దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
నర్సంపేట నేటిధాత్రి:
ఖానాపూరం మండలం బుధరావుపేట గ్రామంలో భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారా తోరణం (ఆర్చ్) ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుదవారం ప్రారంభించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు,దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.