`ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీపై అధిష్టానం ప్రత్యేక దృష్టి!
`కేరళ గెలిచిన ఊపును కొనసాగించాలంటే “రోహిన్ రెడ్డి” లాంటి నాయకులతో కొత్త కమిటీ ఏర్పాటు కావాలి.

`రెండేళ్ల ముందే పార్టీ ఎన్నికల కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం!
”రోహిన్ రెడ్డి”కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్!

`అధిష్టానం వద్ద పీసీసీ ప్రతిపాదన!
`పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం పరిశీలనలో వున్న “రోహిన్ రెడ్డి” పేరు!
`కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మూడేళ్ళ పాటు అహర్నిశలు కృషి చేసిన రోహిన్ రెడ్డి.
`సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల వేళ అడుగడుగునా తోడుగా నిలిచిన రోహిన్ రెడ్డి.
`సీఎం రేవంత్ ఆదేశాలతో పార్టీ కోసం నిద్రహారాలు లెక్క చేయకుండా పనిచేశారు.
`వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ గెలవాలంటే “రోహిన్ రెడ్డి” లాంటి వారి సేవలు పార్టీకి ఎంతో అవసరం.
`పార్టీ పరంగా “రోహిన్ రెడ్డి” సేవలు, ఎన్నికల ముందు “రేవంత” సర్కార్ కు అత్యంత కీలకం.
`గత ఎన్నికల సమయంలో “సిఎం రేవంత” కు అడుగడుగునా నీడలా నిలిచిన నాయకుడు “రోహిన్ రెడ్డి”.
`రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళన కూడా జరగాల్సిన సమయం ఆసన్నమైంది.
`పార్టీ ఎన్నికల టీమ్ ను “సిఎం రేవంత” ఎంచుకోవాల్సి వుంది.
`మొహమాటాలకు పోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి రావొచ్చు.
`వచ్చే రెండేళ్లు అటు పాలనా పరంగా, ఇటు పార్టీ పరంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం.
`టైమ్ పాస్ నాయకులకు కాకుండా పనిచేసే వారికి పార్టీ పదవులు ఇవ్వాల్సిన అవసరం వుంది.
`ఎన్నికల కమిటీ కూర్పు చేసుకోవాల్సిన తరుణం కూడా వచ్చేసింది.
`పార్టీ పూర్తి స్థాయి ఎన్నికల కమిటీ నిర్మాణానికి సమయం ఆసన్నమైంది.
`ఈ సారి గెలుపు బాధ్యతలు బలంగా నిర్వహించే టీమ్ వుండేలా నాయకులను ఎంపిక చేస్తున్నారు.
`వచ్చే ఎన్నికలలో గెలవాలంటే పార్టీ పరంగా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే వారు కావాలి.
`2023 ఎన్నికల కమిటీ కంటే ఇప్పుడు మరింత బలంగా నాయకులు వుండాలి.
`పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాలి అనే పట్టుదల ఉన్నవారు ఎన్నికల కమిటీలో వుండాలి.
`“సీఎం రేవంత” కు అత్యంత సన్నిహితులు పీసీసీలో ఉండడం మంచిది.
`కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆంతరంగికులు కొంత మంది వుండాలి.
`ఎన్నికల వ్యూహాలు పక్కాగా అమలు చేసే “రోహిన్ రెడ్డి” లాంటి వాళ్లు కావాలి.
`నాయకులు, కార్యకర్తలను ప్రోత్సహించేలా కొత్త కమిటీ కనిపించాలి.
`ఇప్పటి నుంచే బలమైన ఎన్నికల అడుగులు పడాలి.
`వచ్చే ఎన్నికలలో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిపించే బలమైన కమిటీ కావాలి.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్‌రెడ్డికి పిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించబోతోంది. పార్టీకోసం కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలను పార్టీ జాతీయ నాయకత్వం, అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. పార్టీకోసం ఏ పని అప్పగించినా విజయంతంగా పూర్తి చేసే శక్తి సామర్ద్యాలున్న నాయకుడిగా ఇప్పటికే రోహిన్‌రెడ్డికి పార్టీలో మంచి పేరు వుంది. గత ఎన్నికల సమయంలో ఆయన పడిన శ్రమ పార్టీలోని నాయకులకు, అధిష్టాన పెద్దలకు కూడా తెలిసిందే. సిఎం. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి ఆయన వెన్నంటే వుంటూ పార్టీ కోసం అహర్నిషలు కృషి చేస్తూ వస్తున్నారు. పైగా సిఎం. రేవంత్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడు అయిన తర్వాత అలుపెరగకుండా పార్టీకోసం పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రతి విషయంలోనూ సిఎం.రేవంత్‌రెడ్డికి చేదోడు వాదోడుగా వున్న రోహిన్‌రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు ఆశించలేదు. పార్టీకి సేవ చేయడం వరకే పరిమితయ్యారు. అయితే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి బంపర్ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సిఎం. రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తియ్యింది. ఇక ఎన్నికలకు మరో రెండున్న సంవత్సరాలు మాత్రమే వుంది. ఈ సమయంలో ప్రభుత్వంలో ఇంకా ఖాళీగా వున్న మంత్రి పదవులు కూడా భర్తీ చేయాల్సి వుంది. అయితే సహజంగా ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే రెండున్న సంవత్సరాల తర్వాత ఎన్నికల క్యాబినేట్ కూర్పు చేయసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన వారి పనితీరును బేరీజును వేసుకొని, కొంత మంది మంత్రులను మార్చడం, కొంత మంది శాఖలను మార్చడం వంటివి సహజంగా జరుగుతుంది. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆయా శాఖల మంత్రుల పనితీరు వల్ల పార్టీకి జరిగిన లాభ నష్టాలను కూడా పార్టీ అదిష్టానం పరిశీలించి నిర్ణయం తీసుకుంటూ వుంటుంది. అలాగే ప్రజా ప్రభుత్వంలో కూడా సిఎం. రేవంత్ రెడ్డి తన ఎన్నికల క్యాబినేట్ కూర్పు కూడా చేసుకోవాల్సివుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో అటు పార్టీ నాయకత్వం, ఇటు ప్రభుత్వం రెండూ బలంగా వుండేలా చూసుకుంటారు. ప్రభుత్వంలో కీలకంగా పని చేసే మంత్రులే కాదు, పార్టీని సమర్ధవతంగా నడిపే యంత్రాంగం కూడా ఎంతో అవసరం. అలా రాష్ట్ర స్ధాయి నుంచి, గ్రామ, వార్డు స్ధాయి వరకు పార్టీ నిర్మాణం అనేది జరుగుతూ వుంటోంది. గత ఆరు నెలల కాలంగా రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్దాయి వరకు పార్టీ నిర్మాణం శరవేగంగా చేపడుతున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర పిసిసి ఇటీవలే రాష్ట్ర స్దాయి యంత్రాంంగాన్ని ప్రకటించింది. తాజాగా వారం రోజుల క్రితం జిల్లా స్ధాయిలో పార్టీ పదవులు పంపకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. జిల్లా స్ధాయి కమిటీలను ప్రకటించారు. మండల స్ధాయి కమిటీలు కూడా కూడా ప్రకటించాల్సి వుంది. తర్వాత గ్రామ స్ధాయి క్యాడర్ నిర్మాణం చేపట్టాల్సి వుంది. పనిలో పనిగా రాష్ట్రంలో ఖాళీగా వున్న అనేక నామినేటెడ్ పోస్టుల పండుగ కూడా నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని రకాల పదవుల పంపకాలు ఏక కాలంలో చేపడుతూ పార్టీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పార్టీకూడా పదవులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. త్వరలోనే రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి వుంది. ఆ లోగా రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల పంపకాలు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఇవే కమిటీలు ఎన్నికల దాకా సాగాల్సి వుంటుంది. అందుకోసం పార్టీ కోసం పనిచేసే నాయకుల ఎంపికలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అసంతృప్తులు ఎదురుకాకుండా, నాయకులు, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి, మరీ పదువుల పంపకాలు చేపడుతున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ నాయకులను గుర్తిస్తున్నారు. వారికి పదవులు అందిస్తున్నారు. గతంకన్నా భిన్నంగా ఆసారి అలా పదవుల పంపకాలు చేపడుతూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. వినూత్నమైన రీతిలో సాగుతున్న ఈ పదవుల పంపకాలు పార్టీ నాయకుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పార్టీకోసం పనిచేసిన నాయకుల పదువులు అందడంతో నాయకుల్లో ఆనందాలు వెల్లివిరస్తున్నాయి. గత పదేళ్లపాటు పార్టీని పట్టుకొని వున్నవాళ్లు, పార్టీకోసం త్యాగాలు చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. పైగా కొన్ని జిల్లాల్లో పార్టీలోకి వచ్చిన కొత్త నాయకులను కూడా గుర్తిస్తున్నారు. కాకపోతే పార్టీ కోసం గత పదేళ్ల కాలంగా పనిచేస్తున్నవారిని ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన వారికి తగిన గౌరవం కల్పిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర స్ధాయిలో రోహిన్‌రెడ్డి లాంటి వారికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక ఇది ఎన్నికల కమిటీ అనేది పార్టీ అధిష్టానం తేల్చడమే కాదు, పార్టీకోసం ఎంత కష్టపడితే అంత భవిష్యత్తు వుంటుందనేది కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిన్‌రెడ్డి విషయానికి వస్తే ఆయన గత ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో కష్టపడిన తీరు అందరికీ తెలిసిందే. సిఎం. రేవంత్‌రెడ్డి పార్టీ పిపిసి. అద్యక్ష బాద్యతలు స్వీకరించిన తార్వత ఆయనతోనే ప్రయాణం చేశారు. సిఎం.రేవంత్ రెడ్డికి అడుగడుగునా అండగా నిలుస్తూవచ్చారు. రాజకీయ నిర్ణయాల అమలు చేస్తూ వచ్చారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ, అనేక కార్యక్రమాలను విజయవంతం చేశారు. మÖడేళ్లపాటు సిఎం. రేవంత్‌రెడ్డి సాగించిన పోరాటంలో రోహిన్ రెడ్డి తోడుగా నిలిచారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పార్టీకోసం నిద్రాహారాలు మానుకొని పనిచేశారు. పైగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీ విజయ దుందుభి మోగించాలంటే రోహిన్‌రెడ్డి లాంటి వారి సేవలను మరింత విసృతంగా వినియోగించుకోవాల్సి వుంది. పార్టీ పరంగా పటిష్టమైన ఓటు బ్యాంకు కోసం, ఎన్నికల ముందు సర్కారు సేవల ప్రచారాల కోసం పార్టీ నాయకులు ఎంతో కృషిచేయాల్సి వుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్ర స్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు తీసుకెళ్లే యంత్రాంగానికి దిశా నిర్ధేశం చేసేవారు కావాలి. అందుకే రోహిన్‌రెడ్డి సేవలు అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు బలమైన అడుగులు పడాలి. వచ్చే ఎన్నికల్లో మరింత మెజార్టీతో పార్టీ గెలవాలి. అందుకోసం రాష్ట్ర స్దాయిలో రోహిన్‌రెడ్డి సేవలు మరింత వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే త్వరలో ఆయనను పిసిసి. వర్కింగ్ ప్రెసిడెంటు, ఎన్నికల కమిటీలో చోటు కల్పించే దిశగా కసరత్తులు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
