Left Unity Urged as Farmers Face Crisis
కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే దోపిడి పాలకులకు ప్రత్యామ్నాయం
మే 12న నర్సంపేటలో ఓంకార్ శతజయంతి ముగింపు బహిరంగ సభ
ప్రభుత్వ వైఫల్యంతో అరిగోస పడుతున్న మొక్కజొన్న రైతులు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగ్, నేటిధాత్రి:
ప్రజా సంక్షేమం పేరుతో వినాశనకర విధానాలను అమలు చేస్తూ పెట్టుబడిదారులకు కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులకు కమ్యూనిస్టు వామపక్ష సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఈ క్రమంలో ఈనెల 12న నర్సంపేటలో జరిగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో మీడియా సమావేశం వరంగల్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రజా పాలన ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని పత్తి పంట దెబ్బతిని దిగుబడి లేక అప్పుల పాలైన రైతాంగం జిల్లాలో లక్ష ఎకరాలలో మొక్కజొన్న పంటను పండించి మార్కెట్లో అమ్ముదామంటే కనీస మద్దతు ధర రాని పరిస్థితి నెలకొన్నదని ప్రభుత్వం అరకురా ఒంగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తూ పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు దళారులకు వత్తాసు పలుకుతూ అమ్ముకునే విధంగా చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు వేదికల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కల కొనుగోలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గోడ్డలి పెట్టు లాగా వారి వ్యక్తి స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని సంపద అందరికీ కాకుండా కొందరికే చెందే విధంగా ప్రశ్నిస్తే అణిచివేతకు గురయ్యే విధంగా చట్టాల రూపకల్పన జరుగుతున్నదని ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విలువలను త్యాగాలను ఆదర్శాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకోసం కమ్యూనిస్టులు వామపక్ష సామాజిక శక్తులు ఐక్యం కావాలని అమరజీవి కామ్రేడ్ మద్దికేయాల ఓంకార్ బలంగా కోరుకున్నాడని ఆ క్రమంలో తన వంతు ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాడని వారి ఆశయాలను ముందు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభను మే 12న నర్సంపేట పట్టణంలోని సిటిజెన్ క్లబ్ ఆవరణలో జరుపుతున్నట్లు దీనికి పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం వివిధ కమ్యూనిస్టు కామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారని కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మే 12న జరిగే బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి నర ప్రతాప్ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్ ఎగ్గేని మల్లికార్జున్ మహమ్మద్ మెహబూబ్ భాష దామెర రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు.
