Demand To Conduct Mandal General Meeting
ముత్తారం మండలం లోని గ్రామాలలో ప్రజలు సమస్య లతో ఇబ్బందులు పడుతుంటే మండల సర్వసభ్య సమావేశం ఎందుకు నిర్వంచడం లేదు
ముత్తారం బి ఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి
ముత్తారం :- నేటి ధాత్రి
మండలం లోని ఓడెడ్ గ్రామం లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారనీ సర్పంచులు ఎన్నికై 5 నెలలు గడుస్తున్న మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయక పోవడం వల్ల గ్రామాలలో ప్రజలు తాగు నీటి సమస్యలు ఇతర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కూడా గ్రామాలలో పర్యటించడం లేదని ఆరోపించారు అధికారులు ఏ శాఖ కు ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తే సర్పంచు లు అధికార్లు గ్రామ సమస్యల పై చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
