మోడల్ స్కూల్లో’అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం.
చిట్యాల,నేటిదాత్రి :
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *అరైవ్అలైవ్’కార్యక్రమంలో భాగంగా,బుధవారం రోజున చిట్యాల మోడల్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.చిట్యాల ఎస్.ఐ పోచంపల్లి సతీష్ ఆదేశానుసారం, ఎస్.ఐ-3 ఈశ్వరయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు:
వ్యాసరచన పోటీలు:* ‘హెల్మెట్ ధరించడం – ప్రాణ రక్షణ’* అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మానవహారం:* పాఠశాల ఆవరణలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారంగా ఏర్పడి, రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది ఏ ఎస్సై మధుసూదన్ హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్స్ ఏ సందీప్, పి సందీప్ మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
