Union Leaders Accuse Singareni Unions
సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన గుర్తింపు సంఘాలు
రెండు సంవత్సరాలు కాలయాపన చేసి ,కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
గుర్తింపు సంఘాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేశాయని ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ అన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ….సింగరేణిలో కార్మిక సంఘాలు గుర్తింపు సంఘంగా గెలుపొందాయి కానీ సింగరేణి కార్మికులకు రెండు సంవత్సరాలలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు కార్మికులకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను ఏ ఒక్కటి నెరవేర్చలేదనీ,సింగరేణిలో డిసెంబర్ 27న గుర్తింపు సంఘం రెండు సంవత్సరాల కాలపరిమితి అయిపోతుందనీ ,కనుక తిరిగి లేబర్ కమిషనర్ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు త్వరగా నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నామని,సింగరేణిలో కార్మిక సంఘాలు రెండు సంవత్సరాలు కాలయాపన చేసి కార్మికులకు ద్రోహం చేశారనీ ,సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం 200 గజాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదనీ ,ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయలేదనీ, మెడికల్ అన్ఫిట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మెడికల్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం వలన ఎంతోమంది వారి పిల్లలకి వచ్చే ఉద్యోగాలకు కోల్పోయారని అన్నారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇవ్వలేదనీ ,అలాగే మారు పేరులను మార్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు…. కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం ఇప్పించలేదనీ ,సింగరేణి సంక్షేమానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయలేదనీ,
డిస్మిస్ అయిన కార్మికుల కుటుంబాలను వీధి పాలు చేశారనీ ,ఒకరి కూడా ఉద్యోగం ఇప్పించలేదనీ,
సింగరేణి కార్మికులకు పనిముట్లు కానీ, నిత్యవసర సరుకులు గాని ,ఏ విషయాన్ని మాట్లాడకపోవడం చర్చనీయం అని ,సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీయడం జరిగిందని వారు అన్నారు.సింగరేణిలోని కార్మిక సంఘాలు సమిష్టిగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేంత వరకు ఐక్యంగా ఉద్యమించాలని
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు.
