SI Sridhar Supports Poor Family
పేద కుటుంబానికి అండగా నిలిచిన ఆర్కేపీ ఎస్ఐ ఏ శ్రీధర్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బి జోన్ ఇందిరానగర్ ఏరియాలో గల పేద కుటుంబానికి చెందిన మంద సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ ఏ శ్రీధర్ మానవతా దృక్పథంతో స్పందించి 50 కిలోల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. పేద కుటుంబం కావడంతో చేయూతనందించడం జరిగిందని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. పేద కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
