కర్నాటకలో డి.కె. శివకుమార్‌ల పరిస్థితి ఇదే! ఇటువంటి సంస్కృతి వున్న పార్టీ ఏవిధంగా బ లోపేతం కాగలదు?

తెగ ముదిరిపోతున్న ర్యాంకుల పిచ్చి

విద్యార్థులపై విపరీత ఒత్తిడి

క్రీడలు, ఇతర కృత్యాలకు ప్రాధాన్యం శూన్యం

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌….ఈ రెండే కోర్సులా?

ఐదు దశాబ్దాల క్రితం విద్యాప్రమాణాలు ఇప్పుడేవీ?

విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం శూన్యం

మార్కులు, ర్యాంకులే విద్యార్థుల లక్ష్యాలు

ఆడుకునే వయసులో ఏసీ రూమ్‌లలో చదివించినా వృధా

భావి తరాన్ని నిర్వీర్యం చేస్తున్న ‘ర్యాంకుల’ విద్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో విద్యావ్యవస్థ పనితీరు ఆశించినంత గొప్పగా యేమీ లేదనే చెప్పాలి. గ్రామాలు, పట్టణాల్లో తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైనా భరించి తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడానికే ఉత్సాహం చూపుతున్నారు తప్ప, ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపడంలేదు. ప్రాథమిక వి ద్య, పాఠశాల విద్య, కళాశాల విద్యకోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నా పిల్లల చదువు నిప్పచ్చరంగా కొనసాగడానికి ప్రధాన కారణం విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణమైనలోపాలు. క్వాలిఫికేషన్లున్నా చాలామంది టీచర్లకు వర్తమాన కాలానికి అనుగుణమైన నైపుణ్యాలు లేక పోవడం, కొన్ని స్కూళ్లలో విద్యార్థులే లేకపోవడం, సమయపాలన విషయంలో నిర్లక్ష్యం, అన్నింటికీ మించి మౌలిక సదుపాయాలు ఎక్కువ స్కూళ్లలో మృగ్యం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పాలి. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లను పోల్చుకొని పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి తల్లక్రిందులై, ప్రభుత్వ స్కూళ్లే ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకోవాల్సిన దుస్థితి! ఫలితంగా ప్రవేశాలకోసం పోరాటం, ర్యాంకుల ఆరాటం పిచ్చి ముదిరి వెర్రి స్థాయికి చేరింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతే లేకుండా పోయింది. ఎంతసేపూ చదువు, ర్యాంకులు త ప్ప ఎవరూ దేన్నీ పట్టించుకోవడంలేదు! ఇది చిన్న పిల్లల మెదళ్లపై అపరిమితమైన ఒత్తిడికి కారణమవుతోంది. వారి వయసుకు తగిన ఆటలు, పాటలు వంటి రిక్రియేషన్‌ గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఎంతసేపూ ఇంజినీరింగ్‌, డాక్టర్‌ టార్గెట్లు తప్ప వేరేవాటికి పిల్లల మెదళ్లలో చో టు లేదు. ఆవిధంగా నూరిపోస్తున్నారు మరి! ఆరేడు దశాబ్దాల క్రితం అన్ని సబ్జెక్టుల్లో 40% మార్కులు సాధించిన విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో తనకు తెలిసినంతవరకు స్పష్టమైన జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు. ఇక 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యత వుండేది. ఇంటర్‌ స్కూల్‌, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కోకో వంటి పోటీలు నిర్వహించేవారు. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోయాయి. 95% మార్కులు సాధించిన విద్యార్థి నాటి 40% విద్యార్థి జ్ఞానంతో సమానస్థాయి కలిగివుండటంలేదు. ఈవిధంగా విద్యార్థులను గదుల్లో బంధించి స్పెషల్‌ క్లా సులు, చదువు తప్ప మరే ఇతర వ్యాపకం లేకుండా చేస్తుండటంతో వారిలో జీవనశైలి, క్రీడలు, కళలు వంటి రంగాల్లో నైపుణ్యం దాదాపు సున్నాగా వుంటోంది. ఇది చాలా ప్రమాదకరం. 144 కోట్లమంది ప్రజల్లో క్రీడల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం ప్రదర్శించేవారు లేకపోవడానికి ప్రస్తుత విద్యావ్యవస్థే కారణం. సదుపాయాలు తక్కువ వున్నా ప్రైవేటు విద్యకే తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం, ప్రభుత్వ విద్యావ్యవస్థ దారుణ వైఫల్యం. ఫలితంగా విద్యకోసం కొన్ని వందలు, వేలకోట్లు ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నా అది బూడిదలో పోసిన పన్నీరు చందంగా వుంటోంది తప్ప ఫలితం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేనివే అధికం. ఫర్నీచర్‌, తదితర సదుపాయాలు అందుబాటులో వుండవు. దీనికి తోడు చాలామంది టీచర్లు ఎంతసేపూ యూనియన్‌ కార్యకలాపాలు, తమ సొంత వ్యాపకాలు చూసుకోవడంలోనే తల మునకలుగా వుండటం తప్ప, విద్యపై దృష్టిపెట్టడంలేదు. అదీకాకుండా టీచర్లను ప్రభుత్వం వివిధ కా ర్యకలాపాలకు వినియోగించుకోవడం కూడా మరో కారణం. పాఠశాల విద్యలో ప్రధాన లోపం డిటైన్‌ సిస్టమ్‌ లేకపోవడం. దీనివల్ల స్థాయికి తగిన విద్యానైపుణ్యాలు సాధించకుండానే విద్యార్థులు పదోతరగతి వరకు చేరుకుంటున్నారు. ఆ స్థితిలో వీరిని ర్యాంకులకోసం రాచిరంపాన పెట్టి నా ఫలితం వుండదు. డ్రాపౌట్లు పెరగడం తప్ప! ఏదీ సులభంగా రాదు, కష్టపడి సాధించాలన్న సత్యాన్ని పిల్లలకు చిన్నతనంలోనే మనసులో నాటడం వల్ల, ఆ స్థాయినుంచే వారు కష్టపడటం నేర్చుకుంటారు. క్రీడల్లో ఉత్సాహం చూపేవారిని ఆ రంగంలో తగిన శిక్షణ ఇస్తే వారు రాణింపుకు వస్తారు. అందరూ ఒకే రంగంలో రాణించడం సాధ్యంకాదు. నేటి విద్య కేవలం ఇంజినీర్లు, డాక్టర్లను తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఆవిధంగా నిర్లక్ష్యానికి గురైంది క్రీడా రంగం. దీనిపై ప్రభుత్వం సత్వరం దృష్టి పెట్టాలి. అసలు ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోతుండటానికి కారణమేంటని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది గణాంకాల పరిశీలన అవసరం. 

విద్యార్థుల కొరత

2011 జనగణన ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 66.46%. జాతీయ సగటు 74% శాతం తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలోని 1213 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేదు. ఈ స్కూళ్లలో దాదాపు 1300 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఏకోపాధ్యాయ స్కూళ్లు, ఇద్దరు టీచర్లు పనిచేసే పాఠశాలలు కూడా వున్నాయి. ప్రవేశాలు లేకపోవడంతో ఈ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులను సమీప పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపాల్సి వచ్చింది. అంతేకాదు మొత్తం 30,023 ప్రభుత్వ స్కూళ్లలో 13,364 పాఠశాలల్లో 50% కంటే తక్కువే ప్రవేశాలు జరగడం ప్రభుత్వ విద్య దయనీయ స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో 5821 స్కూళ్లలో సింగిల్‌ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వ అధికా ర్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు 2024`25కు సమర్పించిన నివేదికలో వెల్లడిరచారు. అంతేకాదు రాష్ట్రంలో 9.44% బాలుర టాయిలెట్లు, 5.86% బాలికల టాయ్‌లెట్లు, 15.45 సీడబ్ల్యుఎస్‌ఎన్‌ టాయ్‌లెట్ల నిర్మాణం పెండిరగ్‌లో వున్నాయి. 18.19% పాఠశాలలకు సమగ్ర ప్రయోగశాలల సదుపాయం లేదు. 11.7% స్కూళ్ల ఐ.సి.టి. ల్యాబ్‌లు లేవు, 71% స్కూళ్లకు స్కిల్‌ఎడ్యుకేషన్‌ ల్యాబ్‌లు లేకుండానే పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024`25 విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద రూ.1907 కోట్లను ఖర్చు చేసేందుకు ఆమోదం తెలుపగా, ఇందులో కేంద్రం వాటా రూ.1148 కోట్లు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వుంటుంది.

మౌలిక సదుపాయాల లేమి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఘోరమైన నిర్లక్ష్యానికి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (యుడిస్‌) తన నివేదికలో వెల్లడిరచింది. రాష్ట్రంలోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో 25,217 స్కూళ్లకు తాగునీటి సదుపాయం, 15,986 స్కూళ్లలో బాలికల టాయ్‌లెట్లు, 8,888 స్కూళ్లలో తగినంత ఫర్నీంచర్‌ వున్నదని నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 5వేల పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. అదేవిధంగా 22వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్‌ సౌకర్యం లేదు. 26,095 స్కూళ్లకు విద్యుత్‌ సదుపాయం వుండగా, 20,574 పాఠశాలలు (అంటే రెండిరట మూడువంతులు) క్రీడా మైదానాలను కలిగివున్నాయి. మొత్తం 30,014 స్కూళ్లలో 8,284 స్కూళ్లకు కంప్యూటర్‌ సదుపాయం వుండగా, 2,760 పాఠశాలలకు మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. ఇక వైద్య పరీక్షల విషయానికి వ స్తే కేవలం 9,726 స్కూళ్లు మాత్రమే విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించాయి. నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే`2021(ఎన్‌ఎస్‌ఎ`2) ప్రకారం జాతీయ స్థాయిలో పాఠశాలల సగటు పనితీరుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి వుండటం గమనార్హం. ఈవిషయంలో జాతీయ సగటు 37.8% కాగా, రాష్ట్ర సగటు 36.7% నమోదైంది. 

గణితం, సైన్స్‌ల్లో పూర్‌

తెలంగాణ విద్యార్థులు లాంగ్వేజెస్‌లో 100 మార్కులకు సగటున 48 మార్కులు స్కోర్‌ చేయగా,గణితంలో (32), సైన్స్‌లో (35) సాంఘికశాస్త్రంలో (34) సాధించడం ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎంత అధ్వాన్నంగా వున్నదీ వెల్లడిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, పనితీరు అధ్వాన్నంగా వున్న నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా తల్లిదండ్రులు త మ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గు చూపుతుండటం గమనార్హం. విచిత్రమే మంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే, ప్రైవేటు పాఠశాలల సంఖ్య తక్కువైనప్పటికీ వీటిల్లో చేర్పించడానికే ప్రాధాన్యతనిచ్చేవారు 51.3% వుండటం ప్రభుత్వ పాఠశాలలు తమన పనితీరును ఎంతగానో మెరుగుపరచుకోవాలన్న సత్యాన్ని వెల్లడిస్తోంది.

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న ప్రవేశాలు

2021ా22 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 43,083 పాఠశాలలుండగా వీటిల్లో 59,60,913 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిల్లోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 29,73,684 కాగా, కేవలం 13,069 ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు 29,87,229. విచిత్రమేమంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య సగంకూడా లేకపోయినప్పటికీ వీటిల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం ప్రభుత్వ స్కూళ్ల కంటే ఎక్కువ! 2022ా23 ఆర్థిక సంవత్సరంలో ‘యుడిస్‌’ ఇచ్చిన నివేదిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందన్న సంగతిని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 30,307 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 28,95,456 కాగా, 10,634 ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30,49,766. ఈవిధంగా ప్రైవేటు పాఠశాలలపట్ల పట్టణ ప్రాంతాల తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపడం కనిపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే మేడ్చెల్‌ామల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికశాతం తల్లి దండ్రులు ప్రైవేటు స్కూళ్లకు ప్రాధాన్యనిచ్చారు. ఈ జిల్లాలో 1478 ప్రైవేటు పాఠశాలలు, 558 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తుండగా 81.6% విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు.హైదరాబాద్‌ నగరంలో మొత్తం 2,867 స్కూళ్లుండగా 7,85,054 మంది విద్యార్థులు వీటిల్లో చదువుకుంటున్నారు. మళ్లీ ఇక్కడ కూడా 71.1% ప్రవేశాలతో ప్రైవేటు పాఠశాలలదే ఆధిపత్యంకొనసాగుతోంది. నగరంలోని మొత్తం 1863 ప్రైవేటు పాఠశాలల్లో 6,05,190 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, అదే 1004 ప్రభుత్వ స్కూళ్లలో 1,79,864 మంది పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు.

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాలో మెరుగు

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాల్లో మాత్రం పై గణాంకాలకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్కూళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు. భూపాలపల్లిలో మొత్తం 337 పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 33.1% మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. అదేవిధంగా ములుగులో 553 స్కూళ్లుం డగా కేవలం 20.8% విద్యార్థులు మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. 

నలిగిపోతున్న విద్యార్థులు

విషయమేంటంటే ప్రవేశాలే కుంచించుకు పోతున్నప్పుడు, క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేది ఎక్కడ? ప్రవేశాలు దండిగా వున్న ప్రైవేటు స్కూళ్లకు క్రీడలు పట్టవు. వాటికి ర్యాంకులు ముఖ్యం. ర్యాంకులు వస్తేనే వాటికి మనుగడ! విద్యా వ్యాపారంలో లాభానికి మొదటి మెట్టు ‘ర్యాంకు’. అంతేకాని క్రీడలు, కళలు ఇతర కార్యకలాపాలు కావు. ఫలితంగా విద్యార్థులు యాత్రికంగా తయారవుతు న్నారు. వీరి మెదళ్లలో ర్యాంకులు తప్ప మరే ఇతర అంశాలకు స్థానం లేదు. ప్రైవేటు పాఠశాల ల పోటీకి తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలలు కూడా ర్యాంకుల బాటనే పడుతున్నాయి. కానీ ఈ ర్యాంకుల ‘పిచ్చి’కి ఒక దిశ, దశ వుండటంలేదు. విద్యార్థి మానసిక సామర్థ్యం, అతనిలోని నైపు ణ్యాలు, ఆసక్తుల గురించి పట్టించుకునే నాధుడే లేదు. ఒక్కటే లక్ష్యం! ఇంజినీర్‌ లేదా డాక్టర్‌!! మరి దీనికి అంతం ఎక్కడ? పరిష్కారం లభించేనా?

మమత కోటలో విభేదాల బీటలు

పార్టీపై మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారా?

విభేదాలతో ఓటర్‌ ఐ.డి. సమస్య తెరమరుగు

అందరూ ఫైర్‌ బ్రాండ్‌లే…ఎవరూ తగ్గేదే లేదు

క్రమశిక్షణా సంఘం సమావేశం వాయిదా పార్టీలో అనిశ్చితికి సంకేతం

బీజేపీలో నెలకొన్న జోష్‌

వక్ఫ్‌బిల్లు ఆమోదంతో కొన్ని ముస్లిం వర్గాల్లో తృణమూల్‌ పట్ల ఆగ్రహం

తృణమూల్‌లో బట్టబయలైన విభేదాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి 

ఒక చిన్న అగ్గిపుల్ల చాలు పెద్ద దావానలం సృష్టించడానికి…అన్న సామెత తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయంలో ఇప్పుడు నిజం కావడం వర్తమాన ఆశ్చర్యకర పరిణామం. బెంగాల్‌ టైగర్‌నంటూ చెప్పుకొని, ప్రత్యర్థులను నోరెత్తనీయకుండా ఏక ఛత్రాధిపత్యంగా బెంగాల్‌ను ఏలుతున్న మమతాబెనర్జీ ఇప్పుడు బయల్పడిన తన పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా నోరెళ్లబెట్టే పరిస్థితి దా పురించడం వర్తమాన చరిత్ర! 34సంవత్సరాలు ఏకబిగిన ఉడుంపట్టుతో బెంగాల్‌ను ఏలిన వా మపక్ష కంచుకోటను కుప్పకూల్చి అధికారాన్ని చేపట్టిన మమతమ్మకు ఇప్పుడు తానొక అగ్నిపర్వ తంపై కూర్చునానన్న సంగతి స్పష్టమైవుంటుంది. ఇంతకూ జరిగిందేమంటే ఏప్రిల్‌ 4న, రాష్ట్రం లో డూప్లికేట్‌ ఓటర్‌ ఐ.డి. నెంబర్ల విషయంలో ఢల్లీిలోని ఎన్నికల కమిషన్‌కు ఒక పత్రాన్ని ఇ వ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే వెళ్లేముందు పార్టీ ఎంపీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని మరీ ఎన్నికల సంఘాన్ని కలవాలని కోరింది. అయితే పార్టీ ఎం.పి. కళ్యాణ్‌ బెనర్జీతో పాటు ఎన్నికల సంఘాన్ని కలిసే పార్టీ ఎంపీల జాబితాలో కృష్ణనగర్‌ ఎంపీ మహువా మొయిత్రా పేరు లేదు. ఆయనే నేరుగా ఎన్నికల సంఘాన్ని కలవడానికి యత్నించారు. దీంతో ఎన్నికల సంఘం ఆఫీసుకు వచ్చిన ఈమె తన పేరు జాబితాలో లేకపోవడంతో కళ్యాణ్‌ బెనర్జీని ప్రశ్నించినప్పుడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో మొయిత్రా ఆగ్రహంతో అక్కడి సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ జవాన్లను ఏకంగా బెనర్జీని అరెస్ట్‌ చేయమని కోరడం వరకు వెళ్లింది. అంతేకాదు ఆమె విలపిస్తూ, ఎంపీల వాట్సాప్‌ గ్రూపు నుంచి కూడా తప్పుకోవడం అనంతర పరిణామం.

 ‘‘నాకు నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వుంది. కాంగ్రెస్‌, బీజేపీ, లెఫ్ట్‌ పార్టీలకు వ్యతిరే కంగా పోరాడిన రాజకీయానుభవం వుంది. ఈ మహిళా ఎంపీకి కేవలం ఆదానీ, నరేంద్రమోదీ తప్ప మరో సమస్యే కనిపించదు. పార్లమెంట్‌లో తనకు ఇష్టంవచ్చినంతసేపు మాట్లాడాలి. నా కుమార్తెపై కూడా ఈమె కొన్ని కామెంట్లు చేసింది. నేను వక్ఫ్‌బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడిన దగ్గరినుంచి ఆమెకు నాపై కోపం’’ అంటూ కళ్యాణ్‌ బెనర్జీ రెచ్చిపోయారు. ఇక విలేకర్ల సమావే శంలో మాట్లాడుతూ మరో ఎంపీ సౌగత్‌రాయ్‌పై కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ‘‘నారదా స్కామ్‌లో సౌగత్‌రాయ్‌ లంచాలు తీసుకోవడం వల్లనే కదా పార్టీ పరువు గంగలో కలిసింది.ఒకళ్లపై మరొకరిని రెచ్చగొట్టడం, గోతులు తీయడమే ఆయన పని. ఒకవేళ దీదీ కోరితే రాజీనామా చేస్తాను’’ అని కళ్యాణ్‌ బెనర్జీ అన్నారు.

దీనిపై సౌగత్‌రాయ్‌ స్పందస్తూ, ‘‘మొహువా మెయిత్రా ఏడుస్తూ వెళ్లిపోయింది. బెనర్జీని పార్లమెంట్‌లో ఛీఫ్‌ విప్‌ పదవినుంచి తొలగించాలి’’ అంటూ డిమాండ్‌ చేశారు. అంతేకాదు కళ్యాణ్‌ బెనర్జీ ఒక ‘అనాగరిక వ్యక్తి’ వక్ఫ్‌బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా గ్లాసును పగులగొట్టి ఛైర్మన్‌ ప్యానల్‌పై విసిరేయడం ఎంతవరకు సమంజసమంటూ’ ఆయన ప్రశ్నిం చారు.  

