నేటి ధాత్రి, మంచిర్యాల:
ఎఫ్ సి సి క్లచ్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ స్పేర్ పార్ట్స్ కంపెనీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో టూ వీలర్ మెకానికులకు ఎఫ్ సి సి కంపెనీ తయారు చేస్తున్న స్పేర్ పార్ట్స్ గురించి ట్రైనింగ్ క్లాస్ ఇప్పించడం జరిగింది. అలాగే జపాన్ లో తయారు చేస్తున్న విడిభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి బండికి ఎలా అమర్చాలి వాటి యొక్క నాణ్యత గురించి కంపెనీ ట్రైనర్ యశ్ రావల్, హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ హిమన్షు మోటార్స్, , ఎఫ్ సి సి క్లచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కె.జయరామ్ సమక్షంలో ఏర్పాటు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బి ఎస్ 6 టెక్నాలజీ రావడంతో ఇలాంటి ట్రైనింగ్ వల్ల మెకానికులకు లాభం జరుగుతుందని కంపెనీ ఒక ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ 130 మంది మెకానికులు హాజరై విజయవంతం చేశారు.