విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం…రూ.ఐదు లక్షల ఆస్తి నష్టం.
బాధితురాలు జూలూరి రేణుక
నర్సంపేట నేటిధాత్రి:
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నర్సంపేట పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో మంగళవారం మధ్యాహ్నం సంభవించింది. బాధితురాలు, నర్సంపేట అగ్నిమాపక కేంద్రం అధికారి రాజేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డు మహిళా సమాఖ్య భవనానికి సమీపంలో గల మంచిగా రాజు అని వ్యక్తికి సంబంధించిన పెంకుటిల్లులో తన సోదరి జూలూరి రేణుక నివాసముంటున్నది. రేణుక నర్సంపేట కరెంటు ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నది. దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రేణుక తన తమ్ముడు ఇంట్లో ఉంటూ ఉద్యోగరీత్యా ఉదయం కార్యాలయానికి వెళ్ళింది. ఇంట్లో నుండి పొగలు రావడంతో దానిని గమనించిన చుట్టుపక్కల వారు రేణుకకు సమాచారం ఇచ్చారు అలాగే అగ్నిమాపక కేంద్రానికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సమంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే భారీగా పూలతో పాటు ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రం అధికారులు ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే లోపల భారీ ఎత్తున బట్టలు, గృహోపకారాలు, బీరువా మంటలు అంటుకొని కాలి బూడిదయ్యాయి. పెంకుటిల్లు కావడంతో పైకప్పు మొత్తం ఖాళీ ఇల్లు ధ్వంసం అయింది. అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో జరిగినట్లు గుర్తించామని ఫైర్ అధికారి రాజేంద్రం తెలిపారు. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఫైర్ అధికారి రాజేంద్రం తెలియజేశారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సహాకారం అందించారు.
ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.. బాధితురాలు రేణుక..
నిరుపేద కుటుంబానికి చెందిన నేను భక్త చనిపోయిన నాటి నుండి తన సోదరుని ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నానని ఈ నేపథ్యంలో అగ్నిప్రదాయానికి గురై ఇంటితోపాటు సర్వం కోల్పోయానని బాధితురాలు జూలూరి రేణుక రోధిస్తూ తెలిపింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరింది.
కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు పదును పెట్టి దేశంలోనే ప్రాధాన్యతను సంతరించుకున్న తెలంగాణ రాష్ట్రం కుల జనగణ. తెలంగాణ రాష్ట్రంలో కులజనగణకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రుత్వనికి ప్రత్యేక ధన్యవాదాలు బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల జనగనన చేపట్టాలని కోరుతున్నము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీసీలను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సవితి తల్లి ప్రేమను వలకబోస్తుంది రిజర్వేషన్కు 33 % ఉంటే దానిని 18% తగ్గించి కెసిఆర్ బీసీలపై వివక్ష చూపించి ఇప్పుడు కవితమ్మ ఏమో బీసీల కోసం ఒక దంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నది కానీ కుల జనగణ సర్వే చేయించి బీసీలకు 42% శాతానికి తగ్గొద్దు అని చెప్పినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మంత్రి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాజేశ్వరి, రాణి,జ్యోతి, పద్మ, సౌజన్య కృష్ణవేణి, శ్రీ లక్ష్మీ, సుశీల,, స్వరూప, రూప, పార్వతి, శాంత కుమారి, జయసుధ, తదితరులు పాల్గొన్నారు
పరకాల నేటిధాత్రి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండలం కామారెడ్డి పల్లె పోచారం, వెల్లంపల్లి గ్రామాలలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సంఘీభావ ప్రచార యాత్ర మరియు గోడ కరపత్రాలను కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు ఆధ్వర్యంలో విడుదల చేశారు.గ్రామ గ్రామాన మాదిగ పల్లెలో ప్రచారం నిర్వహిస్తూ మాదిగ జాతి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ప్రతి మాదిగ ఇంటి నుంచి కదలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ విష్ణు మాదిగ,కామరెడ్డి పల్లె పోచారం గ్రామాల అధ్యక్షులు కొయ్యడ చిరంజీవి,ఇనుముల కృష్ణ మాదిగలు,ఎంఆర్పిఎస్,ఎంఎస్పి మాదిగ ఉద్యోగులు,కళాకారులు మాదిగ కుల పెద్దలు పాల్గొన్నారు.
సన్యాసం అంత తేలిక కాదబ్బా! తనపై తనకు అదుపులేని వారికి, ప్రాపంచిక సుఖాల్లో ఓలలా డుతూ ఒక్కసారి సన్యాసంలోకి రావడం ముఖ్యంగా ఈ కలియుగంలో అందరికీ సాధ్యంకాదు. ‘ సన్యాసి సుఖీ సంసారి ద్ణుఖీ అనుకుంటూ గ్లామర్ ప్రపంచంలో ఓలలాడి ఒక్కసారి సన్యాసం స్వీకరిస్తే, ఏ గ్లామరూ వుండని సన్యాసానికి కూడా ఓ ప్రత్యేక గ్లామర్ వస్తుందనడానికి మమతాకులకర్ణి గొప్ప ఉదాహరణ. ఈమెను కిన్నార్ అఖాడాలోకి తీసుకోవడమే కాకుండా, ఏకంగా మహామండలేశ్వర్ స్థాయి కల్పించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను అఖాడాలోకి ఎట్లా చేర్చుకున్నారని మరో మహామండలేశ్వర్ ఆచార్య డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిపై ప్రశ్నలవర్షం వెల్లువెత్తింది. అఖాడాలోకి ఆమెను చేర్చుకోవడమే ఇబ్బందికరమనుకుంటే ఏకంగా మహామండలేశ్వర్ స్థాయి కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ స్థాయికి ఎదగాలంటేఎన్నో ఏళ్లు కఠోర దీక్ష అవసరం. శ్రీయామై మమతానందగిరిగా మారిన ఈ గ్లామర్ హీరోయన్ తో పాటు ఆమెను అఖాడాలో చేర్చుకున్న ఆచార్య డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కూడా ఏకంగా బహిష్కరించారు. ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ సన్యాసి ద్ణుఖీ సంసారి సుఖీ అనుకుంటూ గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టక తప్పలేదు
– సుందరయ్య నగర్ అర్బన్ పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణ పై పలు సూచనలు చేశారు. రోజు ఓపీ, ఈ నెలలో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో ఎన్ని డెలివరీలు కావాల్సి ఉందో ఆరా తీశారు. ప్రతి రోజూ దవాఖానలో 40 నుంచి 50 మంది వరకు వస్తారని, ఈ నెల లో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో 22 కాన్పులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యురాలు సాహితి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని కాన్పులు సర్కార్ ఆసుపత్రిల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు. రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ప్రియాంక బాలానగర్ ఓ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. ప్రియాంక ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించల క్యాన్సర్ గా నిర్ధారణ అయింది. వైద్య ఖర్చుల కోసం రూ.30 లక్షలు అవసరమని డాక్టర్లు తేల్చారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 440- 435 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ప్రియాంక ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. దాతలు ఎవరైనా.. 99510 82091, 96185 42334 ఫోన్ నెంబర్లకు గూగుల్ పే.. ఫోన్ పే చేసి, తన ప్రాణాన్ని కాపాడాలని ప్రియాంక కోరింది.
తెలివితక్కువవాళ్లు తప్పుడు మార్గంలో ప్రయాణించడం సహజం. కానీ తెలివిగలవాళ్లు పతన మార్గంలో పయనిస్తే పర్వర్షన్‌కు గురై, సమాజ క్రమాన్నే ధ్వంసంచేసే ప్రవృత్తికి దిగజారతారు. ఇటువంటివారు సమాజంలో పేరున్నవారైతే వారి కలిగించే దుష్ప్రభావం ఎంత దారుణంగా వుం టుందో చెప్పలేం. రామ్ గోపాల్‌వర్మ తెలుగు సినిమాకే కొత్త పోకడలు తీసుకొచ్చిన గొప్ప సృజ నాత్మక దర్శకుడుగా అంగీకరించాల్సిందే! కానీ తర్వాతి కాలంలో ‘నా ఇష్టం వచ్చినట్టు బతుకు తా’ అనే పంథాని అనుసరించి, చెత్త సినిమాలు సమాజం మీదికి వదలడంతో, తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెతలా పరిస్థితి తయారైంది. అటువంటి రామ్ గోపాల్ వర్మలో ఇప్పుడు జ్ఞాన సూర్యడు ఉదయించాడు. 1998లో హిట్ అందుకున్న సత్య సినిమా రెండోసారి రిలీజ్ సందర్భంగా ట్విట్టర్‌లో ‘తాను ఇప్పటివరకు చేసిన ప్రయాణంపై తీవ్రంగా బాధపడ్డాడు’.ఇకనుంచి మంచి సినిమాలే తీస్తానని శపథం చేశాడు. ఇప్పటివరకు లక్ష్యంలేని ప్రయాణం చేశానని, రంగీలా, సత్య వంటి సినిమాల సక్సెస్‌తో కళ్లు నెత్తికెక్కి పతనమైపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొత్త ఒరవడి పేరుతో కళ్లకు గంతలు కట్టుకొ ని అసభ్య సినిమాలు తీసానంటూ తీవ్ర ఆవేదన పడ్డాడు. తనలోని తెలివితేటల విలువలు తెలుసుకోకుండా, లక్ష్యం లేని జీవితం గడిపానంటూ బాధపడ్డాడు. చేసిన తప్పుల్ని దిద్దుకోలేకపోయినా ఇక ముందు నెంబర్ వన్ సినిమాలే తీస్తానని చెప్పాడు! మంచి మార్పులకోసం కాలం ‘పశ్చాత్తాపమనే’ అద్భుత ఔషధాన్ని ఎప్పుడూ సిద్ధంగా వుంచుతుంది. రాము ఇప్పుడు ఆ ఔషధాన్ని స్వీకరించారు. ఆయనలోని గొప్ప టాలెంట్ బ యటకు రావాలని ఆశిద్దాం!
`ప్రతిపక్ష పాత్రను కూడా ‘‘పికే’’ పాలనలోనే చూపిస్తున్నాడు.
`ఎక్కడ తగ్గాలో కూడా ‘‘పికే’’కు తెలుసు.
`సమయమొస్తే ఎలా పీక పట్టుకోవాలో కూడా తెలిసిందే ‘‘పికే’’ మనసు.
`అంతా బాగుంటే ‘‘పికే’’ ఎల్లకాలం దోస్తీ అంటాడు.
`జనం కోసం తప్పుకుంటున్నానని చెప్పడానికి ఎప్పుడైనా వెనుకాడడు.
`ఒక్కసారి పవర్ చూసిన తర్వాత ‘‘పికే’’ తన పవర్ వదులుకోవాలనుకోడు
రాజకీయాల్లో ప్రతి దానికి ఒక లెక్కుంటుది. కూడికలు కొన్సిసార్లు మైనస్‌లుకావొచ్చు. కొన్ని సార్లు మైనస్‌లే ప్లస్ కావొచ్చు. ఏ ఈక్వేషన్‌కు సరైన లెక్క వుండకపోవచ్చు. అవే రాజకీయాలు. అందువల్ల డిప్యూటీసిఎం. పవన్ కళ్యాణ్‌కు ఒక లెక్కుంది. ఆ లెక్కను ఎంత ఒద్దికగా సరిదిద్దుకుంటూ పోతున్నారో చాలా మందికి అర్దం కావడం లేదు. పైకి పవన్ కళ్యాణ్ ఆవేశాన్నే చూస్తున్నారు. కాని ఆ ఆవేశంలో కూడా లోతైన ఆలోచన వుంది. అది నెరవేరుతుందా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాదానం దొరక్కపోయినా, ఖచ్చితంగా భవిష్యత్తులో లాభమే జరుగుతుంది. నిజానికి పవన్ కల్యాణ్ సీజనల్ నాయకుడు అని అందరూ అనుకున్నారు. కాని ఆయన సీరియస్ రాజకీయాలు చాలా భిన్నంగా చేస్తూ వచ్చారు. ఆ భిన్నమే వైసిపి ప్రభుత్వాన్ని నిండా ముంచేదాక తెచ్చింది. పాలు ఎన్ని వున్నా పెరుగు కావాలంటే పెరుగు చుక్క కావాల్సిందే. అదే పాలు చెడిపోవాలంటే ఒక్క ఉప్పురాయి చాలు. రాజకీయాల్లో లెక్కలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి. ప్రతి క్షణం అప్రమత్తంగా వుండడమే రాజకీయం. ఏమర పాటు ఎవరికీ మంచిది కాదు. అందువల్ల పవన్ చెప్పే మాటలన్నీ నిజం కాదు. అందులో అబద్దాలు వెతికినా దొరక్కపోవచ్చు. అంత పకడ్భందీగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయం అపర చాణక్యుడైన చంద్రబాబుకు తెలియదా? అంటే తెలుసు. కాని కొన్ని సార్లు ఎంత చాణక్యుడైనా ఏం చేయలేని రాజకీయాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఆవేపూరితమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆలోచనాపూర్వకమైన రాజకీయాలు మాత్రమే చేస్తుంటారు. ఈ తరం రాజకీయాలు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆలోచనాపూర్వకమైన రాజకీయాల్లో ఆవేశపూరితమైన అంశాలను మేలవిస్తున్నారు. ప్రతి అంశానికి రాజకీయాన్ని జోడిస్తుంటారు. ప్రతి సారి సెంటిమెంటు రాజేయకుండా రాజకీయం చేయరు. ఎంతటి విపత్కరమైనపరిస్దితుల్లో నైనా కూల్‌గానే వుంటారు. అంతే కూల్‌గా మాట్లాడుతూ నిప్పు రాజేస్తారు. అందుకే బిజేపి ఇప్పుడు ఆ స్ధానంలో వుంది. ప్రధాని మోడీ రాజకీయం తిరుగులేని శక్తిగా మారింది. తన సమకాలీకుడైన మోడీ రాజకీయాన్నే చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నారు. ఆయన దూకుడును అందుకోలేకపోతున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదే కాదు. నిజానికి చంద్రబాబు అంచనాలు గతం తాలూకు చరిత్రకు సాక్ష్యాలు. అంతే కాని ఆయన విజయాలు చరిత్రకు పాఠాలుగా ఎప్పుడూ మారలేదు. అందుకే ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో పాలనాపరమైన కీలక భూమికలో తెలుగుదేశం పార్టీ వున్నా, జనసేన మాత్రమే దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకే ప్రాదాన్యత కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరమే. ఇప్పటికిప్పుడు సమస్యలు ఎదురుకాకపోయినా, భవిష్యత్తులో జగన్ కంటే పవన్ వల్లనే తెలుగుదేశం కొంప మునుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇక్కడ చంద్రబాబు ఒక్కొ మెట్టు ఎక్కిన నాయకుడు కాదు. ఒక్కసారిగా కాలం కలిసి వచ్చి అధికారం అందుకున్న నాయకుడు. కాని ఆయన రాజకీయ పరిణతి వల్ల అందలం చూశారు. ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ కూడా ఇంచు మించి అలాంటి రాజకీయాల వల్లనే ఎదిగారు. జగన్ పాదయాత్ర చేసినా, ఇంకేది చేసినా ఆయన వారసత్వ రాజకీయాలను ముందు పెట్టి రాజకీయం చేసిన నాయకుడే. చెట్టుపేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయిన నాయకుడే. కాని పవన్ అలా కాదు. సినిమా రంగంలో వారసత్వంగా పైకి వచ్చినా, రాజకీయ రంగంలో ఆయన స్వశక్తి మీదనే ఆదారపడి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంలో కూడా ఆయన స్వంత నిర్ణయాల మీదనే ఆదారపడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2014లో తెలుగుదేశం, బజేపిలతో కలిసి రాజకీయం చేశారు. కాని రాజకీయంగా ఎదగాలనుకున్నా కాలం కలిసి రాలేదు. ప్రజా సమస్యలే తన రాజకీయ ఎజెండా అనుకున్నారు. కాని రాజకీయ ఎజెండా వేరు, ప్రజా సమస్యలు వేరు అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఎలాంటి అడుగులు వేస్తే రాజకీయాల్లో ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ వెళ్లాలో దారి కనుక్కున్నాడు. ఆ దారినే ఎంచుకున్నాడు. ఎందుకంటే 2019లో ఆయన ఒంటరి పయనం అనేక పాఠాలే, కాదు గుణపాఠాలు,అనుభవాలు నేర్చుకునే అవకాశం ఏర్పడిరది. వ్యక్తిగతంగా రాజకీయాల్లో తనస్దానమేమిటో తెలిసింది. అభిమానులతోనే రాజకీయాలు సాద్యం కాదని పూర్తిగా తెలుసుకున్నాడు. నిజానికి ప్రజారాజ్యమప్పుడే ఆ విషయం అర్ధమైనా అప్పటి ఉమ్మడి రాజకీయాలను అంచనా వేయలేకపోయారు. అందుకే చిరంజీవి రాజకీయాలు జెండా పీకేసేదాకా తెచ్చుకున్నారు. కాని పవన్ అలా కాదు. తన జెండాను ఎవరూ పీకేంత శక్తి వంతులు ఎదురుగా లేకుండా చేసే రాజకీయాలు చేయాలనుకున్నారు. అది ఆయనకు ఎంత మేలు చేస్తుందో..అంతే నష్టం తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది. ఒక ఒరలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇమడలేదు. ఇమిడినా ఎంతో కాలం కలిసి రాజకీయాలు చేయలేరు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాటి రంగులు బైట పడిపోతాయి. ఎందుకంటే పవన్ ఎళ్లకాలం తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టే రాజకీయాలు చేస్తారనుకోవద్దు. ఆయన రాజకీయ లక్ష్యం ఆయనకు వుంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా పవన్‌కు బలంగా వుంది. కాకపోతే ఆ అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురుచూడొచ్చు. చూడకపోవచ్చు. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గద్దలా అధికారాన్ని తన్నుకుపోయే రాజకీయాలకే విలవెక్కువ. లేకుంటే మరో పార్టీ పాగా వేస్తుంది. ఇక ఏపిలో రెండు భిన్న దృవాలే ప్రత్యర్ది రాజకీయాలు భవిష్యత్తులో చేసే ఆస్కారం వుంది. ఎవరు ఔనాన్నా, ఎవరు కాదన్నా చంద్రబాబు ఆరోగ్యంగా వున్నంత కాలమే తెలుగుదేశం పార్టీ ఆధిపత్య రాజకీయాలు చేసే అవకాశం వుంటుంది. ఎందుకంటే మర్రి చెట్టు లాంటి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ లాంటి నాయకత్వం కూడా ఎదుగుతుందని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్‌కు పూర్తి స్వేచ్చనిప్పుడే తెలుగుదేశంలో కొత్త తరం రాజకీయాలు ఆవిషృతమౌతాయి. తాను వేలు ఎల్లకాలం వేలు పట్టుకొని నడిపిస్తానని అనుకుంటే లోకేష్ రాటు దేలలేరు. ఏ రాజైనా ఆరోగ్యంగా వున్నప్పుడే వారసులకు యువరాజు పట్టాభిషేం చేస్తారు. దాంతో ఆటోమెటిక్‌గా రాజు వున్నా, యువరాజు మాటలే చెల్లుతాయి. మహాభారతం మనకు గొప్ప రాజనీతిని అందిస్తుంది. దృతారాష్ట్రుడు రాజైనప్పటికీ దుర్యోధనుడే రాజ్యబారం మోశాడు. రాజకీయం నెరిపాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆ పాత్రను పోషిస్తేనే లోకేష్ రారాజౌతారు. లేకుంటే రాజకీయాల్లో తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా స్వయం ప్రకాశానికే విలువ ఎక్కువగా వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు స్వయం ప్రకాశమే. లోకేష్ కూడా అదే స్వయం ప్రకాశాన్ని అందుకోవాలి. అప్పుడే పార్టీకి మరో అర్ధ దశాబ్దమైన మనుగడలో వుంటుంది. లేకుంటే పవన్ ముందుకొస్తారు. తెలుగుదేశం రాజకీయాలను హైజాక్ చేస్తాడు. ఎన్నటికైనా పవన్ కళ్యాణ్ చీల్చగలిగేది తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకునే తప్ప, వైసిపి ఓట్లను టచ్ చేయలేరు. కూమిటి ఓట్లనే పవన్ తన వైపు తిప్పుకుంటారు. ఇది ముఖ్యంగా లోకేష్ గమనించాలి. లేకుంటే పికే ఏకు మేకౌతాడు. తెలుగుదేశం పార్టీకి ఎర్తవుతాడు. పవన్ కల్యాన్ ఇంకా పదేళ్లయినా తెలుగుదేశంతో వున్నా, చంద్రబాబు నాయకత్వంలో కలిసి పని చేయడానికి ఇష్టపడతాడే గాని, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కలలో కూడా అనుకోడు. అందువల్ల లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, పవన్ ఏనాటికైనా ఏపికి ముఖ్యమంత్రి అవుతారు. పవన్ ముఖ్యమంత్రి కావొద్దంటే ముందు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఎల్ల కాలం మంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగా వుండడం పవన్ లక్ష్యంకాదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు. ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. అందరూ అవకాశవాదులే. అందరిదారి అధికారం సొంతం చేసుకోవడమే.. పార్టీ పెట్టి, పదిహేనేళ్లు కొట్లాడిన పవన్ పవర్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. తెలిసి,తెలిసి తెలుగుదేశం మేలుకోకపోతే తప్పు.
NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్‌లోని అతని స్నేహితులు చెప్పారు.
ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్‌తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్‌లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.
అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్‌లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ నూన్స్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.
గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్‌ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిత్రబార్ అండ్ రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయి ఉన్నందున ఇటీవలే మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమాని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో బార్ ని ఓపెన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా బార్ అండ్ రెస్టారెంట్ యజమాని జిందం మహేందర్ తమ వ్యాపారాన్ని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయిలు ఉన్నాయని తాత్కాలికంగా కమిషనర్ సీజ్ చేశారని, అదే రోజు బకాయి వెంటనే చెల్లించి సంబంధిత రసీదు మున్సిపల్ కార్యాలయంలో అందించామని అయినప్పటికీ ఇప్పటివరకు బార్ సీజ్ ఉత్తర్వులను ఎత్తివేయలేదని, కోర్టు ఉత్తర్వులను తీసుకొని బార్ ను యధావిధిగా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఇది ఇలా ఉండగా శనివారం రాత్రి 8 గంటలు అవుతున్న కూడా బార్ సీజ్ ను ఎత్తివేయలేదని జిందం మహేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం
ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
నేను కొడితే మాములుగుండదని అంటున్న కెసిఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో మందు కొట్టుకుంటూనే ఉంటున్నది ప్రజలందరికి తెలుసన్నారు. సంతకం పెట్టక పోతే తన నౌకరి పోతుందని, అసెంబ్లీ కి వచ్చాడని ఏద్దేవా చేశారు.16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు.కాళేశ్వరం మీ అవినీతికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు పాలించిన, ఒక్క పార్టీ భవనాన్ని నిర్మించలేదని అన్నారు. అన్ని అద్దె భావనాలేనని, మీ పార్టీ ఫండ్ 1160 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నంచారు. నీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవద్దని అన్నారు.ఈ కార్యకమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి,గడ్డం నర్సయ్య, సూర దేవరాజ్,ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాళ్లు కల్లూరి చందన, శరణ్య తదితరులు పాల్గొన్నారు.
గుండాల మండల కేంద్రం నిట్ట వారి మైదానం లో శనివారం నాడు వ్యాపారవేత్తలు పట్వారి వెంకన్న, మాడె మంగయ్య సహకారంతో పోలీస్ ,జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. గుండాల సీఐ రవీందర్ వారి సిబ్బంది, జర్నలిస్టులు మొత్తం మూడు మ్యాచుల్లో ఉత్సాహంగా పాల్గొనగా చెరొక మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఆహ్లాదకరంగా గడిపినట్లు తెలిపారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం గెలుపొందిన రెండు జట్లకు వ్యాపారవేత్త మానాల వెంకన్న షీల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన తరగతుల వారికే రాజ్యాధికారం రావాలన్న లక్ష్యంతో తన రాజకీయ పోరాటాన్ని తీన్మార్ మల్లన్న తాను ఏ పార్టీలో వున్నా బీసీల వాణిని వినిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌లో ఫిబ్రవరి 2న బీసీల సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు రెండు నుంచి మూడులక్షలమంది హాజరు కాగలరని నిర్వాహకుల అంచనా. బీసీల ఐక్యత కోసం తీన్మార్ మల్లన్న మొదట్నుంచీ కృషి చేస్తున్నారు. బీసీలు కలిసిపోతే రాజ్యాధికారం సాధించవచ్చునన్నది ఆయన దృఢ విశ్వాసం. ఈదిశగానే ఆయన బీసీల్లో వున్న అనేక కులాలవారిని ఒక్కతాటి మీదకు చేర్చి రాజ్యాధికారాన్ని ఈ వర్గాలకు వచ్చేలా చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకోసంఆయన అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని సేకరించి బీసీల సాధికారతో కోసం అలుపెరుగ కుండా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీసీల కులాలవారీగా జనసంఖ్యను వివరిస్తూ వారి బలమెంతో తెలియజేసేందుకు యత్నిస్తున్నారు. కులాలుగా విడిపోవడం కాదు, అంతా ఒక్కటై పోరాటం చేయాలని తెలంగాణలో నిర్వహించే సభల్లో ఆయన బీసీలకు పిలుపునిస్తున్నారు. బలమైన వర్గంగా వున్న బీసీలు, ఓసీల్లోని పేదలను కూడా ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ఆయనలోని విశాల భావాన్ని తెలియజేస్తోంది.
ఇక తెలంగాణ జనాభా విషయానికి వస్తే 2024 జులై 1 నాటికి మొత్తం తెలంగాణ జనాభా 3.83 కోట్లు. 2016 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల మొత్తం జనాభా 18159732 మంది. వీరిలో బీసీ(ఎ) గ్రూపు మొత్తం జనాభా 3040376 కాగా బీసీ(బి) గ్రూపుకు చెందినవారు 5602786, బీసీ(డి) గ్రూపు 6635939 మంది వున్నారు. ఈవిధంగా జనాభా పరంగా బలీయంగా వున్న బీసీలకు తమ సొంత బలాన్ని తెలియజేస్తూ, రాజకీయాలను శాసించాలని ఆయన గట్టి పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధాన డిమాండ్ బి.సి.లకు 42శాతం రిజర్వేషన్ వర్తింపచేయాలని. ఎప్పటికైనా బీసీలకే రాజ్యాధికారం దక్కు తుందన్న ప్రగాఢ విశ్వాసం ఆయనది. జనాభాలో అంతపెద్ద సంఖ్యలో బీసీలున్నప్పుడు వారికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించేది కేవలం రూ.50 కోట్లంటే ఇదేమైనా ముష్టి వేస్తున్నట్టా? అని ఆగ్ర హంగా ప్రశ్నిస్తారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9వేల కోట్లు కేటాయించాలనేది ఆయన ప్రధాన డిమాండ్. గత ఏడాది కాజీపేటలో జరిగిన బి.సి.ల శంఖారావం సభల్లో ఆయన మాట్లాడు తూ 42శాతం రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించకపోతే వెనుకబడిన వర్గాల వారి ఆధ్వర్యంలో పెద్ద భూకంపమే సృష్టిస్తానని హెచ్చరించారు. కేవలం బీసీల ఓట్లతోనే తాను గెలిచానన్న సంగతి గుర్తుచేశారు. అంతేకాదు బలమైన వర్గాలుగా వున్న బీసీలు, ఓసీల్లోని నిరుపేదలపై కూడా దృష్టిపెట్టాలని ఆయన ఉద్దేశం. కులాలవారీగా బీసీల ఓట్లు చీలిపోయిన నేపథ్యంలో, ఈ కులాలమ ధ్య పొత్తులు కుదరాలి. ఆవిధంగా పొత్తు కుదిరిన తర్వాత బీసీ కులాలన్నింటిలో ఉన్న వివిధ నిపుణులతో కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని తీన్మార్ మల్లన్న ఆకాంక్ష. ముఖ్యంగా వెనుకబడిన అన్ని కులాల మధ్య పొత్తు కుదిరితే అవి బలమైన వర్గంగా మారి రాజకీయాలను శాసించగలు గుతాయి. ఇప్పటివరకు ‘మేమెంతో మాకంత’ అనే దశనుంచి ‘మీరెంతో మీకంత’ అని ఓసీలకు చెప్పే స్థాయికి బీసీలు ఎదగాలి. అంటే జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఎంతో స్పష్టమైంది. ఓసీలు, ఎస్సీలు, ఎస్సీలు కలిసి పావు షేరు వుంటే, మిగిలినవారంతా బీసీలే. అందుకనే ‘మీరెంతో మీకంత’ అనేది! బీసీల ఉద్యమంపై ఏ ఒక్క రాజకీయపార్టీ నోరు మెదపడానికి భయపడుతున్నదంటే, ఈ ఉద్యమం ఎంత బలంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని మల్లన్న అంటా రు. ఉద్యమం బలంగా వుంటేనే ఎవ్వరూ నోరెత్తరనేది ఆయన అభిప్రాయం.