ఈ బాగోతానికి చెందిన వీడియో షార్ట్స్‌ను బీజేపీ ప్రతినిధి, ఐ.టి.సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్యా ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఆ వీడియోలో క ళ్యాణ్‌జీ గట్టిగా అరుస్తున్నట్టు రికార్డయింది. దీని తర్వాత ఏప్రిల్‌ 8న సీరామ్‌పూర్‌ ఎం.పి. కళ్యాణ్‌ బెనర్జీ, బర్ద్వాన్‌`దుర్గాపూర్‌ ఎం.పి. కీర్తి అజాద్‌మధ్య మాటలయుద్ధం జరిగింది. ఈ సంద ర్భంగా కళ్యాణ్‌జీ ‘‘ఇటువంటి రాజకీయాలు నెరపినందుకే బీజేపీనుంచి గెంటేశారని’’ ఆగ్రహం తో ఊగిపోయారు. ఇక ఆజాద్‌ ‘‘పదేపదే నేరాలకు పాల్పడే చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తించవద్దంటూ’’ ఎదురుదాడికి దిగడంతో మరింత రచ్చ అయింది. ఇక్కడ ఆజాద్‌ మొహువా మెయిత్రాకు మద్దతుగా నిలవడం గమనార్హం. కళ్యాణ్‌ బెనర్జీ ఈ సందర్భంగా ‘‘ఆ మహిళా ఎంపీ దురు సు స్వభావం కలది మాత్రమేకాదు, నాగరికత లేనిదంటూ’’ విమర్శించారు. కేవలం తన పేరులేదన్న కారణంగా నాపై విరుచుకుపడిరదంటూ ఆయన ఆరోపించారు. అంతకుముందు బెనర్జీ ‘‘కీర్తీ ఆజాద్‌, సీ.ఆర్‌.పార్క్‌లోని పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ‘షోందేష్‌’ పేరుతో ఒక స్వీట్‌ షాపు తెరవడానికి స్పీకర్‌ అనుమతికోసం ఎంపిల సంతకాలు సేకరిస్తున్నారు. నాకీ విషయం తెలిసి దీన్ని వ్యతిరేకించాను. ఫలితంగా ఈ లేఖను స్పీకర్‌కు సమర్పించలేకపోయారు. దీనివెనుక ఏ డీల్స్‌ వున్నాయో? దీంతో కక్షను పెంచుకొని నాపై విమర్శల దాడికి దిగుతున్నారంటూ’’ ఆరోపించారు. 

ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన వీడియోలు, ఎంపీల మధ్య విభేదాలను వెల్లడిరచినప్పటికీ, ఈ స్పర్థలు కేవలం ఇప్పటివి కావని ఎప్పటినుంచో పార్టీలో నివరుగప్పిన నిప్పులా వున్నాయన్నది తెలుస్తోంది. గతంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మొహువా మెయిత్రా, శత్రుఘ్నసిన్హా, కీర్తీ ఆజాద్‌లు కొన్ని కామెంట్స్‌ చేశారు. 

2022లో పార్టీ ఎంపీ శతృఘ్నసిన్నా పార్టీ నాయకత్వ పనితీరుపై తన అసంతృప్తిని నేరుగా వ్య క్తం చేశారు. 2019లో భాజపాను వీడి టీఎంసీలో చేరినప్పటినుంచి తన సేవలను పార్టీ నాయ కత్వం గుర్తించడంలేదన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల ఆయన ఇ ప్పటికీ తీవ్ర అసంతృప్తితో వున్నారు. అదేవిధంగా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత లేదంటూ, టీఎంసీ పనితీరును కీర్తీ ఆజాద్‌ తప్పు పట్టారు. ఇక మొహువా మెయిత్రా కూడా పార్టీ అధిష్టానంపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వుంటారు. ఆమె మమతాబెనర్జీకి విధేయంగా వున్నప్పటికీ, పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. 2021లో ఆమె జాతీయ రాజకీయాలపై పశ్చిమబెంగాల్‌ వ్యవహారశైలిని తప్పుపట్టారు. మమ తా బెనర్జీ కోటరీ అనుసరిస్తున్న కేంద్రీకృత వ్యవహారశైలిని ఆమె విమర్శించారు కూడా. స్థానికంగా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహారశైలిని ఆమె కొన్ని సందర్భాల్లో విభేదించారు. అయితేపార్టీలో ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే తానీ విమర్శలు చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. ఇక2023లో సౌగత్‌రాయ్‌, కళ్యాణ్‌ బెనర్జీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. బెనర్జీ వ్యవహారశైలివల్ల పార్టీ ఇమేజీ దెబ్బతింటున్నదని సౌగత్‌ రాయ్‌ విమర్శించడంతో, పార్టీలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు బయటకు పొక్కాయి.

ఒకపక్క కళ్యాణ్‌ బెనర్జీ, సౌగత్‌ రాయ్‌, మొహువా మెయిత్రా, కీర్తీ ఆజాద్‌ల కారణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌లో వాతావరణం హాట్‌హాట్‌గా మారిన తరుణంలోనే, తృణమూల్‌ కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం సమావేశం ఆకస్మికంగా వాయిదాపడటం పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశానికి 30మంది పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఈ క్రమశిక్షణా సంఘం ఏప్రిల్‌ 8న సమావేశం కావాల్సివుంది. కానీ ఇప్పుడీ సమావేశం నిరవధికంగా వాయిదాపడిరది. ఈ క్రమశిక్షణాసంఘానికి పార్లమెంట రీ వ్యవహారాల మంత్రి సోబందేవ్‌ చటోపాధ్యాయ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం వా యిదాపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కమిటీ సభ్యుడు నిర్మల్‌ ఘోష్‌ఈ సమావేశం ప్రస్తుతానికి వాయిదాపడిరదని, ఎప్పుడు జరిగేదీ మళ్లీ తెలియజేస్తామని విలేకర్ల కు చెప్పారు. ఇదిలావుండగా ఒక సీనియర్‌ మంత్రి మాట్లాడుతూ, ‘‘సౌగత్‌రాయ్‌, కళ్యాణ్‌ బెనర్జీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న విభేదాల కారణంగానే ఈ సమావేశం వాయిదా పడిరదని’ చెప్పడం గమనార్హం. నిజానికి గత మార్చి 20న బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా శాఖ సహాయ మంత్రి మనోజ్‌ తివారీ సహా 30మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజర య్యారు. ఈ క్రమశిక్షణా సంఘం సమావేశంలో వారిని సంజాయిషీ కోరాల్సి వుంది. బడ్జెట్‌ సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీ బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు పార్టీ జారీచేసిన విప్‌ను వీరు ధిక్కరించినట్లయింది. 

తృణమూల్‌ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు బీజేపీలో జోష్‌ పెంచడం సహజమే. పార్టీ ప్రతినిధి, ఐ.టి.సెల్‌ ఛీఫ్‌ మాలవ్యా ఏప్రిల్‌ 8న మరో షార్ట్‌ వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. అందులో కళ్యాణ్‌ బెనర్జీ ‘‘అసలు మమతా బెనర్జీదే తప్పు. కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలనుంచి తక్షణమే తప్పుకుంటా’’ అని వుంది. ఈయనకు వెనుక దన్నుగా ఎవరున్నారంటూ మాలవ్యా ప్రశ్నించడం కీలకం! తృణమూల్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు బయటకు రావడంతో, పార్టీలో క్రమశిక్షణ డొల్ల అనేది స్పష్టమైంది. ఇప్పటికే ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన దగ్గరి నుంచి పార్టీ ప్రతిష్ట గణనీయంగా దిగజారింది. గతంలో నారదా స్కామ్‌లు, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు మమతను కదల్చలేకపోయినా, ఆర్జీకర్‌ సంఘటన పార్టీని కుదిపేసింది. దీనికి తోడు వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడం, మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో, ఏ ముస్లిం ఓట్లను నమ్ముకొని అధికారంలో వున్నదో, ఆ వర్గాల్లోనే చాలామంది పార్టీనాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కేరళలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏవిధంగా వుందో, తృణమూల్‌ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. హిందువుల్లో ఇప్పటికే నెలకొన్న వ్యతిరేకత, వక్ఫ్‌బిల్లు పుణ్యమాని ముస్లింలలో కొందరు దూరమయ్యే పరిస్థితి నెలకొనడం మమతా బెనర్జీని ఊపిరి సలపనీయడలేదు.

తానే ఒక ఫైర్‌ బ్రాండ్‌ అనుకుంటే పార్టీలో ఉన్న ఫైర్‌బ్రాండ్లన్నీ ఇప్పుడు, సొంత కొంపకే నిప్పు పెట్టే స్థితికి చేరుకోవడంతో, మమతా బెనర్జీ ఒక్కసారిగా ‘కూల్‌’గా, ‘సైలెంట్‌’గా మారక తప్పలే దు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఆమె నియంత్రణాపరిధిని దాటిపోయినట్టు తెలుస్తోం ది. ఏ చర్య తీసుకున్నా మొత్తం పార్టీ పుట్టిమునగడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇప్పటికే తృణ మూల్‌కు సవాల్‌ విసురుతున్న భాజపాకు ఈ పరిణామాలన్నీ సానుకూల సంకేతాలిస్తూ, వచ్చే ఎన్నికల్లో అధికారం దగ్గడం ఖాయమన్న విశ్వాసం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నా యకత్వంలో జోష్‌ నెలకొంది. తన ‘నోరు బలం’తో నెట్టుకొస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు సైలెంట్‌ కాక తప్పడంలేదు. అవసాన దశలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన సామ్రాజ్యం ముక్కలు కావడాన్ని వీక్షించి విపరీతంగా బాధపడిన చందంగా, ఇప్పుడు మమతా బెనర్జీకూడా విభేదాలతో కుప్పకూలి పోతున్న పార్టీని నిస్సహాయంగా చూడక తప్పదా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో ఉన్నవారిలో అధికసంఖ్యాకులు అవినీతి అక్రమాలకు పాల్పడేవారే గనక, తమకిక్కడ రక్షణ లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడటం ఖాయం. అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ విభేదాల దెబ్బకు, ఓటర్‌ ఐ.డి.కార్డుల బాగోతం తెరమరుగైపోయింది. దీన్నెవరూ పట్టించుకోవడంలేదు. సామ్రాజ్యమే కుప్పకూలిపోయేటప్పుడు, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానం కానీ, ఎదురుదాడికి సమయం కాదు. ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ పరిస్థితి ఇదే!

అటు ఒత్తిళ్లు..ఇటు బెదిరింపులు!

`ఉద్యోగాలు చేయలేకపోతున్నాం

`కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నాం

`పని చేయడం కష్టంగా వుంది

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆవేదన, ఆందోళన

`తప్పు చేస్తే సహించకండి

`మాతో తప్పులు చేయించకండి

`అక్రమాలు ఎప్పుడూ సక్రమం కావు

`ప్రజా ప్రతినిధుల టార్గెట్లు సరైంది కాదు

`ప్రభుత్వ ఆదేశాలు పాటించాలా!

`ఎమ్మెల్సేల హుకూం భరించాలా?

`అయోమయ స్థితిలో పని చేస్తున్నాం

`భయపెట్టి పనులు చేయిస్తే బాధ్యులమౌతున్నాం

`ప్రజల దృష్టిలో చులకనౌతున్నాం

`అవినీతి పరులుగా ఆరోపణలెదుర్కొంటున్నాం

`అందరూ బెదిరించే వాళ్లే తయారౌతున్నారు

`స్వేచ్ఛగా పనులు చేయలేకపోతున్నాం

`ఎమ్మెల్యేలు మా ఆదేశాలే పాటించాలంటున్నారు

`మేమే బాస్‌లమని బెదిరిస్తున్నారు

`మంత్రి మాకన్నా సీనియర్‌ కాదని కొందరు ఎమ్మెల్యేలంటున్నారు

`చెప్పిన పని చేస్తారా? లేదా! అని ఇబ్బంది పెడుతున్నారు

`చెప్పిన పని చేయకపోతే మీడియాలో లేనిపోనివి రాయిస్తున్నారు

`సబ్‌ రిజిస్ట్రార్లను అవినీతి పరులుగా ముద్రలు వేస్తున్నారు

`గత ప్రభుత్వ హయాంలో విన్నట్లే ఇప్పుడూ వినాలంటున్నారు

`ఎమ్మెల్యేలను దిక్కరిస్తే శంకరగిరి మాణ్యాలు పట్టిస్తామంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. సబ్‌ రిజిస్ట్రార్ల జీవితాలు ఇందుకు బాగా అద్దం పుడుతున్నాయి. ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్లే..ప్రతి ఒక్కరూ నిందలేసేవాళ్లే. ప్రతి ఒక్కరూ నిలదీసేవాళ్లే..ప్రతి ఒక్కరూ నీ సంగతి చూస్తా? అని భయపెట్టేవాళ్లే? అసలు ఏం జరుగుతుతందో అర్ధం కాని త్రిశంకు స్వర్గంలో సబ్‌ రిజిస్ట్రార్లున్నారు. ఇంకా కొందరైతే భయపెట్టి పని చేయించుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ల పని వాళ్లు ఎలా చేసుకోగలరు. ప్రజలు న్యాయం ఎలా చేయగలరు. మరో వైపు సమాజం నుంచి నిందలు, అపనిందలు, చీత్కారాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేశాఖలో కొలువులు. అయినా సరే అందరీ సమాదానం చెప్పాలి. లేకుంటే భయపడుతూ బతకాలి. నిత్యం అంటు ఒత్తిళ్లు, ఇటు బెదిరింపులతో కాలం గడపాలి. సామాన్యుల నుంచి వచ్చే ఇబ్బందేమీ లేదు. కాని నాయకుల మూలంగా ఇటీవల కాలంలో సబ్‌ రిజిస్ట్రార్లు పని చేయలేకపోతున్నారు. అందరూ నాయకులే. అందరూ రిజిస్ట్రార్ల మీద పెత్తనం చేసేవారే. మేం చెప్పినపని చేయాలని హుకూం జారీ చేసేవాళ్లే..ఇంత మంది బెదిరింపుల మధ్య పని ఎలా చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లు చెప్పే అక్రమ పనులు చేయలేమంటే ఒక తంటా? చేస్తే జనం నుంచి మరో తంటా? ఇలాంటి సందిగ్ధావస్తలో పని చేయలేకపోతున్నాం మహా ప్రభో అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాపై నాయకుల ఒత్తిళ్లు లేకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. ఎందుకంటే నాయకులను కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. పని చేయడం కష్టంగా వుందని భోరు మంటున్నారు. ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన. ఇటీవల సబ్‌ రిజిస్ట్రార్లంతా ముక్త కంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. మేం తప్పు చేస్తే సహించకండి. అది ప్రభుత్వమైనా, ఇంకెవరైనా? కాని తమతో తప్పుడు పనులు చేయించకండి? అని వేడుకుంటున్నారు. నాయకల ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనే కాకుండా, ఉద్యోగాలు పోతాయేమో? అని భయపడుతున్నారు. పనులు చేయించుకునే నాయకులు బాగానే వుంటారు. కాని కొలువులు పోతే తమ జీవితాలు వీదిన పడతాయని భయపడుతున్నారు. కనిపించిన ప్రతి భూమిని మా పరం చేయమని, మా పేరున రిజిస్ట్రేషన్‌ చేయమని ఒత్తిడిచేస్తున్ననాయకులు మరీ ఎక్కువౌతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఒత్తిడి చేసి బెదిరించి పనులు చేయించుకున్నా అది సక్రమం కాదు. దాని వల్ల వివాదాలపాలు సబ్‌ రిజిస్ట్రార్లే అవుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలౌతున్నారు. తప్పు చేసే వాళ్లే కాదు..చేయించిన వాళ్లు కూడా నేరానికి పాల్పడినట్లే. కాని వాళ్లు తెరమీదకు రారు. తప్పులు సబ్‌ రిజిస్ట్రార్ల మీద తోసేసి చేతులు దులుపుకుంటారు. పైగా నెల నెల మేం అడిగింది ఇవ్వాలి. మేం చెప్పినలెక్క ముట్ట జెప్పాలంటే ఎక్కడి నుంచి తేవాలి. వారికి కప్పం ఎలా కట్టాలి. గత పాలకులకు ఎలా సహకరించారో మాకు అలాగే సహకరించాలంటారు. గతంలో ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది. గతంలో ఏం చేయించుకున్నారో మాకు అవసరమేముంది? అక్రమ పనులు చేయించమని బెదిరిస్తే కొంత మంది సబ్‌ రిజిస్ట్రార్లు సెలవులపై వెళ్లిపోతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రజలకు మేలు చేయాలనిచూస్తోంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసేలా నూతన పద్దతులు తెచ్చిపెడుతోంది. మాకు చాలా వరకు సులభరతమైన పని రానుంది. ఒక రోజులో మరిన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు కానున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ఎక్కువ కాలం రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేకుండా సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగడానికి వీలుండదు. మధ్య వర్తులు అసలే వుండరు. ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. పైగా సబ్‌రిజిస్ట్రార్లు ఏ చిన్న తప్పు చేసినా ఉపేక్షించే పరిస్దితి వుండదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. ఎక్కడ పట్టిద్దామా? అన్నట్లు మీడియా డేగ కన్నులేసుకొని చూస్తోంది. ఇలాంటి సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు సబ్‌ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ ఎమ్మెల్యే నేను చెప్పింది వింటావా? లేదా? నేను చేయమన్న రిజిస్ట్రేషన్‌ చేస్తావా? లేదా? అంటూ భయపెడుతున్నాడట. ఈ నియోజకవర్గానికి నేనే బాస్‌. నేను చెప్పిందే నవ్వు వినాలని ఆర్డర్‌ వేస్తున్నాడట. మీరు చెప్పమన్నవన్నీ చేస్తే నా ఉద్యోగం పోతుందని సబ్‌ రిజిస్ట్రార్లు అంటుంటే, మీ ఉద్యోగాలకు నేనే భరోసా ఇస్తాను. నేను చెప్పిన పని చేయకుంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శంకరగిరి మాణ్యాలు పట్టిస్తానని బెదిరిస్తున్నారట. దాంతో సబ్‌ రిజిస్ట్రార్లకు ఏంచేయాలో అర్దం కాకుండాపోతోందిన వాపోతుందన్నారు. ప్రభుత్వమే ఎలాంటి తప్పులు జరగకూడదని నూతన ఆవిష్కరణలు తెచ్చి,సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే, అదే ప్రభుత్వంతో చెప్పి మీ అంతు చూస్తామంటూ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? కాపాడమని ఎవరిని వేడుకుంటారు? సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి ఓ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి. మంత్రి రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న తప్పును కూడా సహించేది లేదని ఇప్పటికే ప్రకటనలుచేస్తున్నారు. అలాంటి మంత్రి ఇన్‌చార్జిగా వున్న జిల్లాలో ఓ ఎమ్మెల్యే నేను మంత్రికన్నా సీనియర్‌ని. మంత్రి నాకు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి? నేనే నీకు బాస్‌..మంత్రి చెప్పినట్లు కాదు..నువ్వు కొలువులో వుండాలంటే నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పినట్లే చేయాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులమీద బెదిరింపులు సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పార్టీలో మేం సీనియర్లం. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిమంత్రి అయినంత మాత్రాన మాకన్నా తోపు కాదు..మాపై ఆయన పెత్తనం సాగనివ్వం. మా జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనానికి స్ధానం లేదు. ఆయనకు మా జిల్లాలో ఎలాంటి ప్రాదాన్యత లేదు. అర్దమౌతుందా? అని కొంత మంది సబ్‌ రిజిస్ట్రార్లను పిలిపించుకొని ఓ ఎమ్మెల్యే తన పటాటోపం చూపించనట్లు తెలుస్తోంది. దాంతో తాము ప్రజలకు సేవ చేయడానికి వున్నామో..నాయకులకు ఊడిగం చేయడానికి కొలువులు చేయాలో అర్దం కావడం లేదని సబ్‌ రిజిస్ట్రార్లు మధన పడుతున్నారు.. ఇటీవల ఆ ఎమ్మెల్యే సబ్‌ రిజిస్ట్రార్లను పిలిచి చెప్పిన పనులు చేయకపోవడంతో, ఆ రిజిస్ట్రార్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు రాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వార్తలు ఎందుకొస్తున్నాయని మిగతా మీడియా ప్రతినిదులు సబ్‌రిజిస్ల్రార్లను ప్రశ్నించారు. చూస్తున్నారు… ఎమ్మెల్యే వ్యక్తిగత కక్షతో ఇలాంటి వార్తలు రాయిస్తుంటే నేనెలా భాధ్యుడినౌతానంటూ ఆ సబ్‌రిజిస్ట్రార్‌ తన భాధను వెలుబుచ్చారు. అయినా తాము తప్పు చేస్తే శిక్షించేస్ధాయిలో వున్న ఎమ్మెల్యేలు మాపై తప్పుడు కథనాలు రాయిస్తే మేంఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మా గోడు విన్నవించుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్లు ఆవేదన చెందుతున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాకపై ఒక్క మచ్చ కూడా పడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో సీరియస్‌గా వ్యవస్ధను గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలకు సొంత భవనాలు వుండాలనుకుంటున్నాడు. తెలంగాణలో వున్న 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం తన హయాంలోనే జరగాలనికోరుకుంటున్నాడు. తాను మంత్రిగా వున్నంత కాలం రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అన్న పదం వినిపించకుండా వుండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే ప్రజలకు ఇప్పటి వరకు వున్నట్లు కాకుండా ఎంతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారి చేస్తున్నారు. ప్రజలకు కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నారు. పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగాలని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలు మా నెత్తి మీద తాండవం చేయాలని చూస్తున్నారు. ఈ ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు వదులుకొని వెళ్లాలనుకుంటున్నామని కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నియంత్రణలేని ప్రైవేటు విద్య అనర్థాలకు హేతువు

హన్మకొండలో ఒక విద్యాసంస్థలో గిరిజన విద్యార్థిని ఆత్మహత్య గొప్ప ఉదాహరణ

 ఒత్తిడిని పెంచే విద్య వికాసానికి దోహదం చేయదు

 పోటీ పరీక్షల కోచింగ్‌ పేరుతో వేలం వెర్రి పోకడలు

 చెడ్డు చెడే కాలానికి కుక్కమూతి పిందెల చందం

 మన విద్య ఎటువైపు పోతున్నది?

 నరకానికి దారితీస్తున్న ప్రైవేటు విద్య

 కట్టడిలేకపోతే పుట్టుకొచ్చేది చేవలేని తరం మాత్రమే

 సామాజిక అవగాహన లేని విద్య అనర్థం

 ర్యాంకు తాత్కాలికం, వికాసం శాశ్వతం

ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలకు ఉదాహరణగా హన్మ కొండలోని ఏకశిల జూనియర్‌ కళాశాలలో ఒక గిరిజన విద్యార్థిని మృతి నిలిచింది. ఆత్మహత్మ గా యాజమాన్యం చెబుతోంది. అయితే యువమోర్చా సభ్యులు మాత్రం కళాశాల యాజమాన్యం పెట్టిన టార్చర్‌ భరించలేకే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు ఏవిధ మైన పంచనామా జరుపకుండా ఏకంగా ఎం.జి.ఎం. మార్చురీకి ఏవిధంగా చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు పిల్లల తల్లి దండ్రులనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే కాకుండా, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలుగజేస్తున్నాయన్నది మాత్రం సత్యం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతే ఇది. కానీ విద్య కా ర్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కిమ్మనడంలేదు. విద్యాసంస్థల యజమానులు ఒక దశకు చేరుకొని వివిధ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ సంస్థల్లో జరుగుతున్న కార్యకలాపాలను బయటకురాకుండా వుండేందుకు, మీడియా, అధికార్లు, పోలీసులను గుప్పిట్లో పెట్టు కొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మీడియా ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. ఈ నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియాకు కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలను ఏటా ఇస్తూ, తమ సంస్థల్లో జరిగే అవకవకలు ప్రచురణ లేదా ప్రసారం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అంతేకాదు పోలీసుల్లో అవినీతి అధికారులకు, ఇతర సంబంధిత ప్రభుత్వ అధికార్లకు కూడా తగినంత ముట్టజెప్పి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాదు, విద్యార్థులపై చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల దీన్ని తట్టుకోలేని విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడు తున్నారన్నది ప్రధానంగా వస్తున్న అభియోగం. 

ఈ విద్యాసంస్థలు దోపిడీ ఒకరకంగా వుండదు! ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ దోపిడీ అనాలి. అడ్మిషన్ల దగ్గరినుంచి, పుస్తకాలు, స్పెషల్‌ ఫీజులు, యూనిఫామ్‌లు…ఈవిధంగా వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రులనుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాయి. అదేమంటే విద్యాసంస్థ నిర్వహణకు ఇవన్నీ అవసరమన్న ధోరణి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాల విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి నశించి, తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆశలతో ఉన్న ఆస్తులను కూడా ఖాతరు చేయకుండా తమ పిల్లల చదువుకోసం ఖర్చు చేయడానికి వెనుకాడటంలేదు. ప్రైవేటు విద్యావ్యాప్తికి ప్రధాన కారణం ఈవిధమైన తల్లిదండ్రుల బలహీనతే. గతంలోని తరాల్లో ప్రైవేటు స్కూళ్లు లేవు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. మాతృభాషలో విద్యను అభ్యసించి, పైచదువులు చదివి గొప్ప స్థానాలు పొందినవారెందరు లేరు? కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లున్నా నాణ్యమైన విద్య అందడంలేదన్న కారణంగా తల్లిదండ్రులు ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి?

తల్లిదండ్రులకు తమ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారన్న విషయం కేవలం వారికి వచ్చే మా ర్కుల సరళిని బట్టే తెలుస్తుంది. చాలా ప్రైవేటు స్కూళలో విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే డిటెన్షన్‌ విధానం అమల్లో లేకపోవడంల్ల పదోతరగతికి వచ్చేవరకు ప్రశాంతంగా వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి విద్యార్థులపై వత్తిడి పెరుగుతుంది. ఇంటర్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, జెఈఈ వంటి పోటీపరీక్షలకు హాజరు కావాల్సి వుండటంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనికితోడు ఆయా ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకులకోసం టార్చర్‌ పెట్టడం ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.

విచిత్రమేమంటే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలు, రాజకీ యంగా, మీడియా, అవినీతి అధికార్లు, పోలీసులతో కుమ్మక్కయి అసలు తమ విద్యాసంస్థలో ఏం జరుగుతున్నదీ బయటకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. గతంలో విద్యాసంస్థ యాజమాన్యాలు, ఏవైనా అవకతవకలు బయటపడినప్పుడో లేదా ఆత్మహత్యల వంటి సంఘటన జరిగినప్పుడో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికార్లకు ఏదోవిధంగా ముట్టజెప్పి బయటపడటం జరిగేది. వీరి పలుకుబడి నేపథ్యంలో నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని, పిల్లలను కోల్పోయి ప్రశ్నించలేని దుస్థితిని ఎదుర్కొనడాన్ని మించిన దురదృష్టం మరోటుండదు. మీడియాను ప్రకటనటల ద్వారా తమదారికి తెచ్చుకుంటున్న యాజమాన్యాలు, అవినీతి పోలీసులు, అధికార్లకు అవసరమైనంత ముట్టజెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ పాఠశాల యాజమాన్యాల్లో కొందరు వివిధ రాజకీయ పార్టీ లకు కొమ్ము కాయడం ద్వారా పబ్బం గడుపుకుంటుంటారు. మరికొందరు పార్టీలకు పార్టీఫండ్‌ లను సమకూర్చడం ద్వారా కూడా తమపై ఈగవాలకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇంకా పై స్థాయికి చేరుకున్న వారు, ఏకంగా రాజకీయాల్లోకే ప్రవేశిస్తారు. ఆవిధంగా అధికారం చేతిలోవుంటే అన్నీ వాటికవే చక్కబడిపోతాయన్న సత్యం వారికి బాగా అవ గాహన అయినప్పటికీ, ఆ స్థాయికిచేరుకోవడానికి వారికి కొంత సమయం అవసరం. ఇప్పుడు వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక వి ద్యాసంస్థల యజమాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తు న్నారు. ఎవరైనా ఏరంగంలోనైనా ఎదగాలనుకోవడంలో తప్పులేదు. కానీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయాన్ని ఉపయోగించే విధానమే ఇక్కడ తప్పు!

ఇదిలావుండగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం ర్యాంకులపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల విద్యా ర్థులకు వారివారి స్థాయికి తగిన సాధారణ పరిజ్ఞానం కొరవడుతోంది. జ్ఞాపకశక్తిపైనే దృష్టి తప్ప సృజనాత్మకతకు చోటుండటంలేదు. ఒకప్పుడు ఇంటర్మీడియట్‌ స్థాయిలో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పాఠశాల స్థాయినుంచే సివిల్‌ సర్వీస్‌ వంటి అత్యుతన్న పోటీపరీక్షలకు అవసరమైన ప్రమాణాలతో విద్యాబోధన అంటూ కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. అసలు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థుల అవగాహనా శక్తి ఎంత? అనేది పట్టించుకునే దిక్కే లేదు. వేలంవెర్రిగా కోర్సులు పెట్టడం, తల్లిదండ్రులు అనుసరించడం. ఈవిధంగా విద్య వ్యాపార స్థాయినుంచి, కార్పొరేట్‌ స్థాయిని కూడా దాటిపోయిందనుకోవాలి. ఇక పిల్లల భవిష్యత్తేమిటి? వారి జీవితంలో చదువు, ర్యాంకులు, పోటీలు తప్ప ఆటలు, వినోద కార్యక్రమాలకు అవకాశమే లేని జైలు జీవితాన్ని ప్రైవేటు విద్యావిధానం వారికి అందిస్తోంది. నిజంగా ఇది చాలా దారుణం. జీవితంలో అత్యంత ఆనందమయంగా పరిగణించే బాల్యం, చదువును బోధన పేరుతో ఒక పెద్ద ‘సంకెల’గా మార్చివేశారు. ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లలకు జైలు జీవితానికి పరిమితం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో శారీరక స మతుల్యాభివృద్ధి దెబ్బతింటోంది. వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే బైటికి రాకుండా డబ్బుతో అందరినీ కట్టిపడేస్తున్నారు. అందమైన భవిష్యత్తంటూ రంగురంగుల మాయా ప్రపంచాన్ని చూపుతూ పిల్లల్ని చదువు చట్రంలో విద్యార్థులను బిగించి ప్రైవేటు విద్యాసంస్థలు ఊపిరాడ కుండా చేస్తున్నాయి. 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏ చిన్న పొరపాటు లేదా సంఘటన జరిగినా మీడియా, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వాలిపోతారు. నానా యాగీ చేస్తారు. ఇదే ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఒక్కరు మాట్లాడరు!! ఇదెక్కడి దారుణం! అంతేకాదు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వ విద్యపై ఎన్నిరకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్నిర రకాలుగా చేస్తారు. కారణం ప్రభుత్వ విద్యాసంస్థలు ఖాళీ అయితేనే కదా, ప్రవేటు సంస్థలు కళకళలాడేది!! ఇందులో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్రకూడా విస్మరించలేం. వీరిలో కొందరు ప్రవేటు విద్యాసంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లల్లో మనోవికాసం పెరగకపోవడానికి ప్రైవేటు విద్యే ప్రధాన కారణం! విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల, కళాశాలల వాతావరణం దోహదం చేయాలి తప్ప, ఒక మూస విధా నంతో విపరీతమైన ఒత్తిడిని పెంచుతూ, చివరకు వారి ఆత్మహత్యలకు దోహదం చేసిదిగా విద్య వుండకూడదు!

నిమిషాలలో రిజిస్ట్రేషన్‌..’’న్యూ రెవల్యూషన్‌’’.

`అమల్లోకి నూతన విధానం

`రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నూతన ఒరవడికి శ్రీకారం

`ఇకపై పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు

`ఒత్తిళ్లకు, అక్రమాలకు తావు లేకుండా వెసులుబాటు

`ఎవరికి వారే దస్తావేజులు పూర్తి చేసుకునేందుకు మార్గం

`మధ్య వర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ పూర్తికి మార్గ నిర్దేశనం

`అవకతవకలు జరగకుండా పూర్తి భరోసాతో ఆస్థులు భద్రం

`స్థిరాస్తుల మీద ప్రజలకు ఎలాంటి భయం లేకుండా కొత్త నిర్ణయం

`ఏడాది క్రితమే చెప్పిన నేటిధాత్రి

`ఇలాంటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రాబోతోందని చెప్పిన నేటిధాత్రి

`ప్రజలకు మేలు జరగాలన్నదే మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి’’ ఆలోచన

`ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న ‘‘మంత్రి’’

`అవాంతరాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్న ‘‘మంత్రి పొంగులేటి’’

`సరికొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై ప్రజల ప్రశంసలు

`మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి’’ కి జనం నుంచి అందుతున్న అభినందనలు

`రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సమూల మార్పులకు మంత్రి ఆదేశం

`త్వరలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు సొంత భవనాలు

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవలు

`కార్యాలయాలలో గౌరవంగా ప్రజలకు సౌకర్యాలు

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి, కొత్త తరహా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎదురైన అనుభవాలు,సవాళ్లు, ఇబ్బందులు అదిగమించి, ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురుకాకుండా కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చింది. అందు కోసం రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పట్టుదల, కృషి ఫలించింది. ప్రజలకు రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎలాంటి బాధలు భవిష్యత్తులో ఎదురుకావొద్దన్న మంచి ఉద్దేశ్యంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాత్మకమైన విధానం మూలంగా ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రజల స్ధిరాస్ధుల విషయంలో గందరగోళానికి తావుండదు. పైగా ఒకరి భూములు, మరొకరు ఎట్టిపరిస్ధితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆస్కారం లేదు. వీలు అసలే కాదు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి రిజిస్ట్రేషన్లు చేయడం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ విధానం త్వరలో వస్తుందని నేటిధాత్రి ఏడాది క్రితమే చెప్పింది. సమీప భవిష్యత్తుల సులభతరమై, పకడ్భంధీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నూతన విధానం అందుబాటులోకి రానున్నదని నేటిధాత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిత్యం వివాదాలు ఎదురౌతూ వుండేవి. ఇకపై అలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పడనున్నది. అక్రమాలకు తావులేకుండా, సజావుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుంది. అంతే కాదు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తికానున్నది. రోజుల తరబడి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అదికారులను బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, మళ్లీ మళ్లీ ప్రజలు పదే పదే కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోవాల్సి వుండదు. అధికారులకు ఇబ్బంది లేకుండా,ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఇదంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి అమలులోకి రావడానికి మంత్రి పొంగులేటి కృషిని ప్రభుత్వ వర్గాలు కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో దోహడపడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా వేగవంతమౌతుంది. నేటి నుంచి ఈ స్లాట్‌ బుకింగ్‌ అమలలోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ కొత్త తరహా ఆవిష్కరణ జరిగింది. దశలవారిగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానున్నది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతి వేగంగా కావడమే కాకుంగా, అవినీతి ఆస్కారం లేకుండా వుంటుంది. ఇప్పుడున్న విమర్శలకు భవిష్యత్తులో వినేఅవకాశం వుండదు. ప్రజలకు లంచాల బెడద కూడా వుండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఇకపై దస్తావేజుల తయారీ కోసం ప్రజలు ఎవరి మీద ఆధాపడాల్సిన పని వుండదు. మధ్యవర్తులైన దళారుల చేతుల్లో మోస పోవడం అసలే వుండదు. ఎవరికి వారు స్వంతంగా దస్తావేజులుతయారు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ ఏర్పాటుచేశారు. అందుకోసం ఒక మాడ్యూల్‌ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఐచ్చికంగానే వుంటుంది. ఎందుకంటే గతంలో దస్తావేజుపైన అమ్మిన, కొన్న వాళ్ల సంతాకాలు, రిజిస్ట్రార్‌ సంతకాల కోసం ఇలా కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం చాల పట్టేది. ఇకపై ఆ గందరగోళం అంతా వుండదు. రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి జాప్యానికి తావుండదు. ఒక్కసారి దస్తావేజులు పూరణ పూర్తి చేసి, స్లాట్‌ బుక్‌ చేస్తే ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. పదినిమిషాల్లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఆదార్‌ ఇ` సంతకం ప్రవేశపెడుతున్నారు. ఈనెల చివరి లోగా ఈ సైన్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో రెండు రెండుసార్లు రిజిస్ట్రేషన్ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఆ భూములు ఎవరివో తెల్చుకోలేక సతమతమయ్యేవారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై భవిష్యత్తులో అలాంటిసమస్యలు వుండకపోవచ్చు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డబుల్‌ రిజిస్ట్రేషన్‌ గోల ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వుంటూనే వుంటుంది. అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చేది. భూమిని నమ్ముకొని తరతరాలుగా ఆధారపడుతున్న వారే కాదు, రియలెస్టేట్‌లో స్ధలాలు కొన్న వారికి ఈ డబుల్‌ రిజిస్ట్రేషన్ల వల్ల కేసులు, ఘర్షణలు జరుగుతుండేవి. ఆ కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయేవి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్నవారి భూములను ఇతరులు అసలు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా వున్నారు. కుటుంబాలు వీధినపడ్డ వారున్నారు. ఇకపై అలాంటి సమస్యలు ఏ కుటుంబం ఎదుర్కొకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుక ప్రభుత్వం సిద్దమౌతోంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కొన్ని ప్రత్యేకమైనచట్టాలను అమలు చేస్తున్నాయి. వాటిన్నింటినీ అధ్యయం చేసి, అందుల్లో ఉత్తమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఈ చట్ట సవరణ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరగుతోంది. అధికారుల అద్యయనం సాగుతోంది. రిజిస్ట్రేషన్‌ చట్టంలో వున్న సెక్షన్‌ 22కు అదనంగా 22`బి తీసుకురానున్నారు. దీని వల్ల ఇకపై డబుల్‌ రిజిస్ట్రేషన్‌ అనేదానికి ఆస్కారం లేకుండా వుంటుంది. అవసరమైనంత సిబ్బంది లేకుండా ఇబ్బందులుపడుతున్న కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. దాంతో స్టాట్‌విధానంలో జరిగే వేగవంతమైన రిజిస్ట్రేషన్‌ కోసం అదనపు ఉద్యోగుల వల్ల ఏక కాలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకే రోజు, ఒకే సమయంలోఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని సునాయాసంగా అధిగమించేందుకు వీలౌతుంది. అదనపు ఉద్యోగుల నియామకం కూడా తొలుత మేడ్చల్‌`మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్‌లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లతోపాటు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. దీని వల్ల కుత్భుల్లాపూర్‌లో 144 స్టాట్స్‌ ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోవున్న 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు త్వరలోఈ విధానాన్ని విస్తరిస్తే ఇక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాల వేగవంతమౌతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఎక్కువగా వున్నాయి. చాలీ చాలని సౌకర్యాలతో వుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇన్ని సంవత్సరాలైనా సొంత భవానాలు లేకపోవడం గమనార్హం. అద్దె ఇళ్లలో కార్యాలయాలు వుండడం వల్ల ప్రజలు అనేకు సమస్యలు ఎదుర్కొనే వారు. కార్యాలయంలో నిలుచులేక, కార్యాలయం సమీపంలో వున్న చెట్ల నీడన ఎదురుచూస్తూ వుండేవారు. వానొచ్చినా, ఎండ కాచినా రోజలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్దితులు కూడా వుండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే రిజిస్ట్రేషన్లు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రజలు కార్యాలయంలో కనీసం నిలబడే పరిస్దితి వుండదు. మంచి నీటి సౌకర్యం వుండదు. ఉద్యోగులు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ప్రజలను కసురుకుంటూ, చీదరించుకంటూ వుండే విధానానికి త్వరలో స్వస్తి పలుకనున్నారు. కొత్త కార్యాయాలను నిర్మాణం చేసుకొని, రిజిస్ట్రేషన్లకోసం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. అంతే కాదు అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను గౌరవంగా చూసుకునే విధానం తీసుకురానున్నారు. ఇప్పుడు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కనీసం మాట్లాడుకునే వీలు కూడా వుండదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రజలకు స్వేచ్చాయుత వాతావరణం కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వుండేలా చూస్తున్నారు. ప్రజలకు గౌరవం కల్పించనున్నారు. కొత్త విధానం వల్ల అవినీతి తగ్గుతుంది. కొత్త కార్యాలయాల వల్ల ప్రజలకు గౌరవం దక్కుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రకియ చాలా వేగంగా మారుతుంది.

