కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలేటి శివారెడ్డి
మొగుళ్ళపల్లి డిసెంబర్ : నేటి ధాత్రి
మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా . కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం జిల్లా నాయకులు ఏలేటి శివారెడ్డి మాట్లాడుతూ ఆనాడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోని సిరిసంపదలు. ఖనిజ సంపదలు అన్ని ఉన్నా. అన్ని సంపదలను దోచుకెళ్లి ఆంధ్రను అభివృద్ధి చేసుకున్నారే తప్పా. తెలంగాణను పట్టిచుకున్న పాపానపోలేదని. తెలంగాణకు జరుగుతున్న అన్యాన్ని గర్తించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమరుల త్యాగాలను మరువకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోలేమని కోట్ల జనాభా ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీనీ తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరని అయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము పట్టణ అధ్యక్షులు క్యాతరాజు రమేష్,.బొల్లపెల్లి రాములు, మధుకర్ రెడ్డి,రక్తాని గోపాల్ రావు నాయకులు పాల్గొన్నారు.