నర్సంపేట పట్టణంలో అగ్నిప్రమాదం.

ఇల్లు,బట్టలు గృహోపకాలు పూర్తిగా దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం…రూ.ఐదు లక్షల ఆస్తి నష్టం.

బాధితురాలు జూలూరి రేణుక

నర్సంపేట నేటిధాత్రి:

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నర్సంపేట పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో మంగళవారం మధ్యాహ్నం సంభవించింది. బాధితురాలు, నర్సంపేట అగ్నిమాపక కేంద్రం అధికారి రాజేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డు మహిళా సమాఖ్య భవనానికి సమీపంలో గల మంచిగా రాజు అని వ్యక్తికి సంబంధించిన పెంకుటిల్లులో తన సోదరి జూలూరి రేణుక నివాసముంటున్నది. రేణుక నర్సంపేట కరెంటు ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నది. దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రేణుక తన తమ్ముడు ఇంట్లో ఉంటూ ఉద్యోగరీత్యా ఉదయం కార్యాలయానికి వెళ్ళింది. ఇంట్లో నుండి పొగలు రావడంతో దానిని గమనించిన చుట్టుపక్కల వారు రేణుకకు సమాచారం ఇచ్చారు అలాగే అగ్నిమాపక కేంద్రానికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సమంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే భారీగా పూలతో పాటు ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రం అధికారులు ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే లోపల భారీ ఎత్తున బట్టలు, గృహోపకారాలు, బీరువా మంటలు అంటుకొని కాలి బూడిదయ్యాయి. పెంకుటిల్లు కావడంతో పైకప్పు మొత్తం ఖాళీ ఇల్లు ధ్వంసం అయింది. అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో జరిగినట్లు గుర్తించామని ఫైర్ అధికారి రాజేంద్రం తెలిపారు. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఫైర్ అధికారి రాజేంద్రం తెలియజేశారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సహాకారం అందించారు.

ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.. బాధితురాలు రేణుక..

నిరుపేద కుటుంబానికి చెందిన నేను భక్త చనిపోయిన నాటి నుండి తన సోదరుని ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నానని ఈ నేపథ్యంలో అగ్నిప్రదాయానికి గురై ఇంటితోపాటు సర్వం కోల్పోయానని బాధితురాలు జూలూరి రేణుక రోధిస్తూ తెలిపింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!