Speeding Car Narrowly Escapes Major Accident in Srirampur
అతివేగంతో దూసుకొచ్చిన కారు… తప్పిన పెను ప్రమాదం
శ్రీరాంపూర్, నేటి ధాత్రి:
అతివేగంతో దూసుకొచ్చిన కార్ తప్పిన పెను ప్రమాదం.గోదావరిఖని నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న ఒక కారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ సమీపంలో అతివేగంతో వస్తూ ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ జాతీయ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.రోడ్డుపై ఉన్న హోటళ్ల వద్ద వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలపడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు,ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రయాణికులు,స్థానికులు సంబంధిత అధికారులను కోరుతూ,రోడ్డుపై వాహనాల నిలుపుదలపై నియంత్రణలు విధించి, ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