వసూళ్లలో రూటు మార్చిన మరో క్వారీ.

*దర్జాగా టీఎస్ఎండిసి సిబ్బంది వసూళ్లు.*

*మహాదేవపూర్ పుసుపుపల్లి వన్, క్వారీ లో దారుణం.*

*సీరియల్ 700, లోడింగ్ 100, పాసింగ్ కొరకు 100.*

*టీఎస్ఎండిసి ఉన్నత అధికారుల నిఘా ఎక్కడ.*

*మహాదేవపూర్- నేటి ధాత్రి:*

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలు అదనపు ఇసుక అక్రమ వసూళ్లకు హద్దు అదుపు లేకుండా పోయింది.ఎవరు పసిగ్గటి రీతిలో బొమ్మపూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీలతోపాటు మహాదేవపూర్ పూసుకుపల్లి ,ఒకటవ నంబర్ పేరుతో మండలంలోని కుదురుపల్లి శివారు వద్ద నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లో వసూళ్లకు రూటు మార్చి ,కాంట్రాక్టర్ సిబ్బంది కాకుండా టి ఎస్ ఎం డి సి, కు చెందిన సిబ్బంది ప్రతి లారీ వద్ద 700 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా లోడింగ్ వద్ద 100 రూపాయలు, కాంట వద్ద టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని పాసింకు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన తిరిగి ఇసుక వేయడం లేదా తీయడం చేస్తూ మరో అదనంగా 100 రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లలో ఎక్కువ మోతాదులో ఈ క్వారీ నుండి ఇసుక లారీల రవాణా కావడం జరుగుతుంది.

 

ప్రస్తుతం మండలంలో సుమారు 150 కు పైగా ప్రతిరోజు లారీల ఇసుకను లోడ్ చేసే క్వారీల్లో బొమ్మపూర్ ఎలికేశ్వరం తో పాటు, మహాదేవపూర్ పుసుపుపల్లి, ఒకటవ నంబర్ క్వారీ కూడా ఉంది. గత నెల కేవలం 3 నుండి 17 లారీలకే పరిమితమైన, ఈ క్వారీ ఈనెల వారం రోజులుగా 60 నుండి నేడు 246 లారీల ఇసుక ను తరలిస్తుందంటే, అక్రమ వసూళ్ల పర్వం ఎంతవరకు ఉందో స్పష్టం అవుతుంది. సాండ్ పొలిసి ని కఠినంగా అమలు పరుస్తున్నాము ,అని చెప్పుకుంటున్న మైనింగ్ శాఖ, మండలంలో దర్జాగా వసూళ్లు చేస్తుంటే ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది. గుత్తేదార్ గుమస్తాలుగా మారి టీఎస్ఎండిసి సిబ్బంది, ఇసుక లోడింగ్ వద్ద ఉండాల్సినప్పటికీ, కేవలం కంటైనర్ల వద్ద పరిమితమై సీరియల్ పేరుతో సిబ్బంది వసూలు చేయడం మైనింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ల నుండి వాటా పోగకుండా ఇలా సాధ్యమవుతుంది. మైనింగ్ ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి, అక్రమ వసూళ్లు చేస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కేరళ కాంగ్రెస్‌ మెడకు చుట్టుకున్న వక్ఫ్‌బిల్లు 

`బూమరాంగ్‌ అయిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు

`కాంగ్రెస్‌, సీపీఎంలపై మండిపడుతున్న క్రైస్తవులు, వక్ఫ్‌ బాధిత ముస్లింలు

`పుట్టి ముంచనున్న ఓటు బ్యాంకు రాజకీయాలు

`తలపట్టుకు కూర్చున్న కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీలు

`రాహుల్‌, ప్రియాంకలపై కేరళ ముస్లింల ఆగ్రహం

`బీజేపీకి అస్త్రంగా మారిన వక్ఫ్‌బిల్లు

`వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ

`కాంగ్రెస్‌పై మండిపడుతున్న కేథలిక్‌ చర్చ్‌

`కాంగ్రెస్‌ కొంప ముంచనున్న మునాంబం సమస్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత కేరళలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. మైనారిటీల వర్గాల బుజ్జగింపు రాజకీయాలతో తన రాజకీయ మనుగడను సాగిస్తున్న కాంగ్రెస్‌కు అదే మైనారిటీ అస్త్రం బూమరాంగ్‌ కావడం కేరళలో తాజాపరిణామం. పార్లమెంట్‌లో వక్ఫ్‌ బి ల్లుపై చర్చలో రాహుల్‌ మౌనం పాటిస్తే, ప్రియాంకా వాద్రా అసలు లోక్‌సభకే రాలేదు. చివరకు వక్ఫ్‌ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో, కేరళలోని ముస్లిం వర్గాలు కాంగ్రెస్‌పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. సందట్లో సడేమియా మాదిరిగా ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ కేరళ క్రైస్తవ వర్గాల్లో సానుకూలతను పెంచుకోవడానికి కృషి చేస్తుండటం తాజా పరిణామం. బిల్లు ఆమోదంతో డిఫెన్స్‌లో పడ్డ కాంగ్రెస్‌ పార్టీ, లెఫ్ట్‌ పార్టీలు ఉమ్మడిగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇటీవల జబల్‌పూర్‌లో క్రైస్తవ మత గురువుపై రైట్‌వింగ్‌ కార్యకర్తలు జరిపిన దాడికి ఎక్కువ ప్రచారం కల్పించడం ద్వారా, కేరళ క్రై స్తవుల్లో భాజపాపై సానుకూలతను నిరోధించే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇది అంతగా ఫలితం ఇస్తున్నట్టు లేదు.

మునాంబం వాసుల్లో ఆనందం

వక్ఫ్‌ బిల్లు ఆమోదంతో కేరళలోని మునాంబం గ్రామ ప్రాంతంలోని క్రైస్తవుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక్కడి క్రైస్తవుల భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో ఈ ప్రాంత క్రైస్తవుల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై పినరయి విజయన్‌ ప్రభుత్వం కూడా పెద్దగా స్పం దించకపోవడం క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. తాజాగా పార్లమెంట్‌లో వక్ఫ్‌బిల్లు ఆ మోదం పొందడంతో మునాంబంలోని 610 క్రైస్తవ కుటుంబాలకు ఊరట లభించే అవకాశాలు మెరుగైన నేపథ్యంలో, బీజేపీ పట్ల కృతజ్ఞతా భావంతో ఇప్పటికే ఈ ప్రాంతంలోని 50మంది క్రైస్తవులు బీజేపీలో చేరిపోయారు. ఈనెల 4వ తేదీన కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎన్‌డీఏ కూటమి భాగసామి నేతలు మునాంబం గ్రామాన్ని సందర్శించి న ప్పుడు వీరికి అపూర్వరీతిలో స్వాగతం లభించింది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు ఈ ప్రాంత వాసులు వక్ఫ్‌ ప్రకటన కారణంగా పడుతున్న కష్టాలను పట్టించుకోకపోయినా, తాము వారికి దన్నుగా నిలుస్తామని వీరు స్పష్టం చేశారు. వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు తమ భూములపై చట్టబద్ధంగా యాజమాన్య హక్కు వచ్చేవరకు తాము వీరికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్‌బోర్డు వీరి భూములను తమవిగా ప్రకటించడంతో గత 178రోజులుగా ఈ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందడంతో కృతజ్ఞతగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రాంత క్రైస్తవులు కోరడంతో, అందుకు తప్పక అవకాశం కల్పిస్తామని ఈ నాయకులు హామీ ఇచ్చారు. 

మునాంబం వివాదం

2022లో కేరళ వక్ఫ్‌బోర్డు మునాంబం గ్రామంలో ప్రజలు నివసిస్తున్న 400 ఎకరాల విస్తీర్ణంలో ని నివాస భూములన్నీ తమవేనని ప్రకటించడంతో, ఈ ప్రాంతంలో నివసించే ఫలితంగా ఇక్కడ నివసిస్తున్న 600కు పైగా క్రైస్తవ కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నది హిందూ, క్రైస్తవ మత్స్యకార్లు. ఎర్నాకులం జిల్లాలోని తీరప్రాంత శివారు గ్రామమే మునాంబం. సిద్ధిఖి సైట్‌ అనే వ్యక్తి ‘వక్ఫ్‌’ కింద కోజిక్కోడ్‌లోని ఫరూక్‌ కళాశాలకు దానంగా ఇచ్చాడని వక్ఫ్‌బోర్డు వాదిస్తోంది. అయితే తాము ఈ భూములను కళాశాల యాజమాన్యం నుంచి కొనుగోలు చేశామని దీనికి సంబంధించిన టైటిల్‌ డీడ్స్‌ కూడా తమవద్ద వున్నాయని మునాంబం వాసులు చెబుతున్నారు . ఎన్నో ఏళ్లుగా వీరిక్కడ నివాసం వుండటమే కాదు ఇంటిపన్ను కడుతున్నారు. తమ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు కూడా వీరివద్ద వున్నాయి. కానీ ఈ భూములను వక్ఫ్‌బోర్డు తమదిగా ప్రకటించడంతో 1995 వక్ఫ్‌బోర్డుచట్టం ప్రకారం, వీరు వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను మాత్రమే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వీరిలో ఎకోశానా లేదు. ఈ ట్రిబ్యునల్‌లో నిష్పక్ష పాత తీర్పు వస్తుంద న్న ఆశకూడా వీరిలో లేదు.ఎప్పుడైతే వక్ఫ్‌బోర్డు ఈ భూములు తమవని ప్రకటించిందో స్థానిక పంచాయతీ పన్ను వసూళ్లను నిలిపేసింది. ఇక బ్యాంకులు ఇక్కడివారికి రుణాలు మంజూరు చేయడంలేదు. ఈ తతంగం 2022 నుంచి కొనసాగుతోంది.

కుహనా సెక్యులర్‌ రాజకీయాలు

ప్రస్తుతం కేరళలో క్రైస్తవ ఓటర్లు 18% వున్నారు. తమను తాము సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేకాంగ్రెస్‌ లేదా లెఫ్ట్‌ పార్టీలు ఎక్కువగా ముస్లిం మైనారిటీ వర్గానికే కొమ్ము కాసే విధంగా రాజకీ యాలు నడుతుండటంతో, క్రమంగా ఈ పార్టీలు మిగిలిన వర్గాలకు దూరమవుతున్నాయి. చాప కింద నీరులా జరుగుతున్న ఈ పరిణామాన్ని ఇవి గుర్తించకపోవడం వాటి స్వయంకృతాపరాధం. ‘సెక్యులర్‌’ అంటే దేశంలోని అన్ని వర్గాల పట్ల సమాన వైఖరితో వ్యవహరించడం. కానీ దేశంలోని విపక్ష పార్టీలు కేవలం ముస్లిం మైనారిటీ వర్గానికి మాత్రమే దన్నుగా నిలుస్తూ, మెజారిటీలను నిర్లక్ష్యం చేయడం ద్వారా తమను తాము సెక్యులర్‌గా భావిస్తున్నాయి తప్ప, తాము ‘సూడో సెక్యులర్‌’ విధానాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారామన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నాయి.విపక్ష కాంగ్రెస్‌ నేత వి.డి. సంథీసన్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ బిల్లుకు, మునాంబం సమస్యకు ప్రత్యక్ష సంబంధం లేదని, ఈ విషయంలో ఇప్పటికే చర్చ్‌ మత గురువులను కలిసి చర్చించి వారిని ఒ ప్పించగలిగామని చెబుతున్నారు. ఈలోగా జబల్‌పూర్‌లో క్రైస్తవ మతగురువుపై జరిగిన దాడిని హైలైట్‌ చేయడానికి యత్నించారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు క్రైస్తవులు శాంతించినట్లయితే,బీజేపీ లో ఈ చేరికలు జరిగివుండేవి కావు. ఇదిలావుండగా కేరళలో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన ‘సమస్థ కేరళ జమియతుల్‌ ఉలేమా’, వక్ఫ్‌బిల్లు విషయంలో రాహుల్‌ గాంధీ మౌనాన్ని, ప్రియాంకా వాద్రా వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సంస్థ అధికార పత్రిక ‘సుప్రభాతం’ లో ‘‘ప్రియాంక వాద్రా లోక్‌సభకు రాకపోవడం, రాహుల్‌ గాంధీ మౌనం వహించడంతో, బీజేపీ ముస్లింల రాజ్యాంగ హక్కులను నిరోధించే వక్ఫ్‌బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది’’ అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో ప్రియాంక ఇచ్చిన వివరణను వారికి తెలియ జేసి శాంతింజేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు నానా తిప్పలు పడుతున్నారు.

 కేరళ కేథలిక్‌ బిషప్స్‌ కౌన్సిల్‌ (కేసీబీసీ) వక్ఫ్‌ చట్టాలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కౌ న్సిల్‌లో సైరో`మలబార్‌, లాటిన్‌, సైరో`మలంకర చర్చ్‌లు భాగంగా వున్నా యి. వక్ఫ్‌ బిల్లుకు మద్దతు పలకాలని తమ ఎంపీలకు కేసీబీసీ బహిరంగంగా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశే ఖర్‌ చురుగ్గా పావులు కదపడం మొదలుపెట్టి, కేసీబీసీ ప్రెసిడెంట్‌ కార్డినల్‌ బేసిలియోస్‌ క్లీమిస్‌ మరియు ఎస్‌ఎన్‌డీపీ యోగం సంస్థ ప్రధాన కార్యదర్శి వల్లెపల్లి నటేషన్‌ను కలిసి మంతనాలు జరిపారు. నటేషన్‌ బీజేపీకి అనుకూలుడు. అంతేకాదు రాజీవ్‌ చంద్రశేఖర్‌ బిల్లు విషయంలో కేసీబీసీ అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. వక్ఫ్‌బిల్లుకు మద్దతు పలకాలని కేసీబీసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కేరళలో మంచి ప్రాచుర్యం పొందిన కేథలిక్‌ దినపత్రిక ‘దీపిక’ తన సంపాదకీయం లో కాంగ్రెస్‌, సీపీఎంల వ్యవహారశైలిని తీవ్రంగా వి మర్శించింది. ‘‘వక్ఫ్‌బిల్లును వ్యతిరేకిస్తే ఈ నాయకులు రాబోయే తరాలకు జవాబుదారీలుగా మిగులుతారు. కొన్ని వర్గాల ఓట్లు తమకే పడతాయని, మరికొన్ని వర్గాలను ఎప్పటికప్పుడు బుజ్జగించక తప్పదని ఈ పార్టీలు తప్పుగా అంచనా వేస్తున్నాయి. కేవలం వక్ఫ్‌కు అనుకూలంగా వ్యవహరించడమే సెక్యులర్‌ విలువలని భావించడం తప్పు’’ అని ఆ పత్రిక సంపాదకీయం ఘాటుగా హెచ్చరించింది. ఇదే సమయంలో ఈ వక్ఫ్‌ బిల్లు సవరణ ద్వారా, వక్ఫ్‌ అక్రమంగా తనదిగా ప్రకటించిన ఈ అమాయక ప్రజల భూములను తిరిగి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని భాజపాను ఈ సంపాకీయం విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో బిల్లు ఆమోదం కేవలం బాధితులకు న్యాయం అందించడానికి తప్ప, రాజకీయం కోసం కారాదని కూడా హెచ్చరించింది.

జరుగుతున్న పరిణామాలు కేరళ కాంగ్రెస్‌ క్రైస్తవ ఎంపీల్లో అసంతృప్తిని రాజేస్తున్న మాట వాస్త వం. ముఖ్యంగా క్రైస్తవ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఈ పరిస్థితిని ఎట్లా సర్దుబాటు చేయాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు. కొట్టాయంకు చెందిన కాంగ్రెస్‌ ఎం.పి. జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ ఇప్పుడ తీసుకొచ్చిన సవరణల్లో కొన్ని ఉపయోగకరమే కానీ తుది నిర్ణ యం రాష్ట్రప్రభుత్వం చేతులో వుండటం ఇక్కడ ప్రధాన సమస్య. తుదినిర్ణయం విషయంలో కేం ద్రం ఏమీ చేయలేదన్నారు. అయితే కేరళ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ పి.జె. జెసెఫ్‌ తనయుడు జాన్‌ జోసె ఫ్‌ మాత్రం రాష్ట్రంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం మునాంబం ప్రజలకు న్యాయం చేస్తుందని చెబు తూ బీజేపీ స్వల్పకాలిక వ్యూహాల ద్వారా ముస్లిం మైనారిటీలను నిరాశకు గురిచేయవద్దని కోరా రు. 

కేరళలో వక్ఫ్‌ బాధితులు సగానికి పైగా ముస్లింలే

వక్ఫ్‌బోర్డును చారిత్రకంగా నియంత్రిస్తూ వస్తున్న జమాయత్‌ ఉలేమా ఇ హింద్‌, జమాత్‌ ఎ ఇ స్తామీ వంటి సంస్థలు వక్ఫ్‌ బిల్లు సవరణను వ్యతిరేకిస్తున్నాయి. విచిత్రంగా ముస్లింలలో కూడా చాలామంది వక్ఫ్‌ బోర్డు బాధితులున్నారు. వీరంతా కేరళ కాంగ్రెస్‌ మద్దతుదార్లు. ప్రస్తుతం వీరికి వక్ఫ్‌ బోర్డుతో ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వక్ఫ్‌ ట్రిబ్యునళ్లలో ప్రస్తుతం 40,951 కేసులు పెండిరగ్‌లో వుండగా వీటిల్లో 9942 కేసులు ముస్లిం వర్గాలకు చెందినవే. ఇక కేరళ విషయానికి వస్తే ప్రస్తుతం 1008 వక్ఫ్‌ ఆస్తుల వివాదాలు కొనసాగుతుండగా వీటిల్లో 551 కేవలం ముస్లింవర్గాలకు చెందినవి కాగా కేవలం 457 కేసులు మాత్రమే ముస్లిమేతరులవి. వీరంతా బాధితులు కనుక వక్ఫ్‌ చట్టాలను వ్యతిరేకించడం సహజం. వీరు వక్ఫ్‌ ట్రిబ్యునళ్ల కంటే సివిల్‌ కోర్టుల్లోనే తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గం ప్రజలంతా వక్ఫ్‌బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌, సీపీఎంలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహంతో క్రైస్తవులతో పాటు, వక్ఫ్‌బోర్డు బాధిత ముస్లిం వర్గాల ఓట్లను ఈ రెండు పార్టీ లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిరది. వక్ఫ్‌ బిల్లును సమర్థించాలని కోరిన తన విజ్ఞప్తిని ఖాతరు చేయని కాంగ్రెస్‌పై కేఎస్‌బీసీ తీవ్ర ఆగ్రహంతో వుంది. మొత్తంమీద చెప్పాలంటే వక్ఫ్‌బిల్లు ఆమో దం పొందడంతో కేరళ రాజకీయాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పరిస్థితి కుడితో పడ్డ ఎలుక చందంగా మారిందనే చెప్పాలి.

మింగలేని, కక్కలేని మిల్లర్ల కష్టాలెన్నో!

`త్రిశంకు స్వర్గంలో తెలంగాణ మిల్లర్లు!

`నిత్యం ఒత్తళ్లతోనే వ్యాపారం

`దివాలా తీస్తున్నా చెప్పుకోలేని ధైన్యం

`ప్రభుత్వం వినిపించుకోదు!

`అధికారులు పట్టించుకోరు!

`ప్యాడీ టెండర్ల ఆగడాలు తట్డుకోలేకపోతున్నారు

`అన్ని రకాలుగా నష్టాలు మిల్లర్లే అనుభవిస్తున్నారు!

`తేమ శాతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!

`నాణ్యమైన బియ్యం అందచేయడానికి మరింత నష్టపోతున్నారు

`బకాయిలు పేరుకుపోతున్నాయి

`కోట్లలో రావాల్సిన సొమ్ము అందక ఆగమౌతున్నారు

`ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం లేదు

`కనీసం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అప్పాయింట్‌మెంటు దొరకదు

`ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ తెలంగాణ మిల్లర్లకు మేలు జరగలేదు

`పన్నెండేళ్లుగా మిల్లర్ల సమస్యలు వినిపించుకునే నాధుడు లేడు

`అప్పులపాలై అనేక మంది మిల్లర్లు దివాలా తీస్తున్నారు

`ప్యాడీ టెండర్ల మూలంగా ప్రభుత్వం నష్టపోతోంది

`మధ్య వర్తుల మూలంగా మిల్లర్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు

`దేశంలో పుడ్‌ సెక్యూరిటీ అమలుకు కారణం మిల్లర్లు

`తెలంగాణ ఉద్యమంలో మిల్లర్ల పాత్ర ఎంతో పెద్దది

`ప్రభుత్వాలు అందించే బియ్యం పథకాల అమలులో మిల్లర్ల సహకారం గొప్పది

`అయినా తెలంగాణ మిల్లర్లపై చిన్న చూపు తగదు

`కొంత మంది దళారుల మూలంగా మిల్లర్ల వ్యవస్థ కుదేలౌతోంది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 సమాజంలో కష్టాలు కొందరికే వుంటాయనుకుంటారు. కొన్ని వర్గాలే అనుభివిస్తాంటారు. కాని పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. అలాగే సమాజంలో రైస్‌ మిల్లర్లకు కష్టాలుంటాయా? అని కూడా అనుకుంటుంటారు. కాని వారికుండే కష్టాలు వింటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లే వుంటుంది. పైకి సిల్కు షర్టు వేసుకున్నా లోపల చినిగిన బనియన్‌ వున్నట్లే మిల్లర్లకు కూడ అనేక చిల్లులుంటాయి. కాని పైకి కనిపించే మిల్లర్ల సిల్కు చొక్కలే చూస్తారు. వారి కష్టాలు చెప్పుకోలేక, వినేవారు లేక నానా ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది వున్నారు. సమాజం దృష్టిలో మాత్రం మిల్లర్లుపై రకరకాల అభిప్రాయలుంటాయి. కాని వారి గోడు వినేవారుండరు. చెప్పుకుందామన్నా ఆలకించేవారుండరు. అంత ధైన్యంగా మిల్లర్ల పరిస్ధితులంటాయి. రైతులు మిల్లర్లనే తప్పు పడుతుంటారు. అదికారులు మిల్లర్లపైనే జులుం చేస్తుంటారు. ప్రభుత్వం మిల్లర్లనే దోషులుగా చిత్రీకరిస్తారు. కాని అందరికీ అవసరమైంది మిల్లర్లే అని మర్చిపోతుంటారు. రైతు ఆరు గాలం కష్టం చేసి ధాన్యం పండిస్తాడు. కాని ఆ ధాన్యాన్ని దేశానికి అన్నంపెట్టేలా మార్చేది మిల్లర్లు. ప్రజల నోటికి ముద్ద వచ్చేందుకు మిల్లర్లు కష్టపడుతుంటారు. కాని రైతు కష్టమే చూస్తారు. మిల్లర్‌ను వ్యాపారి కింద జమకట్టేస్తారు. దాంతో మిల్లర్లు తమ గోడును చెప్పలేక, వారి బాధలు మింగలేక, కక్కలేక కష్టాలు పడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలో జీవిస్తుంటారు. పైన పటారం లోన లొటారం లాగా లాభం లేని వ్యాపారాలు సాగిస్తుంటారు. మిల్లర్లకు లాభాల కన్నా నష్టాలే వుంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే రైతుల ధాన్యం అమ్ముకుంటే రైతుకు రాబడికి మంచి లాభం వస్తుందనుకుంటారు. కాని అది వాస్తవం కాదు. నిత్యం ఒత్తిళ్లతోనే సతమతమౌతుంటారు. కాని పైకి నవ్వుతూ వుంటారు. తాముదివాళా తీస్తున్నామని కూడా చెప్పుకోలేక మధనపడుతుంటారు. ధాన్యం తేమ విషయం నుంచి మొదలు, బియ్యం అమ్ముకునేదాకా కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు రైతు ధాన్యాన్ని మిల్లుకు చేర్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు రైతులు తెచ్చే ధాన్యం మిల్లర్లకు శాపాన్ని తెచ్చిపెడుతుంటి. ఎందుకంటే ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, మట్టి లేకుండా చూసుకొని, తాలు లేకుండా తూర్పారపట్టి మిల్లుకు రైతు ధాన్యం తెచ్చేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు కోసిన కోతను అలాగే మిల్లుకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ఐకేపి వ్యవస్దను తెచ్చిన తర్వాత రైతు ఎలాంటి ధాన్యం తెచ్చినా తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురైంది. మిల్లర్ల కష్టాలు ఇక్కడి నుంచే మొదలౌతున్నాయి. రైతుకోత నుంచి నేరుగా తెచ్చే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. సహజంగా తేమ 17శాతం వుండాలి. కాని ప్రభుత్వాలు 25 శాతం వరకు వున్నా మిల్లర్లు సేకరించాల్సిందే అంటుంది. దాంతో నాణ్యమైన బియ్యం రావడం కష్టమౌతుంది. ఒకవేళ అలాంటి ధాన్యాన్ని సేకరించకోతే నాయకుల నుంచి, అధికారుల నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొవాల్సివుంటుంది. ఇవన్నీ తట్టుకున్నా, మీడియా నుంచి కూడా వచ్చే వార్తల మూలంగా అదో రకమైన ఇబ్బంది. రైతులను ముంచుతున్న మిల్లర్లు అని వార్తలు వస్తాయి. మిల్లర్లు మునుగుతున్నారని ఎవరూ జాలి పడరు. కాని తేమ శాతం ఎంతున్నా ధాన్యం సేకరిస్తే రైతులు ఎలా నష్టపోతాడన్నది ఎవరూ ఆలోలించరు. కాని మిల్లర్లు మోసం చేస్తున్నామంటారు. అసలు ఆ వార్తలకు లాజిక్‌ కూడా వుండదు. లేనిపోని లెక్కలు జోడిస్తారు. మిల్లర్లపై బురజల్లుతారు. కొవ్వొత్తిలాగా మిల్లర్లు తమనుతాము కాల్చుకుంటున్నారని ఎవరూ జాలిపడరు. కాని రైతలును కాల్చుకు తింటున్న మిల్లర్లు అని వార్తలు రాసేస్తుంటారు. రైస్‌ మిల్లర్ల ఆలోచనలు ఎవరూ ఆలకించరు. మిల్లు ఏర్పాటు కోసం అప్పులు తెచ్చి, నిర్మానం చేస్తారు. వాటి ఈఎంఐలు కూడా వెల్లదీసుకోలేక, ఎప్పటి పంట పైసలు అప్పుడు రాక ఎన్ని రకాలుగా మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారో ఎవరికీ అక్కర్లేదు. కాని అందరూ మిల్లర్లనే బెదిరిస్తుంటారు. అయితే మిల్లర్లు వేల కోట్లు బకాయిలు వున్నాయనే వార్తలు కూడా వున్నా యి. ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యమిచ్చి, బియ్యం తీసుకోవాలి. కాని మిల్లర్లకు దాన్యం ఇచ్చే క్రమంలో టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. ఆ దళారీ వ్యవస్దలో వున్నవాళ్లు కూడా కొంత మంది పాతుకుపోయిన మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలున్నారు. అసలు ప్రభుత్వానికి, ఇటు మిల్లర్లకు మద్య దళారీ వ్యవస్ద అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో యంత్రాంగముంది. సివిల్‌ సప్లైకి శాఖలో వివిద స్ధాయిల్లో ఉద్యోగులున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసుకోవచ్చు. కాని ప్రభుత్వాన్ని నమ్మించి, కొంత మంది అసోసియేషన్‌ పెద్దలు టెండర్ల వ్యవస్ధను తెచ్చిపెట్టారు. ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ వ్యవస్ధనంతా వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. టెండర్‌ వ్యవస్ధ ఎందుకు? ఏర్పాటైందో అసలు కారణం పక్కకు వెళ్లింది. మిల్లర్లను దోచుకునే వ్యవస్దగా ప్యాడీ టెండర్‌ మారిపోయింది. టెండర్‌ వ్యవస్ధ మిల్లర్ల నుంచి ధాన్యమే సేకరించాలి. కాని మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే మిల్లర్లు నష్టపోయినా ఫరవాలేదు. కాని టెండర్‌ వ్యక్తులకు నేరుగా మిల్లర్లు సొమ్ము జమచేయాల్సివస్తుంది. మరి మిల్లర్లు ఆ దాన్యం ఎక్కడమ్ముకోవాలి? ఎలా అమ్ముకోవాలి? నష్టాలు ఎలా భరించాలన్నదానిపై మిల్లర్లు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ అక్కర్లేదు. టెండర్‌ దారులకు రూ.1900 చెల్లించాలన్న లెక్క వుంది. కాని టెంటర్‌ దారులు మాత్రం మిల్లర్లు రూ.2300 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. తనికీలు చేయిస్తామని హెచ్చరిస్తుంటారు. ఓ వైపు మిల్లర్లు నెలల తరబడి తమ గోడౌన్లలో దాన్యాన్ని కాపాడేది మిల్లర్లు. ఆ సమయంలో ఎలాంటి నష్టం వాటిల్లిన్నా మిర్లదే బాద్యత. అయినా భరిస్తున్నారు. గోదాములు కిరాయిలు చెల్లించేవారు లేరు. గన్నీ బ్యాగులు పాడైపోతాయి. వాటి ఖర్చు ఎవరు భరించాలి? అని మిల్లర్లు అడిగే ప్రశ్నలకు అధికారులు వద్ద, టెండర్‌ దారుల వద్ద సమాధానం వుండదు. కనీసం కనికరం కూడా వుండదు. దాన్యం మిల్లర్ల గోడౌన్‌ నుంచి లిఫ్ట్‌ చేయరు. కాని డబ్బులు మాత్రం వసూలు చేస్తూ టెండర్‌ దారులు వేదిస్తుంటారు. ఈ విషయంపై మిల్లర్లు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా మిల్లర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. టెండర్‌ దారులు మిల్లర్ల నుంచి ధాన్యం మాత్రమే తీసుకోవాలి అనిచెప్పింది. కాని ఆ తీర్పును టెండర్‌ దారులు లెక్క చేయరు. అధికారులు అమలు చేయరు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధవల్ల క్వింటాల్‌కు రూ.230 రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తుంది. అటు రైతులు బాగుపడ్డట్టు కాదు. ఇటు మిల్లర్లకు మేలు జరిగింది లేదు. ప్రతిసారి టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ జేబుల్లోకి రూ.1100 కోట్ల రూపాయలు అప్పనంగా చేరుతోంది. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధను తొలగిస్తే ప్రభుత్వానికి రూ.1100 కోట్లు మిగులుతాయి. టెండర్‌ ప్యాడీ పెద్దలకు కనీసం గోడౌన్లు కూడా వుండవు. మిల్లర్లే ఆ ధాన్యాన్ని కాపాడి టెండర్‌ ప్యాడీకి అప్పగిస్తారు. అలాంటప్పుడు టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ఎందుకంటూ, మిల్లర్లు ప్రభుత్వానికి, సంబంధిత అదికారులకు అనేక సార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. కాని పట్టించుకున్న నాధుడు లేడు. టెండర్‌ ప్యాడీ పేరుతో ఓ నలుగురు దళారులు బతుకుతుంటే, 3300 మంది మిల్లర్లు అవస్ధలు పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పులపాలౌతున్నారు. కాని వారికి అది పట్టడం లేదు. కేవలం దళారుల అవతారం ఎత్తిన నలుగురైదుగురు మేలు కోసం మొత్తం మిల్లర్ల వ్యవస్ధనే ఫణంగా పెట్టడం ఏ మాత్రం సరైంది కాదు. అయితే ఈ దళారుల మూలంగా 3వేల మంది మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలవలేకపోతున్నారు. వారి సమస్యలు విన్నవించుకోలేకపోతున్నారు. కనీసం మిల్లర్లకు అప్పాయింటు మెంట్‌ కూడా దొరకడం లేదు. మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలిస్తే తమ బండారం బైట పడుతుందని దళారులు కుట్రలు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే దళారుల అవతారం ఎత్తిన వారిలో మిల్లర్ల యూనియన్‌ అసోసియేషన్‌ నాయకులే వుండడం గమనార్హం. టెండర్‌ ప్యాడీ సభ్యులు రూల్స్‌ ప్రకారం మిల్లర్లు వుండకూడదు. కాని బినామీల పేరుతో మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలు కొంత మంది దళారుల అవతారం ఎత్తి, మిల్లర్లనే దోచుకు తింటున్నారు. ప్రభుత్వానికి చెందిన సొమ్మును మింగుతున్నారు. మిల్లర్ల కడుపు కొట్టి, బతుకుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకుంటే దళారుల పాలౌతున్న రూ.1100 కోట్లు ఖజానకు చేరుతాయి. లేకుంటే ప్రభుత్వం కనికరిస్తే మిల్లర్లకు అందుతాయి. అటు మిల్లర్లకు కాకుండా, ఇటు ప్రభుత్వానికి కాకుండా దళారులు మింగుతున్నారు. వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. మిల్లర్ల ఉసురు పోసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే అసలు విషయాలన్నీ బైటకు వస్తాయి. మిల్లర్లు పడుతున్న సమస్యలు వెలుగులోకి వస్తాయి. మిల్లర్లు అను భవిస్తున్న కష్టాలు తెలుస్తాయి. మిల్లర్లకు మేలు జరిగితే రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఎంతో మంచిది. మిల్లర్లు కేవలం ధాన్యం ఆడిరచి, ప్రభుత్వానికి బియ్యం అందించేందుకు వున్న వ్యవస్ధ. ఈ వ్యవస్ధలో కొంత మంది అవకాశవాదులు చేరి, మిల్లర్ల జీవితాలను ఆగం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా నొక్కేస్తున్నారు. రైతుల వి షయంలో మిల్లర్లను విలన్లుగా చూపిస్తున్నారు. కాని మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ అర ్ధం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని మిల్లర్లు ఆశిస్తున్నారు. వారిని పిలిచి ఒక్కసారి మాట్లాడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని కోరుకుంటున్నారు.

అన్నాడీఎంకేతో భాజపా పొత్తు

వైకుంఠపాళిలో అన్నామలైని పాము కాటేసిందా, నిచ్చెన వరించిందా?

తమిళ యాక్టర్‌ విజయ్‌ పార్టీ ఎవరి ఓట్లు చీల్చనున్నదో?

అన్నాడీఎంకే పొత్తు భాజపాకు అనుకూలించే అవకాశాలే ఎక్కువ

అన్నాడీఎంకేకూ భాజపా ఆసరా అవసరం

 అలయన్స్‌ వద్దన్న అన్నామలై, వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం చేస్తారా?

 ఛరిష్మా లేక ఇబ్బంది పడుతున్న పళనిస్వామి

 భాషావివాదాలు, డీలిమిటేషన్‌ను పట్టుకొని వేలాడుతున్న స్టాలిన్‌

 విజయ్‌ ఛరిష్మా ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు, భాజపా నాయకత్వ పగ్గాలు చేపట్టి, అట్టడుగునుంచి 18శాతం ఓట్లు సాధించే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణలో బండిసంజయ్‌ ఎట్లానో, తమిళనాడులో అన్నామలై పార్టీకి అంత ముఖ్యం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒంటరిగా పోటీచేస్తే ఓట్లశాతం ఒక పరిమితికి పెరగవచ్చు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏఐడీఎంకేది కూడా ఎదురీదుతోంది. దీనికి బీజేపీ ఆసరా అవసరం. బీజేపీకి అధికారంలోకి రావడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గత ఎన్నికల లెక్కలకు సంబంధించి కూడికలు తీసివేతల ప్రకారం అన్నాడీఎంకేతో పొ త్తు మాత్రమే అధికారాన్ని అందించగలదన్నది స్పష్టమైంది. అన్నామలైకి పొత్తు ఇష్టంలేదు. పళనిస్వామికి, అన్నామలై పొడ గిట్టలేదు. పార్టీ విశాలహితం రీత్యా పదవీకాలం పూర్తయిన అన్నామలై అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా తమిళ సినీస్టార్‌ విజయ్‌ ‘తమిళగ వెట్రి కజగం ట్రాన్సిల్‌’ పేరుతో పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మరి ఆయన ఏ ద్రవిడ పార్టీ ఓట్లకు గండికొట్టి కొంప ముంచుతాడో తెలియడంలేదు. ఎక్కుమంది మాత్రం ఆయన ఎంట్రీ డీఎంకేకు నష్టమన్న అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అన్నాడీఎంకేGబీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమవుతుంది. ఇదిలావుండగా తెలంగాణలో బండిసంజ య్‌ను తప్పించినప్పుడు ఎట్లా నిరసనలు వ్యక్తమయ్యాయో, ఇప్పుడు అన్నామలై తప్పుకోవడం వల్ల తమిళనాడులో కూడా పార్టీ అభిమానుల్లో కూడా నిరసన వ్యక్తమవుతోంది. పార్టీకి ఒక దశ దిశ ఏర్పరచిన నాయకుడిని తప్పించడం ఎంతమేర సమంజసమన్న వాదనలు వినపిస్తున్నాయి. ఈ రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని నిచ్చెన వరిస్తుందో, ఎవరిని పాము కాటేస్తుందో అంచనా వేయడం కష్టం. అధ్యక్షపదవికి రాజీనామా పాము కాటుగా మారుతుందా లేక నిచ్చెన పైకి లాక్కెళుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

పొత్తుకు ఇష్టపడని అన్నామలై

2023 మార్చి నుంచి అన్నామలై, ఎ.ఐ.డి.ఎం.కె.తో పొత్తు కుదుర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. ఆవిధంగా పొత్తు కుదుర్చుకోవడం రాష్ట్రంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను పళంగా పెట్టడ మే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 1G1R2 అన్న సూత్రం పనిచేయదు. ఒక్కో సారి 1G1R11 కూడా కావచ్చు! గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజ యానికి, ఎ.ఐ.డి.ఎం.కెGబిజేపీ అలయన్‌ లేకపోవడమే కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. కోయంబత్తూరులో గత లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, డీఎంకే అభ్యర్థికంటే ఎక్కువ. అంటే అలయన్స్‌లో ఉన్నట్లయితే ఇక్కడ అన్నామలై గెలిచివుండేవారని స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి మరో 12 నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. 12సీట్లలో బీజేపీ ఓట్లశాతం విషయంలో ఏఐడీఎంకేను వెనక్కు నెట్టేసిన సంగతి కూడా వాస్త వం. అన్నాడీఎంఏ చరిత్రలో 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం కూడా ఇదే ప్రథమం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ జరగబోతున్నది. మరి కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికలబరిలో దిగుతున్న సినీనటుడు విజయ్‌ ఈ రెండు ద్రవిడ పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనేది ప్రధాన ప్రశ్న. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పోటీ డీఎంకేకు లాభం చేకూరుస్తుంది. కానీ మరికొందరు మాత్రం విజయ్‌ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు. ఈ చీల్చడం 15శాతం వరకు ఉంటే డీఎంకే కుప్పకూలడం ఖాయమన్నది వారి అంచనా. ఇదిలావుండగా అన్నామలై గత ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను విమర్శల బాణాలతో చీల్చి చెండాడారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కూడా విమర్శించడం పళనిస్వామికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది కూడా. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢల్లీిలో ఆయన అమిత్‌షాను కలిసినప్పుడు, అన్నామలైను తప్పించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు మాత్రమే కాదు ఇద్దరిదీ గౌండర్‌ కులమే! తమిళనాడులో కుల రాజకీయాలు ఎంతటి స్థాయిలో వుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నియమావళి ప్రకారం మరోసారి అన్నామలైని రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చు. కానీ ఆయనకు అన్నాడీఎంకేతో పొత్తు అస్సలు ఇష్టంలేదు. కానీ పార్టీ అధిష్టానం ఆలోచనలు వేరే వు న్నాయి. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చే సానుకూల పరిస్థితులున్నాయి. తెలంగాణలో పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో భాగస్వామిగా వుంది. కేరళలో ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈసారి డీఎంకేను చావుదెబ్బ కొట్టవచ్చున న్నది ఎన్నికల లెక్కలు చెబుతున్న సత్యం. దీనికి తోడు అన్నాడీఎంకే నుంచి మరిని సీట్లు కోరవచ్చు కూడా. ఆవిధంగా అధికారంలో భాగస్వామి కావచ్చు. 

అన్నామలై భవితవ్యం?

ఇప్పుడు పార్టీ తమిళనాడు అధ్యక్షపదవికి 39 ఏళ్ల మాజీ ఐపీసీ ఆఫీసర్‌ అన్నామలై రాజీనామా తో బీజేపీ కేంద్ర వర్గాల్లో ఆయన భవితవ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అన్నామలై, ఇటు మోదీకి అటు అమిత్‌షాకు అత్యంత ఇష్టుడైన యువ నాయకుడు. ఈ నేపథ్యంలో మూడు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఆయనకు రాజ్యసభ సభ్యత్వం క ల్పించడం. రెండవది కేంద్రంలో ఏదో ఒక పదవి ఇవ్వడం. మూడవది పార్టీలో కీలకమైన పదవికట్టబెట్టడం. ఇందులో రాజ్యసభ సభ్యత్వం విషయానికి వస్తే, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ఎంపీ ల విమర్శనలను గట్టిగా ఎదుర్కొనే వాక్పటిమ, విషయపరిజ్ఞానం అన్నామలైకి పుష్కలం. ఈ కా రణంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశమున్నదన్నది మొదటి అంచనా. ఇక రెండవది కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం. ఆవిధంగా చేయడం అంత సమంజసమైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీని అట్టడుగు స్థాయినుంచి బీఆర్‌ఎస్‌ ఢీకొట్టే స్థాయికి తీ సుకొచ్చిన బండిసంజయ్‌ను ఆకస్మికంగా అధ్యక్ష పదవినుంచి తప్పించి కేంద్రంలో సహాయమం త్రి పదవిని ఇచ్చారు. దీంతో ఆయన పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కుంచించుకుపోయింది. ఆయన్ను తప్పించిన కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ సీట్లు ఆశించిన స్థాయిలో పెరగలేదన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈ కారణంగానే తెలంగాణలో బండి సంజయ్‌ను తొల గించినప్పుడు చాలా గొడవైంది.ఇప్పుడు అన్నామలై పరిస్థితి కూడా తమిళనాడులో సరిగ్గా ఇదే మాదిరిగా వుంది. అయితే తమిళనాడులో భాజపా ఎదుగుదలను ద్రవిడవాదం ఒక స్థాయికి మించి ఎదగనీయదనేది అక్షరసత్యం. రాష్ట్రంలో దాదాపు 70`80శాతం మంది ప్రజలు ద్రవిడ వాదానికే మద్దతిస్తారు. తమిళనాడులో 25శాతం ఓట్లు వచ్చినా భాజపాకు సీట్లు రావడం కష్టం. లోక్‌సభలో 18శాతం ఓట్లు వచ్చాయంటే అంటే మోదీ కోసం అనుకోవాలి. అసెంబ్లీకొచ్చేసరికి ఈ శాతం ఇంకా పడిపోతుంది. ద్రవిడ రాజకీయాలు నడిచినంతకాలం బీజేపీకి 25శాతం మించి ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు. అంటే అన్నామలై ఎంతగా శ్రమించినా ఈ శాతానికి మించి ఓట్లు సాదించడం కష్టం, పార్టీ అధికారంలోకి రావ డం మాట అట్లావుంచి, సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నట్లయితే అధికారంలోకి రావడం ఖాయం. స్టాలిన్‌ తన తండ్రి మాదిరిగా ఛరిష్మా నాయకుడు కాదు, ఆయన కుమారుడు ఉదయనిధి మారన్‌ అంతకంటే కాదు! వీరిద్దరూ ద్రవిడవాదాన్ని భుజానేసుకొని నెట్టుకొస్తున్నారు. డీఎంకే నుంచి పుట్టిన అన్నాడీఎంకే పరిస్థితి అంతకంటే మెరుగ్గా లేదు. జయలలిత మరణం తర్వాత పార్టీకి నేతృత్వం వహిస్తున్న పళనిస్వామికి పార్టీని అధికారంలోకి తెచ్చే ఛరిష్మా లేదు. దీనికి తోడు పన్నీర్‌సెల్వంతో గొడవలు. బీజేపీతో పొత్తు విరమించుకోవడం వల్ల గత ఎన్నికల్లో పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న నగ్నసత్యం కళ్ల ముందు కదలాడుతోంది. దీనికి తోడు జయలలిత చివరిదశలో నరేంద్రమోదీ అండగా నిలవడమే కాకుండా, అన్నాడీఎంకేకు మేలు చేయడానికే కృషిచేశారు. ముఖ్యంగా శశికళ కబంద హస్తాలనుంచి పార్టీని కాపాడే క్రమంలో పన్నీర్‌సెల్వంకు భాజపా అండగా నిలిచింది. చివరకు పళనిస్వామి కూడా భాజపా చేసిన మేలును మరచిపోలేదు. మొత్తంగా అన్నాడీఎంకేకు నరేంద్ర మోదీపట్ల కృతజ్ఞతాభావం వుంది. కాకపోతే అన్నామలై కొరకరాని కొయ్యగా వున్నాడు కనుక ఆయ న్ను తప్పించాలని పళనిస్వామి కోర్కె! ఇప్పుడాయన వాంఛ నెరవేరింది. అన్నామలైని తప్పించడానికి అంగీకరించిన భాజపా, పన్నీర్‌సెల్వంతో కలిసి పనిచేయాలన్న షరతు విధించినట్టు తెలు స్తోంది. 

ఇక మూడో అంశానికి వస్తే పార్టీలో కీలక పదవి ఇవ్వడం. అన్నామలైకి పార్టీని నడిపే సామ ర్థ్యం, అద్భుతమైన వాక్పటిమ, విషయ పరిజ్ఞానం వున్నాయి. కాకపోతే ఆయన రాజకీయ ప్రొఫైల్‌ కేవలం ఐదున్నరేళ్లు మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కొందరికి 30 ఏళ్లు, 40ఏళ్లు మరికొందరికి జీవితకాలం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అనుభవం కంటే, ఛరిష్మాతోపాటు, తన ఆకర్షణశక్తిని ఓట్లుగా మార్చే సామర్థ్యమున్న నాయకుడు పార్టీకి అవసరమవుతా రు. ప్రస్తుతం జాతీయస్థాయిలో బీజేపీ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో నడ్డా తప్పుకోవడంఖాయం. మరి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? నితిన్‌ గడ్కరీ అంగీకరించరు. రాజ్‌నాథ్‌సింగ్‌కు వయసైపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ ఛరిష్మా మహారాష్ట్రకే పరిమితం. వీటితోపాటు ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే ఉత్తరభారత దేశంలో, ఓట్లు, సీట్లు సాధించే విషయంలో ఒక సంతృప్తస్థాయికి చేరుకుంది. అంటే అక్కడ తిరుగులేని స్థాయిలో స్థిరంగా వుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హేమంత్‌ బిశ్వాస్‌ శర్మ నాయకత్వంలో పూర్తిగా బలపడిరది. ఇప్పుడు పార్టీ బలపడాల్సింది దక్షిణ భారతదేశంలో. దక్షిణాదిలో భాజపాకు ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడిపోయింది. ఈ అపప్రధ తొలగించుకొని దక్షిణాదికి కూడా తాము ప్రాధాన్యమిస్తామన్న అంశాన్నిపార్టీ నిరూపించుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో కూడా ఈ రాష్ట్రాల్లో పార్టీ పెద్దగా బలపడలేదు. ఇప్పుడు అన్నామలై యువనేతగా, ఛరిష్మా కలిగినవాడిగా, ద్రవిడ రాజకీయాలను ఎదుర్కొనే సామర్థ్యం వున్న వాడిగా నిరూపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షపదవి ఇవ్వడం ద్వారా పార్టీ అధినాయకత్వం ఒక ప్రయోగం చేయవచ్చు! ఆవిధంగా చేయడం ద్వారా తమ పార్టీలో సామర్థ్యమున్నవారెవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునన్న బలమైన సంకేతాలను ఇవ్వవచ్చు. ఒక తమిళుడిగా, కేరళ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగలరు. ఇన్ని లక్షణాలున్నా, ఇన్నిసానుకూలతలున్నా, మోదీ`అమిత్‌ షా ద్వయం తమకు అత్యంత ఇష్టుడైన అన్నామలైకి ఇంతటి బృహత్తర బాధ్యత ఇచ్చే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. 

పొత్తు లెక్కలు

గత లోక్‌సభ ఎన్నికల్లో ఎ.ఐ.డి.ఎం.కె.కి తమిళనాడులో వచ్చిన ఓట్లు 23శాతం. భాజపాకు 18 శాతం. అదే డీఎంకేకు 46శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 23G18 శాతాలను కలిపితే 41శాతం అవుతుంది. ఒక ఐదారుశాతం ఓట్లు సంపాదించగలిగితే డీఎంకేను మట్టికరిపించవచ్చు. ఇది పొత్తుకు ప్రధాన కారణం. మరి అన్నామలై పార్టీని జీరో స్థాయినుంచి ఆ స్థాయికి పెంచారు. ఒక బేస్‌ ఏర్పాటుచేశారు. కానీ ఆయనకు కొన్ని పరిమితులున్నాయి. ఎంతగొప్పగా చదువుకు న్నా, తమిళనాడుకు వచ్చేసరికి ద్రవిడియన్‌ రాజకీయాల్లోకి మారిపోతారు. అంటే యాంటీ హిందీ, యాంటీ నార్త్‌, యాంటీ బిహార్‌ గురించి మాట్లాడుతుంటారు. అన్నామలై ఆవిధంగా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు. చాలా విస్తృతమైన ఆలోచనా పరిధి వున్నవాడు. ఇక్కడ తమిళుల్లో ఒక గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఇతర ప్రాంతాలకు చెందినవారిని కూడా రాష్ట్రనాయకత్వాన్ని చేపట్టడానికిఅవకాశం ఇస్తారు. ఉదాహరణకు ఎంజీఆర్‌ మళయాళీ, జయలలిత కర్నాటకకు చెందినవారు.డీఎంకే నుంచే ఏఐడీఎంకే పుట్టింది. రజనీకాంత్‌ది మహారాష్ట్ర. అదేవిధంగా స్టాలిన్‌ పూర్వీకులు నెల్లూరు ప్రాంతంవారు. వైగో పూర్వీకులు కూడా ఆంధ్రప్రాంతం వారే! అంటే తమిళనాడులో వేరే ప్రాంతం నాయకత్వాన్ని ఆమోదించే సంస్కృతి కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ద్రవిడ పార్టీన నాయకులంతటి స్థాయి హై ప్రొఫైల్‌ నాయకుడు అన్నామలై కాకపోయినా మంచి ప్రభావాన్ని మాత్రం సృష్టించగలిగారన్నది అక్షరసత్యం.

బంగారు వార్తలన్నీ గిల్టువేనా?

`మార్కెట్‌ మాయాజాలం… సామాన్యుడికి సుడిగుండం.

`జనాలను మోసం చేయడానికే!

`ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే?

`గత ఆరు నెలల్లో విపరీతంగా పెంచేశారు.

`దసరా పండుగకు ముందు 75వేలు.

`దిగుమతుల సుంకాలను తగ్గించడంతో రూ.69 వేలకు వేరింది.

`ఆరు నెలల్లోనే మళ్ళీ 90 వేలకు ఎందుకు చేరింది?

`విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు.

`మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి.

`బంగారం ధరలు స్థిరంగానైనా వుండాలి.

`అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతోందనేది నిజమా?

`మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.

`మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా?

`ఈ లెక్కలు నమ్మశక్యంగా వున్నాయా?

`పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు.

`ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి.

`2000 సంవత్సరంలో బంగారం తులం ధర. రూ. 4 వేలు.

`2015 వరకు పదిహేళ్లలో పెరిగిన ధర రూ. 24 వేలు.

`ఈ పదేళ్లలో చేరిన ధర సుమారు రూ. 90 వేలు.

`పదేళ్లలో బంగారం ధర ఎందుకు ఇంత పెరుగింది!

`సామాన్యలకు అందకుండా ఎందుకు పైపైకి వెళ్తోంది.

`ప్రజలలో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి.

`ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద వుంటే మనకు చౌకగా దొరకాలి.

`ఏది నిజం.. ఏది అబద్దం!?

