మంచిర్యాల నేటిదాత్రి
భారతదేశ ఆణిముత్యం కళా యాత్రికుడు ఏల్పుల పోచం (బి ఎఫ్ ఏ ,ఎమ్ ఎఫ్ ఏ )చెన్నూరు వాస్తవ్యులు మంచిర్యాల జిల్లా వాసి అయినా భారతదేశం మొట్ట మొదటి కళాయాత్ర లైవ్ డ్రాయింగ్స్ భారతదేశ మొదటి కళాయాత్త్రికుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కళ యాత్ర 2017 డిసెంబర్ నెలలో కాశ్మీర్లో మొదలుపెట్టి 07.06.2024 ముగింపు కార్యక్రమం వివేకానంద రాక్ ,మెమోరియల్ కన్యాకుమారి, తమిళనాడు నందు క్లోజింగ్ సెర్మనీ దిగ్విజయంగా పూర్తిచేసుకుని, మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపి పూల మాలలతో శాలువలతో సత్కరించి పోచం కష్టపడి తెలంగాణకే గొప్ప ఖ్యాతి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఎంతోమంది మన్ననలు పొందారనీ పోచం గురువుగారైన మద్దూరి రాజన్న తెలియపరుస్తూ దేశస్థాయి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలలో అవార్డులతో ,పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సర్టిఫికెట్ పొంది , లిమ్కా లింకబుక్ ఆఫ్ ఇండియా మరియు వరల్డ్ రికార్డ్ , మిరాకిల్ వరల్డ్ రికార్డ్ ,కన్యాకుమారి టూరిజం అవార్డు లతో భారత దేశవ్యాప్తంగా నడుస్తూ ,సైకిల్ ,బైక్ ,ట్రావెల్ వాహనాలలో మరియు ట్రైన్ లలో 30,700 కిలోమీటర్లు 2010 రోజులు4 కేంద్ర పాలిత ప్రాంతాలు స్మారక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు ,8 జ్యోతిర్లింగాలు, తొమ్మిది అష్ట శక్తి పీఠములు, 24దేశస్థాయి యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలు, భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో జీవన విధానం అన్ని రాష్ట్రాల కట్టుబాట్లపై ఆర్టిస్ట్ పోచం కళయాత్ర లో లైవ్ డ్రాయింగ్స్ రేఖలతో మరియు పెయింటింగ్స్ వేస్తూ 20వేల పెయింటింగ్స్ పూర్తిచేసి నేటి తరానికి దిక్సూచిగా నిలిచాడు, భారతదేశంలో సంపదలను ఒక్క దగ్గరికి చేరుస్తూ మన మంచిర్యాలకు కాశ్మీర్ టు కన్యాకుమారి కలయాత్ర పూర్తిచేసుకుని వచ్చిన సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో పట్టణ మరియు జిల్లా ప్రముఖులు స్వాగతం తెలపడం జరిగినది వారిలో కోరల్లారామ్ రెడ్డి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు కోరల్ల రామ్ రెడ్డి శాలువాతో సత్కరించడం జరిగినది, మరియు మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ పూదరి సునీత ప్రభాకర్ మరియు వారి మిత్ర బృందం తిరుపతి బద్రి శ్రీనివాస్. మరియు శాలువతో సత్కరించడం జరిగింది ,మంచిర్యాల శ్రీ సీతారామ కాలనీ ప్రముఖులు వర్మణి వెంకటేశ్వర్లు ,గంగాధరి రాజు, మల్లేష్ ,తోట సదానందం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్, రాజు , కుర్మా రాజేశ్వర్ గౌడ్ సింగరేణి వర్క్ షాప్ టెక్నికల్ ఆఫీసర్, బోయిని మోహన్ యాదవ్ ఎన్నారై సింగపూర్, మరియు ప్రముఖ గేయ రచయిత, ఆస్వాన్ ఆర్టిస్ట్ ,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, నోట్స్ స్పీకర్ ,సామాజిక కార్యకర్త సుందిళ్ల రమేష్ ప్రభుత్వ టీచర్ శాలువాతో సత్కరించడం జరిగినది మరియు భారతీయ మజ్దూర్ సంఘ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ కమలాకర్ బిఎంఎస్ నాయకులు సమ్మయ్య కార్మికులు తదితరులు మరియు ఆటో కార్మికులు రాంబాబు, భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర డోలక్ వాయిద్య కళాకారుడు డోలక్ సమ్మయ్య గారు సాగర్ ,కిరణ్ ,పవన్ ప్రముఖులు మరియు తదితరులు స్వాగతం మరోసారి తెలియజేస్తూ సత్కరించారు.