మంచిర్యాల,నేటి ధాత్రి:
అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజిలెన్స్, యాంటి కరప్షన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతే అన్నారు.సోమవారం అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజిలెన్స్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ విభాగం సోషల్ డిటెక్టివ్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆడెపు సురెంధర్ అధ్యక్షతన స్టాప్ కరప్షన్ వాల్ పోస్టర్ ను జిల్లా కేంద్రంలో కౌన్సిల్ చైర్మన్ విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించడం సాధ్యమేనని,టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొన్ని రంగాల్లో లంచగొండితనం తగ్గింది అని అన్నారు. మరికొన్ని రంగాల్లో అవినీతి కొనసాగుతుందన్నారు.పూర్తిస్థాయిలో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, లంచగొండితనం తగ్గుతుందన్నారు.కొన్ని శాఖల్లో డబ్బులు ఇవ్వకుండా పనులు కావడం లేదని,దీన్ని రూపుమాపాలంటే ఆలోచించి సరైన పద్ధతులను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు కాగితవు సునీల్, నడిపెల్లి సునీల్ రావు, ఎగుడ తిరుపతి, హనుమండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.