బీసీలకు ఏవిధంగా అన్యాయం జరుగుతున్నదో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకొని వివరించిన విధం విశ్లేషణాత్మకంగా వుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,312 మంది బి.సి. జనాభా వుంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు. అదే 2,97,659 ఓసీలుంటే వారికి మూడు సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అసలు ఇంతమంది బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి సీట్లెందుకు కేటాయించలేదు? గెలవడం గెలవకపోవడం తర్వాతి ముచ్చట. ఇది అన్యాయం కదా. అంటే రాజకీయ పార్టీలు కొంతమంది తమకోసం పెట్టుకున్నారు కనుక బీసీలకు సీట్లు ఇవ్వలేదు. అసలు వీరి సంగతే వాళ్లకు పట్టదు. అదీకా కుండా మనం ఎన్నికల్లో పార్టీ గుర్తులకు మాత్రమే ఓటేస్తాం. అందువల్ల మనకు బీసీల సంఖ్య, బలం, జనాభా అనే సంగతులు మనకు తెలియవు. ఇదీ ఆయన విశ్లేషణ.
నాయీ బ్రాహ్మణుల చరిత్ర
1947ా2024 మధ్యకాలంలో నాయీ బ్రాహ్మణుల (మంగలి)కు చెందిన వారు ఎవ్వరూ మండలి, అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికవలేదు! అసలు వాళ్లకు అవకాశం కల్పిస్తేనే కదా? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల జనాభా 309798. వీరిజనాభాలో సగం కంటే తక్కువ జనాభా వున్న వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి వెళ్లారు. ఇ దేం విచిత్రం! తక్కువ జనాభా ఉన్న జాతులు క్రమంగా అంతరించి పోతాయన్నది అంబేద్కర్ సి ద్ధాంతం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. నిజానికి నాయీ బ్రాహ్మణుల రాజ్యపాలన చరిత్ర క్రీ.పూ.362నాటిది. అదే సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి నాయీ బ్రాహ్మణుడే. ఆయన పేరు మహాపద్మానందుడు. ఆయన చక్రవర్తి ఎట్లా అయ్యాడంటే శిశునాగులు పరిపాలిస్తున్న కాలంలో వారికి క్షవరం, వైద్యపరమైన సపర్యలు చేయడానికి ఈ మహాపద్మనందుడు వుండేవాడు. ఈయన్ను శిశునాగులు ప్రతిరోజు అవమానించారు. చివరకు ఈ అవమానం భరించలేక తనవద్దనున్న కత్తితో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాడు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని, చుట్టుపక్కల రాజులను ఓడిరచి చక్రవర్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా డు. ఆయన వద్ద లక్షకోట్ల కిలోల బంగారం వుండేదట. దాన్ని గంగానది గర్భంలో దాచిపెట్టాడన్నది చారిత్రక కథనం. కరీంనగర్ జిల్లా రామడుగు వద్ద ఇటీవల ఒక పు రాతన విగ్రహం బయటపడిరది. ఇది మహాపద్మనందుడి కాలం నాటిది. అటువంటి చరిత్ర నా యీ బ్రాహ్మణులది. స్వాతంత్య్రానికి పూర్వం వీరిని ఎస్సీ వర్గంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం గు ర్తించింది. స్వాతంత్య్రానంతరం వీరిని జనరల్ కేటగిరీలోకి చేరిస్తే, అనంతరామన్ కమిషన్ సిఫారసు మేరకు వీరిని బీసీాఎ గ్రూపులో కలిపారు. ఇదీ వారి చరిత్ర. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిది ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన నాయీబ్రాహ్మణుడు. మరి మన తెలంగాణలో మంగలివారి పరిస్థితేంటి?
ప్రతి కులంలో ప్రతిభ అనేది దాగివుంటుంది. అటువంటి వారిని వెలికి తీసి ప్రాధన్యత ఇస్తే త ప్పక పైకొస్తారు. కానీ అగ్రకులాలు బీసీలను ఎదగనీయకుండా చేయడంతో వీరిలోని ప్రతిభ అణగారిపోయింది. తమ సామర్థ్యం తాము తెలుసుకోలేని దుస్థితికి దిగజారారు. ఈ దీన స్థితినుం చి బయటపడి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం, అందుకు అవసరమైన సామర్థ్యాన్ని, వనరులను పెంపొందింపజేసుకోవడం బీసీల తక్షణ కర్తవ్యమని తీన్మార్ మల్లన్న వారిలో చైతన్యాన్ని ఉద్దీప్తం చేస్తున్నారు. ఒక గట్టి బీసీ నేతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తు న్నారు. మరి బీసీల రాజ్యాధికార సాధనలో ఆయన ఎంతవరకు కృతకృత్యులవుతారన్నది కాలమే నిర్ణయించగలదు.
`ఈ ఏడాదిలోనే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం
`ప్రభుత్వం మీద పట్టభద్రులలో మరింత నమ్మకం
`నరేందర్ రెడ్డి కి ఉద్యోగాల కల్పన బాగా కలిసొచ్చే అంశం
`నరేందర్ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులే లక్షల్లో వుంటారు
`వాళ్లంతా నరేందర్ రెడ్డి నాయత్వాన్నే బలపరుస్తారు
`నాలుగు ఉమ్మడి జిల్లాలలో అత్యధిక శాతం పట్టభద్రులు కరీంనగర్ జిల్లాలోనే వున్నారు
`తెలంగాణలో విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు
`కరీంనగర్‌లో అందరికీ సుపరిచితులు
`విద్యా వ్యవస్థపై పూర్తిగా పట్టున్న విద్యా వేత్త
`నిరుద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన వున్న వ్యక్తి
`ఏ రకంగా చూసినా గెలిచేందుకు అన్ని రకాల దారులున్న నాయకుడు
`పార్టీలకతీతంగా వ్యక్తిగతంగా అందరివాడు
`ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు
`ఇతర అభ్యర్థుల కన్నా ముందున్నారు
`ఇతర పార్టీల అభ్యర్థుల ఎవరూ నరేందర్ రెడ్డికి సమీపంలో వున్నట్లు కూడా లేదు
`నరేందర్ రెడ్డి విజయం ముందే నిర్ణయం జరిగినట్లే అని చర్చించుకుంటున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆల్‌ఫోర్స్ విద్యా సంస్దల అదినేత డాక్టర్. వి. నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పాఈ్ట అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అనువైన, అనుకూల వ్యక్తిగా నరేందర్ రెడ్డికి పేరుంది. వ్యక్తిగా అందరి తలలో నాలుకలా వుండే నాయకుడు నరేందర్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని ఎంపిక చేస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలుపు మరింత సునాయాసమౌతుందని నిర్ణయం తీసుకున్నది. అయితే నరేందర్ రెడ్డి పేరు ఇప్పుడు ప్రకటించినా గతంలోనే ఆయనను పార్టీ అధిష్టానం పిలిపించుకొని వివరాలు కనుగొన్నది. ఆయనతో అనేక విషయాలు చర్చించింది. విద్యా రంగం, యువత, నిరుద్యోగ, ఉపాది వంటి అనేక అంశాలపై నరేందర్ రెడ్డికి వున్న అవగాహన చూసి అదిష్టానం మెచ్చి ఎట్టకేలకు ఆయనను ఖరారు చేసింది. విద్యారంగంలో సుమారు 40 సంవత్సరాల విశేష అనుభవం నరేందర్‌రెడ్డికి వుంది. నరేందర్ రెడ్డిని పిలిపించుకున్నప్పుడే గ్రౌండ్ వర్క్ చేయమని అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన గత ఆరు నెలలుగా విశేషమౌన కృషి చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నా పార్టీ అదిష్టానంపై నమ్మకంతో, అంకితబావంతో పెద్దఎత్తున పట్టభద్రుల ఎన్‌రోల్ మెంట్ నాలుగు జిల్లాలో చేపట్టారు. అందరింటే ముందున్నారు. అంతే కాకుండా నరేందర్‌రెడ్డికి పార్టీపై వున్న అపారం నమ్మకంతో తన ప్రచారాన్ని కూడా ఎప్పుడో ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీపెద్దలు, నాయకులు, ఆయా జిల్లాలో వున్న పట్టభద్రులను కలిసి తనను గెలిపించాలని కోరడం జరిగింది. వాళ్లందరికీ రెగ్యులర్‌గా టచ్‌లో వుంటూ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందో కూడా వారిని ఒప్పించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాంతో ప్రచారంలో అందరికన్నా నరేందర్ రెడ్డి ముందున్నారని చెప్పడంలో సందేహం లేదు. పైగా పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా వున్న కరీంనగర్ జిల్లాలో పట్టున్న ఏకైక నాయకుడు నరేందర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఆయన పేరు తెలియని వారు, ఆయన పరిచయం లేని వారంటూ ఎవరూ వుండరు. అంతలా ఆయన పేరు సుపరిచితం. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆయన విద్యా సంస్ధలలో చదువుకొని జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. వాళ్లంతా అనేక రంగాలలో గొప్ప గొప్ప స్ధాయిలో వున్నారు. వాళ్లు ఆయన విద్యార్ధులే. సమాజానికి సేవ చేస్తున్నవారే. అందువల్ల నరేందర్ రెడ్డికి ఆ ఓట్లు ఎంతో కీలకం. ఆ ఓట్లే ఆయన గెలుపును సునాయాసం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఏ అభ్యర్ది నరేందర్‌కు పోటీ కాలేదు. సాటి రాలేరని చెప్పొచ్చు. ఎందుకంట సుధీర్ఘమైన అనుభవం నరేందర్‌రెడ్డికి విద్యారంగంలోనే వుంది. అంటే సమాజమంతా విద్యారంగంతోనే ముడిపడి వుంటుంది. విద్యా రంగ నిపుణులకు సామాజిక సమస్యల మీద వున్నంత అవగాహన ఇతర రంగాలలో వుండేవారికి వుండదు. అందువల్ల రేపటి తరానికి ఏం కావాలి? ఇప్పుడు మన దేశంలో విద్యారంగం ఎలా వుంది? ప్రపంచ దేశాలలో విద్యా రంగ పరిస్దితులు ఎలా వున్నాయన్నదానిపై సంపూర్ణమైన అవగాహన వున్న ఏకైక నాయకుడు నరేందర్ రెడ్డి. అందువల్ల ఆయనకు తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై అనేక మార్గాలను అన్వేషించగలిగే ఆలోచనలు, ఆచరణలు చూపించగల నాయకుడు నరేందర్‌రెడ్డి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నిరుద్యోగం ఒక పెద్ద విపత్తు అని చెప్పాలి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న వారికి కూడా ఉపాది అవకాశాలు తగ్గుతున్నాయి. కారణం మన విద్యా వ్యవస్ధలో వున్న లోపం. మన విద్యా విధానంలో అనేక రకాల, రూపాలలో రకరకాల కోర్సులు వున్నాయి. కాని వాటిపై రాజకీయ నాయకులకు పూర్తి అవగాహన వుండదు. పాలకులతో చర్చించేందుకు వారికి వెసులుబాటు వుండదు. వాటిపై పట్టు వుండదు. కాని విద్యా రంగంలో వున్న నిపుణులైన నరేందర్‌రెడ్డి లాంటి వారికే విద్యా రంగ సమస్యలు, తీసుకురావాల్సిన మార్పులు, ఇప్పటి తరానికి అవసరమైన మార్పులపై సమగ్రమైన అవగాహన ఆ రంగంలో వుండేవారికి మాత్రమే వుంటుంది. విద్యా రంగంలో ఎంతో నిష్ణాతుడైన నరేందర్ రెడ్డిని పట్టభద్రులు ఎన్నుకుంటే పెద్దల సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసే అవకాశం ఏర్పతుంది. