మాదారం లో పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన రావుల
కారేపల్లి నేటి ధాత్రి.
.సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో 2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక మాథారంలో పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రామ కార్యదర్శి రావుల నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో ప్రజల వారి మౌలిక సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే,పాషిజం ప్రజలను విభజించి శ్రామిక వర్గాల మధ్య చిచ్చు పెడుతూ వైషమ్యాలు పెంచుతున్నదని అన్నారు. ఇది కార్మిక, కర్షక దెబ్బతీయడం కోసమే కార్పొరేట్ శక్తులు చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో విప్లవ కారుల ఐక్యత మరింత అవసరాన్ని నొక్కిచెప్పుతున్నదని పేర్కొన్నారు. మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభలు విప్లవొద్యమంలో ఒక మైలురాయి అని అన్నారుఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పార్టీ మండల నాయకులు. (డ్రైవర్) కోయిల శ్రీనివాసరావు. వేములపల్లి వీరన్న. గ్రామ నాయకులు ముక్తి నాగేశ్వరరావు. కోయిల ఉపేందర్. కోయిల ఎంకన్న. హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.