మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 6
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ చరవాణి ద్వారా పత్రిక విలేకరులతో మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు భారీ మెజార్టీతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించిన భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా గండ్ర సత్యనారాయణ గెలుపు కోసం శ్రమించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాభివందనాలు తెలియజేస్తున్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల నర పరిపాలించడం జరిగింది
కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ కెసిఆర్ కుటుంబం మాత్రం అందరూ బాగుపడ్డారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదు కానీ కెసిఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురికి మాత్రం పది సంవత్సరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించి వారికి తరతరాలు వారి, కుటుంబానికి సరిపడే ఆస్తిని సంపాదించినారు ఎందరో నిరుద్యోగ విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ సాధించుకునారు . కానీ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి అమరవీరులకు వారి కుటుంబాలకు ఎలాంటి దిక్కు దశ లేదు గత సుమారు 75 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఆనాడు తెల్ల దొరలు ఏ విధంగా హింసలు పాలు చేసి చిత్రహింసలు పెట్టి పరిపాలించారో గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ దొరలు ఈ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎన్నో కష్టాల పాలు చేసినారు అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరగబడి ఓటు హక్కు అనే వజ్రాయుధంతో భారత రాష్ట్ర సమితి పార్టీ కి దిమ్మ తిరిగే విధంగా షాక్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందని అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాం, ఈ గెలుపు సాధించిన విజయం
ఇది ప్రజలు సాధించిన విజయం అన్నారు