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. విద్యా రంగ నిపుణుడైన నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలౌతుంది. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఆయన ఒకటి రెండు దఫాల ప్రచారం కూడా పూర్తిచేసుకున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చేలా, ఎలాంటి వాయిదాల లేకుండ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా చేస్తానని నరేందర్ రెడ్డి మాట ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 55వేలకు పైగా ఉద్యోగాలను ఈ ఏడాది కాలంలోనూ భర్తీ చేసింది. కొత్తగా అనేక నోటిపికేషన్లు కూడా విడుదల చేసింది. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో పదేళ్లపాటు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువతకు ఉపాది కరువైపోయింది. వారి జీవితంలో పదేళ్ల విలువైన సమయం వృధా అయ్యింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది. వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలలో పెండిరగ్‌లో వున్న ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. అందువల్ల తెలంగాణలో వున్న మొత్తం నిరుద్యోగులు, యువత కాంగ్రెస్ వైపే వున్నారని చెప్పడంలో సందేహం లేదని నరేందర్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నిరుద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సమర్దుడు నరేందర్‌రెడ్డే అని నిరుద్యోగులు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిసిన వెంటనే నిరుద్యోగ సమస్యపై తాను నిరంతరం కృషి చేస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్ధలలేవైనా వాటిలో పనిచేసే ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే అద్యాపకుల సమస్యలే కాదు, వారికి ఆరోగ్య భీమా అందిస్తానంటున్నారు. ప్రైవేటు రంగాలలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో కంపనీలు స్ధాపించే పారిశ్రామిక వెత్తలతో మాట్లాడి తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందేందుకు ప్రయత్నం చేస్తానంటున్నారు. ఇలా తెలంగాణ విద్యారంగంలో మరింత ముందుకు సాగేందుకు కృషి చేస్తానని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. దాంతో పెద్దఎత్తున యువత నరేందర్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని బలపర్చుతున్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇతర పార్టీలకు చెందిన ఏ అభ్యర్ది నరేందర్ రెడ్డితో సమానమైన సామాజిక సృహ వున్నవారు కాదు. అందుకే నరేందర్ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా పట్టభద్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాము దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇక ప్రచారం విషయంలో కూడా అందరికంటే నరేందర్ రెడ్డే ముందున్నారు. నాలుగు జిల్లాలు కలియ చుట్టేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పట్టభద్రులతో ప్రత్యేకమైన సమావేశాలు ఇప్పటికే అనేకం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. తాను గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారో కూడా చెప్పి, పట్టభద్రులల్లో నమ్మకం నింపారు. అందుకే ఎవరి నోట విన్నా ఒకటే మాట..నరేందర్ రెడ్డిదే గెలుపన్నదే వినిపిస్తున్న చర్చ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకుఇచ్చిన ప్రతి హామీని వెంటనేఅమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలంఅన్నారు.శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని ప్రతి పేదవానికి, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లునిర్మించి ఇవ్వాలనిఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామకమిటీలో అన్ని రాజకీయ పార్టీల ను అనుమతించాలని,సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గ్రామాలలో పారదర్శకంగా అర్హులైన పేదలని గుర్తించాలనిఆయన కోరారు. అర్హులైన పేదలను గుర్తించకుండా ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నిరుపేదలకి ఇండ్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీల 12 వేల రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏ కకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకుండా పెండింగ్లో ఉన్న రుణమాపిని వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు దపాలుగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ , రైతు భరోసా రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ సంపన్నులకు, బడా కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. . ఈ సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, గౌసియా బేగం, వెంకటేశం, నరసింహ, ఈరటి వెంకటయ్య, అంజయ్య,బల్లెం స్వామి, ఈరగట్ల నరసింహ,తదితరులు ఉన్నారు.
– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
Shiva Parvathi
మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సంక్షేమం ముసుగులో సోమరులను తయారుచేస్తున్న పార్టీలు
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే సమాజానికి మనుగడ
సంక్షేమం ఉత్పత్తికి దోహదం చేసేదిగా వుండాలి
శ్రమైక జీవనంలోనే జీనవ సౌందర్యం
సంక్షేమం మాటున పరాన్నభుక్తులను తయారుచేయొద్దు
సంక్షేమం అభివృద్ధి సమతుల్యమైతేనే సమర్థపాలన
రాజకీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే పరమావధిగా ఎన్నికల్లో హద్దూపద్దూ లేని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? అప్పులు, ఆదాయ వివరాలు తెలుసో తెలియదో కానీ హామీలు మాత్రం కోటలు దాటే స్థాయిలో వుంటున్నాయి. తీ రా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయలేక కప్పదాటు రాజకీయాలు చేయడం దేశంలో ఒక రివాజుగా మారిపోయింది. క్రమంగా దిగనాసిల్లుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఈ ఉచితాలపై ఎక్కువ హామీలు గుప్పించి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధి కారంలోకి రాగలిగింది. కానీ ఇచ్చిన హామీల అమలులో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఢల్లీిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కాం గ్రెస్ తన ఉచితాలను ‘అనుచిత’ రీతిలో ప్రకటిస్తుండటం విస్తుపోయేలా చేస్తోంది. ఢల్లీి ఎన్నిక ల్లో ప్రధాన పోటీ ఆమ్‌ఆద్మీ`బీజేపీల మధ్యే వుంటుందని వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో గెలుస్తామన్న ధీమా లేకపోయినప్పటికీ, ‘తెగించి’ మరీ హామీలు ఇస్తోంది. వీటిల్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలు ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయితే ఢల్లీిలో ప్రతి మహిళకు రూ.2500, వృద్ధ వితంతు వులు, వికలాంగులకు నెలకు రూ.5000, యువతకు రూ.8500 స్టైఫండ్ ఇస్తామని కొత్త హామీలను ఇచ్చింది. ఇప్పటివరకైతే కాంగ్రెస్‌కు గాలి అనుకూలంగా లేదు. ఎట్లాగూ ఓడిపోతున్నాం కదా ‘కొండకు వెంట్రుక కట్టాం’ అన్నరీతిలో ఈ హామీలను గుప్పిస్తున్నదేమో తెలియదు. ఎందుకని ఇట్లా అనాల్సి వస్తున్నదంటే, మహిళలకు ఉచితబస్సు సదుపాయం వీటిల్లో లేదు! దీన్ని అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆర్టీసీకి డబ్బులు కట్టలేక నానా అగచాట్లు పడుతున్నాయి. ఈ బాధలను చూసే ఢల్లీి ఎన్నికల్లో ఈ హామీపట్ల మొగ్గు చూపలేదనుకోవాలి. అయితే మిగిలిన హామీల మాటేంటి? ఒకవేళ అధికారంలోకి వస్తే అమలు చేసే పరిస్థితి కాంగ్రెస్‌కు వుం టుందా? అనేది ఇప్పటికైతే సమాధానం దొరకని ప్రశ్న.
