నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి చౌటుప్పల్:
చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించకుండా వారికి తెలిసిన వారికి మాత్రమే పని కల్పిస్తూ ఎవరికి తెలియకుండా కమిటీ సభ్యులు కొత్త ఆర్డర్ పారాలను నమోదు చేసుకోవడం జరిగినది.చేనేత సహకార సంబంధించిన ఆస్తులను అమ్మటానికి ప్రయత్నిస్తున్నారు.నిలదీస్తున్న కార్మికులపై దౌర్జన్యంగా అహంకారపురితంగా ప్రవర్తిస్తున్నారు ఇట్టి అవినీతిని అరికట్టాలని చేనేత కార్మికులకు పని కల్పించాలని చేనేత వృత్తిపై ఉన్న కార్మికులకు నూతన ఆర్డర్ పారాలు ఇవ్వాలని కోరనైనది పొరపాట్లు జరుగుతున్నాయని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయగా వారు వచ్చేంత వరకు కూడా వేచి చూడకుండా వాటా దనాన్ని కట్టుకోవడం జరుగుతున్నది .చేనేత సహకార సంఘం అధ్యక్షులు కందగట్ల బిక్షపతి గారిని కట్టుకోవడానికి వీల్లేదని కార్మికులు అడగగా వారిపై కేసుల్ని నమోదు చేయడానికి సిద్ధమైనరు. ఈ కార్యక్రమంలో. గోశిక స్వామి , గుర్రం నరసింహ , గోశిక.బిక్షపతి , గోష్క రవి ,గోష్క పురుషోత్తం ,వనం ధనంజయ ,సుంకి రవి , కర్నాటి జనార్ధన్ గోషిక నరసింహ , గోషిక భాస్కర్ , జల నారాయణ , గోష్క లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.