ప్రభుత్వ నిర్మాణ, స్థానిక అవసరాలకు ఇసుక రీచ్ లు గుర్తించాలి

డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ మీటింగ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ప్రభుత్వ నిర్మాణ, స్థానిక, వాణిజ్య అవసరాలకు ఇసుక రీచ్ లు గుర్తించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ శ్యాండ్ కమిటీ మీటింగ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఓ నెంబర్ 3, టీజీ ఎం.డీ.సీ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు.

జిల్లాలో ఎన్ని ఇసుక రీచ్ లు ఎన్ని ఉన్నాయో ఆరా తీశారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 100 ఉండగా, రూ.160 కి పెంచాలని కమిటీ ప్రతిపాదనలు చేశారు. చెక్ డ్యాంల నిర్మాణాలకు ఇబ్బంది కాకుండా ఇసుక తీయాలని ఆదేశించారు. పీ.సీ.బీ ఇతర శాఖల సమన్వయంతో ఇసుక తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీ.ఆర్డీ.ఓ శేషాద్రి, డీ.టీ.ఓ. లక్ష్మణ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సర్వే ఏడీ వినయ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ జానకి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!