ఉచిత బస్సు కర్ణాటకలో విఫలమైందనే చెప్పాలి. ఈ ఉచిత బస్సు పథకం పుణ్యమాని కెఎస్సార్టీసీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడిరది. ‘ఉచిత బస్సు’లోటును పూడ్చడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అట్లాగని పథకాన్ని ఎత్తేయాలంటే భయం! ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్లు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, డబ్బులు పెట్టి టిక్కెట్ కొను క్కున్నవాళ్లు నిలబడి ప్రయాణిస్తుంటే, ఉచిత సౌకర్యం పొందేవారు దర్జాగా సీట్లలో కూర్చొని ప్రయాణిస్తున్నారు! తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ప్రభుత్వం పంటి బిగువున ఈ పథకాన్ని అమలు చేస్తున్నదనుకోవాలి. అంతేకాదు తెలంగాణలో ఆరు హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కావడంలేదంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వంపై మోయలేని భారమే! ఇది ప్రభుత్వానికి మింగలేని, కక్కలేని పరిస్థితి! మరి ఢల్లీిలో కాంగ్రెస్ ప్రకటించిన నెలకు రూ.5000, రూ.2500, యువతకు రూ.8500 స్టైఫండ్ పథకాలు తెలంగాణ, కర్ణాటకల్లో అమలు కావడంలేదు. అక్కడ అమలైతే ప్రజలు నమ్మేవారేమో! ఇప్పుడు నమ్మితే మాత్రం ముక్కుమూసుకొని యమునా నదిలో దూకినట్టే! ఇక ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆరు హామీల విషయంలో చేతులెత్తేసి, ‘రాష్ట్రం 15శాతం వృద్ధి నమోదు చేస్తే వీటిని అమలు చేస్తామని’ ఎవరికీ అర్థంకాని రీతిలో తనదైన శైలిలో గణాంక వివరాలు చెప్పి ‘కాడి కిందపడేసి’ మమ అనిపించారు. ఆయన చెప్పిన లెక్కలు సామాన్యుడికి అర్థమయ్యేసరికి మళ్లీ ఎన్నికలస్తాయి! పనిలో పనిగా ఆస్తిపన్నుమాత్రం 40`50శాతం పెంచేసి ‘సంక్షేమాలు’ అమలు కావడం లేదన్న పరేషాన్‌లో ఉన్న సామాన్యులపై ‘కర్రు’ కాల్చి వాతపెట్టారు. రాష్ట్రం 15శాతం వృద్ధి చెందేదెప్పుడో చంద్రబాబుకే తెలియాలి. కానీ ఆస్తిపన్ను రూపంలో ఆయన పెట్టిన ‘వాత’ మాత్రం తక్షణం అమల్లోకి వచ్చేసింది. తన ప్రతి వైఫల్యానికి జగన్ ‘బూచి’ని చూపి జనాలను భయపెట్టడం ఏపీలో అధికార పార్టీకి అలవాటైపోయింది. రోడ్లు వేయని జగన్‌ను జనం మరచిపోతే, రోడ్లేసిన చంద్రబాబు జనానికి ‘వాత’ల రూపంలో తనను మరచిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా సాగాలి. కానీ అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పార్టీలు అదుపులేని స్థాయిలో సంక్షేమ హామీలిచ్చేసి, అభివృద్ధిని పట్టించుకో వడంలేదు. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి. అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ సొంత డబ్బు లు ఈ సంక్షేమాలకు ఉపయోగించడంలేదు. ఈ నిధులన్నీ పన్ను చెల్లింపు దార్లనుంచి వసూలు చేసినవి! ఆవిధంగా ఇతర వర్గాల వారినుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే ఈ నిధులను, ఇష్టం వచ్చిన రీతిలో పప్పుబెల్లాల మాదిరిగా సంక్షేమాలకోసం పంచిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఓట్లకోసం అమలు చేసే ఈ ఉచితాల వల్ల జనాల్లో పనిచేసే అలవాటు కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువ. మానవుడి ఆశకు అంతుండదు. ఒక కోర్కె తీరగానే మరో కోర్కె నెత్తిన నాట్యం చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పరిస్థితి! హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలే అమలు చేయలేక ప్రభుత్వం దివాలా తీసే దుస్థితి లో వుంటే, ఇంకా మరిన్ని సంక్షేమాలు కావాలని ప్రజలు కోరుతున్నారట! ఇది సాక్షాత్తు కాంగ్రెస్‌నాయకుడు డి.కె. శివకుమార్ అన్న మాటలు! ఈ మితిమీరిన సంక్షేమాల వల్ల పార్టీలు అధికా రంలోకి వస్తున్నాయేమో కానీ, సామాజికంగా తీవ్ర నష్టాలు కలుగుతున్నాయి. ఉచితాలతో కడుపు నిండుతున్నవారు పనులకు పోవడం మానేయడం పల్లెల్లో కనిపిస్తోంది. ఫలితంగా సామాజిక ‘అల్లిక’ దెబ్బతినడం మొదలైంది. అందరూ అన్ని పనులు చేయలేరు. పరస్పర సహకారమే స మాజ మనుగడకు పరమావధి. కానీ సంక్షేమాలు అందే కొన్ని వర్గాలు తాము చేయాల్సిన పనులు చేయకపోవడంతో వ్యవస్థ దెబ్బతినడం మొదలైంది. శ్రామిక ఉత్పత్తి ద్వారా అభివృద్ధి, సంక్షేమం బాటన నడవాల్సిన సమాజాల్లో, ప్రభుత్వాలు సోమరులను ‘ఉత్పత్తి’ చేస్తున్నాయి. ఇది తి రోగమనం తప్పమరోటి కాదు.
ట్రేడ్ యూనియన్లు, కమ్యూనిస్టు భావజాలం బాధ్యతలు లేని ‘హక్కు’లను నూరిపోయడంతో ప్ర భుత్వరంగ సంస్థలు పెద్ద గుదిబండలుగా మారాయి. ఇది ప్రైవేటీకరణకు దారితీసి ఉత్పాదకత బాగా పెరగడంతో ఉపాధి అవకాశాలతో పాటు, ప్రజల జీనవ నాణ్యత పెరిగింది. కేవలం ‘హ క్కులు’ మాత్రమే ప్రబోధించిన కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ‘సంక్షేమం’ పేరుతో ఇటువంటి బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూ డా ‘బాధ్యతలు’ లేని ‘హక్కుల’ వంటిదే! కాకపోతే దీనికి సంక్షేమం అనే అందమైన ముసుగును వేస్తున్నారు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలు గతంలో మాదిరిగా లేరు. వారి జీవన నాణ్యత పెరిగింది. వాళ్ల ఆలోచనా తీరు కూడా మారింది. తిండి, గుడ్డ, ఇల్లు అనే రోజులుపోయాయి. సంపాదించే తీరుతెన్నులు, సంపద సృష్టిలో ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ప్రజలు మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకొని ముందుకు సాగుతున్నారు. అందువల్ల అధికారంలోకి వచ్చే పార్టీలు ముఖ్యంగా ఆలోచించాల్సింది అర్థంపర్థంలేని హామీలకు కాకుండా, ఉచితవిద్య, ఉచిత వైద్యంపై దృష్టి కేంద్రీకరిస్తే ప్రజలకు అంతకు మించి చేసే మేలు మరోటుండదు.
విద్య, వైద్యం నేడు ఎంతో ఖరీదైనవిగా మారాయి. మనిషి ఆరోగ్యంగా వుంటేనే పనిచేయగలడు.పనిచేస్తేనే ఉత్పాదకత పెరికి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కారణం ఇదే. సామాన్యులు తమ ఆదాయంతో అప్పులు చేయకుండా ప్రశాంతంగా జీవించాలంటే, విద్యను ఉచితంగా అందించాలి. తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు పెద్ద భారం కారాదు. అప్పుడు మాత్రమే వారు తమ జీవితాలకు భరోసా లభించినట్టు భావించగలరు. ఎందుకంటే తమ పిల్లలకు గౌరవప్రద స్థానాన్ని కల్పించే విద్య, అనారోగ్యానికి అందుబాటులో చికిత్స వున్నప్పుడు వారు తమ మిగిలిన అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఫలితంగా వారి జీవనగమనం సాఫీగా సాగుతుంది. ప్రజల సంక్షేమం పట్ల నిజమైన నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీలు ప్రధానంగా చేయాల్సింది ఇదీ! ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం కదా అని చెప్పవచ్చు. ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని అమలు చేయడానికి కొన్ని సందర్భాల్లో ముందుకు రావడంలేదు. ప్రభుత్వం బకాయిలు పడటానికి ప్రధాన కారణం ఇతర సంక్షేమ పథకాల భారం! ఈ భారాన్ని మోయలేరు, తీసేయలేరు! ఇదొక విచిత్ర సంకట స్థితి! ఒక రకంగా చెప్పాలంటే ‘ఉచితాలు’ ప్రకటించి అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రశాంతంగా లేవు. ‘ఉచి తాలు’ అందని మెజారిటీ ప్రజలు సుఖంగా లేరు. అందువల్ల ఉచితాలు కాదు కావలసింది ఉపాధి. ఒక వర్గంవారిపై భారంవేసి మరో వర్గంవారిని పైకి తేవాలనుకోవడం సముచితం కాదు! ఎందుకంటే ఆ వర్గాలకు డబ్బులు ఊరికే రావడంలేదు! ఎంతో కష్టపడితేనే వస్తున్నాయి! అటు వంటి తమ కష్టార్జితాన్ని పన్నులపేరుతో ముక్కుపిండి వసూలు చేసి సంక్షేమాల పేరుతో అభివృ ద్ధిని నిర్లక్ష్యం చేయడం సమర్థపాలన అనిపించుకోదు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి మాత్ర మే సుపరిపాలన అనిపించుకుంటుంది! మరి ఈ ఓట్ల సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు బయటకు వచ్చి సమర్థపాలన అందించడం ఇప్పట్లో సాధ్యమయ్యేదేనా?
` ఇప్పుడన్నా ఊరట కల్గుతుందేమో అని ఎదురుచూస్తున్నారు.
` ఇంతకాలం నడ్డి విరుస్తూనే వచ్చారు.
` పన్నుల మోత ఇకనైనా తగ్గించండి.
` వాయింపులు వాయిదా వేయండి.
` సామాన్యలను బతకనీయండి.
` పేదల బతుకు బస్టాండు చేయకండి.
` పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు.
` సంపాదించింది మిగలలేక దిగులు పడుతున్నారు.
` కొనుగోలు శక్తి తగ్గి కుదేలౌతున్నారు.
` సంపాదన తిండికే సరిపోవడం లేదు.
` దేశమంతటా వలసలు పోతున్నారు.
` ఉత్తరాధి నుంచి దక్షణాదికి కడుపు కట్టుకొని వస్తున్నారు.
` కూలీ నాలి చేసుకొని బతుకుతున్నారు.
` పిల్లలను కనీసం చదివించుకునే దిక్కులేదు.
` రోగమొస్తే వైద్యానికి దిక్కులేదు.
` గంభీరంగా జనం బతుకుతున్నారు.
` బలహీనంగా బతుకులీడుస్తున్నారు.
ఈసారైనా తమ కష్టాలు తీరుతాయా? పన్నులు తగ్గుతాయా? జీవితాలు మెరుగు పడతాయా? అంటూ సామాన్యులు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఈసారైనా మాపై దయచూపమ్మా అంటూ వేడుకుంటున్నారు. ప్రజలు సమస్యలతో సతమతమౌతున్నారు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ఆగమౌతున్నారు. వచ్చేరూపాయికి, వెళ్లే రూపాయికి పొంతన లేక జనం అవస్ధలు పడుతున్నారు. కొనుగోలు శక్తి లేక ఆకలికి మాడుతున్నారు. కడుపులు మాడ్చుకుంటున్నారు. ఉల్లి ధరలు పెరిగితే తినడం మానేయండి అని చెప్పినంత సులువు కాదు..జీవితాలంటే..ఓ వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే తగ్గించకపోగా, వాయింపులు పెరుగుతున్నాయి. ఏ కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదని జనం ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ఆ రేషన్‌తో జనం బతుకుతున్నారని పాలకులు లెక్కలేసుకుంటే బాగున్నారని అర్ధం కాదు. సగటు వ్యక్తి తన ఆశలు, కోరికలు అన్నీ చంపుకొని బతుకుతున్నాడు. కంటి నిండా నిద్రపోయే పరిస్ధితి లేదు. కుటుంబమంతా కష్టపడుతున్నా పూట గడవడం లేదు. పదేళ్లు అసంఘటిత కార్మికులు కూలీలు పెరగడం లేదు. వారి జీవితాలకు భరోసా లేదు. జీతాలు పెరగక వేతన జీవులు విలవిలలాడుతున్నారు. కార్మికుల జీవితాలు ఆగమ్య గోచరంగా తయారౌతున్నాయి. చిన్న పరిశ్రమలు లక్షల్లో మూతపడుతున్నాయి. కార్పోరేట్ వ్యాపారులు కూడా చేతులేత్తేసున్నారు. ఆర్ధిక వ్యవస్ధ కుదలేలౌతోంది. ఆర్ధిక వ్యవస్ద చిన్నాభిన్నమౌతోందని ఆర్ధిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచం ఎటు వెళ్తుందో..మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండానే కాలం గడిచిపోతోంది. డిమాండ్, సప్లయ్‌లో సమతూకం లేకుండాపోతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణిస్తోంది. మార్కెట్‌లో మనీ సర్కులేషన్ లేకుండాపోతోంది. డిమాండ్ ఎకనామిక్స్‌ను అనుసరించాల్సిన పాలకులు సప్లయ్ ఎకనామిక్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. అయినా కార్పోరేట్ శక్తులు చేతులేత్తేస్తున్నాయి. అయినా పాలకులకు పట్టింపు లేదు. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. కార్పోరేట్ కంపనీలకు రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు. అయినా ఎక్కడ లోపం జరగుతోంది. పెట్టుబడులు పెట్టి దివాళా తీశామని చెబుతున్నారే గాని, ఉపాది కల్పించి దాఖలాలు కనిపిస్తున్నాయా? నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా సమయంలో కార్పోరేట్ శక్తులకు పదిలక్ష కోట్లు మాఫీ చేశారు. కాని సగటు జనం నుంచి లెక్కకు మించి వసూలు చేస్తున్నారు. వేతన జీవి తన ఏడాది కాలంలో వచ్చే జీతంలో మూడు నాలుగు నెలల జీతంలో కోత పడుతోంది. పన్నుల రూపంలో నేరుగా ఖజానాకు చేరుతోంది. ఉద్యోగి జేబుకు నేరుగా చిల్లు పడుతోంది. ఈ చిల్లు పూడేదెలా? వేతన జీవి కొనుగోలు శక్తి పెరిగేదెలా? ప్రజల మీద వేసిన పన్నుల భారంతో 13శాతం వృద్ది రేటు పెరగుతుందని అంచానా వేశారు. కాని అది 33శాతానికి పెరిగింది. అదే కార్పోరేట్ శక్తుల నుంచి ఆదాయం పెరుగుతుందనుకుంటే .5 శాతానికి పడిపోయింది. లోపం ఎక్కడుంది. కార్పోరేట్ శక్తుల నుంచి పన్నులు వసూలు చేయడంలో అసత్వం వహిస్తున్నారు. సామాన్యుల నుంచి ఉప్పు, పప్పు, చెప్పు,నిప్పు నుంచి కూడా పన్నుల మీద పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకుంటున్నారు. కార్పోరేట్ శక్తులకు రాయితీలు ప్రకటిస్తున్నారు. జిడిపి 5శాతానికి పడిపోయిందంటున్నారు. యూపియే 2లో 9శాతంగా పెరిగిన జిడిపి ఇంతలా ఎందుకు దిగజారుతోంది. జనం వద్ద కొనుగోలు శక్తిలేక కార్పోరేట్ శక్తులు ఉత్పత్తులు తగ్గించాయి. కార్మికులను తొలగిస్తూ వున్నాయి. ఆఖరుకు కంపనీలే మూతపడుతున్నాయి. పన్నుల విధానం నచ్చక ఎంతో మంది దేశం వదిలి వెళ్లిపోతున్నారని నిత్యం వార్తలు వస్తున్నాయి. సగటువ్యక్తులు దేశంలోనే ఉపాధి వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతున్నారు. ఇల్లూ, వాకిలి వదిలిపెట్టి వసలు పోతున్నారు. 2014లో బియ్యం ధరలు ఎలా వున్నాయి? ఇప్పుడు ఎలా వున్నాయి? అందుకే ప్రజలు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వడ్డింపులపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. పాప్‌కార్న్ కొన్నా పన్నుల వాయింపులపై నిలదీస్తున్నారు. విద్యార్దులు రాసే పరీక్షల మీద కూడా జిఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా జనం గొడు కేంద్రానికి పట్టడం లేదు. పద్దులకు పన్నులే ముఖ్యమా? అని నిలదీస్తున్నారు. ఈసారైనా పద్దులో కనికరం చూపమని కోరుతున్నారు. ఓ వైపు అమెరికా ప్రజలను పన్నుల భారం నుంచి విముక్తి చేస్తామని ప్రకటిస్తోంది. ప్రజలను పన్నుల భారం నుంచి తప్పిస్తామంటోంది. కాని మన దేశంలో పన్నులే అసలైన పద్దులన్నట్లు సాగుతోంది. ఓట్లేసి మూడుసార్లు ప్రజలు ఎన్నుకుంటే సామాన్యులకు ఎప్పుడైనా ఊరట కల్గిందా? ఓట్లేసి సామాన్యులు. గెలిపించేది సామాన్యులు. బాగు పడేది కార్పోరేట్లు. వాళ్లు ఓట్లేసేది లేదు. ఓట్లు వేమయని చెప్పేది లేదు. కాని వాళ్లను కాపాడుతున్నారు. ప్రజలజీవితాలను గాలికి వదిలేస్తున్నారు. ఈసారైనా..ఈసారైనా అంటూ పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడూ కూడా కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. మధ్య తరగతి జీవితాలకు ఊరట కలుగుతుందని ఆశపడుతున్నారు. ఈసారి పద్దులో పన్నుల భారం తగ్గుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్ విషయంలో పది లక్షల నుంచి పదిహేను లక్షలకు వెసులుబాటు కల్పిస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. కాని అయినా అనుమానం అందరినీ వెంటాడుతూనే వుంది. ఇంత కాలం వడ్డిస్తూనే వున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టినా, మనకు మాత్రం పైసా తగ్గింది లేదు. ఊరట లభించింది లేదు. కాని ధరల పెరుగుదల కనీసం ఆగింది లేదు. పెట్రోలు ధరలు తగ్గించింది లేదు. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలకు ఎంతో వ్యత్యాసముండేది. ఇప్పుడు రెండూ సరిసమానమైపోయాయి. ప్రపంచంలో ఎలక్రిసిటీ వాహనాలు పెరుగుతున్నాయంటూ మనం వాటి వెంట పరగులు తీస్తున్నాం. తాజాగా అమెరికాలో ఎలక్రిసిటీ వాహనాలకు స్వస్తిపలికేందుకు సిద్దపడిరది. పెట్రో ఉత్పత్తులను విపరీతంగా పెంచుకునేందుకు ట్రంప్ అనుమతులిస్తున్నారు. