D.S. Venkanna Appointed New RDO
పరకాల నూతన ఆర్డీవోగా డి.ఎస్. వెంకన్న
పరకాల,నేటిధాత్రి
పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారిగా డి.ఎస్.వెంకన్న నియమితులయ్యారు.సోమవారం పరకాలకు చేరుకున్న ఆయనకు వివిధ శాఖల అధికారులు,రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
