# నాళాల ఆక్రమణ… చినుకుపడితే చెరువును తలపించే రోడ్డు.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులను కొందరు వ్యక్తులు వారికి ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు.నాళాలను సైతం వదలకుండా ఆక్రమించుకొని వారి అవసరాలకు వాడుకుంటూ ప్రమాదాలకు కరకులౌతున్నారు.వారు ఆక్రమించుకున్న నాళాల వలన చినుకు పడితే చాలు రోడ్లు మొత్తం జలమయమై చెరువులను తలపిస్తున్నాయి.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గెస్ట్ హౌస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వెళ్లే ప్రధాన రహదారిపై శ్రీశ్రీ డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ యాజమాన్యం ప్రధాన రొడ్డును అక్రమంగా వాడుకుంటూ వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.అలాగే అదే షాపు ముందట గల నాళాను సైతం పూర్తి అక్రమించుకోవడం పట్ల ఆ ప్రాంతంలో ఒక్క చినుకు పడితే చాలు రోడ్డు మొత్తం జలమయమై చెరువులుగా మారి ప్రమాదాలకు అడ్డాగా మారుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.రోడ్లకు సంబందించిన నాళాలను కొందరు వివిధ రకాల దుకాణాల దారులు తమ పలుకుబడితో అక్రమించుకుంటుంటే నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు బహుబాటంగా తెలుపుతున్నారు.రోడ్డును ఆక్రమించి నడిరోడ్డుపై బోర్డులను పెడుతున్న దుకాణందారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.