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చేస్తే మొదటికే మోసం వస్తోంది. ప్రతి వ్యక్తి కనీస అవసరాలు తీరడం లేదు. సామాన్యుడు ఇల్లు కొనుక్కునే దిక్కులేదు. అంతెందుకు కనీసం ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేసుకునే పరిస్దితి లేదు. పెట్రోలు ధరలు పెరుగుతున్నా కొద్ది వాహనాల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. సామాన్యులకు అందకుండాపోతున్నాయి. ఉప్పు,పప్పుల పరిస్దితే ఇలా వుంటే ఖరీదైన వస్తువుల ధరలు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెల్ ఫోన్ వాడకం దారులకు నెల రీచార్జికి డబ్బులు వసూలు చేస్తూ, 28 రోజులకు వ్యాలిడిటీ అందిస్తుంటే వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారంటే అర్ధమేమిటి? అటు పాలకులకు వడ్డించి, అటు ప్రైవేటు కంపనీలు వాయించుకుంటూ పోతే సామాన్యుడు బతికెదెలా? పూట గడవడమే కష్టంగా మారుతుంటే పిల్లలకు చదువులెట్లా? వారి ఆరోగ్యాలకు భద్రత ఎట్లా? ఓ వైపు కుటుంబాల ఆర్దిక పరిస్దితి చితికిపోతుంటే, పిల్లల్ని కనండి అని ఉచిత సలహాలు ఇస్తూ పోతున్నారు. జనం గోడు వినిపించుకునే పరిస్దితి లేదు. అందుకే సామాన్యులను బతకనీయండి. పేదల బతుకులు బస్టాండ్ చేయండి. రాజుల కాలానికి ఇప్పటికీ తేడా ఏముంది? అప్పుడు రాజులు నిరంకుశత్వంగా పాలిస్తూ, ప్రజలను పీడిరచుకుతిన్నారు. మనల్ని పాలించిన ఆంగ్లేయులు పీడన భరించలేకనే స్వాతంత్య్రం తెచ్చుకున్నాము. ఆనాడు ఉప్పుమీద పన్నును భరించలేకనే పోరాటం చేశాము. మరి ఇప్పుడు మన పాలన. మన ప్రజాస్వామ్యం. మరి ఎవరి మేలు కోసం ఈ పన్నుల భారాలుఅని ప్రశ్నలు వినిపించడం లేదా? అభివృ ద్ది కావాలంటే పన్నుల వసూలు చేయాలి. కాని పన్నుల వసూలుకు, అభివృద్దికి సమతూకం లేదు. ప్రజలు పన్నులు కట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు. సంపాదించిన దానిలో రూపాయి మిగలడం లేదని దిగులు పడుతున్నారు. అనారోగ్యాల పాలౌతున్నారు. ప్రభుత్వానికి ఖజానా ఎంత ముఖ్యమో..ప్రజలకు తమ ఆర్ధిక స్ధితి కూడా అంతే…కాకపోతే ప్రభుత్వ ఖజానాలో నిలువ వుండదు. జనం జేబులను కూడా అలాగే మార్చుతున్నారు. దీనిని ఆర్ధిక ప్రగతి అనలేరు. దివాళా దిశగా పరుగులు అంటారు. ఇప్పటికైనా అర్దం చేసుకోండి. ప్రజలకు ఊరట కల్గించండి.
ఒక్కసారి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.
నర్సంపేటలో నడుస్తున్న కొత్త సంస్కృతి
ఐపి పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.
60 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ నిధులు రాష్ట్రంలో పంపిణీ.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలోపెట్టుకొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయా డ్రామాకు తెరలేపిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ రాయిడి రవీందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభల వలన లబ్ధిదారులను ఎంపిక చేయలేదు ప్రజలకు జరగలేదన్నారు.రాష్ట్రంలో ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతతో ఎన్నికల నుండి తప్పుకోవడానికే మండలానికి ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేసి ఎన్నికల నుండి తప్పించుకోవడానికి పథకాలను ప్రారంభించినట్లు అధికారులను గ్రామ సభల్లో వాడుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకుండా గ్రామసభల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు పైన రేవంత్ రెడ్డి,కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటనలు చేశారని లబ్ధిదారుల ఎంపిక సీఎం రేవంత్,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటనలు చేశారని ఆరోపించారు.ప్రభుత్వ పథకాల అమలు పట్ల నియోజకవర్గ పరిధిలోని 179 గ్రామ పంచాయితీలకు గాను ఆరు గ్రామాల్లో ప్రారంభం చేశారని మిగతా గ్రామాలు అలాగే నర్సంపేట పట్టణ 24 వార్డుల్లో ప్రజలు మీకు ఓట్లు వేయలేదా ఆప్రజల భాధ్యత వద్దా అని ఎమ్మెల్యే దొంతిని ప్రశ్నించారు. ఒక్కసారి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుకుంటే తప్పుచేయని అధికారులను తిట్ల దండకాలు పడుతున్నాయని తెలియజేశారు.నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఊళ్ళల్లో వ్యాపారాలు చేసి అప్పులు ఎగగొట్టినోళ్ల విధంగా మారిందని ఐ.పి పెట్టిన వారీకి అప్పు పుట్టదు.సంక్షేమ పథకాలు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్లురావని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.ఇప్పుడు నర్సంపేటలో కొత్త సంస్కృతి నడుస్తున్నదని అంటూ గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను లక్ష్మారెడ్డి,ఆ తర్వాత మాధవరెడ్డి గతంలో ఉన్న ఎమ్మెల్యే పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో చేశారు.ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను తెచ్చిన అభివృద్ధి పనులను నిలిపివేసి కక్ష తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై ఆరోపణలు చేశారు.అలాగే నేడు ఎలా పనులు వచ్చాయని ప్రశ్నించారు.గత రెండు సంవత్సరాల క్రితం పనులు చేసిన వాటికి పురోగతి లేదని క్యాన్సిల్ చేసిన మీరు నెల రోజుల్లోనే పనులు తెచ్చి పురోగతి ఎలా తెచ్చారని,గతంలో చేసిన పనుల పట్ల మీకు భాధ్యత లేదా అని మీరు ఎమ్మెల్యేనా లేక కాంట్రాక్టరా అని మాధవరెడ్డిని నిలదీశారు.ఎస్డీఫ్ ఫండ్స్ నుండి 2023 ఎన్నికలకు ముందు ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మూడు జీఓ ద్వార జీఓ నంబర్ 369 ,187 పనులు, 7.22 నిధులు, 384 జీఓ నంబర్ ప్రకారం 17 కోట్ల నిధులతో 102 పనులు,జీఓ నంబర్ 452 ప్రకారం,18.95 కోట్ల నిధులు 385 పనులు మొత్తం 650 పనులు తెచ్చి పనులు మొదలు చేస్తే 650 పనులకు పురోగతి లేదని క్యాన్సిల్ చేశారు. అదే ఎస్డిఎఫ్ నిధుల నుండి జీఓ నంబర్ ప్రకారం 22 ప్రకారం ఎమ్మెల్యే దొంతి 10 కోట్లు 2024 మార్చి నెలలో తెచ్చి 12 రోజుల్లో పనులు పురోగతిలో ఉన్నాయని వర్కులు చేస్తున్నారు.ఇది ధర్మమా అని ఎమ్మెల్యే దొంతిని అడిగారు.గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనులు చేశారు. ఈ విషయాలు బయటపెట్టాల్లా అని పేర్కొన్నారు.నర్సంపేటలో రైతుల అభివృద్ధి కోసం పైలెట్ ప్రాజెక్ట్ గా 60 కోట్ల నిధులు వ్యవసాయ యాంత్రీకరణపై తెస్తే రైతులు సంబరాలు చేసుకున్నారు.కానీ ఆ నిధులు ఆపేశారు.నిల్వ ఉన్న నిధులను ఉపయోగించుకులేనా చేయాలి అని కలెక్టర్ ను కోరినా.కానీ అవి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నర్సంపేట పరిధిలోని రైతుల 60 కోట్ల నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయడానికి ప్రకటన చేసి టెండర్లు పూర్తి చేశారు.ఇది నర్సంపేట పరిస్థితి అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.ఈకార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,జిల్లా నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ మండల శ్రీనివాస్,బండి రమేష్, పెండెం వెంకటేశ్వర్లు,గంప రాజేశ్వర్,పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల యాదగిరి,పట్టణ యూత్ ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్,మద్దెల సాంబయ్య గౌడ్, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
భద్రాచలం డిప్యూటీ తాసిల్దారిగా ధనియాల వెంకటేశ్వర్లు నేడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో యుడిసిగా కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం ప్రమోషన్లు డిప్యూటీ తాసిల్దార్ పదవి బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.