Crop Fire Loss: Govt Assures Help
మొక్కజొన్న చేను కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.
ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం తిరుమలపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట చేను కాలిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సోమవారం సంఘటన స్థలానికి చేరుకుని పంటచేను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట కోత దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం అన్నారు.ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలన ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అలాగే ఈ ఘటనను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారితో మాట్లాడి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీలైనంత సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎమ్మార్వో,ఎంపీడీవో,వ్యవసాయ శాఖ అధికారులు,ఎలక్ట్రిసిటీ అధికారులు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గుమ్మడి శ్రీదేవి ,కాంగ్రెస్ పార్టీమండలఅధ్యక్షులు గూట్ల తిరుపతి, గుంటూరు పల్లె ఉప సర్పంచ్ ముద్దన నాగరాజు, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
