
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల పట్టణంలోని శ్రీ మహంకాళి మోటార్స్ ట్రాక్టర్ షోరూమ్ ఆధ్వర్యంలో పరకాల వ్యవసాయం మార్కెట్ లో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హైమావతి సత్యనారాయణ చేతుల మీదుగా పవర్ ట్రాక్ ట్రాక్టర్ కొనుగోలు పై భారతీయ ట్రాక్టర్ ఫెస్టివల్ ఆఫర్ పత్రికను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా మహంకాళి మోటార్స్ డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సూర్యదేవర భరత్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రైతు సోదరుల మన్నలను అందుకుంటూ పవర్ ట్రాక్ కంపెనీ ట్రాక్టర్స్ తో వినూతన పద్ధతిలో అదునాతన వ్యవసాయ పద్ధతులకు అణువుగా ట్రాక్టర్లను రూపొందిస్తున్న సంస్థ ఈ కంపెనీ పవర్ ట్రాక్ కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు పై స్క్రాచ్ కార్డు ద్వారా షిఫ్ట్ డిజైర్ కార్,మోటార్ సైకిళ్ళు,ఎల్ఈడి టీవీలు,వాషింగ్ మిషన్లు,ఫ్రిజ్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని అన్నారు.రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమం లో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.