మేరు మహిళలకు కుట్టు మిషన్లలో తొలి ప్రాధాన్యత కల్పించాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు మేరు సంఘం వినతి
యాదగిరిగుట్ట: టైలరింగ్ వృత్తినే ప్రధాన జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న మేరు కుల మహిళలకు ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న “స్వింగ్,కుట్టు మిషన్ టు ఉమెన్” పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మేరు సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున బీసీ మహిళలకు కుట్టు మిషన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, నిజంగా టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న మేరు కుల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మేరు కులానికి చెందిన అనేక కుటుంబాలు తరతరాలుగా టైలరింగ్ వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు పారదర్శకంగా పథకం అమలు చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా మేరు కుల మహిళలకు టైలరింగ్ ప్రధాన జీవనాధారమని, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ సమస్యపై సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు నా పీఆర్వో గా పని చేస్తున్న ఆదిమూలం సురేష్ కూడా మేరు కుల బిడ్డనే కావున తప్పకుండా మిషన్ల పంపిణీ లో మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని బీర్ల అయిలయ్య గారు సంఘం నాయకులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, అధ్యక్షులు బొడ్డు సత్యనారాయణ,తుర్కపల్లి మండల మేరు సంఘం అధ్యక్షులు,ప్రభుత్వ విప్ పిఆర్వో ఆదిమూలం సురేష్ , ప్రధాన కార్యదర్శి కొట్టూరి రాజమల్లప్ప, కోశాధికారి కొత్త భాస్కర్, ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, దీకొండ వెంకటేష్, కొత్త గణేష్, మేడిగ భాస్కర్, కొండ వీరేందర్ తదితర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
