రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని మోతే గ్రామానికి చెందిన గోనే అంబదాసు, కోలిపాక రమేష్, బోగ సత్యనారాయణ, గొనే సిద్దయ్య, సత్య నారాయణ, కళ్యాడపు రాయమల్లు బోగ రవీందర్ అనే ఏడుగురు చేనేత కార్మికులను సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా కొలిపాక కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం చేనేత బందు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మర మొగ్గలపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి చేనేతను ప్రోత్సహించాలని, రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న పద్మశాలీలను ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు, పద్మశాలి సంఘం నాయకులు మెరుగు శంకరయ్య, అలువాల శంకర్, కొలిపాక ప్రవీణ్ కుమార్, పంతగాని శ్రీధర్, కొలిపాక అజయ్, కే.ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.