టీవీ ఏసి జేఏసీ నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో తెలంగాణ విద్యుత్ అర్టీజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ కెటిపిపి జెఎసి చైర్మన్ కన్వీనర్ ల ఆద్వర్యంలో నాలుగవ రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం హెచ్ -58 జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రఘోత్తం రాష్ట్ర నాయకులు పుట్టపాక కిరణ్ పొనగంటి శ్రీపాల్ రావు బుర్ర కుమారస్వామి రిజినల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగంపల్లి రాజేశ్వరరావు తోట మల్లిక్ కమిటీ సభ్యులు హాజరై తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23000 మంది అర్టీజన్ కార్మికుల కన్వర్షన్ అనే న్యాయమైన కోరిక వెంటనే అమలు చేయాలని కోరారు ప్రభుత్వానికి డిపార్మెంటుకు శాంతియుతంగా నిరసన కారిక్రమాలు సంస్థలో పనికి బంగం కలగకుండా సంస్థకు నష్టం వాటిల్లకుండా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న అర్టీజన్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది విద్యుత్ శాఖ లో అర్టీజన్ కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వివిధ రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అర్టీజన్ కార్మికుల కన్వర్షన్ అనేది న్యాయమైన కోరిక వెంటనే నెరవేరుస్తారని ఆశిస్తూ ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని వేరుగా సర్వీస్ రూల్స్ ఉండడం వలన అర్టీజన్ కార్మికులకు పదవి విరమణ సమయం లో ఎలాంటి బెనిఫిట్స్ గ్రాట్యుటీ లేకుండా ఖాళీ చేతులతో పదవీవిరమణ అవుతున్నారు కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ శాఖ యాజమాన్యాలు వీరి న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఎ.పి.ఎస్.ఇ.బి.సర్వీస్ రూల్స్ తో ఉన్నటువంటి కన్వర్షన్ ఇవ్వాలని అర్టీజన్ కార్మికుల విద్యార్హతలను బట్టి పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ గా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు సిఐటియు జెన్ కో సెక్రటరీ చిలువేరు మల్లయ్య, రిజినల్ అధ్యక్షులు ఇనుగాల కుమార్ రిజినల్ జెఎసి కోశాధికారి మణి కుమార్ దీక్ష లో కూర్చున్న వారు అల్లం ఓదెలు ఒనపాకల సంపత్ మణి కుమార్ రాజిరెడ్డి శంకర్ సల్లాఉద్దిన్, రవి, ఓదెలు రాజు సుధాకర్ ప్రవీణ్ నెల్సన్ సుదర్శన్ రవిందర్, రాజయ్య కర్నాకర్ సమ్మయ్య శ్రీనివాస్ కొమురయ్య రాజేశ్వర్ సతీష్ ల తో పాటు కెటిపిపి లోని వందలాది అర్టీజన్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు