BRS Demands Apology Over Tejasvi Surya Remarks
వివేకపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలి
బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు చక్రి
పరకాల,నేటిధాత్రి
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటును ఇండియా పాకిస్తాన్,విభజనతో పోల్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నాయకుడు ఒంటేరు చక్రి తీవ్ర ఆక్షేపం తెలిపారు.తేజస్వి సూర్య తన అవివేకపూరిత మాటలను తక్షణమే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అతి దారుణమని ఆరోపించారు. తెలంగాణ సాధన అంటే దేశానికి స్ఫూర్తి.ఆ పోరాట స్పూర్తిని చిన్నతం చేసేలా మాట్లాడటం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనమని పోరాట ఉద్యమాలు లేని బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమీ తెలియవని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల మనసులను దెబ్బతీసిన ఈ వ్యాఖ్యలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.a
