Drinking Water Wasted in Mudigunta
వృథాగా తాగునీరు.. పట్టించుకోని అధికారులు!
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల పరిధిలోని ముదిగుంట గ్రామస్తులకు తాగునీరు అందించే ప్రధాన వాటర్ ట్యాంకు వద్ద మెయిన్ పైపులైన్‌కు అమర్చిన పంపు కులాయి మరమ్మతులకు గురై తాగునీరు విపరీతంగా వృథా అవుతోంది. కులాయిని ఆన్, ఆఫ్ చేసే ‘కీ’ పూర్తిగా పాడైపోవడంతో.. ట్యాంకు నింపుతున్న సమయంలో లీటర్ల కొద్దీ నీరు వృథాగా రోడ్డు పాలు అవుతోంది. ఒకవైపు వేసవి కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు.. కళ్లెదుటే ఇంతలా తాగునీరు వృథాగా పోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం నీరు కారుతుండటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ బురదమయంగా మారి,పక్కనే ఉన్న నాలీ ఏటి కాలువను తలపిస్తోంది.కాబట్టి గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి,తక్షణమే కొత్త కులాయిని అమర్చి తాగునీటి వృథాను అరికట్టాలని ముదిగుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
