ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. వ్యాపార ప్రకటన కోసమేనా

ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోసమా

అవసరం లేకున్నా రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. ప్రైవేట్ ఆసుపత్రుల. యాడ్స్

ప్రతి నిత్యం ప్రజలకు తప్పట్లేదు ఇక్కట్లు..

డివైడర్ మలుపు కనబడక యాక్సిడెంట్లు..
పోలీసులను అడిగితే పర్మిషన్ లేదని సమాధానం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం మున్సిపాలిటీ.రోడ్లపైపోస్టింగ్ బాక్సులు. అడ్డదిడ్డంగా పెడుతున్నది ఎవరు..
లక్షల ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం..
ఎస్పీ. స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రచారం కోసం కొంతమంది పెట్టే ట్రాఫిక్ పోలీస్ బూత్ లు నిరంతరం యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందల సంఖ్యలో ఉన్న ఈ ప్రచారం బాక్స్ల వల్ల అర్ధరాత్రి పూట ఆకతాయిలు తలదాచుకునేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. ఇవి దొంగతనాలు చేసే వ్యక్తులు సైతం తలదాచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రచారం ఏజెన్సీలు అవసరం లేని చోట కూడా పోలీస్ ట్రాఫిక్ బూత్ లను ఏర్పాటు చేసి లక్షల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇష్టానుసారంగా రోడ్లపై అడ్డదిడ్డంగా పెట్టిన ఈ ట్రాఫిక్ పోలీస్ బూత్ లు రాజకీయ నాయకుల ప్రచారం కటౌట్లు పెట్టుకునేందుకు స్టాండ్లుగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నాలుగు రోడ్లకు నాలుగు ట్రాఫిక్ పోలీస్ బూత్ లు ఏర్పాటు చేశారు వ్యాపారం నిర్వహించుకునే ఏజెన్సీలు. ఒక్క ట్రాఫిక్ పోలీస్ బూత్ లో కూడా ట్రాఫిక్ పోలీసులు నిలబడే పరిస్థితి ఉండదు. అవసరం ఉన్న చోట సరే కానీ అక్కర్లేని చోట కూడా ఈ బాక్స్లను ఏర్పాటు చేసి దండుకుంటున్నారు.

ఎవరి పర్మిషన్ ఉందో ….

ఏ ఒక్క బాక్స్ కు అటు జిల్లా పోలీసుల నుండి గాని మునిసిపాలిటీ మరియు పంచాయతీల నుంచి గాని పర్మిషన్లు ఉన్నాయో లేవో సదరు అధికారులకే తెలియాలి. అయినా నడిరోడ్డుపై అవసరం లేని చోట అధికారులు ఎలా అనుమతినిస్తారు. పాత బస్ డిపో సెంటర్లో డివైడర్ ప్రారంభమయ్యే చోట నడిరోడ్డుపై ట్రాఫిక్ బూత్ ను ఏర్పాటు చేయడంతో నిత్యం ఏదో ఒక సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ ఎదురుగా కూడా డివైడర్ ప్రారంభంలో ఈ ప్రచారం బాక్స్లను ఏర్పాటు చేయడంతో మూలమలుపు తిప్పుకోలేక వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అదేవిధంగా లక్ష్మీదేవి పల్లిలో బావర్చి హోటల్ ఎదురుగా జంక్షన్ రోడ్డు ఉన్నది 30 అడుగులయితే దాంట్లో 12 అడుగులు రెండు బాక్సులను ఏర్పాటు చేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది. ఇక్కడ సైతం ఈ యాక్సిడెంట్లకు కొదవలేదు.
ఇప్పటికే ఒక ట్రాఫిక్ పోలీస్ బూతును వాహనం ఢీకొని అక్కడ ఉన్న కెమెరాలు ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన పోలీసు కెమెరాలకు అడ్డంగా బాక్సులు పెట్టేసిన అధికారులకు కనబడటం లేదు. రెవెన్యూ ప్లాంటేషన్ అని డివైడర్లపై పెట్టిన బోర్డులు , పంచాయతీ ప్రారంభం అని పెట్టిన బోర్డులు సైతం మూసేసిన అధికారులకు కనబడడం లేదు.
పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏడాదిన్నర క్రితం మూలమలుపులో ఉన్న ట్రాఫిక్ బాక్సును గమనించక పక్కనే ఉన్న లారీ చక్రాల కింద పడి మరణించిన సంఘటనలు సైతం ఉన్నాయి .

బాక్సులను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి.

మాకు పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అని చెబుతున్న ఏజెన్సీల మాటల్లో నిజం ఎంత అనేది అధికారులే తేల్చాలి.
పోలీసు బాక్సులను పెట్టి లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఏజెన్సీ వారి వెనుక ఏ అధికారులు ఉన్నారు అన్న విషయం జిల్లా అధికారులే తేల్చాల్సి ఉంది. ఇప్పటికైనా ఇష్టానుసారంగా రోడ్లపై ఎక్కడబడితే అక్కడ ఈ ప్రచారం బాక్సులను పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటారో లేదో ఆ ప్రచారం బాక్స్లను తొలగిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *