గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉద్యోగులకు జాతీయ అవార్డులు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న జర్పుల చందన్ సింగ్ డివిజనల్ ఇంజనీర్ కొండికొప్పుల అనిల్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జెన్ కో అధ్యక్షులు ఎలకంటి రఘోత్తం కి కార్మిక రత్న జాతీయ అవార్డు – 2024 సంవత్సరమునకుగాను అందుకున్నారు. జనవరి 5వ తేదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమి 8వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్‌లో… బహుజన సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారి చేతులమీదుగా అవార్డును అందకున్నారు.
ఈ సంధర్భంగా నల్లా రాధాకృష్ణ మట్లాడుతూ. ఎస్.సి., ఎస్.టి., బి.సి. & మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమి వారు ప్రతి ఏట ప్రజా ఉద్యమకారులకు, సంఘసేవకులకు, కవులకు, రచయితలకు మరియు స్వచ్చంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 31 జిల్లాల నుండి సుమారుగా 300 మంది డెలిగెట్స్ ఈ కాన్ఫరెన్స్‌కి హాజరైనారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం. గౌతమ్, అవార్డు సెలెక్షన్ కమిటి సభ్యులు సేవా రత్న అవార్డు గ్రహీత బొమ్మకంటి రాజేందర్, చిలువేరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు