వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాల్సిందే “సుప్రీంకోర్టు”
నేటి ధాత్రి:
బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించాలన్న ఆదేశాలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది నవంబర్లో లో తాము ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. వీధి కుక్కల దాడుల సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుందని పేర్కొంది. ఆస్పత్రులు, బస్టాండ్లు, విద్యా సంస్థల సమీపం నుంచి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తేల్చిచెప్పింది.
గత కొన్ని రోజుల ముందు యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధి కుక్కలు బాలుడి కనుగొడ్డు తీసిన సంగతి తెలిసిందే.
