Tribal Student Secures Delhi Seat
గిరిజన విద్యార్థికి.. ఢిల్లీ యూనివర్సిటీలో సీటు
బాలానగర్ నేటి ధాత్రి.
https://youtu.be/qnVv4RsgECE?si=f1F4LmYLT7h1raja
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండాకు చెందిన నగేష్ నాయక్ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్లో ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఢిల్లీలోని స్వామినారాయణ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అధిక మార్కులు సాధించి బీటెక్ చదివే అవకాశం పొందాడు. అయితే నగేష్ నాయక్ జీవిత ప్రయాణం సులభం కాదు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి మృతిచెందడంతో కుటుంబంపై భారమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కష్టాలను ఎదుర్కొంటూనే నగేష్ నాయక్ తన లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.
ఈ విద్యార్థి ఒకటో తరగతి నుండి 10వ తరగతి వరకు.. గీతాంజలి పాఠశాలలో చదువుకున్నాడు. ఈ సందర్భంగా..పాఠశాల ప్రిన్సిపల్ శ్రీశైలం, అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించారు.
