చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:
చిల్పూర్ మండలంలోని రాజవరం గ్రామానికి చెందిన ఇల్లందుల లక్ష్మి అనే మహిళ ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మరణించడంతో ఆమె కుమారుడైన ఇల్లందుల దయాకర్ తో చదువుకున్న ఎస్ ఎస్ సి బ్యాచ్2003-04 పూర్వ విద్యార్థులైన మిత్రులు అతనికి ప్రగాడ సానుభూతి తెలుపుతూ తోటి మిత్ర బృందం అతనికి ఆర్థిక పరంగా అండగా నిలిచి రూపాయలు14000 వేల రూపాయల నగదును అందించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఊరేడి శ్రీనివాస్, తాళ్లపల్లి క్రాంతి కుమార్ గౌడ్, గడ్డమీది మహేందర్,దుబ్బాక రంజిత్,
మచ్చరాజు,జక్కుల మధుకర్, ఎడ్ల సునీల్, ఎదుల సుదర్శన్, నాయిని రాజు,కుతాటి రాజశేఖర్, చుక్కా అంజిబాబు,రామగుండం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
స్నేహితునికి ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు
