Deepak Rising Star in Folk Dance
ఫోక్ డ్యాన్స్‌లో దూసుకుపోతున్న దీపక్
జాను లిరీ,రాము రాథోడ్ వంటి ఫేమస్ డాన్సర్లతో స్టెప్పులు
యూట్యూబ్‌లో వందల పాటలతో ప్రత్యేక గుర్తింపు
పరకాల,నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన యువకుడు ఫోక్ డ్యాన్స్ రంగంలో యువ నర్తకుడు దీపక్ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారుసంప్రదాయ నృత్యానికి ఆధునిక శైలిని జోడిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయన,యూట్యూబ్ వేదికగా విస్తృతంగా గుర్తింపు పొందుతున్నారు.దీపక్ ఇప్పటివరకు యూట్యూబ్‌లో దాదాపు 500 పాటలలో డాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చి తన కృషిని నిరూపించుకున్నారు.ప్రతి ప్రదర్శనలో ఉత్సాహభరితమైన స్టెప్స్, శక్తివంతమైన అభినయంతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.ఫోక్ డ్యాన్స్‌కు ప్రత్యేకమైన ఉత్సాహం,శైలిని నిలబెట్టుకుంటూ తన ప్రదర్శనలను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారు.ప్రత్యేకగా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దాటిన పిల్లో సీతలమ్మా, శెనిగషేండ్ల నిబడి చేతులియమ్మో,కమలాపురం రొడ్డట వంటి ఫోక్ పాటలపై చేసిన నృత్య ప్రదర్శనలతో దీపక్‌కు మంచి గుర్తింపు లభించింది.

ఈ పాటలతో పాటు అనేక పాటలలో ఆయన ప్రదర్శించిన ఉత్సాహభరితమైన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అదేవిధంగా, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన జాను లిరి,మౌనిక డింపుల్,రాము రాథోడ్ వంటి కళాకారులతో కలిసి డాన్సర్‌గా పాల్గొనడం ద్వారా ఆయనకు మరింత గుర్తింపు లభించింది.ముఖ్యంగా జాను లిరి ఆయన నృత్య ప్రదర్శనలకు సహకారం అందిస్తూ,పలు వీడియోల్లో భాగస్వామ్యమవడం విశేషం. తనతో రూపొందిన నృత్య ప్రదర్శనలు డిజిటల్ వేదికల్లో మంచి స్పందనను అందుకుంటున్నాయి.శాంతిరాజ్ మాస్టర్ మార్గదర్శకత్వంలో యూట్యూబ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపక్ క్రమంగా తన ప్రతిభను విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్నారు.వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.ఫోక్ డ్యాన్స్ పట్ల ఉన్న అభిరుచి,కృషితో ముందుకు సాగుతున్న దీపక్ ఈ రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.అదే కాకుండా ఇంస్టాగ్రామ్ లో తన ఐడి లో అనేక సినిమా మరియు ఫోక్ పాటలకు ప్రత్యేక మైన డాన్స్ లు చేస్తూ మంచి గురింపు పండుతున్నాడు.
