ఎమ్మెల్యే నాగరాజు కు ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి.
కాశిబుగ్గ నేటిధాత్రి.
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేసారు. ఈమేరకు సోమవారం ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్ నగర్ లోని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు అదేవిధంగా స్మశాన వాటిక, కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే నాగరాజును కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ 14వ డివిజన్ లోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ లోని మిగిలిన సిసి రోడ్లు డ్రైనేజీ పనులతో పాటు స్మశాన వాటిక అభివృద్ధి పనులకు కమిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిట్ట నగేష్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ కుమార్, నాయకులు ఓర్సు అంజయ్య, కొమ్ము వినయ్, మహిళా అధ్యక్షురాలు ఎస్.కె శైజాది యూత్ అధ్యక్షుడు కస్తూరి భరత్, శోభ, కాసర్ల రఘు, యాంసాని సందీప్, ఆవుల అజయ్, వెంకట్రాజం, రమ్య, ప్రమీల, సరోజన, రజిత, తదితరులు పాల్గొన్నారు.