మెరిసేదంతా బంగారం కాదు..బంగారం ధరలు దిగివస్తున్నాయ్న వార్తలో నిజం అసలే లేదు. వ్యాపారులు ఆడుతున్న నాటకాలు. జనం జేబులకు చిల్లు పెట్టే కుట్రలు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు. ఎందుకంటే గతంలో బంగారం కొనుగోలు, వస్తువుల తయారి అనేది వృత్తిగా మాత్రమేవుండేది. ఇప్పుడు అది వ్యాపారమైపోయింది. వేల కోట్లు పెట్టుబడి పెట్టి, షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ, లాబాలు ఎప్పటికిప్పుడు రావాలి. ఆ షాపుల్లో పనిచేసే లక్షలాది మందికి జీతాలు చెల్లించాలి. ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. ఇదంతా జనం మీద మాత్రమే రుద్దాలి. ఇదీ బంగారం మార్కెట్‌ చరిత్ర. బట్టల షాపులో పనిచేసే వ్యక్తికి, బంగారం షాపులో పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన జీతం వుంటుంది. బట్టల వ్యాపారం చేసే వారికి వచ్చే లాభాలకు, బంగారు వ్యాపారులకు వచ్చే లాభాలకు చాలా తేడా వుంటుంది. ఒక నగరంలో వేలాది బట్టల దుకాణాలుంటాయి. కాని బంగారం దునాలు పదులు సంఖ్యలోనే వుంటాయి. కాని బంగారం వ్యాపారం బంగారమే..కాని జనం కొంటేనే అది నిజమైన బంగారం వ్యాపారం. సహజంగా ధర పెరిగిందంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గుతుంది. వారి కోరికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటుంటారు. ధర తగ్గకపోతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కోసం అప్పుడప్పుడు బంగారు వ్యాపారులు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. పావలా తగ్గించి, బంగారం ధరలు ఢమాల్‌ అని ప్రచారం సాగిస్తుంటారు. కాని బంగారం ధరలు పెరిగినప్పుడు మాత్రం స్పల్ప పెరుగుదల అని వార్తలు రాయిస్తారు. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌ అంటారు. బంగారు వార్తలన్నీ గిల్టువే..జనాలను మోసం చేయడానికి వేస్తున్న ఎత్తులే.. ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరిగింది. అంతగా డిమాండ్‌ ఏర్పడితే పెంచారా లేక, మార్కెట్లు పెంచుకునేందుకు లేని లెక్కలు చూపించారా? సగటు వ్యక్తి రోజు తినడానికే సంపాదించింది చాలడం లేదు. రోజంతా కష్టం చేసినా వెయ్యి రూపాయలు రావడం లేదు. పట్టణ ప్రజల జీవితాలు మరీ దుర్భరంగా మారుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే లివింగ్‌ కాస్ట్‌ చాలా తక్కువ అనే పేరుండేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో నుంచి వెళ్లే వారు ఎవరూ హైదరాబాద్‌లో బతికే పరిస్దితి లేదు. చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నివాసముందామంటే అందుబాటులో ఇళ్ల కిరాయలు లేవు. పూట ఎట్లా గడుస్తుందిరా దేవుడా? అని బాధపడే సగటు వ్యక్తికి బంగారం ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటి బంగారాన్ని అందుకోవాలన్న ఆశ కూడా ఎప్పుడో చంపుకున్నారు. సగటు ఉద్యోగులు కూడా బంగారం కొనుగోలు చేసే శక్తిలో లేరు. మరి ఎవరు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఇదంతా మార్కెట్‌ మాయాజాలం అంతే..మొన్నటి వరకు బంగారం ధరలు రాకెట్లలా దూసుకుపోయాయి. సరిగ్గా గత దసరా పండుగ సమయంలో తులం 24 క్యారెట్‌ బంగారం ధర రూ.43వేల వరకు వుంది. అదే సమయంలో దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తులం బంగారం ధర రూ.5వేలకు వరకు పడిపోయింది. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని నమ్మించారు. ఆలోచించినా ఆశాభంగం అన్నట్లు ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే జనం ఎగబడి కొన్నారు. అంటే వారిలో కొనుగోలు శక్తి వుండి కాదు. సామాన్యుడికి రూ.5వేల ధర తగ్గడం అంటే ఎంతో ఊరట చెందే అంశం. అలా కొంత కాలం కాగానే బంగారం ధర పైపైకి ఎగబాకింది. రూ.90వేలు దాటింది. ఇలా బంగారం ధరలను రూపాయి పెంచడం, పావలా తగ్గించడం జనాన్ని నమ్మించి ముంచడం తప్ప బంగారం వ్యాపారంలో నిజాయితీ లేదు. ఇకతాజాగా అమెరికా సుంకాలను పెంచడం మూలంగా మనదేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బంగారం మనదేశంలోనే అమ్ముకుంటేనే మేలు అని వ్యాపారులు జనం మీద దయతలిచి తగ్గించారని ఓ రకమైన ప్రచారం. అసలు మనదేశమే గత ఏడాది లండన్‌ నుంచి సుమారు 400 కోట్ల టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మన అవసరాలు తీరేందుకే ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. మరి మన దేశ అవసరాలకే సరిపోకుండా వుంటే, అమెరికాలకు ఎలా ఎగుమతి చేస్తున్నట్లు? ఎందుకు చేస్తున్నట్లు? అదే నిజమైనే తలె అమ్ముకొని చెప్పులు కొనుక్కొవడమే అవుతుంది. మనకు లండన్‌ నుంచి చౌకగా బంగారం అందితే మన దేశ ప్రజలకు అందించాల్సిన అవసరం వదిలేసి, విదేశీ మారక ద్య్రవ్యంకోసం ఏ ప్రభుత్వమైనా చూస్తుందా? సహజంగా మనకు మిగులు వున్నప్పుడు, ఇతర దేశాలలో వారికి అందుబాటులో లేని వస్తువులను ఎగుమతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం సమృద్దిగా వస్తుంది. మనదేశం కంటే అమెరికాలోనే బంగారం చౌక. అలాంటిది అంతకన్నా చౌకగా అమెరికాకు ఎగుమతి చేస్తేనే ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతే కాని మనదేశం చెప్పిన ధరకు అమెరికానే కాదు, ఏ దేశం కొనుగోలు చేయదు. ఇదంతా మార్కెట్‌ వర్గాలు ఆడుతున్న వింత నాటకం. గత దసరా సమయంలో రూ.75వేల వరకు పలికిన తులం బంగారం ఎందుకు రూ.90వేల వరకు చేరింది. ఆరునెలల సమయంలో ఇంతగా ధర పెరగడానికి, పెంచడానికి కారణం ఏమిటి? బంగారం వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ నియంత్రణ లేకనా? లేక ప్రభుత్వ ఉదాసీనత? ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. వారికి అన్ని వస్తువులు అందుబాటులో వుండేలా విధానాలు రూపకల్పన చేయాలి. నిజం చెప్పాలంటే మనదేశంలో మధ్య తరగతి లేకుంటే దేశమే ఆగమౌతుంది. అలాంటి మధ్య తరగతిని వ్యాపారులు, ప్రభుత్వాలు చిదిమేస్తున్నాయి. జీవిత కాలం కోలుకోకుండా చేస్తున్నాయి. వారి పొదుపును ద్వంసం చేస్తున్నారు. రూపాయి రాక, పోకల మధ్య సున్నా బ్యాలెన్స్‌ కనిపించేలా చేస్తోంది. నెల గడవక ముందే అప్పుల పాలయ్యేలా ప్రభుత్వ విధనాలున్నాయి. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే 2000 సంవత్సరంలో బంగారం ధర తులం. రూ.4000. అది ఏడాదికి కొంత పెరుగుతూపెరుగుతూ 2015వరకు రూ.25 వేలకు చేరింది. అంటే బంగారం ధరల్లో స్ధిరత్వమే కనిపించింది కాని, ఉద్దాన పతనాల ప్రభావం ప్రజల్లో పెద్దగా పడలేదు. కాని 2015 నుంచి 2025 వరకు ఆ ధర రూ.90 వేలకు చేరింది. అంటే పదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. మరి ప్రజల జీతబత్యాలు పెరుగుతున్నాయా? వారి ఆదాయం పెరిగిందా? లేదు. కాని వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అంతే కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ దోడిపీ మరింత పెరిగింది. దేశమంతా ఒకటే పన్ను విధానం అంటే ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కాని ఏం జరగింది. రివర్స్‌లో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఆగడం లేదు. తగ్గడం లేదు. పెరగని జీతాలు, సంపాదనలతో పెరుగుతున్న ధరలను చూసి జనం విలవిలలాడుతున్నారు. ధరలు చూసి బేంబెలెత్తిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. ఇది ఒక్క బంగారానికే కాదు, అన్ని రకాల వస్తువుల ధరలు ఇలాగే ఆరోహన క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని తాకుతున్నాయి. అసలు ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువు దరలైనా తగ్గాలి. లేకుంటే కొంత కాలం స్ధిరమైన ధరలే వుండాలి. డిమాండ్‌ అండ్‌ సప్లై అనే సూత్రం ఇక్కడ ఎక్కడా వర్తించడం లేదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ హయాంలో బ్యాంకుల్లో వున్న బంగారం అమ్ముకున్న చరిత్ర వుంది. ఆప్పట్లో దీనిపై పెద్ద వివాదాలు కొనసాగాయి. అంటే ప్రపంచంలోని దేశాలైనా బంగారు బాండ్లను కొనసాగిస్తుంటాయి. టన్నుల కొద్ది బంగారం రిజర్వు బ్యాంకు కొనుగోలు చేసి, అత్యవసర ఆర్ధిక పరిస్ధితుల కోసం నిలువ చేస్తుంది. దేశంలో ద్రోవ్యోల్భనం పెరిగినప్పుడు దాని అసవరం వుంటుంది. కాని కరోనా కాలంలో ప్రపంచ దేశాలన్నీ దివాళా తీసినా, మనదేశంలో ద్రవ్యోల్భనం రాలేదు. ఆకలి కేకలు వినిపించలేదు. అంటే ఇన్ని కోట్ల జనాన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. అలాంటప్పుడు ఇలా కళ్లెం లేని గుర్రాల్లా ధరలు పెరిగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయన్న మాటలు నమ్మి, జనం ఎలా, ఎలా అని ఆలోచిస్తున్నారు. కాని నిజానికి బంగారం ధర ఒక్కసారి పెరిగిందంటే తగ్గడం అంటూ వుండదు. కాని హెచ్చు తగ్గుల్లో స్వల్ప తేడాలే గాని, ఉన్న ఫలంగా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వుండవు.

జీతం చిల్లి గవ్వతో సమానం.. లంచం లక్షలతో తులా భారం!

-రోజు లక్షలు మూట కనిపిస్తుంటే జీతం తాలుతో సమాతూకం

-ఇక అధికారులు మారమంటే ఎందకు మారుతారు?

-లంచాలు వద్దంటే అధికారులెందుకూరుకుంటారు?

-పట్టుబడతామని భయమెందుకు పడతారు?

-ఏ అధికారి జీతం కోసం ఎదురు చూడడం లేదు!

-రోజూ సూట్‌కేస్‌ల తూకం చూసుకుంటున్నారు.

-జనాన్ని పీడిరచుకు తింటున్నారు!

-పట్టుబడినా రెండేళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు.

-దర్జాగా మళ్ళీ కొలువులు తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు.

-పెట్టిన పెట్టుబడికి మళ్ళీ పదింతలు వసూలు చేసుకుంటున్నారు.

-సస్పెండ్‌ అయిన కాలాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

-విందులు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.

-సస్పెన్షన్‌ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు.

-జీవితాంతం కష్టపడినా రాని సంపాదన లంచాల రూపంలో పదేళ్లలో పోగేసుకుంటున్నారు.

-ఏసిబి ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువుకెక్కుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మ వంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంత మంది వుంటారు. మానవత్వం మర్చినవారు, మంచితనం లేని వారు వుంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన మూడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంత మంది వుంటారని తేలింది. ఓ అదికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు ఆ లంచంకూడా ఉగాది పండుగ రోజు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. ఏసిబికి పట్టుబడ్డాడు. ఇక మరో ఇరిగేషన్‌ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్‌టీఎల్‌, భఫర్‌ జోన్‌లో లేదని ఎన్‌వోసి ఇవ్వడానికి శ్రీరారమ నవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు రోజులు. అయినా ఆ లంచాల వతారులకు పండగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచి తనం అనేది మచ్చుకు కూడా లేదని తేలిపోయినట్లైంది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. ఎందుకంటే కొంత మంది ఉన్నతోద్యోగులకు జీతం చిల్లిగవ్వతో సమానమైపోయింది. దాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్కలేకుండాపోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి పదుల రెట్లు నెలనెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటుపడిన కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడపడం లేదు. ఇది ఈ శాఖ, శాఖ అని తేడాలేదు. ఏశాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాళ్లమని చెప్పుకునే అదికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం ఒక్క శాతమే.. ఇంతగా ఏసిబి దృష్టిపెట్టినా అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కళ్లమందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాంటే లంచం అందాల్సిందే..లేకుంటే అదికారుకు కనికరం అనేది లేకుండా పోతోంది. వ్యవస్ధలన్నీ దిగిజారిపోతున్నాయి. ఏ శాఖలో చూసినా లంచమే కనిపిస్తోది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికులు వున్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవిన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆఖరుకు విద్యాశాఖకు చెందిన ఉన్నతోద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా భరితెగించారో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒక వేళ ఏసిబికి పట్టుబడినా, ఆ కేసును రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా చేసుకంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్ధానమే ప్రభుత్వానిది తప్పని తేల్చి, లంచావతారులకు మళ్లీ పోస్టింగ్‌ ఇస్తుంది. చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో కొంత మంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతలా దిగజారిపోతారని చట్టంచేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువకు భరోసా కల్పిస్తోంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి..మానవత్వం మరిచి! దిగజారిపోతున్న రెవిన్యూ వ్యవస్ధ. లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు. తహసిల్ధారుల మితిమీరుతున్న ఆగడాలు. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్నా కష్టమే? కొనుక్కున్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరుకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్నా లంచమే. తహసిల్ధార్‌ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు.. ఏసిబికి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. చిన్నా, చితకా పని ఏదైనా సరే..లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికీ లేదు. కొంత మంది తహసిల్ధార్‌లలో కనీసం మానవత్వం కరువైపోతోంది. ఎక్కడికక్కడ కొంత మంది తహసిల్ధార్‌లు ఏసిబికి పట్టుబడుతున్నా, మిగతా వాళ్లు భయపడం లేదు. కాసుల కక్కుర్తికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా వుండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అకునే స్ధాయికి దిగిజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. తహసిల్ధార్‌లు అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే, వారి ఆగడాలకు అడ్డూ అదుపేముంటుంది. రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని వారికి మేలు చేస్తామని స్దానిక నాయకులు చెబుతుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసిల్ధార్‌ వద్దకు వెళ్లొచ్చు. కాని ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే వుంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టడానికి సామాన్యుడు ముందూ వెనుక ఆలోచిస్తూనే వుంటాడు. తమ సమస్యచెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచే చిన్న చూపు ఎదురౌతుంది. సార్‌ లేడంటూ..లేదంటే పక్కన నిలబడంటూ…రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనులకోసం ఆ గ్రామంలోవున్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకులు మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేర సారాలు చేసుకుంటారు. అప్పుడుగాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అదికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా ఫరవాలేదని చాలా మంది అదికారులు తెగించేశారు. మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్‌ వుంటే ట్రీట్‌ మెంటు వుండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా వుండడంలేదు. రోజూ సూట్‌కేసుల తూకం కళ్లముందు కనిపిస్తుంటే, పట్టుబడితే కదా? అన్న ఆలోచన తప్ప, భయం వుండడడం లేదు. ఒక వేళ పట్టుబడి సస్పెండ్‌ అయినా ఎలాంటి బాధ వుండదు. ఎందుకంటే ఇవ్వాల కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్‌ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నతోద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్.

వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300,

కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ.

అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ డోంట్ కేర్ అనేలా కనబడుతుంది.

నా లారీ లోడ్ అయిపోయింది ఇప్పటికీ 600 ఇచ్చాను ఓ డ్రైవర్.

మహాదేవపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వ ఆదేశాలు ఇసుక పాలసీ ఈ రెండు క్వారీల్లో మాత్రం అమలు పరచడం అసాధ్యంగా మారింది. ఇసుక లోడింగ్ వద్ద ఉన్న.” పోక్లైన్’ డబ్బాల నిండా పైసలు జమ చేసుకోవడం, వేబిల్ తోపాటు సీరియల్ వద్ద మరో రెండు రెండు వందల రూపాయలను వసూలు చేస్తున్నారు, అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కేవలం ఇసుక లారీల్లో నింపి, కాంట చేయకుండానే బేబీల్లో లారీ యొక్క సైజులు పట్టి వే బిల్ ,లో ఇన్ని టన్నుల ఇసుక అని వేయడం జరుగుతుంది. కాటా చేయకుండా లారీల రవాణా వ్యవహారం అదనపు బకెట్ ఇసుక లారీల్లో నింపడం జరుగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రెండు క్వారీల్లో టీఎస్ ఎండిసీ శాఖ చర్యలకు బదులు, క్వారీ కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుంది.

తాడ్పాల్ వేసుకుంటున్న 600 తీసుకున్నారు వేబిల్ వద్ద 300 ఇచ్చాను డ్రైవర్.

 

లోడింగ్ పుక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం బొమ్మ పూర్ గ్రామం పేరుతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన, బొమ్మ పూర్ ఒకటవ నంబర్, అలాగే ఎలికేశ్వరం రెండవ నంబర్, పేర్లతో గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ రెండు ఇసుక క్వారీలు అక్రమ ఇసుక రవాణాకు పెద్ద మొత్తంలో తెరలేపడం జరిగింది, ప్రభుత్వం ఉన్నత అధికారులు ఈ రెండు ఇసుక క్వారీల పై ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నత అధికారులు పర్యవేక్షించడం కూడా జరిగింది. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవ అక్రమ రవాణా పై అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం మాత్రం అధికారుల ఆదేశాలు ఇసుక పాలసీ ను తుంగలో తొక్కి, టీఎస్ ఎండిసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అక్రమ వసూళ్ల నేటికీ కొనసాగిస్తుంది.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

మహాదేవపూర్ మండల పరిధిలోని పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్న బొమ్మ పూర్, ఇలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న ఈ రెండు క్వారీలు, టి ఎస్ ఎం డి సి సిబ్బంది అధికారులను తమ గుమస్తాగా మార్చుకొని, ఇసుక లోడింగ్ వద్ద ప్రతి లారీకి 300 రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ కొరకు సీరియల్ వద్ద మరో 200 నుండి 300 వరకు, అలాగే వేబిల్ ఇచ్చే క్రమంలో మరో 200 రూపాలను లారీల నుండి తీసుకోవడం జరుగుతుందని డ్రైవర్లు నిర్భయంగా చెప్పడం జరుగుతుంది, లోడింగ్ పాయింట్ వద్ద లోడ్ చేసి అటువంటి ఫోక్లైన్ లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేసి, లోడింగ్ కు వచ్చే, ప్రతి లారీ వద్ద 300 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది, కొందరు డ్రైవర్లు 200 ఇచ్చిన లోడింగ్ చేసే ప్రసక్తి లేదని 300 ఇస్తేనే లోడింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం కొత్త రకమైన అక్రమానికి తెరలేపింది, గత కొన్ని రోజులుగా లోడింగ్ చేసుకొని వచ్చిన లారీ కాటా పైకి వెళ్లి, “సెల్యూట్ కొట్టి” వెళ్లిపోవాల్సిందే లారీలో ఎంత ఇసుక ఉంది, ఏమైనా ఎక్కువ ఇసుక వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అని కాంట చూసే ప్రసక్తి లేదు, లారీ సైజును బట్టి లారీలో వచ్చిన టన్నులను బేబీల్ లో వేయడం జరుగుతుంది, కాంట రిసిప్ట్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు, అడుగుతే కరెంటు లేదు, బ్యాటరీ ఇంవేటర్ చెడిపోయింది అని సమాధానం చెప్పడం, గట్టిగా ప్రశ్నించే పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధించిన కొందరు ప్రశ్నించే వారిపై, లేదా ఫోటో వీడియో లాంటి వాటిని చిత్రీకరిస్తామని ప్రయత్నించిన ఆ డ్రైవర్లకు ఇతరులపై దాడికి సిద్ధంగా కొందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతుంది.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ “డోంట్ కేర్” అనేలా కనబడుతుంది.

ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనంతరం కూడా బొమ్మ పూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల అక్రమాలు, ఆగడం లేదంటే దీని వెనుక కారణం ఎవరు, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి, వారితో కలిసి వసూళ్లు చేయడం జరుగుతుంది అంటే, దీని వెనుక అధికార యంత్రాంగం హస్తము కూడా ఉందని స్పష్టమవుతుంది. తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఈ రెండు ఇసుక క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాల పై డ్రైవర్ల తో వివరాలు సేకరించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సమ్మర్‌ హాట్‌ గురూ!!

ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

గతంతో పోలిస్తే పెరగనున్న వేడి గాడ్పుల సంఖ్య

వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు

రాజధాని ఢల్లీిలో కాలుష్య నివారణ చర్యలు

పంజాబ్‌, హర్యానా, యు.పి.ల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులకు ప్రోత్సాహం

సాధ్యమైనంత ఎక్కువ గడ్డిని పశుగ్రాసంగా మలచేందుకు చర్యలు

ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులను ఒప్పించడానికి వీలు

వరిధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్‌.సి.ఐ.

రైతులకు లాభం కలిగించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ ఏడాది వేసవి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 1 వచ్చిందటే వేసవి సీజన్‌ వచ్చేసినట్టే. ఇది జూన్‌ 30వరకు కొనసాగుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత అధికంగా వుండబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మండే ఎండలు మనుషుల జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది రోజువారీ పనులపై ఆధారపడి జీవనాన్ని గడిపేవారిపై వేసవి ఎండలప్రభావం అధికంగా వుంటుంది. ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి ప్రధాన కారణంమార్చి నెలలో నెలలో వాతావరణం బాగా పొడిగా మారడం. వాతావరణంలో తేమ కొరవడడంతో గాలి తేలిగ్గా వేడెక్కుతుంది. ఫలితంగా ఈసారి దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణ స్థితికంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో నైరుతి మరి యు తూర్పు ప్రాంతాలు వేడి గాడ్పుల ప్రభావానికి లోనవుతాయని కూడా వాతావరణశాఖ అం చనా వేసింది. సాధారణంగా ఏప్రిల్‌`జూన్‌ మధ్యకాలంలో నాలుగు నుంచి ఆరు వరకు వేడి గాడ్పులు అనుభవంలోకి వస్తాయి. కానీ ఈఏడాది వీటి సంఖ్య ఆరు నుంచి పది వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తోంది. 

వాతావరణశాఖ వేడి గాడ్పులను ఏవిధంగా నిర్ణయిస్తుందనే ప్రశ్న ఉదయించడం సహజమే. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి 47డిగ్రీల వరకు చేరతాయో అప్పుడు వేడి గాడ్పులు వీస్తున్నాయని నిర్ణయిస్తుంది. అయితే ఈ వేడిగాడ్పుల అంచనా అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్ణయించరు. ఉదాహరణకు మైదాన ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరుకున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలకు చేరినప్పుడు, తీరప్రాంతాల్లో 37డిగ్రీలు నమోదయినప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5డిగ్రీల నుంచి 6.4డిగ్రీల సెల్షియస్‌ అదనంగా నమోదయినప్పుడు వేడిగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతుంది. 

ఏప్రిల్‌ాజూన్‌ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎ క్కువ నమోదయ్యే అవకాశాలుండగా, పశ్చిమాద్వీపకల్ప ప్రాంతం, తూర్పుామధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక దేశంలోని అధిక ప్రాంతాల్లోమాత్రం సాధారణ గరిష్టం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితేదేశ వాయువ్య భాగానికి చెందిన సుదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోత్రలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక దక్షిణ ద్వీకల్ప భారత్‌లోని సూదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. దేశ ఈశాన్య, వాయువ్య భాగాలకు చెందిన కొన్ని సుదూర ప్రాంతాల్లో సాధారణ గరి ష్టం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా సుదీర్ఘ వేడి గాడ్పుల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికీ ఈ పెరిగే ఉష్ణోగ్రతలు ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజాఆర్యోగం దృష్ట్యా జాతీయ విపత్తు నివారణసంస్థ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరచాల్సి వుంది. ఈ ఏప్రిల్‌ నెలకు సంబంధించి వాతావరణశాఖ అందించిన మరో శుభవార్త ఏమిటంటే సాధారణ వర్షపాతం నమోదు కావడం. దేశంలోని పలు ప్రాంతాల్లో, సాధారణ వర్షపాతంలో 88`112% వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశ వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప భారత్‌, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక దేశం మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెలలో ఏప్రిల్‌ నెలలో 32.6% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, వాయువ్య ప్రాంతాల్లో 41.3%, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 38.6%,మ ధ్యభారత్‌లో 39.3% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో మాత్రం 33.6% అధిక వర్షపాతం నమోదు కానున్నదని అంచనా వేసింది. 

