
తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వీధి వీధిలో బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ పడగల మానస రాజు మాట్లాడుతూ పార్టీ ప్రవేశపెట్టిన కరపత్రాలతో గ్రామంలోని ప్రతి ఇంటింటికి ప్రచారం జరుగుతుందని వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి కేటీ రామారావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుందని మళ్లీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ కోడి అంతయ్య పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మైనార్టీ నాయకులు మహిళ నాయకులు ఎస్సీ సెల్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు