RTC Politics Heats Up in Telangana
ఆర్టీసీపై విపక్షాల ‘మొసలి కన్నీరు’.. లెక్కలతో సహా బట్టబయలు చేసిన కాంగ్రెస్!*
వర్థన్నపేట నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (RTC) వేదికగా రాజకీయ చదరంగం ఆడుతున్న ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల ముసుగులో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను వర్థన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి బర్ల సహాదేవ్ తీవ్రంగా ఖండించారు. గత పదేళ్ల విధ్వంసాన్ని, ప్రస్తుత ప్రభుత్వ చిత్తశుద్ధిని లెక్కలతో సహా ఆయన వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన.. ఆర్టీసీకి శాపం
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని కుదేలు చేశారని సహాదేవ్ ధ్వజమెత్తారు. ప్రధానంగా మూడు అంశాలను ఆయన ప్రస్తావించారు అప్పుల ఊబి 2014లో లాభాల బాటలో ఉన్న సంస్థను 2023 నాటికి 6,000 కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు కార్మికులపై ఉక్కుపాదం 2019 సమ్మె సమయంలో 48,000 మంది కార్మికులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అంటూ భయభ్రాంతులకు గురిచేసి, 30 మంది కార్మికుల మరణానికి కారణమైంది ఎవరో ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు.సొమ్ము దారిమళ్లింపు కార్మికుల కష్టార్జితమైన పీఎఫ్ (PF) సీసీఎస్ (CCS) కు సంబంధించిన ₹3,000 కోట్లను అక్రమంగా దారిమళ్లించి కార్మికులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు.
బీజేపీది అంతా ‘డబుల్ గేమ్
కేంద్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న బీజేపీ, ఇక్కడ మాత్రం ఆర్టీసీపై ప్రేమ ఒలకబోయడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశార దేశవ్యాప్తంగా రైల్వేలు, ఎయిర్పోర్టులను అమ్ముతున్న బీజేపీకి.. ఇక్కడ ప్రభుత్వ సంస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ హయాంలో మహాలక్ష్మి విప్లవం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు ఉచిత ప్రయాణం ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా కోట్లాది మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా ఆ ఛార్జీలను ప్రభుత్వం రూపాయికి రూపాయి రీయింబర్స్ చేస్తూ సంస్థను ఆదుకుంటోంది బకాయిల చెల్లింపు గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులను క్లియర్ చేస్తూనే, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.కార్మికులకు విజ్ఞప్తి.. విపక్షాలకు హెచ్చరిక
రాజకీయ నిరుద్యోగుల మాటలు నమ్మి ఆర్టీసీ కార్మికులు ఆవేశపడవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని సహాదేవ్ విజ్ఞప్తి చేశారు. గతంలో మిమ్మల్ని నడిరోడ్డుపై వదిలేసిన వాళ్లే ఈరోజు దొంగ దీక్షలు చేస్తున్నారు. నిజం నిప్పులాంటిది అది ప్రజలందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు.a