పంజాబ్‌, హర్యానాల్లో పంట మార్పిడి ప్రణాళికలు

ఢల్లీి, ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కోసిన త ర్వాత పంట వ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ రాబోయే కాలంలో తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగాకనిపిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పాలు ప్రాంతాల్లో వరిపండిరచే రైతులు పంట కోతల తర్వాత పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్య మయమైపోయి, ఇది క్రమంగా ఢల్లీి తదితర ప్రాంతాలకు గాలితోపాటు విస్తరించడంతో వాయు కాలుష్యం పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోటారు వాహనాలకాలుష్యం కూడా జతకావడంతో ఢల్లీి వాసుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం జరిగిన యత్నాల కారణంగా ఈ రాష్ట్రాల్లో రాబోయే సీజన్‌లో ఐదులక్షల ఎకరాల్లో వరిపంటకు ప్రత్యా మ్నాయంగా పత్తి, మొక్కజన్న వంటి పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నా రు. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికను కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) సుప్రీంకోర్టుకు గతవారం ఒక నివేదికను సమర్పించింది. 

పంజాబ్‌లో ఏటా మే నెలలో వరి సీజన్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సీఏక్యూఎం సభ్యులు మూడు రాష్ట్రాల అధికార్లతో చర్చలు జరిపి వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు వారు రూపొందించిన ప్రణాళికను కోర్టు ముందుంచారు. 2024 సీజన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం 3.15మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు జరగ్గా 19.52 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. అదేవిధం గా హర్యానాలో 1.5మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు చేపట్టగా 8.10 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇక ఎన్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో గత ఏడాది 1,85000 హెక్టార్లలో వరి సాగు చేయగా, 0.74మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇది లావుండగా ఈ మూడు రాష్ట్రాలు వరిగడ్డిని తగులబెట్టకుండా, వాటిని సమీపంలోని పరిశ్ర మలకు తరలించి పశువులకు ఆహారంగా తయారుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ రాష్ట్రాలు హామీ ఇచ్చినటు ఈ నివేదికలో పేర్కొన్నారు. 

ఢల్లీాిఎన్‌సీఆర్‌ (నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌) ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ కార్యకర్త, అడ్వకేట్‌ మెహతా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, రాజధాని నగరంలో కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. వాహనాలు, విచ్చలవిడిగా పటాసులను పేల్చడం, వరిగడ్డి కాల్చడం వల్ల వస్తున్న ధూళి ప్రధాన కారణాలుగా కోర్టు గుర్తించింది. వీటన్నింటి కారణంగా నగ రంలో కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాయుకాలుష్యం అత్యధిక స్థాయిలకు చేరు తోంది. ముఖ్యంగా శీతాకాలంలో పంటకోతలు జరుగుతాయి. సరిగ్గా అప్పుడే వరిగడ్డిన తగులబెట్టడం వల్ల నగరవాసులకు నాలుగు వారాలపాటు కాలుష్య నరకం తప్పడంలేదు. 

పంజాబ్‌లో ప్రస్తుతం 18 ధాన్యాలనుంచి ఎథనాల్‌ను ఉత్పత్తి చేసే డిస్టిలరీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,90,000 హెక్టార్లలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజన్న, చెరకు, పత్తి పంటసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఏక్యూఎం తెలిపింది. హర్యానా ప్రభుత్వం కూడా 81,000 హెక్టార్లలో పంటమార్పిడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం 11వేల హెక్టార్లలో మొక్కజన్న సాగుకు చర్యలు తీసుకుంటోంది. 

దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సీఏక్యూఎంను ఆదేశించింది. ఇందుకోసం సంబంధిత అధికార్లతో చర్చలు జరపి ఒక నివేదికను తనుకు సమర్పించాలని కోరింది. పంటమార్పిడిని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగానే వున్నానని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందుకు రైతులను ఒప్పించాలి. ఎందుకంటే మొక్కజన్న పంట సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక తప్పదు. అప్పుడు మాత్రమే వారిని ఒప్పించే అవకాశాలుంటాయి. అదే వరిపంటకైతే ఈబాధలే దు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ వరి ధాన్య సేకరణ చేపడుతుందని, పంజాబ్‌ ప్రభు త్వం పేర్కొంది. గతవారం సీఏక్యూఎం సమర్పించిన ఈ నివేదికను, ఇంకా కోర్టు పరిశీలించాల్సి వుంది. 1985 నుంచి సుప్రీంకోర్టు ఢల్లీి కాలుష్యంపై దృష్టి సారించినప్పటికీ, 2017లో అడ్వకేట్‌ మెహతా పిల్‌ దా ఖలు చేసిన తర్వాత, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు చేపట్టా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

కేరళ ఓటు బ్యాంకు రాజకీయాలు భిన్నం

ఆలయల్లో డ్రెస్‌కోడ్‌పై కొలిక్కిరాని వివాదం

సమర్థకులు…వ్యతిరేకులు..ఎవరి రాజకీయాలు వారివే

సీపీఎం ఓటుబ్యాంకులోకి ఎంట్రీ ఇస్తున్న భాజపా

హిందూ ఓట్ల ఐక్యతపై బీజేపీ దృష్టి

కుల, మత రాజకీయాలపై ఇతర పార్టీల ఆసక్తి

మూఢత్వం నుంచి సామాజిక ప్రగతివైపు కేరళ ప్రస్థానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కేరళలోని హిందూ దేవాలయాల్లోకి వెళ్లినప్పుడు శరీరం పైభాగంలోని దుస్తులు విప్పి స్వామి ద ర్శనం చేసుకోవాలన్న నిబంధన ఇప్పటికీ అమలవుతోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. గత డిసెంబర్‌ 31న కేరళలోని నారాయణ గురు స్థాపించిన ప్రముఖ శివగిరి మఠానికి చెందిన సచ్చిదానందస్వామి ఆలయంలో స్వామి ద ర్శనానికి వెళ్లే సమయంలో శరీర పైభాగంలో ధరించిన వస్త్రాలను తొలగించాల్సిన అవసరం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇంకా ఆయన చెప్పిందేమంటే నిరాకార, నిర్గుణుడుడైన భగవానుడిని చేరేందుకు భక్తుల కు దేవాలయాలు ఉపకరణాలు మాత్రమే. ఇందుకోసం శరీర పైభాగంలోని వస్త్రాలను తొలగించాల్సిన అవసరమేముంది? అందువల్ల ఎటువంటి ప్రయోజ నం లేదు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడి మనసు దేవుడు/దేవతపై లగ్నం కావాలి. ఇది ముఖ్యం. బాహ్య వేషధారణకు దీనికి సంబంధం లేదు, అని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ, దేవాలయంలోకి ప్రవేశించేవారు జంధ్యం వేసుకున్నారా లేదా పరిశీలించేందుకు తద్వారా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అనడం వివాదం సృష్టించింది. కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజారులు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించాన్ని కూడా ఆయన వేలెత్తి చూపారు. నిజానికి డ్రెస్‌ కోడ్‌ అవసరంలేదు అని ఆయన చెప్పడం వరకు సమంజసమే. ఎందుకంటే దైవదర్శనం మనసు కు సంబంధించింది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆలయ ప్రవేశం కలిగించేందుకు ఈసం ప్రదాయం పాటిస్తున్నారనడంలో మాత్రం అర్థంలేదు. ఎందుకంటే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులే. ఎవరూ ఎవరినీ అడ్డుకోవడంలేదు. కులాల ప్రసక్తి తెచ్చి రచ్చ చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. సామాజిక అశాంతి తప్ప. 92వ శివగిరి మఠం వార్షిక తీర్థయాత్ర కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో పాల్గన్నా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా సచ్చిదానందస్వామి వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన నారాయణ గురును సనాతనధర్మం నుంచి వేరుచేయడానికి య త్నించారనే చెప్పాలి. అయితే స్పందించే సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. డ్రెస్‌కోడ్‌ అవసరంలేదని సచ్చిదానందస్వామి చెబుతున్న అంశం నిజమే కానీ, సర్వసమ్మతితో మాత్రమే ఇది జరగాలన్నారు.ఎందుకంటే గతంలో శబరిమలలో మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో తలకు బప్పికట్టిన సంగతి ఆయనకు బాగానే గుర్తుంది.

ముదిరిన వివాదం

ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్‌ పి.ఎస్‌. ప్రశాంత్‌ కూడా ‘సర్వసమ్మతి’ అభిప్రాయాన్ని సమర్థించారు. చరిత్రకారుడు ఎం.జి. శశిభూషణ్‌ అభిప్రాయం ప్రకారం, ప్రజలు పవిత్రమైన దేవాలయాలను టూరిస్ట్‌ స్పాట్స్‌గా పరిగణించకుండా వుండేందుకు కూడా ఈ నిబంధనలను వి ధించి వుండవచ్చునని అభిప్రాయపడ్డారు. 1970 ప్రాంతంలో అప్పటి కేరళ ప్రభుత్వం ఈ డ్రెస్‌కోడ్‌ నిబంధనలను తొలగించడానికి ప్రయత్నించిన సంగతిని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది లా వుండగా నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్‌) సెక్రటరీ జి. సుకుమారన్‌ నాయర్‌ ముఖ్య మంత్రి పినరయి విజయన్‌, సచ్చిదానంద స్వామిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిరచడంతోవివాదం ముదిరింది. ఆలయ సంప్రదాయాలను మార్చడానికి ఎవరికీ అధికారంలేదు, ప్రభుత్వానికి కూడా! ఆలయ సంప్రదాయాలను ప్రశ్నించే అధికారం సచ్చిదానందస్వామికి ఎవరిచ్చారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రతి ఆలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. అందువల్ల డ్రెస్‌ కోడ్‌ పాటించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. 

శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేషన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి సుకుమారన్‌పై విమర్శల దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఇటువంటి సమస్యలు హిందువులను విడదీయలేవని ఆయన అన్నారు. అయితే యోగక్షేమ సభ అధ్యక్షుడు అఖీరామన్‌ కళాదాసన్‌ భట్టత్తిరిప్పాడ్‌ మాత్రం కొంత సంయమనంగా మాట్లాడటం గమ నార్హం. అనవసరమైన పరిమితులు, నిబంధనలు ఎత్తేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే బ్రాహ్మణులను గుర్తించడానికే ఈ డ్రెస్‌కోడ్‌ తీసుకొచ్చారన్న వాదనను మాత్రం ఆయన ఖండిరచారు. ‘‘ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. ఉదాహరణకు శబరిమల దేవాలయనికి డ్రెస్‌కోడ్‌ నిబంధనలేం లేవు. కానీ 10 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ లకు ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. మార్పులకు మేం వ్యతిరేకం కాదు. కానీ ప్రతిదానికీ బ్రాహ్మ ణులు ఆధిపత్యం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు’’ అని స్పష్టం చేశారు. 

విజయన్‌ మద్దతు వెనుక రాజకీయం

అతిపెద్ద తీర్థయాత్రా కేంద్రమైన శివగిరి మఠానికి విజయన్‌ మద్దతుగా నిలవడం వెనుక ఒక రాజకీయ కారణం వుంది. ఈ మఠం హిందువుల్లోని ఎరaవా వర్గం శివగిరి మఠాన్ని అత్యంత పవిత్ర మైనదిగా భావిస్తారు. పెద్దంసంఖ్యలో ఈ వర్గానికి చెందిన ప్రజలు ఈ మఠాన్ని సందర్శి స్తుంటారు కూడా. ఓబీసీలైన వీరు సీపీఎంకు బలమైన మద్దతుదార్లు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకోవడానికి యత్నిస్తుండటం విజయన్‌కు ఎంతమా త్రం మింగుడుపడటంలేదు. ముఖ్యంగా భారత ధర్మ జనసేన (బీడీజేఎస్‌), శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం (ఎస్‌ఎన్‌డీపీ) అనే రెండు సంస్థలు భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సీపీఎంకు ఓటుబ్యాంకుగా వున్న ఎరaవా వర్గం ప్రజల్లో బీజేపీ పలు కుబడిని పెంచడానికి ఇవి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఎంకు గట్టి మద్దతుగా నిలిచిన ఇక్కడి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి గణనీయంగా ఓట్లు సంపాదించడం వెనుక ఈ రెండు సంస్థల కృషి ఎంతో వుంది. లోకనీతి, సీడీఎస్‌ సర్వే ప్రకారం ఎరaవా కులాల్లో బీజేపీకి ఏకంగా 32% ఓట్లు లభించాయి. ఇది గతంతో పోలిస్తే 11% ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎన్‌డీపీని పూర్తిగా కాషాయీకరిం చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ సీపీఎం విరుచుకుపడుతోంది. 

శివగిరి మఠానికి ఎందుకంత ప్రాధాన్యం?

కేరళకు చెందిన నారాయణ గురు గొప్ప సంఘసంస్కర్త. ఆయన మతసామరస్యంతో పాటు అందికీ సమాన విద్య, అన్ని వర్గాల మధ్య సమానత్వం అవసరమంటూ ఉద్యమాలు చేశారు. శివగిరి మఠాన్ని 1903లో ఆయన స్థాపించారు. ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనేది ఈయన ప్రవచించిన సిద్ధాంతం. ముఖ్యంగా బాగా వెనుకబడిన ఎరaవా కులం వారి అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడ్డారు. ప్రజల్లో ఉన్నత విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఏటా ఈ ‘తీర్థయాత్ర’ కార్యక్రమాన్ని మఠం నిర్వహిస్తుంది. నిజానికి ఎరaవా వర్గం వారు కేరళ జనాభాలో 23% వరకు వున్నారు. దీనివల్ల సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వీరిని గొప్ప ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివగిరి మఠంతో మంచి సంబంధాలను కొన సాగించడం ద్వారా ఈ వర్గం ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలని తంటాలు పడుతున్నాయి. బీజేపీ హిందువుల ఓట్లు చీలడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. ఈ నేపథ్యంలో నారాయణ గురు సంప్రదాయానికి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఎరaవా వర్గాల్లో పలుకుబడి పెంచుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అయితే శివగిరి మఠం ఇప్పటివరకు ఏపార్టీకి మద్దతు ఇవ్వకుండా తట స్థ వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ఈ మఠాన్ని తమకు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. శివగిరి మఠం ముఖ్యంగా ఆలయల్లో అనుసరిస్తున్న డ్రెస్‌కోడ్‌ను వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా జనవరి 17న ట్రావన్‌కూర్‌ దేవస్థానం బోర్డువరకు మఠం సన్యాసులు ఒక ప్రదర్శన కూడా నిర్వహించడం గమనార్హం.

మూఢత్వం నుంచి ప్రగతి పథం వైపునకు….

నిజానికి కేరళలో కులవివక్షకు వ్యతిరేకంగా తొలి ఉద్యమం 1813లో చోటుచేసుకుంది. నాటి ట్రావన్‌కూర్‌ సంస్థానంలోని వెనుకబడిన వర్గాలైన నాడార్లు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. అప్పటివరకు ఈ కులాలకు చెందిన మహిళల వక్షాలను వస్త్రంతో కప్పుకోవడానికి అనుమతి వుండేది కాదు. మారు మరక్కల్‌ సమారం పేరుతో జరిగిన ఈ ఉద్యమం 50 సంవత్సరాల పాటు సాగింది. నాటి ట్రావన్‌కూర్‌ ప్రభుత్వం, అత్యంత శక్తివంతమైన నాయర్‌లు ఈ ఉద్యమాన్ని అణచివేశారు. అయితే చివరకు ప్రభుత్వం నాడార్‌ మహిళలకు తమ పైభాగాలను వస్త్రంతో కప్పుకునే హక్కును సమర్థించిడంతో వివాదం సమసింది. తర్వాత 1859లో అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ గవర్నర్‌ ఛార్లెస్‌ ట్రెవెలియన్‌ ఒత్తిడితో నాడార్లలో అత్యధికులు క్రైస్తవంలోకి మారిపోయారు. అప్పట్లో కేరళలోని ఉన్నత కులాలకు చెందిన మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లాలంటే తమ పైభాగంలోని ఆచ్ఛాదనను తప్పనిసరిగా తొలగించాల్సిందే. ఇదిలావుండగా 1936కు ముందు కేరళ దేవాలయాల్లోకి వెనుకబడిన వర్గాలవారు ప్రవేశించడానికి అనుమతి వుండేది కాదు. అయితే 1936లో మహాత్మాగాంధీ, నారాయణగురులు వైకోమ్‌లో సత్యాగ్రహం చేశారు. కేరళలో అత్యధిక శాతం హిందువులు ఇతర మతాల్లోకి మారిపోవడానికి ప్రధాన కారణం ఈ మూర్ఖపు ఆచార వ్యవహారలేనని చెప్పాలి.దీంతో అప్పటి ట్రావన్‌కూర్‌ సంస్థానాధిపతి ఈ నిషేధాన్ని ఎత్తేశారు. స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాలు దాటిన తర్వాత దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజార్ల నియామకం కూడా జరుగుతోంది. 2018లో ప్రస్తుత విజయన్‌ ప్రభుత్వం ట్రావన్‌కూర్‌ దేవస్థాన బోర్డులో దళితులకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించింది. ఈ దేవస్థానం కింద 1200 దేవాల యాలున్నాయి.

కెసిఆర్ సమక్షంలో సన్నాహక సమావేశం.

సమావేశానికి హాజరైన ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి” ఎర్రవెల్లి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)రజతోత్సవం ఈనెల 27వతేదీన జరుగనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఖమ్మం, నల్లగొండ,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.
కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గుంతకండ్ల జగదీష్ రెడ్డి,వీ.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్,రావుల చంద్రశేఖరరెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,వనమా వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.అలాగే,ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి,రేగా కాంతారావు,బానోతు మదన్ లాల్,మెచ్చా నాగేశ్వరరావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కంచర్ల భూపాల్ రెడ్డి,బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, ఖమ్మం మాజీ జేడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

vaddiraju ravichandra

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు,!

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల బాంధవుడు,మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజికవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రం పస్తపుర్ లో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉద్యమకారులతో కుల సంఘాల నాయకులతో కలసి కేక్ కాట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరిచిపోలేనివి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుచుకొని మన దేశ రాష్ట్రాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరం అన్నదమ్ముల వలె నడుచుకొని మనకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిదీ కూడా అందరం కలిసికట్టుగా ఆలోచించి పని చేస్తే మనం విజయాన్ని చేకూర్చుకుంటాం బాబు జగ్జీవన్ రావ్ 1935లో దళితులకు సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు , ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు ఆయన జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో , కార్మిక మంత్రిగా భారతదేశపు మొదటి మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా కూడా పనిచేశారు , అక్కడ ఆయన సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా తదుపరి 30 సంవత్సరాలు వివిధ శాఖలతో మంత్రిగా పనిచేశారు .

Birth anniversary.

 

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,హుగ్గేలి రాములు,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, మరియు అరుంధతి సంఘం సభ్యులు,వరాలు, రామచందర్,ముర్జల్ గారు,జైరాజ్, శాంసన్ గారు,చిన్న గారు,రాజు తతిధురులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version