
సిద్దిపేట జిల్లా మనమయ(విశ్వబ్రాహ్మణ) యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా మనుమయ విశ్వబ్రాహ్మణ యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం మాట్లాడుతూ ఆల్విన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ముందే జయశంకర్ సార్ విగ్రహాన్ని దుండగుడు ద్వంసం చేసిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రాహ్మాలు రాస్తారోకలు చేస్తామని డిమాండ్ చేశారు,. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు