వెయిట్ లిఫ్టింగ్ లో ఎన్నో అవార్డులు.
సొంత నియోజవర్గం ఇల్లెందు నుంచి స్పందన కరువు.
పేదరికంలో “లిఫ్ట్ లేని లిఫ్టర్”
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు.
అండగా నిలిచిన హెచ్ ఆర్ సి ఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం ఇల్లెందు పట్టణానికి చెందిన రోషిని పాసి వెయిట్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో 150 కేజీలు బరువును లిఫ్ట్ చేసి జాతీయ స్థాయిలో ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ ను సాధించింది.స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,ఖేలో ఇండియా పోటీల్లో సీనియర్స్,జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానాల్లో నిలిచి గోల్డ్ మెడల్ ను సాధించింది.జాతీయస్థాయిలో వెయిట్ లిఫ్టర్ ఛాంపియన్ గా పేరు సంపాదించిన రోషిని పాసిను శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హెచ్ ఆర్ సి ఐ జిల్లా కార్యాలయం నందు హెచ్ఆర్సీఐ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఉమెన్ పోర్ట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు రెంటపల్లి మాధవి లత,స్టేట్ ఆర్గనైజిగ్ సెక్రెటరీ మైసాలత,ఉమెన్ పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షురాలు ధర్మరాజులా సుమలత,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గంట ఉమకాంత్,మీడియా సెక్రెటరీ కవటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.మున్ముందు జరిగే పోటీలకు ఆర్థిక సహాయం అoడగా తెలంగాణ స్టేట్ ఆర్గనైజిగ్ సెక్రెటరీ మైసలత రోషిని పాసి కి 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ బీద కుటుంబంలో జన్మించి వెయిట్ లిఫ్టింగ్ లో అనేకమైన మెడల్ సాధించిన రోషిని పాసికి సొంత నియోజకవర్గంలో స్పందన కరువైందనీ,ఉన్నత స్థాయి పోటీలలో పాల్గొనేందుకు ఆర్థికంగా సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలి అని ఈ సందర్భంగా హెచ్ఆర్సిఐ సభ్యులు కోరారు.